![]() |
| Missionaries are shocked... 110 tribal families return to Hinduism |
ఒడిశాలోని మయూర్బంజ్ ప్రాంతంలోని మహాలిబాసా గిరిజనులు క్రైస్తవ మత మార్పిడి ముఠాకి పెద్ద షాక్ ఇచ్చారు. 110 గిరిజన కుటుంబాలు తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశాయి. ఈ నెల రెండో తేదీన ఈ ఘర్ వాపసీ కార్యక్రమం ఘనంగా జరిగింది.గిరిజన తెగలో ఐదు ప్రధాన వర్గాలైన సంథాల్, మంకాడియా, లోధా,బరాంగ్, భూమిజ్ కి సంబంధించిన 21 కుటుంబాలు ఈ ఘర్ వాపసీలో వున్నాయి. ఈ కార్యక్రమానికి సమీపంలోని 18 గ్రామాల నుంచి జనజాతి ముఖ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఘర్ వాపసీ అయిన కుటుంబాలందర్నీ సాదరంగా హిందూ ధర్మంలోకి సంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. వనవాసీ కల్యాణాశ్రమం, జనజాతి సురక్షామంచ్ ఆధ్వర్యంలో ఈ ఘర్ వాపసీ జరిగింది.
జనజాతి సురక్ష మంచ్ జిల్లా ఉపాధ్యక్షుడు మరియు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) యొక్క రిటైర్డ్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ భీమ్ చరణ్ మాఝి, కైలాష్ ముర్ము, బైశాఖు సర్దార్, ఘనశ్యామ్ మహంత్, రామచంద్ర సాహా మరియు రామయ్ బెస్రా వంటి ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.
స్థానికంగా వుండే జనజాతి నాయకులు అక్కడి సంప్రదాయం ప్రకారం పూజలు, శుద్ధి ఆచరాలతో ఈ ఘర్ వాపసీ జరిగింది. సంప్రదాయ దుస్తులు ధరించే అందరూ ఇందులో పాల్గొన్నారు. పూర్వీకుల నమ్మకాలు, మన సంస్కృతిని కాపాడుతామంటూ అందరూ ప్రతిజ్ఞ చేశారు.
మమ్మల్ని క్రైస్తవ మిషనరీలు ప్రలోభ పెట్టాయి...
ఈ సందర్భంగా తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించిన వారు మీడియాతో మాట్లాడారు. తిరిగి తమ సంప్రదాయంలోకి వచ్చినందుకు తమకు ఎంతో ఆనందంగా వుందన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం క్రైస్తవ మిషనరీలు తమను తప్పుదారి పట్టించాయని, ప్రలోభాలకు గురి చేసి, మతం మార్చాయని పేర్కొన్నారు. వైద్యం చేయిస్తామని, డబ్బులు ఇస్తామని, అవసరాలన్నీ చూసుకుంటామంటూ ప్రలోభ పెట్టారని గిరిజనులు వెల్లడించారు.
మతమార్పిడి తర్వాత, మేము క్రమంగా మా పండుగలు, ఆచారాలు మరియు మా పూర్వీకులు అందించిన ఆరాధన విధానం నుండి దూరమయ్యాం. మా జీవితంలో శూన్యత ఏర్పడింది. పూర్వీకుల మార్గాన్ని విడిచిపెట్టడం చాలా పెద్ద తప్పు అని మేము గ్రహించాం. తిరిగి మన ధర్మం మూలాల్లోకి వచ్చేయాలని అనుకున్నాం. వచ్చేశాం’’ అని పేర్కొన్నారు.
గిరిజనులు ఎక్కువగా నివసించే జిల్లా మయూర్భంజ్, చాలా కాలంగా మిషనరీ గ్రూపులు ఇక్కడి గిరిజనులను ప్రలోభాలకు గురి చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. బలవంతం లేదా ప్రలోభం ద్వారా మత మార్పిడిని నిషేధించే ఒడిశా మత స్వేచ్ఛా చట్టం ఉన్నప్పటికీ ఈ మార్పిడులు జరుగుతున్నాయి.ఈ అక్రమ మత మార్పిళ్లకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుంది.
నాలుగు రోజుల క్రితమే ఛత్తీస్ గఢ్ లో భారీ సంఖ్యలో ఘర్ వాపసీ...
ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో కూడా ఘర్ వాపసీ జరిగింది. అక్టోబర్ 30 న ఈ కార్యక్రమం జరిగింది. విరాట్ హిందూ సమ్మేళనం సందర్భంగా సాధు సంతులు, ధర్మ జాగరణ్ సభ్యుల సమక్షంలో 140 మంది తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. దర్రాభటలోని హార్ది హవాయి పట్టి సమీపంలో ఈ ఘర్ వాపసీ జరిగింది. ఈ వేడుకకు అఖిల్ భారతీయ ఘర్ వాప్సీ ప్రముఖ్, ప్రబల్ ప్రతాప్ జుదేవ్ నాయకత్వం వహించారు, తిరిగి వచ్చిన వారికి పాదాలు కడిగి స్వాగతం పలికారు.
జార్ఖండ్ లో 200 మంది గిరిజనులు ఘర్ వాపసీ..
మార్చి 19 వ తేదీన జార్ఖండ్ లోని గోయిల్కేరా బ్లాక్‌లోని పర్లిపోస్ అధిక సంఖ్యలో ఘర్ వాపసీ జరిగింది. గోయిల్కెరాలో జరిగిన 56వ ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరంలో భాగంగా జరిగిన ఘర్ వాపసీ కార్యక్రమంలో 68 కుటుంబాలకు చెందిన దాదాపు 200 మంది తిరిగి హిందూ ధర్మాన్నిస్వీకరించారు. తమను క్రైస్తవ మిషనరీలు ప్రలోభాలకు గురి చేశాయని, ఆ తర్వాత పూర్వీకుల సంప్రదాయాలనే కొనసాగించాలని నిర్ణయించుకొని, తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశామని గిరజనులు ప్రకటించారు.,
తిరిగి వచ్చిన వారిని జగద్గురు శంకరాచార్య సదానంద జీ మహారాజ్ స్వాగతించారు, వారికి పవిత్ర గంగాజలం చల్లి, హిందూ ధర్మంలోకి ఆహ్వానించారు. దీనిని విశ్వ కల్యాణ్ ఆశ్రమం నిర్వహించింది.
ఒడిశాలో 200 మంది ఘర్ వాపసీ..
కియోంఝర్ జిల్లాలోని ఘాసిపురా బ్లాక్‌లో సెప్టెంబర్ మాసంలో ఘర్ వాపసీ కార్యక్రమం జరిగింది. ఆరు గిరిజన కుటుంబాలకు చెందిన 40 మంది తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశారు. వీరితో పాటు మిగతా గిరిజనులు కూడా వున్నారు. వీరంతా ముండా, సంథాల్ తెగలకు సంబంధించిన వారు. తమను క్రైస్తవ మిషనరీలు ప్రలోభాలకు గురి చేశాయని, దీంతో తాము అటు వైపు వెళ్లామని, కానీ.. ఆ తప్పునంతా తెలుసుకొని, తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశామని తెలిపారు. ఇందులో స్థానిక ఎంపీ శివేంద్ర చక్ర, ధర్మ జాగరణ్ కార్యకర్తలు, స్థానికులు కూడా హాజరయ్యారు.


