![]() |
| Naxal movement weakened, happy to meet people: Venkaiah Naidu |
జీవితంలోని మంచి చెడు రెండూ తెలిసిన వారు, సమాజానికి దిశా నిర్దేశం చేసే పరిణతి వున్న అనుభవమే పెద్దరికమని, అలాంటి వారు భవిష్యత్తును సానుకూల దృక్పథంతో ముందుకు నడపగలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వయస్సుతో పాటు వచ్చిన పెద్దరికాన్ని హుందాగా ఎలా నిలబెట్టుకోవాలి? అంకెలు మాత్రమే వుండే వయస్సుకు మనస్సుతో ఎలా లంకె వేయాలి? తెలిసిన వారే నిజమైన పెద్దలని వేదం కూడా చెబుతోందన్నారు. ఈ గుణాలకు ప్రజ్శా భారతి హనుమాన్ చౌదరి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.తన జీవితాన్ని సమాజం కోసం పూర్తిగా అంకితం చేశారని, టెలికాం రంగంలో అనేక విప్లవాత్మకతకు బాటలు వేశారని ప్రశంసించారు.
నక్సల్స్ ఉద్యమం బలహీనపడిందని, జాతీయ జీవన స్రవంతిలో అందరూ కలిసి నడవాల్సిన అవసరం వుందని మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ చాలా పవర్ ఫుల్ అని అన్నారు. ప్రజ్ఞా భారతి 33 వ వ్యవస్థాపక దినోత్సవం హైదరాబాద్ లోని మారియట్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. “Information Warfare and National Security – Challenges for Viksit Bharat, అనే అంశంపై సెమినార్ జరిగింది. ఇందులో ప్రముఖులు, మేధావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తుపాకీ ద్వారా మార్పు సాధ్యం కాదని, ఈ విషయాన్ని వారు తెలుసుకోవాలన్నారు. వారికి వారి సిద్ధాంతంపై నమ్మకం వుంటే బ్యాలెట్ రంగంలోకి దిగి కష్టపడాలని, అంతేగానీ తుపాకీతో సమాజాన్ని మార్చలేమని తేల్చి చెప్పారు. పైపెచ్చు తుపాకీ అందరి చేతుల్లో వుండొద్దని, కేవలం రక్షణ దళం చేతిలోనే వుండాలని ,లేదంటే ముప్పు వున్న వారి చేతుల్లోనే వుండాలన్నారు. అంతేగానీ వీరికి సమాంతరంగా తుపాకులు చేతుల్లో పట్టుకొని తిరుగుతామని, సమాజాన్ని శాసిస్తామనడం అంగీకారం కాదన్నారు. అడవుల్లో వుంటూ వారికి ఇష్టం వున్న వారిని వదిలేసి, ఇష్టం లేని వారిని వదిలేయడం సరైంది కాదన్నారు.ఇప్పుడు నక్సల్ ఉద్యమం అంతర్గత కలహాలతో చీలిపోయి, బాగా బలహీనపడిందని, ఇప్పుడు వారు జన జీవన స్రవంతిలోకి వస్తున్నారని, ఇది సంతోషకరమని ప్రకటించారు.
మన ప్రజ్ఞను, జ్ఞానాన్ని, చైతన్యాన్ని ఇతరులతో పంచుకోవాలని, తదుపరి తరానికి అందించాలని సూచించారు. ఇతరులతో పంచుకుంటే వచ్చే ఆనందం చెప్పలేనిదని, ఇది భారతీయ సంస్కృతిలో మూలమన్నారు. వసుధైక కుటుంబం అని చెప్పేది కేవలం హిందూ ధర్మమేనని తెలిపారు. వలసవాదులు మన మనస్సులను, జ్ఞానాన్ని దోచుకున్నారని, యువతకు తిరిగి మన జ్ఞానాన్ని బోధించేవారు అవసరమని అన్నారు.మన పూర్వీకుల గురించి కూడా చెప్పాల్సిన అవసరం వుందని నొక్కిచెప్పారు. విదేశీయుల గొప్పలు చెప్పడం కాకుండా రాణి రుద్రమ్మ, అల్లూరి సీతారామరాజు, కొమురం భీం గురించిన వీర గాధలు చెప్పాలన్నారు. ప్రగతిశీలవాదులమని చెప్పుకుంటూ, భారతీయ సంస్కృతి అంతా విమర్శిస్తుంటారన్నారు.
