![]() |
| Mandyam Iyengar community |
కర్నాటకలోని మాండ్య జిల్లాలోని మేల్కొటే ప్రాంతం ఆ రాష్ట్రంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పేర్కొంటారు. కావేరీ నది ఒడ్డున వున్న వైష్ణవ క్షేత్రం. దీనిని తిరునారాయణపురం అని కూడా పిలుస్తుంటారు. కావేరీ లోయకు అభిముఖంగా ఇది వుంటుంది. దీనిని యదుగిరి, యదుశైలదీపం అని కూడా పిలుస్తుంటారు. రాతి కొండలపై నిర్మించిన ఈ ప్రదేశం 12 సంవత్సరాలకు పైగా శ్రీ వైష్ణవ రామానుజాచార్యులకు నిలయం.
ఈ ప్రాంతంలో చెలువ నారాయణ స్వామి ఆలయం, సంస్కృత పరిశోధనా అకాడమీతో పాటు అనేక పుణ్య క్షేత్రాలతో పాటు పురాతన విద్యా కేంద్రంగా ఖ్యాతి గడించింది. ఇంతటి మహిమాన్వితమైన ప్రాంతం మాత్రం దీపావళి జరుపుకోదు.
వీటన్నింటితో పాటు ఈ ప్రాంతంలో అయ్యంగార్ బ్రాహ్మణులు కూడా ఎక్కువగా వుంటారు. తమిళనాడు నుంచి వచ్చిన వీరంతా ఈ మేల్కొటే ప్రాంతంలోనే స్థిరపడ్డారు. క్రమంగా స్థిరపడి మాండ్యమ్ అయ్యంగార్లుగా పిలువబడుతున్నారు.
1790లో నరక చతుర్దశి నాడు టిప్పు సుల్తాన్ మేల్కొటేలోని 700 మందికి పైగా మాండ్యం అయ్యంగార్ కుటుంబాలను అత్యంత కిరాతకంగా, రాక్షసంగా ఊచకోత కోసేశాడు. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. దీపావళి జరుపుకోవడానికి శ్రీరంగపట్నంలోని కావేరి ఒడ్డున వున్న నరసింహ స్వామి ఆలయంలో అందరూ గుమిగూడారు. ఈ సమయంలోనే టిప్పు సుల్తాన్ సైన్యం వీరందర్నీ ఊచకోత కోసేసింది.
అత్యంత కిరాతకమైన, క్రూరమైన ఈ పనితో మాండ్యం అయ్యంగార్లు అందరూ నాగమంగళం అన్న ప్రాంతానికి తరలి వెళ్లారు. దీని తర్వాత బాబూరాయన కొప్పలు, మాండ్య కొప్పల్, మాండ్య నుంచి మేల్కొటేలో స్థిరపడ్డారు.
ఈ దారుణానికి సంబంధించి ఉన్న మరొక సమాచారం ఏమిటంటే...
![]() |
| కర్ణాటకలో మైసూర్ ప్రాంతాన్ని పాలించిన టిప్పు సుల్తాన్... 230 ఏళ్ళ కిందట మాండ్య జిల్లా మేల్కొటేకు చెందిన బ్రాహ్మణులను లక్ష్యంగా చేసుకుని క్రూరాతి క్రూరమైన దాడి చేశాడు |
కర్ణాటకలో మైసూర్ ప్రాంతాన్ని పాలించిన టిప్పు సుల్తాన్... 230 ఏళ్ళ కిందట మాండ్య జిల్లా మేల్కొటేకు చెందిన బ్రాహ్మణులను లక్ష్యంగా చేసుకుని క్రూరాతి క్రూరమైన దాడి చేశాడు. సంధి కోసం అంటూ ఈ బ్రాహ్మణ కుటుంబాలను శ్రీరంగపట్టణం పిలిపించాడు. వారంతా దేవాలయంలో భోజనం చేస్తుండగా ఏనుగుల్ని వారిపైకి వదిలి చంపించాడని తెలుస్తోంది. ఆ రోజున భోజనాలు చేస్తున్నవారిలో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. రాజమాత లక్ష్మి అమ్మణి రాసుకున్న లేఖల్లో ఈ ఘటన వివరాలున్నాయి. బ్రాహ్మణులను చంపించి అక్కడి ఆలయంలోని చింతచెట్టుకు వారి మృతదేహాలను వేలాడదీయించాడని చరిత్ర చెబుతోంది. మొత్తంగా ఈ దాడుల్లో సుమారు 1500 మంది చనిపోయినట్టు సమాచారం. సరిగ్గా దీపావళికి ముందు రోజైన నరక చతుర్దశి రోజున ఈ ఘోరం జరిగింది. తనను గద్దె దించడానికి కుట్రపన్నుతున్నారన్న అనుమానంతోను.. అలాగే హిందువులను దెబ్బ కొట్టాలంటే ముందు బ్రాహ్మణులను నిర్మూలించాలనే కుట్రతోను ఈ ఘోరానికి పాల్పడ్డాడు టిప్పు సుల్తాన్.
మేల్కోటే బ్రాహ్మణులపై జరిగిన ఈ మారణకాండకు నిరసనగా మొత్తం నాటి సమాజంలోని అన్ని కులాలవారూ అప్పటి నుంచీ దీపావళి పండగ చేసుకోలేదు. దీన్ని బట్టి ఆనాడు వివిధ కులాల మధ్య బలమైన ఐక్యత ఉండేదని అర్థమవుతుంది. అంతేగాక, ఈ కులాలకు అతీతంగా తామంతా హిందువులమనే భావన వారిలో ఉండేది. ఆ తరువాత కాలంలో దానిని నాశనం చేయడానికి, విభేదాలు సృష్టించడానికి, ముఖ్యంగా బ్రాహ్మణులపట్ల వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇంత క్రూరుడైన టిప్పు సుల్తాన్ని గొప్ప రాజుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు కీర్తిస్తూ పండుగలు చేయడం దురదృష్టం.
ఈ కిరాతకం జరిగి ఇన్ని సంవత్సరాలు జరిగినా... ఇప్పటికీ ఈ పట్టణంలోని వారు దీపావళి జరుపుకోరు. ఇంతటి విషాదకరమైన విషయాన్ని చరిత్రకారులు, మేధావులు మర్చిపోవచ్చు గానీ.. అక్కడి ప్రజలు మాత్రం 1790లో నరక చతుర్దశి రోజు జరిగిన భయానక జ్ఞాపకాలను మాత్రం మరిచిపోవడం లేదు.
మేల్కొటే అయ్యంగార్ బ్రాహ్మణుల ఊచకోత టిప్పుసుల్తాన్ ముస్లిమేతరులపై చూపిన రాక్షసత్వానికి, మౌఢ్యానికి సంబంధించిన ఉదాహరణలో ఒకటి. టిప్పు సుల్తాన్ తన వాదనను సమర్థించుకుంటూ, ఆయన హిందువులు, క్రైస్తవులపై దారుణమైన ఊచకోతలు కోసినా... ఆయన మాత్రం మతతత్వ మౌఢ్యుడు కాదని మాత్రం ఆయన సమర్థకులు వాదిస్తుంటారు. శృంగేరి మఠం, ఇతర దేవాలయాల పునర్నిర్మాణానికి ఆయన మంజూరు చేసిన గ్రాంట్లను, తన పరిపాలనలో ఉన్నత స్థానాల్లో కొంతమంది హిందువులను నియమించిన సందర్భాలను, అలాగే శారదా చిహ్నం ఉన్న నాణెం గురించి వారు ఉదాహరణలుగా చెబుతుంటారు.


