![]() |
| Hindu student pressured to wear burqa |
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఐదుగురు ముస్లిం బాలికలు హిందూ విద్యార్థినిని బుర్ఖా ధరించమని బలవంతం చేశారు. ఈ విషయంపై బాలిక సోదరుడు ఇచ్చినఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐదుగురు బాలికలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే మొరాదాబాద్ లోని బిలారి పట్టణంలో షాకుంజ్ కాలనీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బాధితురాలితో పాటుగా, నిందితులైన విద్యార్థులు అందరూ 12వ తరగతి చదువుతున్నారు. వారంతా 15, 17 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. అందరు విద్యార్థులు ఒకే పాఠశాలలో చదువుతున్నారు అందరూ కలిసి ఒకే కోచింగ్ సెంటర్‌కు కూడా వెళతారు. మొదట్లో తనకు ఈ బాలికలతో మంచి స్నేహం ఉండేదని, కానీ క్రమంగా వారు తనను ప్రభావితం చేయడం ప్రారంభించారని బాధితురాలు చెప్పింది. ఎందుకంటే బాలికలు ఆమెను ఇస్లాంలోకి మారవద్దని పదే పదే రెచ్చగొట్టారు.”నువ్వు ఇస్లాంలోకి మారితే, నీ విధి మారిపోతుంది నువ్వు చాలా అందంగా కనిపిస్తావు” అంటూ ఆమెను ప్రలోభపెట్టారనీ, హిందూధర్మంపై ద్వేషాన్ని నింపే ప్రయత్నం చేశారని బాధిత మహిళ పేర్కొంది. వాటన్నింటినీ తాను భరించానని, వాళ్ల మాటలు వినలేదని ఫలితంగా వారు తన పట్ల ద్వేషాన్ని పెంచుకున్నారన చెప్పింది.
ఈ సంఘటన జరిగిన రోజు, కోచింగ్ నుండి తిరిగి వస్తుండగా, అమ్మాయిలు ఆమెను చుట్టుముట్టారు. ఆమె బ్యాగ్ నుండి బుర్ఖాను తీసి బలవంతంగా ఆమెపైకి లాగారు. బాధితురాలు భయం కారణంగా ఏమీ చేయలేకపోయింది. ఇదంతా తన సోదరిపై బ్రెయిన్ వాష్ చేసే చర్య అని ఆమె సోదరుడు చెప్పాడు. “ఈ మొత్తం సంఘటన వెనుక పెద్ద కుట్ర ఉండవచ్చు. ఏదైనా సంస్థ మైనర్ హిందూ అమ్మాయిలను మతం మార్చడానికి ప్రేరేపిస్తుందా? ఈ విషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని బాధితురాలి సోదరుడు చెప్పాడు. సీసీటీవీ ఫుటేజ్, సాక్షులు,బాలికల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు పోలీసులు.

