బెంగాల్ లోని మహేశ్తలా, 24 పరగణాల ప్రాంతంలోని శివాలయాన్ని ఆలయాన్ని దుండుగులు ధ్వంసం చేశారు. ఆలయానికి సంబంధించిన భూమిని ఆక్రమించుకోవడానికి కొందరు ప్రయత్నించగా… హిందువులు దీన్ని అడ్డుకున్నారు. నిరోధించారు. ఈ సమయంలోనే హింస చెలరేగింది. ఈ హింస సమయంలోనే దుండుగులు ఆలయాన్ని ధ్వంసమైంది. అంతేకాకుండా ఘర్షణ కూడా పెరిగిపోయింది.
ఈ ఘర్షణ సమయంలోనే దుండగులు పోలీసులపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. అలాగే అక్కడే వున్న వాహనాలను, దుకాణాలను కూడా ధ్వంసం చేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో చాలా మంది పోలీసులకు గాయాలయ్యాయి.
నిజానికి స్థానికంగా వున్న శివాలయ ప్రాంగణంలోని చెరువును ఆక్రమించేందుకు దుండగులు ప్రయత్నాలు ప్రారంభించారు. క్రమంగా చెరువును ఆక్రమించేందుకు మట్టితో నింపుతున్న విషయాన్ని స్థానిక హిందువులు గమనించారు.దీంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పెడచెవిన పెట్టారు.
అలాగే ఈ ఘర్షణకి మరో కారణం కూడా కనిపిస్తోంది. కొంత మంది ముస్లింలు ఆలయానికి సంబంధించిన భూమిని ఆక్రమించి, కొన్ని పండ్ల దుకాణాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. దీన్ని హిందువులు తీవ్రంగా ప్రతిఘటించారు. అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది.
దీని తర్వాతే ముస్లిం గుంపు ఆలయాన్ని ధ్వంసం చేసి, రాళ్లతో, ఇటుకలతో దాడికి దిగింది. దీన్ని ఆపడానికి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చినప్పుడు ఇదే ముస్లిం గుంపు పోలీసులపై దాడి కూడా చేశారు.
మరోవైపు ఇదే ఘటనపై బీజేపీ ప్రతిపక్ష నేత, ఎమ్మెల్యే సువేందు అధికారి స్పందించారు. తులసి కోట, హిందువులకు సంబంధించిన దుకాణాలపై దాడులు జరిగాయని, హిందూ ఇళ్లపై కూడా దాడులు జరిగాయని మండిపడ్డారు. అలాగే ఆలయంపై కూడా రాళ్లు, ఇటుకలతో దాడికి దిగారని, దీంతో దేవాలయం ధ్వంసమైందన్నారు.
ఈ ఘటన అంతా స్థానికంగా వుండే పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే జరిగిందని, అయినా పోలీసులు అలసత్వం వహించారని సువేందు మండిపడ్డారు. పోలీసులు విధ్వంసకారులను అడ్డుకోలేకపోయారని, సంఘటన అంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందన్నారు.దీనికి సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.