దళిత యోగులు - Dalit Yogis

Vishwa Bhaarath
0
తెలుగు దళిత యోగులు - Telugu Dalit Yogis
Dalit Yogis

తెలుగు దళిత యోగులు : Telugu Dalit Yogis

దళిత యోగులు


శ్రీ హరళయ్య స్వామి.(ఆదోని,కర్నూల్ జిల్లా) 

మాదిగ కులం లో కర్నాటక లో పుట్టాడు.63 మందితో ఒక భక్త బృందం ఏర్పడి వూరూరా తిరిగి ప్రచారం చేసేవారు.ఆయన చేసిన పాదరక్షలలో శివపార్వతులు కనిపించేవారు.మధు వర్మ అనే బ్రాహ్మణుడు ఈయన జ్ఞానానికి మెచ్చి,కులం కంట జ్ఞానం మిన్నయని అతని కూతురిని హరళయ్య కొదుక్కి ఇచ్చి పెళ్ళిచేశాడు.ఎవరి వద్ద నుండి పారితోషకాలు స్వీకరించేవాడు కాదు.ఎంతో సౌమ్యంగా శివ భక్తితో జీవించాడు.ఎవరికైన ఆరోగ్యం బాగాలెకపొతే చెప్పులు నానపెట్టిన నీళ్ళను చల్లితే రొగం నయమయ్యేదని నమ్ముతారు.800 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన తరువాత ఇప్పుడు ప్రతి జ్యెష్ట మాసంలో వేల సంఖ్యలో భక్తుల సేవలందుకుంటున్నాడు. పూజలు,అర్చనలు అన్ని కులాల వారు చెస్తుంటారు.

శ్రీ సద్గురు నారాయణప్ప తాత (హలిగెర,కర్నూల్ జిల్లా) 

1884 లో మాదిగ కులం లో జన్మించాడు.ఒక రెడ్డి ఇంట్లో పాలేరుగా పనిచేస్తూనే అన్ని రోగాలకు నాటు వైద్యం చేసేవాడు.ఉశేన్ సాబ్ ని గురువుగా ఎంచుకున్నాడు.జీవితాంతం పేదరికం లో వున్నా కూడా వూరికి మంచి చేశాడు.కలరా వ్యాపిస్తే ఆంజనేయుని విగ్రహం తెచ్చి పూజించమని చెప్పి, అలా చేయగానే కలరా తగ్గిపోయింది.వర్షాలు లేక ప్రజలు ఇబ్బంది పడితే మన్మధరెడ్డి దొర ఇంటికి పిలిచి అడిగితే,ఇంట్లో వున్న ధన్యాన్ని ప్రజలకు పంచుమని చెప్పి, ఆ పని చేయించి,తాను ధ్యాన మగ్నుడయ్యాడు.సాయంత్రం వరకు వాన కురిసింది.దైవాన్ని నమ్ముకుంటే అన్ని బాధలు తీరుతాయని చెప్పి భక్తి ని ప్రచారం చేసిన మహాను భావుడు. 40 సంవత్సరాలు దొరల ఇళ్ళలో పనిచేసినా దారిద్ర్యం పోలేదు..ఏమి ఆశించేవాడు కాదు.తన ఆఖరు సమయం లో 40 రోజులు ఉపవాసముండి 1989 లో శివైక్యం చెందాడు. శివరాత్రి తరువాత వచ్చే దశమికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు.

శ్రీ నిత్యానంద స్వామి (అసలు పేరు తాయప్ప).

