జాతి మనుగడకు మాతృభాష మకుటం - Matrubhasa

Vishwa Bhaarath
0

 ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా 

- బలుసా జగతయ్య, 9000443379
ముచ్చటగా ముచ్చటించే మాటల సవ్వడితో తను ఆలకించడం ప్రారంభిస్తాడు. ఏడుస్తున్నప్పుడు తల్లి ఓదార్పు మాటలు, పాలిస్తూ తీసే కూని రాగాలు, గోరుముద్దలు'పెడుతూ వినిపించే చందమామ పాటలు, నిద్రపుచ్చుతూ పాదే జోలపాటలు, తన వాళ్ళందరిని చూపిస్తూ సంబంధ బాంధవ్యాలు పరిచయం చేయడాన్ని వింటూ పులకరిస్తుంటాడు శిశువు. తప్పటడుగులు వేస్తున్న సమయంలో తల్లి చెప్పే జాగ్రత్తలను వింటూ కిందపడుతూ లేస్తూ అమ్మ నాన్న తాత అంటూ చిట్టి పొట్టి మాటలను పలకడం ప్రారంభిస్తాడు. అట్టి మాటలతో కుటుంబ సభ్యులను అలరిస్తూ తన భావాన్ని ప్రకటిస్తూ ఎదుటివారి భావాన్ని ఆస్వాదిస్తూ ఆనందపరవశుడవుతూ మాటల పరంపరను కొనసాగిస్తుంటాడు.

అలా కొనసాగుతున్న మాటలే ఆ శిశువుకు మాతృభాష తనకు జన్మనిచ్చిన స్రీయే మాతృమూర్తి, తను జన్మ పొందిన భూమే మాతృభూమి. అందుకే దశరథ నందనుడు శ్రీరాముడు “జననీ జన్మభూమిశ్చ - స్వర్గాదపి గరీయసి” మనకు జన్మనిచ్చిన ఈ భూమి స్వర్గం కన్నా మిన్నయైనది
అంటూ మాతృభూమిపై పరమపవిత్ర భావన కలిగించడం మనం రామాయణంలో చూస్తాం. సీతాదేవిని వెతకడానికి వెళ్ళిన హనుమంతుడు లంకానగరంలోని అశోక్రవనంలో సీతమ్మ తల్లిని గుర్తించిన తదుపరి ఆమెను ఏ భాషలో మాట్లాడిస్తే నన్ను నమ్ముతుందోననే ఆలోచనలో పడ్డాడు.

    కోసల రాజ్యంలోని వాడుక భాషలో మాట్లాడితే రావణుడు మోసం చేస్తున్నాడని, కిష్కింధానగరం వాడుక భాషలో మాట్లాడిస్తే అపరిచితుడనని నేను శ్రీరామచంద్రుడి దూతనని అంగీకరించదేమోనని.. ఇలా పరిపరి విధాల ఆలోచించి చివరకు తన జన్మభూమి అయిన మిథిలా నగరంలోని వాడుక భాషలో అంటే సీతమ్మవారి మాతృభాషలో మాట్లాడితే తన భూమి పుత్రుడని, తన శ్రేయో భిలాషి అని భావించి, ధైర్యంతో తన మాటలు నమ్ముతుందని భావిస్తాడు, అలా హనుమంతుడు సీతమ్మవారితో మొదటిసారి ఆమె మాతృభాష అయిన మిథిలా నగర వాడుక భాషలో మాట్లాడుతాడు. అనాటి నుండే మాతృభాష విశిష్టత, ప్రాధాన్యం గుర్తింపబడిందేమో! మాతృభాష ప్రాశస్యం రామభక్తుడు హనుమంతుడి ద్వారా నాడే గుర్తించబడింది.

రామాయణం ద్వారా ప్రాచుర్యం

ప్రపంచంలో మాతృభాష ప్రాతిపదికన అనేక దేశాలు ఏర్పడినవి. భారతదేశంలో మాతృభాష ప్రాతిపదికన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయుట జరిగినది.
    
ఆంగ్ల భాషను అంతర్జాతీయ భాషగా చెప్పుకోవడం భారతీయుల (భమ. ఆంగ్లభాష ప్రపంచ స్థాయిలో మాట్లాడటం, వ్రాయడం, చదవడం ఏడు శాతానికంటే మించలేదు. చైనా, రష్యా, జపాన్‌, జర్మనీ స్వీడన్‌, స్విట్టర్లాండ్‌, దక్షిణకొరియా, ఇజ్రాయెల్‌ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా వారి స్థానిక భాషలలోనే అంటే వారి వారి మాతృభాషలలోనే విద్యనభ్యసించుట, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యకలాపాలు కొనసాగించుట జరుగుచున్నది.

ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే వివిధ దేశాలవారు కూడా వారి వారి మాతృభాషలలోనే మాట్లాడుతుంటారు. భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పాయ్‌ మన విదేశాంగ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాతృభాష అయిన హిందీలో ఐక్యరాజ్యసమితిలో మాట్లాడి, ఐక్యరాజ్యసమితిలో మాతృభాషలో మాట్లాడిన తొలి భారతీయుడిగా కీర్తి గడించారు.
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులు వారి వారి మాతృభాషా మాధ్యంగా ప్రాథమిక విద్యనుండి చదివినవారు సమర్థవంతంగాను, నిర్భయంగాను వారివారి కార్యకలా పాలలో రాణిస్తూ ఉన్నత పదవులు అలంకరిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుండి ఆంగ్లభాష మాధ్యమంగా చదివినవారు సమర్ధవంతంగా, నిర్భయంగా పని చేయలేకపోతున్నారని అమెరికాలో ఒక అధ్యయన సంస్థ ప్రకటించడం గమనార్హం.

మాతృభాష దినోత్సవానికి నాంది 

1947లో మతపప్రాదిపదికన భారతదేశం నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడిన పాకిస్తాన్‌లో 'ఉర్జూ భాషను అధికార భాషగా ప్రకటించినారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌గా పిలువబడుతున్న ఆనాటి ఉమ్మడి పాకిస్తాన్‌లోని తూర్పు ప్రాంత ప్రజల మాతృభాష బెంగాల్‌ కావడం వల్ల వారు “ఉర్జూ భాషను అధికార భాషగా అంగీకరించలేదు. అందుకే అక్కడ మాతృభాషా పరిరక్షణ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం చివరికి హింసాత్మకంగా మారి 1956 ఫిబ్రవరి 21వ తేదీన ఉద్యమకారులైన ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు నలుగురు మాతృభాష పరిరక్షణలో బలిదానమైనారు. తప్పనిసరి పరిస్థితిలో పాకిస్తాన్‌ ప్రభుత్వం 1956 ఫిబ్రవరి 28వ తేదీన బెంగాల్‌ భాషను మరో అధికార భాషగా ప్రకటించవలసి వచ్చింది.

    మాతృభాషా పరిరక్షణ పోరాటంలో బలిదానవ్వాన నలుగురి విద్యార్థుల బలిదానానికి జ్ఞాపకార్థంగా 'ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా 1999 నవంబర్‌ 17వ తేదీన ఐక్యరాజ్యసమితిలోని సాంస్కృతిక విభాగం ప్రకటించింది. 2000 సంవత్సరము ఫిబ్రవరి 21వ తేదీ నుండి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపుట ప్రారంభమైంది.

ఏ దేశవాసి అయినా, ఏ ప్రాంత వాసి అయినా ప్రప్రథమంగా తన మాతృభాషలో మాట్లాడుట, చదువుట, వ్రాయుట తన కర్తవ్యంగా భావించవలెను. తన అభిరుచి మేరకు, సమర్థత మేరకు ఏ భాషనైనా, ఎన్ని భాషలనైనా నేర్చుకోవచ్చును. పాండిత్యం సాధించవచ్చును.

  కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి, మన దేశ మాజీ ప్రధానమంత్రి పి.వి. నర్సింహారావు దాదాపు పది భాషలలో మాట్లాడుట, చదువుట, వ్రాయుటలో సిద్ధహస్తులైనారు. ఇలాంటి మేధావులు మన దేశంలో అనేకులున్నారు. మనము కూడా వివిధ భాషా కోవిదులం కావచ్చును. మాతృభాషలు పరిరక్షంచబడాలంటే స్థానిక భాషల మాధ్యమంగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యాబోధన జరగాలి. ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యకలాపాలు స్థానిక భాషలలో జరగాలి. ఇందుకు ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలి. 

జాతీయ, అంతర్జాతీయ భాషలను విధిగా నేర్పాలి

శ్రీరామచంద్రుడు “జననీ జన్మభూమిశ్చ - స్వర్గాదపి గరీయసీ! అన్నట్లుగా “మాతృభాష అమృతవర్షిణీ” అని . హనుమంతుడు సమాజానికి పరిచయం చేసినాడు. ఇట్టి విషయాన్ని ప్రతి దేశీయుడు, జాతీయుడు గుర్తించి అనుసరించి అమలుపరిచినప్పుడే మాతృభాష పరిరక్షించ బడుతుంది. ప్రపంచంలో అనేక దేశాలు మాతృభాషా ప్రాతిపదికన ఏర్చ్పద్దాయి. మన దేశంలో కూడా మాతృభాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డ విషయము మనందరికి విదితమే.

భారత ప్రభుత్వం గుర్తించిన 22 భారతీయ భాషలలో ఏ ఒక్క భాషను కూడా జాతీయభాషగా ఏ రాష్ట్ర ప్రజలు అంగీకరించరు. అత్యధికంగా మాట్లాడే హిందీ భాషను జాతీయ భాషగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు అంగీకరించరు.

