వ్రేలాడుతున్న కత్తిక్రింద కూర్చొని భోజనం చేసే జీవనం - Living and eating while sitting under a hanging sword

0
వ్రేలాడుతున్న కత్తిక్రింద కూర్చొని భోజనం చేసే జీవనం - Living and eating while sitting under a hanging sword
వ్రేలాడుతున్న కత్తిక్రింద కూర్చొని భోజనం చేసే జీవనం
కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దాక్టర్టీ విద్యాప్రమాణాలు, పట్టాలు వీటి గురించి ఆలోచించటం తగ్గించారు. ఎవరైనా స్వయంసేవక్‌ మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణుడై ప్రచారక్‌గా వస్తానన్నాా దానిని అనర్హతగా భావించలేదు. ప్రారంభంలో ప్రచారకుల విజయానికీ, కీర్తిక అవసరమైన ఆధారమది. ప్రచారకులపని బాగా కష్టమైనది. అయినప్పటికీ, మన కార్యపద్ధతిలో అనన్యసాధారణ ఆవశ్యకత కల్లినది. ప్రచారకుల ప్రవర్తన శుద్ధంగా ఉండటమేగాక, ప్రజల వ్యవహారంకూడా శుద్ధంగా ఉండేటట్లుగా సంబాళించుకొంటూ నడవవలసి ఉంటుంది. శూలంవేయబడిన వ్యక్తి ఆహారం తీసుకొంటున్నట్లుగా (ఒక వెంట్రుకతోకట్టి వ్రేలాడదీయబడిన కత్తి క్రింద కూర్చొని విందారగిస్తున్నట్లుగా) ప్రచారకుల జీవనశైలి ఉంటుంది. ఇటువంటి అసాధారణ కార్యం సంఘం నేటివరకూ చేసుకొంటూ వచ్చింది. రాబోయే రోజులలోనూ ముందుకు సాగిస్తుంది. ప్రచారక్‌ వ్యవస్థ మనం అపేక్షిస్తున్నతీరున చురుకుగా ముందుకు సాగుతూ ఉన్నట్లయితే, ప్రచారకులపట్ల సమాజంలో ప్రేమ, సమ్మానము, శ్రద్ధ, గౌరవమూ ఇప్పటిలాగే ఎప్పటికీ కొనసాగుతూ ఉంటాయి.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top