![]() |
| I am fortunate to have visited the memorials of Doctorji and Guruji: Israeli Consul General |
ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యావిన్ రేవాచ్ నాగపూర్ రేషంబాగ్ లోని డాక్టర్జీ స్మృతి మందిరాన్ని, గురూజీ స్మృతి మందిరాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. అలాగే అక్కడి చారిత్రక, సైద్ధాంతిక ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపకులు హెడ్గేవార్ స్మృతి మందిరం గురించి, ఆయన జీవితం, కృషి, స్ఫూర్తిదాయక ఘట్టాలను కూడా అడిగి తెలుసుకున్నారు.
![]() |
| I am fortunate to have visited the memorials of Doctorji and Guruji: Israeli Consul General |
అలాగే సంఘ్ వంద సంవత్సరాల యాత్ర, సామాజిక కార్యకలాపాలు, సేవ గురించి అక్కడి వారు ఆయనకు వివరించారు.ఈ సందర్భంగా నాగపూర్ మహా నగర్ సంఘచాలక్ రాజేష్ జీ లోయా, వరిష్ట ప్రచారక్ వికాస్ జీ తేలంగ్ తో సహా.. ఇతర సంఘ అధికారులు ఈ సందర్హంగా యావిన్ రేవాచ్ కి స్వాగతం పలికారు.
![]() |
| I am fortunate to have visited the memorials of Doctorji and Guruji: Israeli Consul General |
ఈ సందర్భంగా ‘‘యావిన్ రేవాచ్ మాట్లాడుతూ ‘‘ ఆరెస్సెస్ కార్య శతాబ్దిలో నాగపూర్ లోని సంఘ ప్రధాన కార్యాలయాన్ని (కేశవ కుంజ్) ను సందర్శించాను. ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. 1925 లో మొట్ట మొదటి సారిగా శాఖ ప్రారంభమైన ప్రాంతాన్ని చూశాను. అలాగే ఆరెస్సెస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్, ద్వితీయ సర సంఘచాలక్ గురూజీ స్మృతి మందిరాలను సందర్శించి, నివాళులు అర్పించాను’’ అని పేర్కొన్నారు.