భారత దేశం ఎదుగుతోందని, మనమందరమూ గర్వపడాలని, ఈ ప్రయాణంలో భాగస్వాములం కావాలని పిలుపునిచ్చారు. పూర్వీకులు చెప్పే వాటిని రాబోయే తరాలకు కూడా అందించాలని సూచించారు. ఏ విషయమైనా తెలుసుకోవాలంటే గూగుల్ చూస్తున్నారని, చివరికి ఆవిడ పేరు కూడా గూగుల్ చూడాల్సి వస్తుందేమోనని వ్యంగ్యంగా అన్నారు. గూగుల్ కి కూడా గురువు వుండాలని, అందుకే గురువులు కావాలని మన ధర్మం చెబుతోందన్నారు.
జీవితంలోని మంచి చెడు రెండూ తెలిసిన వారు, సమాజానికి దిశా నిర్దేశం చేసే పరిణతి వున్న అనుభవమే పెద్దరికమని, అలాంటి వారు భవిష్యత్తును సానుకూల దృక్పథంతో ముందుకు నడపగలని అన్నారు. వయస్సుతో పాటు వచ్చిన పెద్దరికాన్ని హుందాగా ఎలా నిలబెట్టుకోవాలి? అంకెలు మాత్రమే వుండే వయస్సుకు మనస్సుతో ఎలా లంకె వేయాలి? తెలిసిన వారే నిజమైన పెద్దలని వేదం కూడా చెబుతోందన్నారు. ఈ గుణాలకు ప్రజ్శా భారతి హనుమాన్ చౌదరి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.తన జీవితాన్ని సమాజం కోసం పూర్తిగా అంకితం చేశారని, టెలికాం రంగంలో అనేక విప్లవాత్మకతకు బాటలు వేశారని ప్రశంసించారు.
ఇక.. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా ప్రవాహ జాతీయ కన్వీనర్ నంద కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యాన్ని చెప్పే వారి సంఖ్య పెరగాల్సిన అవసరం వుందన్నారు. అలాగే ఆపరేషన్ సిందూర్ ఇతి వత్తాన్ని కూడా ఆయన వివరించారు.తరుచూ తప్పుడు వక్రీకరణలు చేసే వారి కంటే మంచి వ్యక్తుల మౌనం చాలా ప్రమాదకరమని అన్నారు. జాతీయ చర్చలు జరుగుతున్న సందర్భంలో తటస్థంగా వున్న వారు లేదా ఉదాసీనంగా వుండే వారు పరోక్షంగా అబద్ధాల వ్యాప్తికి దోహదకారులు అవుతున్నారన్నారు. జాతీయ దృక్పథాన్ని చెప్పే గొంతులు పెరగాలని, కథన నిర్మాణంలో విజయం సాధించాలంటే మౌన ప్రేక్షకులుగా వుండొద్దన్నారు.ప్రజ్ఞ ప్రవాహ్ ఏర్పడక ముందే ప్రజ్ఞ భారతి స్థాపించబడిందని, రెండూ ఒకే దృక్పథంతో పాతుకుపోయి, సమాజంలో జాతీయవాద దృక్పథానికి వాహకాలుగా అవుతున్నాయని అన్నారు.
ఇక.. ఇదే కార్యక్రమంలో జాగృతి ప్రత్యేక సంచికను కూడా అతిథులు ఆవిష్కరించారు. అలాగే కోవెల సంతోష కుమార్ రాసిన కల్లోల భారతం పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. మరోవైపు ప్రజ్ఞా పురస్కారాలను కూడా అందజేశారు. చారిత్రక నవలా చక్రవర్తి,రచయిత ముదిగొండ శివప్రసాద్ కి, ప్రముఖ జాతీయవాద జర్నలిస్టు, రాకాలోకం ఫేం రాకా సుధాకర రావు గారికి అందజేశారు.
@ Jagruti & VSK





