ఆంధ్రాలో అధికారంలోకి వ‌స్తే మతమార్పిడి నిరోధ‌క బిల్లు - If BJP comes to power in Andhra Pradesh, we will bring an anti-conversion bill!

0
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్

విజ‌య‌వాడ‌: రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని, పాలకులే వీటిని ప్రోత్సహిస్తున్నారని భార‌తీయ జ‌నతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మ‌తమార్పిడులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొస్తామన్నారు.

విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని వాజపేయీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు సునీల్ దేవధర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలు సాగుతున్నాయని, ఇటీవల ఓ బహిరంగ సభలో ఎస్సీ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సుచరిత తాను క్రిస్టియన్‌ అని ప్రకటించుకున్నారని సునీల్ దేవధర్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కూడా తన కుటుంబం క్రిస్టియన్లుగా పేర్కొన్నారన్నారు. ఎస్సీ రిజర్వు నియోజకవర్గాల నుంచి క్రిస్టియన్లు పోటీచేయడం రాజ్యాంగ విరుద్ధమని అలాంటి వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని, పాలకులే వీటిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. హిందూ ఆలయాల ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని, భక్తులు దేవాలయాల అభివృద్ధి కోసం సమర్పించిన ఆస్తులు, కానుకలను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నార‌ని సునీల్ దేవధర్ మండిప‌డ్డారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి, మతపరమైన రాజకీయాలను ప్రోత్సహించటం మానుకోవాలని హితవుపలికారు.

28న బహిరంగ సభ: కన్నా లక్ష్మీ నారాయణ
వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ నెల 28న విజయవాడలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వెల్ల‌డించారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని వాజపేయీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అవినీతి, కక్ష సాధింపుతో పాలన సాగిస్తోంద‌ని విమ‌ర్శించారు. రాష్ట్రాన్ని సొంత‌ వ్యాపార సంస్థగా మార్చేశారని దుయ్యబట్టారు. అవినీతి పాలనపై బీజేపీ పోరాటం చేస్తుందని, ముఖ్యమంత్రి నిరంకుశ విధానాలను ఈనెల 28న జరగనున్న సభలో ఎండగడతామన్నారు.

Source: EtvBharat
Tags

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top