నేటి ప్రపంచంలో : హిందువుల స్థితి - The situation of the Hindus In today's world

Vishwa Bhaarath
0
నేటి ప్రపంచంలో : హిందువుల స్థితి - The situation of the Hindus In today's world
నేటి ప్రపంచం : హిందువుల స్థితి 

ప.ఫూ. డాక్టర్‌ హెడ్గెవార్‌ గారి ప్రసంగం, పుణే 1935 !

ప్రపంచచరిత్రలో మనకీనాడు కన్పించే దేమిటి? ఒకసారి ఆసియా, ఐరోపా, అమెరికా, ఆఫ్రికాలవైపు చూడండి. కైస్తవులు, మహమ్మదీయులు, బౌద్దులు, హిందువులూ ఈ నాల్టు ఖండాలలో వ్యాపించి ఉండటం కన్పిస్తుంది. ప్రపంచంలో క్రైస్తవ మతస్థులు అందరికంటే ఎక్కువ. ఆ తరువాత సంఖ్య మహమ్మదీయులది.
   బౌద్దులూ, హిందువుల కన్పించేది ఆసియాలోనే. హిందువుల సంఖ్య ఎక్కువగా హిందూదేశంలోనే ఉన్నది. అదైనా అన్ని ప్రాంతాలలో హిందువులు అధిక సంఖ్యాకులుకారు. ఇక్కడి 85 కోట్ల జనసంఖ్యలో హిందువుల సంఖ్య కేవలం 25 కోట్లే. మిగతా పదికోట్లమంది కూడా హిందువులే, కాని మన ఉదాసీనతవల్లా, ఆకర్శణ్యతవల్లా వీరిని మనం కోల్పోయాం. ఈనాటి ఆస్టనిన్తాన్‌ ఒకప్పుడు మన గాంధారదేశం. నేడది సంపూర్ణంగా 'ఇస్లామ్‌స్తాన్‌ అయింది. కాళ్ళీర్‌ మొదటినుంచీ హిందువులదే. కాని నేడక్కడ అధిక సంఖ్యాకులు మహమ్మదీయులు. అక్కడి రాజు హిందువే ఐనా ప్రజలు మహమ్మదీయులవడం ఆశ్చర్యకరం కాదా ! కాళ్ళీర్‌ భారతదేశపు నందనోద్యానమని ప్రసిద్ధి. కాని ఆ నందనవనమే మహమ్మదీయులతో నిండిపోవడం ఎంత ఉద్వేగాన్ని కలిగిస్తుంది. 

అలాగే పంజాబ్‌, సింధు ప్రాంతాల్లోకూడా మహమ్మదీయులే అధిక సంఖ్యాకులు. బెంగాల్‌ ఒకప్పుడు మనకు స్వర్ణభూమియై వెలుగొందింది; మనకు విద్యాకేంద్రమై విలసిల్లింది. కాని అక్కడకూడా ఈనాడు నూటికి 55 మంది మహమ్మదీయులే. ఇది సాధారణమైన విషయంకాదు. మహమ్మదీయులు ఉత్తర హిందూస్థానంలో అధిక సంఖ్యాకులు కాబట్టి అక్కదే వారి ప్రభావం అధికంగా ఉన్నదని అనుకోకూడదు. నర్మదకు దక్షిణాన హైదరాబాద్‌లాంటి మహమ్మదీయ సంస్థానంకూడా ఉన్నది. దాని ప్రభువు ఒక మతోన్మాదియైన మహమ్మదీయుడు. ఉత్తరాన మహమ్మదీయుల సంఖ్య ఎక్కువ కాబట్టి అక్కడ కేవలం మహమ్మదీయులే ఉండాలని బాధ్యత కలిగిన ఒక మహమ్మదీయు డీ మధ్య అన్నాడు. అంటే హిందూస్థానంలో “ఇస్లాంన్ధానం” కూడా న్థాపించబడాలని అతని అభిప్రాయం. ఇస్లాం మతప్రచారానికి ఇస్లాం మతావలంబుల సంఖ్యను వృద్ధిచేయడానికి హైదరాబాద్‌ సంస్థానం పూర్తిగా ప్రోత్సాహం ఇస్తున్నది. నాలుగైదు శతాబ్దుల పూర్వం హిందూదేశంలోనే కాక, పరిసర దేశాలపైన సహితం ఆధిపత్యం కలిగిఉన్న హిందువులు ఈనాడు తమదేశాన్నైనా 'హిందూస్తాన్ ” అని వ్యవహరించుకో లేకపోతున్నారు.
  35 కోట్ల జనసంఖ్య క్రమంగా నేటికి 25 కోట్లకు దిగింది. ఈ పరిస్థితి ఇలా మరికొన్ని శతాబ్దాలపాటు ఉండటం తటస్థిస్తే వెదికినా హిందువు అంటూ కనిపించడు. మనం ఎంత త్వరితంగా క్షీశించిపోతున్నామో చెప్పడానికే ఈ విపులీకరణ. మనం ఒకవైపు ఈ విధంగా క్షీణించిపోతూంటే అటు మహమ్మదీయులు బాహాటంగా “పాకిస్థాన్‌” కోర్కెను బ్రిటిషువారి ముందుంచు
తున్నారు.
   ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తవహించి ఆత్మ సంరక్షణార్థం మనం సంఘటితమవ్వాలి. మనలో సామాజిక భావాలు లేకపోవడమే ఈ పతనానికి కారణం. మనలో ఎవరికివారు స్వార్ధంకొరకు తాపత్రయపడడంతోటే సరిపోతున్నది సమాజానికీ, సంస్కృతికీ సంబంధించిన ఆలోచనలను మనం దగ్గరికైనా చేరనివ్వడంలేదు. ఈ విషాదకర పరిస్థితులను మార్చాలనే సంకల్పం మనకు ఉన్నట్లయితే సంఘటనను నిర్మాణంచేయక తప్పుదు. కేవలం హిందువులే హిందూదేశాన్ని ఎలా ఉన్నతస్థాయికి తీసుకుపోగలరని కొందరు అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటారు. దీనికి ప్రత్యుత్తరంగా “యూరోపులో నాలుగైదు కోట్ల ప్రజలే విశాల సామ్రాజ్యాన్ని చక్రంతిప్పినట్లు త్రిప్పుతుంటే, ఇరవై యైదు కోట్లమంది హిందువులు ఏకమై హిందూదేశాన్ని ఉన్నతన్థాయికి తీసుకొని పోజులరా ? అని ప్రశ్న్చిస్తున్నాను.

