రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది నేపథ్యంలో ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంపును, నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సంఘ్ వందేళ్ల ప్రయాణం అద్భుతమని కొనియాడారు. దేశ నిర్మాణం, క్రమశిక్షణ, నిస్వార్థ సేవే లక్ష్యంగా విశేష కృషి చేస్తోందన్నారు. ఆరెస్సెస్ కార్య శతాబ్ది అన్న మైలు రాయిలో భాగం కావడంపై గర్వంగా వుందన్నారు.
కొత్తగా విడుదల చేసిన నాణేనికి ఓ వైపు జాతీయ చిహ్నం వుంది, మరోవైపు సింహంపై కూర్చున్న భారత మాత చిత్రం, ఆరెస్సెస్ స్వయంసేవకుల చిత్రాలు ఉన్నాయి. భారత కరెన్సీపై భారత మాత చిత్రం వుండటం ఇదే మొదటి సారి, అలాగే ఈనాణెంపై ‘‘రాష్ట్రీయ స్వాహా ఇదం నమ:’’ అని రాసి ఉంది. అయితే
మీకు కూడా సంఘ శతాబ్ది సందర్భంగా విడుదల చేసిన ఈ భారత మాత చిత్రం ఉన్న ఈ నాణెం కావాలా? ఎలా పొందడం అనుకున్నారా
స్మారక నాణేలను ఎలా కొనుగోలు చేయాలి?
ఈ నాణెం స్మారక నాణెం కాబట్టి సాధారణ చెలామణిలో అందుబాటులో ఉండదు. దీనిని కొనుగోలు చేయడానికి, పౌరులు భారత ప్రభుత్వ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి .
• ఆసక్తి ఉన్నవారు వెబ్‌సైట్‌ను సందర్శించి ఖాతాను సృష్టించుకోవచ్చు.
• అందుబాటులో ఉన్న నాణేల జాబితా నుండి ₹100 నాణెం ఎంచుకోండి.
• ఆన్లైన్ చెల్లింపు తర్వాత నాణెం నేరుగా మీ ఇంటికి డెలివరీ చేయబడుతుంది.
పై విధంగా చేసి మీరు కూడా మీ ఇంటికే ఈ నాణెంని డెలివరీ ద్వారా పొందవచ్చు. అయితే SPMCIL లేదా RBI అధికారిక వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోండి. మోసం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నకిలీ సైట్లు లేదా లింక్‌లను నివారించండి.

