మన పతనానికి మూలకారణం - Causes of our Downfall

Vishwa Bhaarath
" మన పతనానికి మూలకారణం ": ప.ఫూ. డాక్టర్‌ హెడ్గెవార్‌, పుణే 1935 !  - Causes of our Downfall
మన పతనానికి మూలకారణం
ప.ఫూ. డాక్టర్‌ హెడ్గెవార్‌, పుణే 1935 !

హైందవేతరులు అధికసంఖ్యాకులైన హిందువులపై దాడులు జరుపుతున్నారని నేడు నాలుగువైపులా వినవస్తూవుంది. దీనికి కారణం ఏమిటి ? హైందవెతరులు మనలను చూసి భయపడకపోవడానికి కారణం ? భయం మాట అటుంచి పైగా వారే మనలను పీడిస్తున్నారు. “పరమేశ్వరా! ఏం చేయాలి? రక్షించే నాథుడే లేడా?” అని మనం అర్థంలేకుండా గోలపెడుతూ ఉంటాం. ఈ ఆక్రందనానికి బెచిత్యం ఉన్నదా? ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది. "God Helps those who help themselves" అంటే మానవయత్నం ఉంటే దానికి దైవబలం తోడవుతుంది అని భావం. మరి పరమేశ్వరుడు మనకెందుకు సాయపడాలి ? మనమీద ఆయనకు కనికరం కలగటం దేనికి ? మనం ఏం ప్రయత్నిస్తున్నామని పరమేశ్వరుడు మన సాయానికని పరుగెత్తి రాగలడు ? ఏమీలేదు. సాధుజనుల సంరక్షణకై అవతరిస్తుంటానని భగవానుడన్నాడు. కాని “సాధువు” అంటే ఎవరు ? నంస్కృతీ ధర్మాలంటే అణుమాత్రమైనా పట్టింపులేక స్వార్థంతప్ప మరొకటి స్ఫురించని దుష్టులను సంహరించడానికే పరమేశ్వరుడు అవతరిస్తాడు. 
    హిందూ సమాజంలో ఈ దుర్గుణాలు బాగా వ్యాపించాయి. మరి ఇలాంటివారిని దుష్టు లనక మరేమనాలి ? ధర్మం, రాష్ట్రం, సమాజం, లోకకల్యాణం కాంక్షిస్తూ సర్వదా తమ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉందేవారే సాధువులు. ఇలాంటి త్యాగులూ, కర్తవ్య పరాయణులూ హిందువులలో తగినంతమంది ఉన్నారా? సాధుగుణాలు హిందువులలో సగం మందిలోనైనా ఉంటే ఈ విశాల సమాజంమీద దాడులు జరిపే సాహసం ఎవరిలోనూ ఉండకపాయ్యేది. అప్పుడు పరమేశ్వరుడే స్వయంగా ధర్మ్శరక్షకై మన మధ్యన అవతరించేవాదు. కాని ఈనాటి పరిస్థితుల్లో పరమేశ్వరుని సాయంలభించగలదనే ఆశకు తాపులేదు. ఈ జాతిలో స్వార్థపరులు, బలహీనులు-అంటే పాపులే ఎక్కువ ఉన్నారని పరమేశ్వరుడు ఏవగించుకొని మనవైపు చూడనైనా చూడడు. ఏదోవిధంగా ఆయన అవతరించినా, దుష్టసంహారమే ఆయన కర్తవ్యం కనుక, మనలను సంహరించడానికనే భావించాలికాని రక్షించడానికిమాత్రం ముమ్మాటికీ కాదు. మనలో స్వార్థపరత, బలహీనత, సమాజపు హితవుపట్ల వైముఖ్యం తొలగనంతవరకూ, సళ్చీలురం కానంతవరకూ, మనలను దుష్టులని భావించి పరమేశ్వరుడు దండిస్తుంటాడు. వాస్తవికంగా మనం సాధుమూర్తులమైననాడు, రాష్ట్రం ధర్మం కళ్యాణార్థం సర్వస్వార్పణం చేయడానికి పూనుకున్ననాడు పరమేశ్వరుడు సాయపడడం జరుగుతుందేమో !!