అంటరాని వారు వేదం చదివితే చెవుల్లో సేసం కరిగించి పోయాలన్న పరిస్థితి వున్న రోజుల్లోనే స్వామి వేదం చదివాడు. 1896 లో కర్నాటకలోని దిన్నె గ్రామం లో మాదిగ కులమ లో జన్మించాడు. సాలె తిమ్మప్ప వద్ద ఆధ్యాత్మ విద్య నేర్చాడు.చదివింది 5 వ తరగతి అయిన 7 భాషలలో ప్రావీణ్యుడయ్యాడు.ప్రభుత్వ ఉద్యోగం లో చేరినా భారతం,n రామాయణం, వేదాంతం, భాగవతం, సాంఖ్యం చదివాడు.జ్ఞానం కోసం దేశమంతా కాలిబాటన నడిచి 5,6 గురు గురువుల వద్ద శిష్యరికం చేశాడు.అనుభవం సంపాదించాడు.వూరూరా జ్ఞాన బొధ చేశాడు.30 మందికి దీక్ష ఇచ్చాడు. అందులో అన్ని కులాల వారున్నరు..గొల్ల(హనుమంతప్ప) వారున్నారు.
   బ్రాహ్మణులున్నారు(ప్రొఫెసర్ దయానంద). వేదాధ్యయనం చేశాడు.వూర్లో కలరా సోకినప్పుడు గ్రాం దేవత మారెవ్వను వేడుకుని తన ప్రాణాలు తీసుకొమ్మని,గ్రామ ప్రజల ప్రాణాలు రక్షించమని అడిగాడు.అలాగే జరిగింది.1993 లో స్వర్గస్తుడయ్యాడు.ఆఖరు జీవితంలో తన మథానికి దాసప్ప అనే మాదిగ కులస్థుడికి జ్ఞాన బోధ చేసి అధిపతిని చేశాడు.

ఉశేనప్ప తాత ( ఢణాపురం,కర్నూల్ జిల్లా)...
సుమారు 300 సంవత్సరాల క్రితం నాటి మాట.ఉశేనప్ప మాదిగ కులం లో జన్మించాడు.ఈయన తాత అనుమప్ప కు భగవాన్ ఆంజనేయుడు కలలో కనిపించి తనకు వశమవుతానని చెప్పి వూర్లొ వెలుస్తాడు. ఆ స్థలం ఒక బ్రాహ్మణుడిది.విషయం తెలిసి ఆ బ్రాహ్మణుడు అంగీకరించి అనుమప్ప ద్వారానే గుడి నిర్మాణం జరిగేట్లు చూస్తాడు.అనుమప్ప,అతని కొడుకు మల్లప్ప,మనుమడు ఉశేనప్ప ఈ ముగ్గురూ ఆంజనేయ పూజరులై గ్రామ ప్రజలకు సేవ చేస్తారు.మల్లప్ప మరణం తరువాత అతని సమాధి కడ్తారు.3 నెలల తరువాత చూస్తే ఆయన భౌతిక కాయం చెడిపోకుండా, వాసన రాకుండా ఎప్పటిలాగే వుండటం ఆశ్చర్యం. వూర్లో ఇప్పటికినీ దీపావళి,శ్రీరామనవమి,ఇల ఏ పండుగ జరిగినా ముందు వీరి సమాధులకు పూజ చేసిన తరువాతనే ఇతర దేవతలకు పూజలు నిర్వహిస్తారు.ఉసేనప్ప తాత వూరి కోసం మంచి పనులు చేశాడు.శనివారం ఆంజనెయునికి శ్రద్ధతో పూజ చేసి,ఆ తరువత గ్రామ ప్రజల సమస్యలకు పరిష్కారం చెప్పేవాడు.అవన్నీ నిజమయ్యేవి.80 సంవత్సారాల వయస్సులో శివైక్యం పొందాడు.వారి వంశీకులైన భీమప్ప ఇప్పుడు అంజనేయుని పూజిస్తూ వూరికి మేలు చేస్తున్నాడు.మాదిగ కులం లో జన్మించి , దైవత్వాన్ని పొందిన ఈ మహనీయులను అన్ని వర్గాల ప్రజలు ఆరాధిస్తున్నారు.

సద్గురు చెన్నయ్య దాస్,కొడుమూరు,కర్నూల్ జిల్లా.

కంచి కామ కోఠి పీఠాధిపతి తో సన్మానం గ్రహించాడు.రాష్ట్రపతి సర్వేపల్లి రాధ క్రిష్ణ ఈయన గొప్పతనం గ్రహించి,చట్టపరంగా బాధపెట్టొద్దని,ప్రభుత్వాలకుసూచించాడు. 1927 లో మాల కులం లో జననం...దివ్యశక్తులు సంపాదించాడు.ఔషధ విధులు నేర్చాడు.పశుల కాపరిగా వుంటూ,ఆత్మజ్ఞానం పొందాడు.పిల్లన గ్రొవి ఊదితే పశువులు పరవశించిపోతాయి.పశువులు వాటంత అవే ఈయనను అనుసరిస్తాయి.2002 లొ శివైక్యం చెందాడు.

