![]() |
| Dattatreya Hosabale |
విశాఖ మహానగర్, మిథిలాపురి బస్తీ, మధురవాడ నగర్ లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ చేపట్టిన కార్యక్రమాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మంచి కార్యక్రమాలకి ప్రకృతి కూడా సహకరిస్తుందన్నారు.ఈ విజయదశమి ఉత్సవం సంఘ్ స్వయంసేవకులకు ప్రత్యేకమన్నారు. ఎందుకంటే 100 సంవత్సరాల పూర్వం సంఘ్ ప్రారంభం అయ్యిందని, దేశభక్తి, క్రమశిక్షణ కేవలం ఒక సంస్థకు పరిమితం కాకూడదని, ఇది సమాజం పనిగా ఉండాలని ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని తెలిపారు.
భారతదేశానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని, అనేక ఆటుపోట్లుని ఎదుర్కొని, అనేక దండ యాత్రలు ఎదుర్కొని నిలబడిందన్నారు. 1944 రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ మొత్తం ధ్వంసం అయ్యిందని, అయినప్పటికీ జపనీయులు దేశభక్తితో 20 ఏళ్లలో తిరిగి ప్రపంచం పటంలో తిరిగి నిలబెట్టారని చెప్పారు. అలానే భారత్ కూడా అలా నిలబడాలని ఆర్ఎస్ఎస్ పరిశ్రమ చేస్తుందని అన్నారు.
![]() |
| Dattatreya Hosabale |
కేవలం భౌతిక జీవనం ద్వారా అభివృద్ధి చెందినట్లు కాదని, స్వామి వివేకానంద చెప్పినట్లు మన సంస్కృతి, వారసత్వం, సభ్యత, నాగరికత, ఆధ్యాత్మికత ద్వారా కాపాడుకోవాలన్నారు. స్వామీజీని ఒకరు పాశ్చాత్య దేశాలనుండి ఏమి నేర్చుకోవాలి అన్నప్పుడు సంఘటితే శక్తి, అనుసశాసనంని నేర్చుకోవాలన్నారు, కానీ ఇది ఒకప్పుడు ఉంది, ఇప్పుడు కొరవడిందన్నారు.
డాక్టర్జీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని సమాజం సంఘటన లేనిదే స్వాతంత్ర్యం కాపాడుకోలేమని ఒక అభిప్రాయంకి వచ్చారని, సంఘ్ 100 సంవత్సరాల ప్రయాణంలో దేశంలోని నలుమూలకు వెళ్లి గొప్ప పేరు తెచ్చుకుందని తెలిపారు. ఇది ఎలా జరిగింది,ఎదో దేశం నుండి దిగుమతి చేసుకోలేదు ఇది స్వయంసేవకులు వల్లే జరిగింది. బ్రహ్మ స్వయంసేవకులను ప్రత్యేకంగా సృష్టించలేదు. కానీ సంఘం అటువంటి వ్యక్తులను గుర్తించి అటువంటి పుష్పాలను మాలగా మార్చి ఇవి సాధించిందని పేర్కొన్నారు. వీరి ద్వారానే అయోధ్య నిర్మాణం, కన్యాకుమారిలో స్మారకం నిర్మితమైయ్యాయని చెప్పారు.
ఏ కుటుంబంలో పుట్టమో ఆ కుటుంబ ఋణం ఎలా తీర్చుకుంటామో, అదే విధంగా సమాజ ఋణం తీర్చుకోవాలి. సమాజంలో అనేకమంది చాలా మంచి పని చేసేవాళ్ళు సజ్జన శక్తి ఉన్నారు. విద్య, ధనం, కులంను బట్టి గర్వం ఉండకూడదు, దానిబట్టి కాకుండా సమాజానికి ఏమి ఇస్తున్నావు అనే దాని మీద ఉంటుంది. అలాంటి భావన నిలబట్టే పని సంఘ్ ది. ఇదే విషయాన్నీ సాధు సంతులు అనేక సంవత్సరాల నుండి చెప్తున్నారని తెలిపారు.ఇదే విషయాన్ని 100 ఏళ్ల సంఘ్ ప్రయాణం వ్యక్తి నిర్మాణం ద్వారా ఒక ఉదాహరణ రూపంలో సమాజం ముందు నిలబట్టే ప్రయత్నం చేసింది. ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు ఎప్పుడు కూడా దీని గుర్తింపు కోరుకోలేదు. దేశం మనకు అనేకం ఇస్తుంది మనం కూడా దేశం కోసం ఎంతో కొంత ఇవ్వాలని సూచించారు.
హిందుత్వ జాగరణ అంటే ఏమిటి ? కాళ్ళు చేతులు కళ్ళు ఉన్నంత మాత్రాన మనిషి కాడు, మానవత్వం ఉందా లేదా అనేది ముఖ్యం, హిందువుగా పుట్టినంత మాత్రాన హిందువుకారు, కులం మరిచి సమాజం కోసం ఆలోచించేవాడు హిందువు. ఆదిశంకరాచర్య, శివాజీ మహారాజ్, స్వామి వివేకానంద లాంటి ఎందరో పెద్దలు ఆ పని చేశారు, ఒకేసారి దేశంలో లక్షలాది స్థల్లాల్లో కోట్లాదిమంది ఒకేసారి భారత్ మాత కి జై కొట్టించే పని ఆర్ఎస్ఎస్ చేసిందన్నారు.వర్తమాన భారత్ ను స్వాభిమానంతో కూడిన సమృద్ధ భారత్ ను నిర్మించాలి, సమరసత భావాన్ని నిర్మించాలి. ఆధునిక భారత్ నిర్మాణం జరగాలి. కొత్త తరం వాళ్ళు ఈ దేశంని ఆ దిశగా నడిపించే సమయంలో మన ‘స్వ’ని మరువకూడదు, మన చరిత్ర నేర్పిన పాఠాలు, మన సంస్కృతిని మార్చి పోకూడదని తెలిపారు.
భారత్ కుటుంబ వ్యవస్థను ప్రపంచం అంతా మెచ్చుకుంటుంది, కొత్త తరానికి మనం విలువలు నేర్పాలి, తోటి కుటుంబాల వారితో ఎలా వ్యవహారించాలనేది చూపుతూ ప్రపంచం ముందు మన ఆదర్శ కుటుంబంను నిలబెట్టాలని చెప్పారు. సమాజంలో పౌర విధులును పాటించాలి, నీరు, మట్టి, అడవులను కాపాడుకోవాలి, ప్లాస్టిక్ ఉపయోగం తగ్గాలి. ఈ పరివర్తన మన ఇంటి నుండి ప్రారంభం కావాలి. ఈ ఐదు విషయాల్ని పాటించడమే హిందుత్వం అదే యుగ ధర్మం. దీనికోసం సమాజాన్ని జాగృత పరిచేందుకు సంఘ్ పనిచేస్తుందని పేర్కొన్నారు. మనమంతా కలిసి శ్రేష్ఠ, స్వభిమాన, వైభవంతో కూడిన సమాజ నిర్మాణం కోసం తన మన ధన పూర్వక సమర్పణ చేయాలని దత్తాత్రేయ హోసబళే కోరారు.