భారతీయ భాషలన్నీ సంస్కృత భాషా మూలాలతోనే కొనసాగుచున్నవి. అనాదిగా భారతీయ సాహిత్యం వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం, అర్ధశాస్త్రం మొదలైన గ్రంథాలన్నీ సంస్కృత భాషలోనే వెలువబడినవి. మానవాళికి కావలసిన జ్ఞానము, విజ్ఞానము సంస్కృత భాషా గ్రంథాలలోనే నిక్షిప్తమై ఉన్నవి. సంస్కృత భాషను నేర్చుకున్నట్లయితే సర్వాంగీణ వికాసం పొందగలరు. ఇట్టి భారతీయులు ప్రపంచానికే జ్ఞానబోధ చేయగలరు. వీటిలో జ్ఞాన విజ్ఞానంతో బాటు ఆధ్యాత్మికత కూడా సుసంపన్నం కాగలదు.

 భారత రాజ్యాంగ నిర్ణయనభ అధికార భాష గూర్చి చర్చిస్తున్న నమయంలో భారత రాజ్యాంగ డ్రాఫ్ట్స్‌మెన్‌ కమిటి ఛైర్మన్‌గా ఉన్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ సంసృత భాషను జాతీయ అధికార భాషగా నిర్ణయించాలని ప్రతిపాదించినారు. వీరి ప్రతిపాదనను సమర్థిస్తూ ఆనాటి విదేశాంగ శాఖ డిప్యూటి మంత్రి దాక్టర్‌ కీస్కర్‌, నిజాముద్దీన్‌ అహ్మద్‌, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎల్‌కె.మైత్రి, మద్రాసుకు చెందిన టి. టి.కృష్ణకుమారి, వి.కె.మునుస్వామి పిళ్ళై, కల్లూరి సుబ్బారావు, వి.పి.కేశవరావు, డి.గోవిందదాస్‌, పి. సుబ్బరాయన్‌, డాక్టర్‌ వి.సుబ్రహ్మణ్యం, దుర్దాబాయి, దాక్షాయణి, వేలాయుధన్‌, పుదుక్కోటి, త్రిపుర, మణిపూర్‌, కూర్గులకు చెందిన మరికొందరు ప్రముఖులు అంగీకారం తెలుపుతూ సంతకాలు చేసినారు.

“మన దేశంలో అనేక భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. అన్ని భాషలలోను సంస్కృత భాషా మూలాలున్నాయి. కాబట్టి సంస్కృత భాషను జాతీయ అధికార భాషగా ప్రకటించి అభివృద్ధి పరచినట్లయితే వివిధ భాషలు మాట్లాడే ప్రజలు భారత జాతీయులుగా సమగ్రతను కాపాడగలరు. తద్వారా వారికి ప్రపంచంలో భారత వాణిని సమర్థవంతంగా స్వాఖిమానంతో వినిపించగల శక్తి వస్తుందనేది నా ప్రగాఢ విశ్వాసం” అని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఉద్దా టించినారు. దూరదృష్టి గల దార్శనికుడు, జాతీయవాది డాక్టర్‌ అంబేడ్కర్‌ అభిప్రాయపడినట్లుగా జాతి సమగ్రత సాధించాలంటే సంస్కృత భాషను జాతీయ భాషగా ప్రకటించాలి, అలాగే సంస్కృత భాష అభివృద్ధి ప్రణాళికను భారత ప్రభుత్వం త్వరితగతిన ఏర్పాటు చేయాలి.

సంస్కృత భాషా బోధనకు ఉపాధ్యాయుల తయారీకి కావలసిన పాఠ్యక్రమం, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. పంచవర్న ప్రణాళిక ద్వారా ప్రాథమిక విద్య, ప్రాథమికోన్నత విద్య, ఉన్నతవిద్య, కళాశాలల విద్య నందించుటకు పరిశోధన, ప్రణాళిక, పాఠ్యక్రమము స్థాయిలవారి పాఠ్యాంశాల విభజన జరగాలి. 

1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆయా రాష్ట్రాల మాతృభాషల మాధ్యమంగా విద్యనందించాలి. ౩వ తరగతి నుండి సంస్కృత భాషను 4వ తరగతి నుండి ఆంగ్లభాషను ఒక భాషగా ప్రవేశపెట్టాలి. జూనియర్‌ కళాశాల నుండి చదువులను సంస్కృత భాషా మాధ్యమంగా కళాశాలలో, విశ్వవిద్యాలయాలలో విద్యా బోధన జరగాలి.

ఆంగ్లేయులు తమ భాష అయిన ఆంగ్ల భాషను భారతీయులపై రుద్దే ప్రయత్నం 1836లో ప్రారంభించి, 1866 సంవత్సరం నాటికి కేవలం 30 సంవత్సరాల కాలంలో భారతదేశంలో అమలు చేయగలిగారు. అదే ప్రయత్నంతో సంస్కృత భాషను కేవలం 20 సంవత్సరాల కాలంలో సామాన్యుల భాషగా మార్చవచ్చును. ఇందుకు దేశ ప్రజలు సంపూర్ణ మద్దతు, స్వాభిమానాలు ఎంతో దోహదం చేయగలవు. మాతృభాషలకు పెద్ద పీట వేయడం ద్వారా భారతదేశాన్ని జగద్దురువుగా పునఃస్థాపన చ ప్రయత్నంలో మరో అడుగు ముందుకు వేయవచ్చును.

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top