Islamic terrorism and the spread of the Islamic state in Kerala: Communist leader |
అయోధ్య బాబ్రీ కట్టడం కూల్చివేత తర్వాత కేరళలో ముస్లిం తీవ్రవాదాన్ని అబ్దుల్ నాసర్ మదానీ బాగా వ్యాప్తి చేశాడని సీపీఎం సీనియర్ నేత, కేరళ ఖాదీబోర్డు చైర్మన్ జయరాజన్ పేర్కొన్నాడు. కేరళ, ముస్లిం రాజకీయాలు, ముస్లిం రాజకీయం అన్న పుస్తకంలో జయరాజన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
ఈ పుస్తకంలో ఇస్లామిక్ రాజ్యం ప్రస్తావన, అబ్దుల్ నాసర్ మదానీతో పాటు ఇస్లామిక్ రాజ్య విశృంఖలత్వం గురించి లోతుగా చర్చించారు. అయోధ్య బాబ్రీ కట్టడం కూల్చివేత తర్వాత కేరళ వ్యాప్తంగా అబ్దుల్ నాసర్ మదానీ ప్రత్యేక తరగతులు నిర్వహించి, తరగతులు నిర్వహించడాని జయరాజన్ వెల్లడించారు. ఈ తరగతుల ద్వారా ముస్లిం యువతను ఉగ్రవాదులుగా మార్చడం, వారిని లోతుగా ప్రభావితం చేశాడని పుస్తకంలో పేర్కొన్నారు. ఇలా ముస్లిం ఉగ్రవాదం పెరగడానికి ప్రయత్నాలు చేశాడన్నారు. అలాగే ఇస్లామిక్ సేవక్ సంఘ్ అన్న దానిని కూడా స్థాపించాడన్నారు.
ఈ అంశంతో పాటు 1992 జూలై మాసంలో తిరువనంతపురం పూంథూర అల్లర్ల ప్రస్తావన కూడా కమ్యూనిస్టు నాయకుడు తన పుస్తకంలో ప్రస్తావించారు. తిరువనంతపురం విమానాశ్రయానికి ఐఎస్ఎస్ వెళ్లడం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, రొచ్చగొట్టె నినాదాలు, మదానీ రెచ్చగొట్టే ప్రసంగాలను కూడా గుర్తు చేశారు. ఈ అల్లర్లపై జస్టిస్ అరవిందాక్ష మీనన్ విచారణ జరిపారని, విమానాశ్రయం ప్రాంతంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నిల్వలు వున్నాయని తన నివేదికలో పొందుపరిచారన్నారు. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని అస్సలు కనిపెట్టలేకపోయారని పుస్తకంలో వెల్లడించారు.మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. హిందువులు అత్యధికంగా వుండే జోనకా పూంతురాలో ఇస్లామిక్ సేవక్ సంఘ్ దాడులకు కూడా పథకం వేసిందన్నారు.
అయితే అయోధ్య బాబ్రి కట్టడం కూల్చివేత తర్వాతే ఇస్లాం ఉగ్రవాదం వెర్రితలలు వేసిందని కమ్యూనిస్టు నేత పుస్తకంలో పేర్కొన్నారు. అయితే... అయోధ్య బాబ్రి కట్టడం కూల్చివేత డిసెంబర్ 6,1992 లో జరిగింది. అయితే పూంతుర అల్లర్లు ఆ సంవత్సరంలోనే జూలై మాసంలో జరిగాయి. పూంతారాలోని ఆరెస్సెస్ శాఖపై ఇస్లామిక్ ఛాందసులు దాడి కూడా చేశారు. దీంతో అల్లర్లు రేగాయి. తన ప్రసంగాలకు తన వర్గీయుల్ని తరుచూ పిలుస్తుండేవాడని, అందువల్ల ఐఎస్ఎస్ ను రద్దు చేసి పీపుల్స్ డెమోక్రెటిక్ పార్టీని స్థాపించాడని వివరించారు.అయితే.. తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష పడటం, తీవ్రవాద ఆరోపణలు రావడంతో ఆయనకు సానుభూతి భారీగా వచ్చిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మరోవైపు ప్రస్తుతం సీఎం, అప్పటి కేరళ సీపీఎం ప్రధాన కార్యదర్శిగా వున్న పినరయ్ విజయన్ ఇస్లామిక్ ఛాందసవాది మదానీతో పొన్నానీలో వేదిక పంచుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇది జరిగింది. సీపీఎం సంకీర్ణ ప్రభుత్వం తమ పోస్టర్లలో మదానీ ఫొటోను కూడా పెట్టింది. దీంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.
ఇక.. జయరాజన్ తన పుస్తకంలో వెల్లడించిన విషయాలు కేరళ ప్రజలను విస్తుగొలిపేలా చేస్తున్నాయి. ఎందుకంటే జయరాజన్ సీపీఎంలో బలమైన నేత. కన్నూర్ జిల్లాలో బలమైన పునాదులున్న వారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం పినరయ్ విజయన్ తర్వాత స్థానం ఈయనదే.1990 నుంచి 2010 వరకు కేరళలో జరిగిన అనేక సంఘటనలను ఈ పుస్తకంలో బహిర్గతం చేశారు. జాతీయవాదులు జయరాజన్ చొరవను అభినందించారు. ముఖ్యంగా ఇస్లామిక్ ఉగ్రవాదం విషయంలో ఆయన ప్రస్తావించిన విషయాలను మెచ్చుకుంటున్నారు.
Courtesy : vskts