   అందుకే మీలోవున్న స్వార్ధాస్న్‌ జాప్యాన్నీ సమూలంగా తొలగించండని ప్రార్ధన. సమాజ కార్యంపట్ల సంపూర్ణవైముఖ్యం ఉన్నందువల్లనే మన మనస్సులో ఇంతదౌర్చల్యం దాపురించింది “సమాజం ఏగోతిలో పడితేనేం ? నేనేమిటో నాస్వార్థం ఏమిటో”- సమాజంపట్ల ఇలాంటి ఉదాసీనభావాలు మనలో కూరికూరి నింపబడ్డాయి. అందుకే మన సమాజం ఇంత బలహీనమై పోయింది. ఈ హృదయ దౌర్భల్యంవల్ల దాపురించిన ఫలితాలను ఈనాడు సమాజం అనుభవించవలసి వచ్చింది. హృదయదౌర్చల్యమే అన్నిటినీ మించిన హానిని చేకూరుస్తుంది. ఇదే మనలోవున్న పెద్దదోషం. ఎవరికివారు శక్తిమంతులని భావిస్తూ, ఈ సంఘటన కార్యంలో ప్రవేశించిననాడు మనశక్తి ఒక విరాట్‌ స్వరూపాన్ని ధరిస్తుంది. ఇక మనకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. నిజానికి మనలో శక్తి ఉన్నాా దానిని విస్మరిస్తున్నాం. మనస్సునుబట్టే నడతకూడా ఉంటుంది. ఒకప్పుడు మనం ఎంతో బలవంతులం. కాని ఈనాడు ఆ యదార్దాన్ని పూర్తిగా విస్మరించాం. అందుకే మనం జరిపే ఉద్యమాలు బలహీన భావాలతోనే నడుస్తున్నాయి. మనం నడిపే ఉద్యమాలలో బైతన్యంకాని, పారుషంకాని మచ్చుకైనా కనబడదు. రాష్ట్రశబ్దానికి అనలు అర్భవేమిటోకూడా మనకు తెలియదు. దేశపాత భావాలు మనహృదయాలలోకి రానేరావు. వాటినన్నిటినీ పూర్తిగా విస్మరించడమేకాక ఆలోచించడంకూడా మానేశాం. హిందూస్తాన్‌ అనే పదానికి పురాతనకాలంనుంచీ అసందిగ్ధమైన నిర్వచనమే ఉన్నది. కాని 'హిందువుల దీ హిందూదేశం” అని అంటే చాలు, మన నాయకుల శరీరాలు జలదరిస్తాయి.

    భారతవర్వం భరతఖండం, ఆర్యావర్తం, హిందూదేశం-ఈ పేర్లన్నీ సమానార్థకాలుగా ఉపయోగింపబడినా, “హిందూ” అనగానే మన మనస్సు కలవరపడుతుంది. ఏదో పంజరంలో చిక్కుకున్న చిలుకలా మనపరిస్థితి ఏర్పడుతుంది. ('భ్రమలోపడి కొట్టుకొనిపోవుచున్నాము. మన సంస్కృతిని తుదముట్టించడానికి పూనుకున్నవారిని కౌగలించుకోవడానికి తాపత్రయపడుతున్నాము. మానసిక బలహీనతే వీటన్నిటికీ కారణం. హిందూదేశం ప్రపంచ ప్రజలందరిదీ ఐనట్లు “సాహెబ్‌జీ హిందూస్సాన్‌, బందగీ హిందూస్సాన్‌, గుడ్‌ మార్షింగ్‌ హిందూసన్నాన్‌” అనే పదాలు పాడుతూ బ్రోచేదెవరయా: అని ఆర్రులు చాచడం మన దౌర్చల్యాన్ని నిరూపించుకోడం తప్ప వేరుకాదు. ఒకరి సాయాన్ని అపేక్షించడంకానీ, బిక్షాటనంకానీ బలహీనతలకు చిహ్నం మాత్రమే. స్వయంసేవక సోదరులారా! హిందూదేశం హిందువులదే నని ఉద్దాటించండి మానసిక దౌర్బల్యాన్ని తొలగించండి. విదేశీయులు ఇక్కడ ఉండకూడదని మనం అనడంలేదు. కాని హిందువుల భూమియైన హిందూదేశంలో ఉంటూ, హిందువుల హక్కులను కబళించడానికి మాత్రం ప్రయత్నించకూడదని వారు గ్రహించాలి. విదేశీయులు మన నెత్తి నెక్కకుండా మనం జాగ్రత్త వహించాలి.