చింతలా ముని స్వామి,దొడ్డనగౌరి ,కర్నూల్ జిల్లా.

శివభక్తుడు.దివ్యదృష్టి కలవాడు.అన్నదానం చేస్తాడు.మాల కులం లో జన్మించి అన్ని వర్గాల్లో జ్ఞాన బోధ చేసి, 1978 లో పరమపదించాడు.నల్లారెడ్డి,గోవింద రెడ్డి అనే ధనవంతులు ఈయన శిష్యులయ్యారు.ముని స్వామి విగ్రహానికి ఇప్పటికీ పూజలు చేస్తారు.బండారి ముని స్వామి పూజారిగా వున్నాడు.

చింతలా ముని రంగస్వామి.తంగర డొణ,కర్నూలు జిల్లా.

మాల కులములో పుట్టి,ఆధ్యాత్మిక తత్వాన్ని నేర్చి,అందరికీ గురువయ్యారు.దేశాటన తో మరింత అనుభవం సపాదించి ప్రజలను మంచి మార్గం లో నడిపిన మహాను భావుడు.ఈయానకు ప్రతి శ్రావణమాసం లో పూజలందుకుంటాడు.

సంజీవరాయుడు స్వామి,జూటూర్,పత్తికొండ, కర్నూల్ జిల్లా.

మాదిగ కులం లో జననం.భీమిరెడ్డి ఇంట్లొ జీతం.పశువులను మేపడానికి వెల్లి ఎండలో ఒకసారి పడుకుంటే ఒక పాము వచ్చి,పడగ విప్పి,నీడ నిచ్చంది.స్వయంగా భీమిరెడ్డి చూసి ఆశ్చర్యపొయాడు.ఆంజనేయుని ప్రతిరూపంగా ఈయనను భావించారు.వున్నంత కాలం ప్రజల్కు బోధ చేసాడు.ఆ తరువాత ఈ స్వామి ని గ్రామంలో వైష్ణవులు పూజిస్తారు.గౌడ కులానికి చెందిన ఒక మహిళ ఈయన పేరుతో అన్నదానం చేస్తుంటారు.

నాగప్ప తాత.చిగళి,కర్నూల్ జిల్లా.

1818 లో మాదిగ కులంలో జననం.కూలినాలి వృత్తి.నాటు వైద్యుడిగా ప్రసిద్ధి పొందాడు.పూరిగుడిసెలొ వుంటూ పురణాలు చదివి,వూరికి తత్వ బోధ చేస్తాడు.రాజ్యొగం సాధన చేసాడు.నాగప్ప తరువాత మూడవ తరం కూడా ఇప్పటికీ వూరికి మేలు చేస్తుంది.నాగప్ప మరణం తర్వాత అన్నివర్గాల ప్రజలు ఇప్పతికీ పూజిస్తుంటారు.

బసవేశ్వరశ్వామి. చిత్వాడి, కర్నూల్ జిల్ల

మాదిగ కులం లో పుట్టి,దేశాలు తిరిగి జ్ఞానబోధ చేశాడు.ఎవరికి వారే బాగుపరుచుకోవాలని, కష్టపడాలని చెప్పేవాడు..క్రైస్తవులు అనారొగ్యంగా వుండేవారిని, మందులు ఇవ్వకుండా, ప్రర్థనలు చేయటాన్ని నిరసించాడు.1982 లో పరమపదించాడు.ప్రజలు ఇప్పటికి ఇతన్ని ఆరాధిస్తారు.

ఉచ్చీరప్ప, ముండ్రగి,కర్నూల్ జిల్లా.

మాదిగ కులం లో జన్మం.రాజ యోగి అయ్యాడు.అందరు వచ్చి తన కాళ్ళు మొక్కితే వారించి, శివలింగం పలన చోట వుందని, దివ్యదృష్టితో చెప్పి, తెచ్చి పూజలు చెయమన్నాడు.100 సంవత్సరాలు బ్రతికాడు.ప్రతి శివరాత్రి అన్ని వర్గాలు ఈయన విగ్రాహాన్ని పూజిస్తారు.

గురులింగేశ్వర స్వామి,కురుగోడు, కర్నాటక.

