క‌ర్నాట‌క‌లో బ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌ దారుణ హ‌త్య

Vishwa Bhaarath
0
క‌ర్నాట‌క‌లో బ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌ దారుణ హ‌త్య - Harsha murder case Bajrang Dal
Bajrang Dal Activist " Harsha "
క‌ళాశాల‌ల్లో హిజాబ్ ధ‌రించ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ ఫేసుబుక్‌లో ఒక పోస్టు చేసినందుకు భ‌జ‌రంగ్ ద‌ళ్  కార్య‌క‌ర్త‌ను కొంత మంది మ‌తోన్మాదులు దారుణంగా హ‌త్య చేసిన సంఘ‌ట‌న క‌ర్నాట‌క రాష్ట్రంలోని శివ‌మొగ్గ‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే… శివమొగా జిల్లాలోని సీగేహట్టికి చెందిన బ‌జ‌రంగ్ ద‌ల్ కార్య‌క‌ర్త హర్ష దర్జీగా ప‌ని చేస్తూ ఉంటాడు. ఇటీవ‌ల క‌ర్ణాట‌క రాష్ట్రంలో హిజాబ్ ధ‌రించ‌డాన్ని కొన్ని క‌ళాశాల‌లు ర‌ద్దు చేశాయి. ఈ నేప‌థ్యంలో ఆందోళ‌న కారులు కొన్ని చోట్ల సంఘవ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు ఎగ‌బ‌డ్డారు. దీనిపై స్పందించిన హ‌ర్ష విద్యాల‌యాల్లో హిజాబ్ ధ‌రించానికి వ్య‌తిరేకిస్తూ ఫేసుబుక్‌లో ఒక పోస్టు చేశాడు. దీనిని కొంత మంది మ‌తోన్మాదులు వ్య‌తిరేకించారు. అంతే కాకుండా మ‌రికొంత మంది మ‌తోన్మాదులు హ‌ర్ష పై క‌క్ష క‌ట్టి అత‌న్ని చంపేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు ఆదివారం రాత్రి హ‌ర్ష ఒంట‌రిగా ఇంటికి వెళ్తున‌ప్పుడు కామత్ పెట్రోల్ బంక్ సమీపంలో 4-5 మంది దుండ‌గులు అత‌నిపై దాడి చేసి చంపేశారు.

బురఖాను వ్యతిరేకించేవారిని ముక్కలుగా నరికేస్తామని కాంగ్రెస్ నాయకుడు ముకర్రం ఖాన్ బెదిరించిన పన్నెండు రోజుల తర్వాత, తరగతి గదుల్లో బురఖాను వ్యతిరేకిస్తూ ఫేస్‌బుక్ పోస్ట్ రాసినందుకు హర్ష హత్య జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న‌పై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. హర్ష హత్యతో శివమొగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. హత్యకు జ‌ర‌గ‌డానికి ముందునుండే బాధితుడికి బెదిరింపులు వచ్చినట్లు విచారణలో తేలింది.

కర్నాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర హర్ష కుటుంబాన్ని పరామర్శించి సత్వర న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హత్య వెనుక ఏ సంస్థ హస్తం ఉందో గుర్తిస్తామ‌న్నారు. ముందుజాగ్రత్త చర్యగా నగర పరిధిలోని పాఠశాలలు, కళాశాలలను రెండు రోజుల పాటు మూసివేయ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

కర్నాటకలో బురఖా వివాదాల మధ్య, కాంగ్రెస్ నాయకుడు ముఖరం ఖాన్ ఫిబ్రవరి 8 న బురఖాను వ్యతిరేకించే వారిని ‘ముక్కలుగా నరికివేస్తాము’ అని అన్నారు. అతని వీడియో వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫిబ్రవరి 17న, కర్ణాటక పోలీసులు ఖాన్‌పై ఐపిసి 153 (A), 295 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు.

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top