  హిందూదేశం కేవలం హిందువుల భూమియే అని మీరనడానికి ఆస్కారం ఏమిటని అనేకులు నిస్సంకోచంగా ప్రశ్నిస్తారు. ఇక్కడ నివసించేవారందరిదీ ఈ భూమి అని వారి వాదన. అలా ప్రళ్నించేవారికి రాష్ట్ర శబ్దానికి అర్ధం ఏమిటో తెలియకపోవడం చాలా విచారకరమైన విషయం. ఏదో ఒక నేలచెరగును రాష్ట్రం అని పేర్కొనం. ఒకే సిద్ధాంతం, ఒకే సాంప్రదాయం, ఒకే సభ్యతను ఆధారంగా చేసుకొని అనాదికాలంనుంచి సమైక్యతతో జీవిస్తున్న జనులకూడికే రాష్ట్రం. మనవల్లనే ఈ దేశానికి హిందూస్సాన్‌ అనేపేరు వచ్చింది. ఇతరులు సౌమ్యంగా ఈ దేశంలో నివసించవచ్చు. ఇదివరలో అలాంటివారిని మనం అడ్డగించలేదు. ఇకముందూ అడ్డగించము. పారశీప్రజల ఉదాహరణ తీసికొంటే హిందువుల ఉదారత స్పష్టమౌతుంది. అతిథులైవచ్చి “ఇంట తిని ఇంటివాసాలను లెక్కపెట్టే” వారికి మాత్రం ఇక్కడ సూదిమోపినంత స్థలమైనా లభించజాలదు. ఈ సిద్ధాంతాన్ని మీరు క్షుణ్ణంగా అర్ధం చేసికోండి. మన ఇంటిలో మనం సగౌరవంగా జీవించగలగడానికే ఈ సమైక్యత ఉద్దేశింపబడింది. ఇందులో అన్యాయం ఏమీ లేదు.
  ఇంగ్లాండు ఆంగ్రేయులది: ప్రాన్సు ప్రెంచివారిది: జర్మనీ జర్మనులది-అని ఆయాదేశస్థులు సంతోషంగా ఉద్దాటిన్తారు. కాని దురదృష్టవశాత్తు హిందూస్సానానికి ప్రభువులైన హిందువులే ఈ దేశంపై అధికారం మాదే అని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇలాంటి విపరీతభావం మనలో పుట్టడానికి కారణం ? సంజ్ఞావాచకాన్ని (Proper noun) అనువదించడం అసంగతమైన విషయం. ఆ శబ్దాన్ని అలాగే ఉంచడం జరుగుతుంది. కాని మన దౌర్భల్యాన్ని గ్రహించి సార్థకమైన హిందూస్థాన్‌ అనే పేరును తుడిచివైచి, ఈ దేశానికి ఇండియా అనీ, ఈ దేశవాసులకు ఇండియన్స్‌ అనీ నామకరణం చేశారు. హిందూస్సాన్‌, హిందూ అనే పేర్లను వినినంతనే మన గత చరిత్ర అంతా కందగ్లకు కట్టినట్లు కన్పిస్తుందనీ, అందువల్ల ఆ పేర్లకు మనుగడ లేకుండా చేయాలని ఈ తారుమార్లు చేయబడ్డాయి.

