‘బెంగళూరులో ఆటో తోలితే ఆదాయం బాగుంటుంది. బంగ్లాదేశీయులు ఇక్కడికి రండి’ అని ఆహ్వానిస్తూ బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు.
తమకు ఎటువంటి రికార్డులు, గుర్తింపు కార్డులు లేవని, అయినా అద్దెకు ఆటోలు నడుపుతున్నామని వారే స్వయంగా పేర్కొనడం కలకలం రేపుతోంది. తమను తాము బంగ్లాదేశ్ వాసులని చెప్పుకొన్న ఆ ముగ్గురు ఆటో డ్రైవర్లు ఎవరు? దేశంలోకి ఎలా వచ్చారు? రికార్డులు లేకపోయినా స్వేచ్ఛగా ఆటోలను ఎలా నడపగలుగుతున్నారు? అనే చర్చ మొదలైంది. ఈ వ్యవహారం పోలీసులకు సవాలుగా మారింది.
వారు చెప్పింది నిజమే అయితే.. దేశ భద్రత పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ‘సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తే నెలకు రూ.8-10 వేలు మాత్రమే వస్తోంది. ఆటో ద్వారా ఆదాయం అధికం’ అంటూనే బంగ్లాదేశ్ వాసులకు బెంగళూరుకు రావాలని ఆహ్వానించినట్టు ఆ వీడియో సందేశం ఉంది. విదేశీయులు నగరంలో ఏకంగా అద్దె వాహనాలు నడిపే స్థాయికి చేరారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
A video has gone viral showing three men, reportedly from Bangladesh, living in Bengaluru, working as security guards and auto drivers, and openly inviting others to come and work here.
— Yaduveer Wadiyar (@yaduveerwadiyar) December 30, 2025
In another recent video, a woman openly stated that to escape the Assam Government’s… pic.twitter.com/zAkbW6l3vP

