Waqf Board is a monster board: Massive protest in Karnataka |
ఆస్తులను, భూములను వక్ఫ్ బోర్డు అక్రమంగా తీసేసుకుంటోందని, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కర్నాటక బీజేపీ తీవ్రంగా మండిపడింది. వక్ఫ్ బోర్డ్ పనివిధానాన్ని నిరసిస్తూ కర్నాటక విపక్ష నేత ఆర్. అశోక్ ఆధ్వర్యంలో బీజేపీ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది.
మా భూమి, మా హక్కు అనే పేరుతో చిక్కబళ్లాపూర్ లో ఈ భారీ నిరసన కార్యక్రమం జరిగింది. వక్ఫ్ బోర్డు ఆక్రమణలను తీవ్రంగా నిరసించారు. పాఠశాలలు, దేవాలయ భూములను వక్ఫ్ ఆక్రమిస్తోందని, పైగా తమ ఆస్తులేనని ఏకపక్షంగా ప్రకటిస్తోందని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు రాక్షసత్వంతో పనిచేస్తోందని, అదో రాక్షస విధానమని బీజేపీ నేతలు మండిపడ్డారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెడుతోందని ప్రకటించారు. మొత్తం భూములను వక్ఫ్ మింగేస్తోందని, దారిలో వున్న ప్రతీ దానినీ దెయ్యం ఎలాగ తింటుందో... అలాగే వక్ఫ్ వ్యవహరిస్తోందని, రైతుల భూములను కూడా లాగేసుకుంటోందని మండిపడ్డారు. ఈ రాక్షస వక్ఫ్ బోర్డును తొలగించడానికి పోరాడతామని ప్రకటించారు.
అసలు వక్ఫ్ బోర్డు చట్టబద్ధత, అధికారం ఏముందో చెప్పాలని బీజేపీ నేత అశోక్ ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డుకి అసలు ప్రత్యేక అధికారాలు ఎందుకు? అని నిలదీశారు. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులకు కూడా లేని అధికారం ముస్లింలకి ఎందుకని సూటిగా నిలదీశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఏ ఒక్కరికీ ప్రత్యేక హక్కులు లేవని గుర్తు చేశారు. వక్ఫ్ బోర్డు రద్దయ్యేంత వరకూ పోరాడుతూనే వుంటామని బీజేపీ ప్రకటించింది.