   మనం సర్వశక్తులనూ ధారవోసి ప్రయత్నించనిదే హిందూన్సాన్‌ అనేపేరు చరిత్ర పుటలలో తప్ప మరెచ్చటా మిగలదనే విషయం పామరుడుకూడా గ్రహించగలడు. “హిందదేశం అమరభూమి” అని మన నాయకుల గర్జిస్తూ ఉంటారు. కాని ఇది యదార్ధమైన విషయమేనా ? గ్రుడ్డిగా ఇలాంటి మాటలను విశ్వసించకండి. ఎలాంటి తీవ్ర ప్రయత్నాలు చేయనిదే హిందూదేశాన్ని అమరభూమిగా చేయడం సాధ్యంకాదు. తన కుటుంబాన్ని పోషించుకోడానికే మానవుడు కష్టపడక తప్పనప్పుడు ఏ ప్రయత్నమంటూ లేక ఈ సమాజజీవితం సక్రమంగా అవరోధం లేకుండా నడుస్తుందని ఉద్ధాటించడం తెలివిగల విషయమేనా ? సమాజజీవితం సక్రమంగా సాగాలంటే అంతులేని ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నం లేనిదే ఫలితం దక్కడం అసంభవం. భగవన్నామస్మరణ చేస్తూ ఉన్నపక్షంలో పరమేశ్వరుడు తప్పక సాయపడగలడని వాదించే పెద్దలుకూడా అనేకులు కన్పిస్తారు. ప్రయత్నం లేకుండా కేవలం నామపారాయణంచేసి, పాదాల(మోల ధనపు రాసులను దొర్లించుకోగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ? ఇది అసంగతమైన విషయం; కష్టించందే ఫలితం లభించడం కల్ల. కనుక మనం ఎంతో కృషి చేయాలి. ప్రయత్నించేటప్పుడు మాత్రం పరమేశ్వరుని నిస్వార్థబుద్ధితో స్మరిస్తూ ఉండడం, చేసిన పనిని పరమేశ్వరుని పాదపీఠంపై అర్పణ మొనర్చగల నిష్కామ ప్రవృత్తిని అలవరచుకోవడం చాలా అవసరం.

సమయం వచ్చినప్పుడు పరిస్థితులు వాటంతట అవి చక్కబడుతాయని కొందరు అంటుంటారు. కాని తమ స్వంత విషయాలను గురించి కూడా వీరు అలాగే ముభావంతో ఉండగలరా ? తనమీద ఏదైనా వచ్చిపడ్డప్పుడు భగవంతుని ప్రార్థిస్తూ వీరు నిశ్చింతతో ఉండగలరా ? ఏదో క్రిందుమీదులు చేసి అనేక విధాల ప్రయత్నించి తమపని సాధిస్తారు. వ్యక్తిగతమైన విషయాలు కాక దేశమూ, ధర్మమూ, సమాజమూ మొదలైన సమస్యలను ఎదుర్శొనెటప్పుడే ఎక్కడలేని భగవద్భక్తిస్ఫురిస్తుంది. ఇలాంటివారిలో స్వార్థంతప్ప మరొకటి లేదని ఎందుకు అనకూడదు ?