1925 లో మాదిగ కులం లో జననం.వాక్ శుద్ధి కలవాడు.రాజ యోగం సాధన చేశాడు.మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసాడు.1965 లో పరమ పదించాడు.స్థిరాస్థి లేదు.అందరికీ జ్ఞానోదయం గావించాడు.ఇప్పటికీ ఆయన సమాధి వద్ద పూజలు చేస్తారు.కులం కాదు మానవత్వం కావాలని వాళ్ళ జీవితాల ద్వారా రుజువు చేసిన మహాను భావులు.

సుబ్బారూఢ స్వామి,కొసిగి మండలం.కర్నూల్ జిల్లా.

మాదిగ కుటుంబం లో జననం.వీళ్ళ కుటుంబంలోని ఆడువారు జోగిని వ్యవస్థలొ బ్రతికారు.. బసివినులు అని కూడా అంటారు.దీని నిర్మూలనకు సంస్కర్త లు కృషి చెస్తున్నారు.. ఇంకా కొన్ని గ్రామాల్లో ఈ దురాచారం వుంది.సుబ్బరాయుడు స్వామి జన్మించి,దేవరయగట్టు మల్లికార్జునస్వామి ని శ్రద్ధతో కొలిచి,దివ్యశక్తులు సాధించాడు.ఆయన మాటకు తిరుగు లేదు.వర్షాలు కూడా రప్పించాడు.ప్రజలకు అండగా నిలబడ్డాడు.ఎన్ని రోజులైనా సాధన లో కూర్చొనే వాడు.దేశసంచారియై ప్రజలకు బోధ చేసాడు.1979 లో పరమపదించాడు.ఆయన ఫోటొ పెట్టి మఠం లో శివరాత్రి వచ్చే దశిమి కి సంబరాలు చేస్తారు.

హనుమద్దాసుల వారు, కల్లు కుంట, కర్నూలు జిల్లా.

మాల దాసరి కుటుంబం లో పుట్టి,5 వ తరగతి చదివి, పురాణాలు అవలీలగా చదివేవాడు.వక్శుద్ధి కలవాడు.మునిస్వాముల వారు ఈయన గురువు..వూరూరా పాటలు పాడుతూ తత్త్వ బోధ చేశాడు. చాలా గ్రామాలనుండి వచ్చి అన్ని కులాల వారు దర్శించుకునేవారు.60 పైగా శిష్యులను చేసుకుని దీక్ష ఇచ్చాడు. ఈయన మరణం తరువాత 17 మంది కి పైగా మఠ నిర్వహణ లో వున్నారు.1987 లో శివైక్యం చెందాడు.ఇప్పటికీ పూజలందుకుంటున్న్నాడు.

బసయ్య తాత..కాత్రికి-చూడి, కర్నూల్ జిల్లా

1907 లో పుట్టాడు..1987 లో మరణం.నిరక్షరాస్యుడైనా కూడా నిగర్విగా ప్రపంచాన వున్న మంచి చెడులను విప్పి చెప్పేవాడు..చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఈయనను పూజిస్తారు.అంటరాని తనం విలయ తాండవం చేస్తున్న రోజుల్లో కూడా తన జ్ఞానం తో అన్ని వర్గాలకు హితోక్తులు చెప్పి అందరి మనసులు గెలిచిన బసయ్య ఇప్పటికీ శివరాత్రి రోజున ఆరాధనలు చేస్తారు.

సద్గురు నరసింహ అవధూత.పొదల కుంట మదిరె.కర్నూల్ జిల్లా.

మాదిగ కుటుంబం లో పుట్టాడు.దైవచింతన లో గడిపాడు..1874 లో పుట్టి,1959 లో మరణించాడు. యోగ సాధన చేసారు.అన్ని రోగాలకు మందులిచ్చేవాడు. ప్రజలను దైవభావన వైపు తిప్పాడు. శ్రీశైల యాత్ర శిష్యబృందం తో చేసి,శివలింగాన్ని తెచ్చి,మదిరె లొ స్థాపించి పూజలు చేయించాడు. ఆయన మరణన్మ్ తరువత అన్ని వర్గాల ప్రజలు అతని ఫోటో ని ఆరాధిస్తారు

Source: Unknown

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top