![]() |
| Attack on the sentiments of Hindus during the diwali festival.. The saffron flag was pulled down |
హిందువులకు పవిత్రమైన పర్వదినం దీపావళి రోజునే వారి చైతన్య సంకేతంపై దారుణమైన దాడి జరిగింది. రాజన్న సిరిసిల్లాలోని నాగారం గ్రామంలో కాషాయ జెండాలను అక్కడి అధికారులు లాగిపారేశారు. ఇదంతా కూడా అక్కడి గ్రామ పంచాయతీ కార్యదర్శి మహ్మద్ అఫ్సాన ఆదేశాల ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. హిందువుల సాంస్కృతిక ఉనికిని దెబ్బతీసేవిధంగా, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఈ మహిళా అధికారి ప్రవర్తించాని గ్రామస్థులంతా ఉడికిపోతున్నారు. ఇది ఎంత మాత్రమూ క్షమించరాని నేరమని మండిపడుతున్నారు. అందరూ దీపావళి పర్వదినం జరుపుకుంటున్న సమయంలోనే పరమ పవిత్రమైన కాషాయ ధ్వజాన్ని లాగిపారేయడం కలకలం రేపింది.
అయితే దీపావళి రోజునే ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడటం యాదృచ్చికమేమీ కాదని, హిందువుల భాగోద్వేగాలను అణచివేయాలి, సనాతన ధర్మాన్ని అవమానించాలన్న దురుద్దేశంతోనే ఇలాంటి కుట్రలకు తెరలేపారని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు. తమ కళ్లెదుటే, అది కూడా పండగ పూట పరమ పవిత్రమైన కాషాయ ధ్వజాన్ని తూలనాడే విధంగా ప్రవర్తించారని, కాషాయ ధ్వజాన్ని అగౌరవ పరిచిన మహిళా అధికారి మహ్మద్ అఫ్సానను వెంటనే విధుల్లోంచి తొలగించి, ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామంలోని హిందువులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. లేదంటే హిందూ సమాజం ఈ అవమానాన్ని భరించలేని స్థితిలో వుందని అంటున్నారు.
అచ్చు ఇలాంటి ఘటనే దసరా నవరాత్రుల సమయంలో బతుకమ్మ సంబరాల్లో ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. అక్కడి జందాపూర్ గ్రామంలో బతుకమ్మ ఘాట్ పైనే అక్కడి పంచాయతీ కార్యదర్శి సుల్తానా బేగం తన కారును ఎక్కించేశారు. అంతేకాకుండా అత్యంత దురుసుగా, హేళనగా మాట్లాడారు. తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ అంటే తమ అస్తిత్వంగా భావిస్తారు. అలాంటి బతుకమ్మ గద్దెపై నుంచి తన కారును తీసుకెళ్లి, సుల్తానా బేగం దానిని ధ్వంసం చేశారు.
ఒక ప్రభుత్వ ఉద్యోగి, పంచాయతీ కార్యదర్శి సుల్తానా బేగం తన కారు ఎక్కించి ధ్వంసం చేయడం అంటే, ఇది కేవలం నిర్లక్ష్యం కాదు – ఇది మన తెలంగాణ తల్లిని, మాతృమూర్తి స్వరూపాన్ని, ఆడబిడ్డల పవిత్రతను అవమానించినట్లేనని గ్రామంలోని హిందువులు మండిపడ్డారు. అంతేకాకుండా ఆమెను విధుల్లోంచి తొలగించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి వారికి కఠినమైన శిక్షలు విధించాలి. భవిష్యత్తులో మరో సారి ఎవరు కూడా హిందువులను, హిందువుల మనో భావాలను అగౌరవపరచకుండా చూడాలి.
తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి నీచ చర్యలను ఉపేక్షించడం ఎంతమాత్రం సరికాదు! మన భావోద్వేగాలను గౌరవించి, న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. హిందువు భక్తి శ్రద్ధలతో పండుగలు జరుపుకునే రోజున జరిగిన ఈ దారుణమైన అవమానాలు హిందూ సమాజం అంత తేలికగా మర్చిపోదు! ధర్మం జయించాలి! న్యాయం నిలబడాలి! బాధ్యులైన ముస్లిం అధికారులుగా పేరుపడ్డ వారిపై ఉక్కుపాదం మోపాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు.