   “దేశసేవ చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు, ఒక్క పిలుపుతో ఎక్కడికి రమ్మంటే అక్కటికి ఒక్క గంతులో వచ్చేస్తాం” అనేవారుకూడా కొందరు ఉంటారు. ఐతే వారిని పిలిచేదెవరు ? అదీగాక అలాంటి పరిస్థితి కష్టపడి పనిచేస్తేనేకానీ రాదుగదా ? ఎవరింట వారు కూర్చొని ఎదురుచూస్తూ ఉంటే ఆ గడియ దానంతటది వస్తుందా ? ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నామంటూ మీరు ఇంట్లో కూర్చుని ఆ పిలుపు రాగల పరిస్థితిని సృష్టించడానికి ఇతరులు కప్టించాలని ఆశిస్తుంటారు. ఇది సుసంగతమైన విషయమేనా ? ఈ విధంగా ఊహిస్తుంటే ఆ సమయం ఎలా సమీపిస్తుంది? ఆ గడియ సమీపించినపుడు మైదానంలోకి మేము వచ్చి దూకగలం అని అంటూ పనిచేయక మౌనం వహించడం స్వయంసేవకులకు తగదు.  ఇలా మాట్లాడ్డం మన సిద్ధాంతాలకే వ్యతిరేకం. పై రెండు రకాల మనుష్యులు సంఘ సిద్ధాంతాన్ని గ్రహించలేదు. హిందూదేశం హిందువులదిగా చేసి ప్రపంచానికి చూపాలంటే ఇది నా పని అనే నమ్మికతో, ఈ కార్యపూర్తికి కావలసిన సిద్ధాంతాలకు అనుకూలంగా మన జీవితంలో మార్పులు చేసుకోక తప్పదు. మన ధ్యేయానికి అనుకూలంగా వ్యక్తులను సమైక్య మొనర్చడమే మన ప్రథమ కర్తవ్యం. నిజమైన హిందువునని ప్రకటించుకోగలిగిన ప్రతివ్యక్తినీ సమీపించి నేటి మన జాతి దుస్థితిని గురించి విపులంగా నచ్చచెప్పి, దేశంకొరకు కృషిచేసేవిధంగా మార్చాలి. అలా ఒక పదిమంది కూడిన తరువాత, నేర్చరియైన ఒక ముఖ్యుణ్ణి నియమించుకోవాలి. ఈ విధంగా పట్టణాల్లోనూ, (గ్రామాల్లోనూ కార్య మారంభించవచ్చు. ఈ సంఘటన తామరతంపరగా భారతవర్షంలో మూలమూలలా వ్యాపించనిదే మన కార్యపూర్తి జరిగిందని భావించడానికి వీలు లేదు. ప్రపంచ పద్ధతి మీకు తెలియంది కాదు. 100 రూపాయల ఖరీదుగల వస్తువు 99 రూపాయలకు కావాలంటే లభిస్తుందా ? ప్రతి వస్తువుకూ పూర్తివెల ఇచ్చితీరాలి. అందుకని మన సమాజంలో తగినంత శక్తి నిర్మింపబడేవరకు ఈ కార్యక్రమం నడుస్తూనే ఉండాలి. కేవలం శారీరక బలం సరిపోదు. మానసికశక్తి నఖీవృద్ధిపరచడం కూడా ఎంతో అవసరం; అసలు మొదటి ఆవశ్యకత మానసికశక్తియే. అందుకని మొదట స్వయంసేవకులు తమలోవున్న మానసిక దౌర్చల్యాలను క్షాళితం చేసుకొని పిమ్మట తమ మిత్రులలోకూడా మానసిక సామర్ధ్యాన్ని సృజించాలి.

నేడు మనలో విచిత్రమైన పతనం ఏర్పడింది. ధర్మం, సంస్కృతి మొదలైన విషయాలనే విస్మరించడం జరిగింది. స్వార్థంతప్ప మరొక్కటి కన్పించడంలేదు. “సంసారం సారరహితమైంది; ఈ జీవితం ఒక మాయ, ఈ వేదాంతవాక్యాలు పుస్తకాలలో ఉంటేనే శోభిస్తాయి. ప్రత్యక్ష ప్రపంచానికి వీటితో సంబంధం లేదు” అని అంటున్నారు. మీరు సిద్ధాంతాలు ఉద్దాటిస్తున్నారని మనతో అనేకులు అంటున్నారు. సిద్ధాంతాలు కేవలం గ్రంథాలలో ఉండవలసినవేనా! ప్రత్యక్షాచరణతో వాటికి సంబంధంలేదా ? ఎంత భ్రమ ! జీవితంలో సిద్ధాంతాన్నీీ ఆచరణనూ చక్కని కౌశల్యంతో సమన్వయించుకోవడమే మానవత్వమని నా సంపూర్ణ విశ్వాసం.
