![]() |
| High Court stays ban on RSS Sangh activities... Siddaramaiah's plan turned upside down |
సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆరెస్సెస్ ను ఇబ్బందుల్లోకి పెట్టాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆశపై హైకోర్టు నీళ్లు చల్లింది. ప్రభుత్వ స్థలాల్లో ఆరెస్సెస్ నిర్వహించే కార్యక్రమాలై నిషేధం విధించే ఉత్తర్వులను హైకోర్టు నిలిపేసింది. అంతేకాకుండా ప్రభుత్వ స్థలాల్లో ఆరెస్సెస్ కార్యక్రమాలు నిర్వహించడంపై స్టే విధించిన హుబ్లీ పోలీస్ కమిషనర్ ను హైకోర్టు మందలించింది. ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడానికి ఆయనకు రాజ్యాంగబద్ధమైన హక్కు ఎక్కడి వచ్చిందో తమకు వివరించాలని మండిపడింది.
జస్టిస్ నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్ పై విచారణను ప్రారంభించింది. ఈ సందర్భంగా కమిషనర్ ఉత్తర్వుపై మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణను నవంబర్ 17 కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మరో వైపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(A), 19(1)(B) కింద ఇవ్వబడిన హక్కులపై పరిమితులు విధించే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరికీ భావన ప్రకటనా స్వేచ్ఛ అనేది వుంటుందని, అలాగే శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు కూడా వుందని, అందుకే ప్రభుత్వం ఈ విషయాలలో జోక్యం చేసుకోవద్దని హితవు పలికింది.
వాస్తవానికి ఆరెస్సెస్ కార్యక్రమాలను నిషేధించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి లేకుండా ఒకే చోట 10 మందికి పైగా గుమిగూడటం నేరమంటూ పేర్కొంది. అంతేకాకుండా ఆట స్థలాలు, పార్కుల్లో ఎవరైనా పెద్ద సంఖ్యలో కనిపిస్తే, వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానమి హెచ్చరికలు జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ప్రభుత్వ సంస్థలు మరియు పాఠశాలలు, కళాశాలలు సహా ప్రజా ప్రాంగణాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాలను నిషేధించాలి అని ఐటీ మరియు బీటీ, గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఈ నెల 4న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ఈ లేఖను సమీక్షించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినట్లు సమాచారం.
అక్టోబర్ 4న తన క్యాబినెట్ సహోద్యోగి, AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ సమర్పించిన ప్రాతినిధ్యాన్ని ముఖ్యమంత్రి అమలు చేయడంతో ఈ చర్య వివాదానికి దారితీసింది. ప్రియాంక్ ప్రతిపాదనపై, "సమీక్షించి తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని" ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
ప్రభుత్వ మైదానాలు, పాఠశాలల ఆవణలు, క్రీడామందిరాలలో ఆరెస్సెస్ శాఖలు, బైఠక్ లు సాంఘిక్ పేరిటి జరిగే కార్యక్రమాలను నిర్వహించేందుకు అనుమంతించకూడదని వాటిని నిషేధించాలని ఆ లేఖలో ప్రియాంక్ ఖర్గే కోరారు. ప్రియాంక ఖర్గే లేఖకు పలువురు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు మద్ధతు పలికారు.

