5. ఆర్.ఎస్.ఎస్ ప్రచారక పద్ధతి - RSS Pracharak (Campaign) Method

The Hindu Portal
0
ఆర్.ఎస్.ఎస్ ప్రచారక పద్ధతి - RSS Campaign Method

ప్రచారక పద్ధతి - Campaign Method 

దేశంలో సంఘకార్యం విస్తరించుతూరాగా, అన్నిచోట్ల సంఘకార్యం నిర్వహింపబడే తీరుతెన్నులు ఒకే విధంగా ఉండాలనే ఆలోచన చేయబడుతూ వచ్చింది. 
   ప్రచారకుల గురించి కల్పన ముందుకు వచ్చింది. దీని వెనుకకూడా ఒక సుదీర్ఘమైన భూమిక ఉంది. సంఘశాఖ నిర్వహణలో పాటింపవలసిన ఆచార పద్ధతిని, ఇతర కార్యక్రమాలనూ వివరించేందుకు ఇప్పుడు కొన్ని పుస్తకాలు ఉన్నవి. ప్రారంభదినాలలో అటువంటి వేవీలేవు. దేశమంతటా ఉన్న శాఖలలో, సంఘకార్యంలో ఒకే విధమైన పద్ధతిని అనుసరించాలంటే, ఒకే తీరున అంతటా జరగాలంటే, దీనిపట్ల శ్రద్ధవహించే ఒక వ్యవస్థ ఉన్నపుడే అది సాధ్యపడుతుందన్న ఆలోచన వచ్చింది. తదనుగుణంగా శారీరక శిక్షణ ఇవ్వటంకోసం ప్రాథమిక శిక్షావర్గలు, సంఘశిక్షావర్గలు నిర్వహించటం ఆరంభమైంది. 
    వేఱువేఱు శాఖలనుండి స్వయం సేవకులు ఈవర్గలకు వస్తూ ఉండేవారు. వారందరికీ ఒకవిధమైన శిక్షణ ఇవ్వబడేది. అయితే కార్యక్రమాన సంఘకార్యం విస్తరించురాగా, తమవద్ద తమవద్ద కార్యకర్తలు అవసరమని,  వారు తమ స్వస్థానాలకు వెళ్ళి శాఖలు నడిపించుతూ ఉండేవారు. అయితే కాలక్రమాన సంఘకార్యం విస్తరించుతూరాగా, తమవద్ద కార్యకర్తలు అవసరమని, కాబట్టి కార్యకర్తలను పంపించండని ప్రజలు కోరనారంభించారు. నెలా, రెండు నెలలు ఉండి శాఖనడిపేవారిని మీరు మా నగరానికి పంపించినట్లయితే, శాఖ బాగా నడుస్తుందని చెప్పే5వారు ఎక్కువయ్యారు. నాలుగు ప్రక్కలనుండి ఇటువంటి అభ్యర్థనలు వస్తూ ఉంటే డాక్టర్జీ కొందరినీ అక్కడక్కడ నగరాలకు, గ్రామాలకు పంపించారు. అలా బయటి గ్రామాలను వెళ్తూ ఉండిన కార్యకర్తలకు అక్కడివారు భోజనము, వసతి సంబంధమైన ఏర్పాట్లు చేస్తుండేవారు. ఆ పద్ధతిలో కార్యకర్తలను ఒకచోటనుండి మరోచోటకు పంపించటం జరుగుతూ వచ్చింది.

ప్రచారక పద్ధతి - వ్యాసపీఠిక :
 1. పూర్ణకాలిక కార్యకర్తలు కావాలన్న కోరిక
 2. కార్యానికి ముఖ్యమైన ఆధారం సామాన్యస్వయం సేవకులే
 3. కార్యానికి సంబంధించిన బాధ్యత -స్థానీయ కార్యకర్తలపైనే ఉంటుంది
 4.  ప్రచారక్ యొక్క భూమిక
 5. స్థానీయ కార్యకర్తలు భారం వహించాలి !
 6. ప్రచారకులు గుణ సంపన్నులు కావాలి
 7. మాటలలో సంయమం తప్పని సరి
 8. గౌరవ సమ్మానాలు పొందడానికి ఆధారం వ్యక్తిత్వం !
 9. కార్యకర్తకు సావధానత ప్రతిక్షణమూ అవసరమే !
 10. లోగిలివరకూ సంబంధం నెలకొల్పుకోవాలి
 11. అత్యధిక మహత్వం గల అంశం మన వ్యవహారమే!
 12. వ్రేలాడుతున్న కత్తిక్రింద కూర్చొని భోజనం చేసే జీవనం

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top