    స్వార్ధానికి స్వస్తిపలికితే సిద్ధాంతాన్నీీ ఆచరణనూ సమన్వయించుకోవచ్చు. మన స్వార్ధమే మన కర్తవ్యపథాన్ని ఎప్పుడూ అడ్డగిస్తూ ఉంటుంది. అందుకని క్షుద్రమైన ఈ స్వార్ధసీమను స్వయంసేవకులు అధిగమించాలి. పశుత్వాన్ని విడిచి మానవులం కావాలి. స్వార్థం తొలగిపోయినప్పుడు మానవత్వం లభించడం అట్టే కష్టదాయకం కాదు. నా జీవితం నా సర్వశక్తులూ దేశానికీ ధర్మానికీ అంకితం అనే భావం హృదయాలకు హత్తుకోవాలి. స్వధర్శ్మంపట్లా, స్వదేశంపట్లా మానవులందరికీ సహజంగా ఆదరాభిమానాలు ఉండాలి. కానీ నేడు సమాజాన్నీ స్వధర్నాన్నీీ మనం విస్మరించాం. ఎంత సిగ్గుచేటు ! అందుచేతనే ఈ విషయాలను ఇన్నిసార్లు గుర్తుచేయవలసి వస్తున్నది.

మనం ఏ మహోద్దేశాలను తీసుకొని పుఠరోగమించ తలచుకున్నామో వాటిలో దోషంగానీ, పాపంగానీలేదు. మన ధర్మాన్ని దేశాన్ని రక్షించుకునే బాధ్యతను మనం స్వీకరించాం. ఇందులో పాపమేమున్నది ? ఈ మహాకార్యం ఒకరిద్దరి వల్లగానీ, ఏ కొంతమందివల్లగానీ నెరవేరేది కాదనే సంగతిని కూడా మనం విస్మరించకూడదు. ఒకే ధ్యేయంవల్ల ప్రోత్సహింపబడి నడిచే కోటానుకోట్ల యువకుల సమైక్య ప్రయత్నం ఈ కార్యసిద్ధికై కావాలి. మీకునా ప్రార్థన ఇది ఒక్కటే. ఈ విశాల భారతభూమిలో శక్తిమంతులూ ధ్వేయనిష్టాపరులూనైన యువకుల సంఘటనని వ్యాపింపచేయండి. ఇక కార్యసిద్ధికి కష్టాలుండవు. నాల్గువైపులా ఉత్సాహం విశ్వాసం చక్కగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పరిస్థితిని నిర్మించడానికి నేటి మన కార్యక్రమాలు సాధనాలు. ఈ సాధనాలనే సంఘ ఆదర్శాలని అనేకులు భావిస్తూ ఉంటారు. కాని ఇది వట్టిభ్రమ. మన ఆచరణద్వారా ఈ భ్రమను పోగొట్టాలి. దేశంలో ఏక సూత్రతా, క్రమశిక్షణా వ్యాపింపచేయడం అవసరం. కర్ర కత్తి సాములూ, సైనిక శిక్షణా పూర్తిగా వ్యర్థమని నా ఉద్దేశ్యంకాదు. ధ్యేయానికున్నంత ప్రాధాన్యం కార్యక్రమాలకు లేదు. మన కార్యక్రమాలనే సంఘం సర్వస్వం అని భావించేవారికి ధ్యేయానికి కార్యక్రమాలకూ ఎలాంటి సంబంధం ఉంటుందో స్పష్టీకరించడం ఉచితం అనినా ఉద్దేశం. స్వధర్నాన్నీీ స్వరా్ష్రాన్నీ రక్షించుకోడానికి శక్తిని సమకూర్చుకోవడమే సంఘోద్దేశం. ఈ విషయం సంఘంలోవుండే చిన్న పిల్లలకుకూడా తెలుసు.