మన హిందూసమాజాన్ని నేడు నలువైపులా కష్టాలు ఆవరించాయి. ఈ దుస్థితికి బాధ్యులం మనమే. మనము దౌర్చల్యంతో నిద్రపోవుచున్నాము. ఒకవైపున ఇతర మతస్థులైన విదేశీయుల ప్రభుత్వం, మరొకవైపున మహమ్మదీయుల దురంతాలు, ఈ అడకత్తెరలో హిందూసమాజం చిక్కుకున్నది. మనలను మహమ్మదీయులుగా చేయడానికి జరిగే అత్యాచారాలనూ మన ఆలుబిడ్డలపై జరిగే దురంతాలనూ వర్ణించడం ప్రారంభిస్తే సహనాన్ని కూడా కోల్పోతాం. అందుకని ఆ విషయాలను నేనిప్పుడు చెప్పదలచుకో లేదు. ఇదేవిధంగా క్రైస్త్రవులుకూడా దెబ్బపై దెబ్బ తీస్తూనే ఉన్నారు.

ఈ విఘాతాలనుంచి మన సమాజాన్ని రక్షించాలంటే మనలో సంఘటన ఎంతో అవసరం. ఒకరికొకరు వేరై ఉండకూడదనే భావంతోనే 1925లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపన జరిగింది. అప్పుడు మనలను “దేశద్రోహులు” అని అన్నారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. సంఘం తామరతంపరగా పెరిగిపోతున్నది. హిందూదేశంలో మొత్తం రెండువందలశాఖలు వ్యాపించాయి. ఆ శాఖల్లో ప్రతిరోజూ నియమానుసారం 20,000 మంది స్వయంసేవకులు పాల్గొంటున్నారు. ఐనా చేయవలసినపని ఇంకా ఎంతో ఉన్నది. యావద్భారత వర్షంలో నలుమూలలా సంఘశాఖలు వ్యాపించాలి. ఇలాంటి సంఘటనవల్లనే మన దౌర్బల్యం అంతరిస్తుంది. మనకు సామర్ధ్యము, పలుకుబడీ చేకూరుతాయి.

ఈ కార్యక్రమాన్ని హిందూసమాజమంతా నిర్వహించవలసిందే కాని ఒకరిద్దరు చేయవలసింది కాదు. వృద్ధులు కొంత శ్రమపడి యువకులకు సాయవడితే ఈ కార్యక్రమం అద్భుతంగా వృద్ధిచెందుతుంది. ఇంతవరకు మనకు లభించిన అనుభవాలవల్ల నిరాఘాటంగా విజయం చేకూరుతుందని చెప్పవచ్చు. పరమేశ్వరుడు మన పక్షాన ఉన్నాడని మన విశ్వాసం. మనం చేస్తున్నపని శాంతి సమైక్యతల కొరకే కాని ఎవరిమీదనో దండయాత్రలు జరుపదానికి కాదు. హిందూ సంస్కృతి ధర్మాలకొరకు మన మీ పవిత్ర కార్యాన్ని చేసితీరాలి. మన మహోజ్వల సంస్కృతిని కాపాడుకొని వృద్ధి చేసుకోవాలి. అప్పుడే మనమూ మన సమాజమూ ప్రపంచంలో నిలువగలుగుతాం.

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top