ప్రపంచంలో శాంతిభద్రతలు సురక్షితంగా ఉండాలంటే సమస్తితి (Balance) ఉండడం చాలా అవసరం. బలహీనులూ, బలవంతులూ, ఒకచోట కలసి ఉన్నప్పుడు అశాంతి తప్పదు. రెండు పులులు పరస్పరం కలహించుకోవు. కాని పులి మేకలు ఒకచోట తారసిల్లినప్పుడు ఏమి జరుగుతుందో తెలుప నవసరం లేదు. సమానశక్తిమంతుల మధ్యనే శాంతి సౌహార్దాలుంటాయి. అత్యాచారాలకు అలవాటుబడ్డ విద్రోహులకు అవకాశమిచ్చే బలహీనులే ప్రపంచశాంతికి పరమ శత్రువులు. మనము బలహీనులమై ఉంటే ప్రపంచ శాంతిభద్రతలను నష్టపరచిన పాపం మనలను చుట్టుకుంటుంది. శాంతిని ఆశించే మానవ జీవితాన్ని చీకాకు పరచడమనే పాపం మనం చేయకూడదు. అనుకున్నంత మాత్రాన అయ్యేపని కాదిది. సాక్షాత్పరమేశ్వరునికే పదిమార్లు అవతరించి మనుష్యశక్తిని ఆశయించక తప్పలేదు. ఇలాంటి శక్తిని కొందరు పశుశక్తి అని అంటారు. 
    ప్రజాక్షేమానికీ ధర్మసంరక్షణకూ వినియోగించబడదే శక్తి పశుశక్తి అనబడుతుందా? ఆధ్యాత్మిక శక్తి ఎంత పవిత్రమైనదో, ఈ శక్తికూడా అంత పవిత్రమైనదే. హింసను తాండవింపచేయడానికి మనం శక్తిని సమకూర్చుకోకూడదు. ప్రపంచాన్ని ఆవరించిన హింసను, అత్యాచారాలను తుదముట్టించడంకొరకే మనం “శక్తిని” సమపార్ణించుకోవాలి. ఈనాడు ఎటుచూసినా అధర్మం, అన్యాయం, అత్యాచారం విచ్చలవిడిగా విహరిస్తున్నాయి. ఇవి సమూలంగా నశించిపోనంతవరకు మన మెన్ని తప్పులు చేసినా, మోక్షానికి యోగ్యులం కాజాలము. ఇంత సాధారణ విషయంకూడా ఎందుకు అర్ధంకాదో తెలియటంలేదు. మన పతనానికి కారణం కేవలం మానసిక దౌర్చల్యమే. దాన్ని మొదట తొలగించుకోవాలి. సంఘ ధ్యేయాన్ని సఫల మొనర్చడానికి నిర్వహించవలసిన కర్తవ్యమేదో స్వయంసేవకులు సంపూర్ణంగా గ్రహించాలి. నేనూ, నా సర్వస్వం సంఘానికే- అంటే దేశానికే అనే భావమే మన అందరిలోనూ ఉండాలి. దేశప్రేమ ప్రతి స్వయంసేవకుని కణకణంలోనూ వ్యాపించాలి. స్వయంసేవకులు అవకాశవాదులైన దేశభక్తులు కాకూడదు. మన పహృదయాలన్నీ ఈరీతిగా సంఘమయం అయినట్లయితే ధ్యేయపూర్తికి జాగుండదు.
(full-width)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top