సనాతన ధర్మానికి మూలమైన భారతదేశంలో హిందువులలో భయానక వాతావరణం, అభద్రతాభావం కల్పించేందుకు దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. మంచితనంతో దేవుడిపై భారం వేసి తమ ధర్మాన్ని అసుసరిస్తున్న హిందువుల పరమత సహనాన్ని బలహీనంగా భావిస్తూ వారిని రెచ్చగొట్టేందుకు దేశంలో కుట్రలు జరుగుతున్నాయి. భారతీయులు సగర్వంగా నిర్మించుకున్న అయోధ్య రామమందిరం ప్రాంగణంలో, భాగ్యనగరం నడిబొడ్డున ఇటీవల జరిగిన దుశ్చర్యలు, ఏఐఎంఐఎం చీఫ్ అసద్దుదీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే దేశంలో హిందూ సమాజం జాగృతం కావాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. ఈ మూడు సందర్భాల్లోనూ తాము ఏమైనా చేయగలమనేలా మత ఛాందస బరితెగింపు స్పష్టంగా కనబడుతోంది. అయోధ్య, భాగ్యనగరంలో దేవాలయాల లక్ష్యంగా జరిగిన ఘటనలు హిందువుల సహనాన్ని పరీక్షించగా, ఓవైసీ వ్యాఖ్యలు యావత్ భారతదేశ భవిష్యత్తుకు ఒక హెచ్చరికే కాకుండా మత కుట్రలకు సూచికగా కనిపిస్తున్నాయి.
భారతీయులకు మచ్చగా నిలిచిన అయోధ్యలో బాబ్రీ మసీదు కట్టడాన్ని తొలగించి నిర్మితమైన భవ్యమైన రామమందిరం ప్రాంగణంలో జనవరి 10వ తేదీన కొందరు మతమౌఢ్యం చూపించారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన ముస్లింలు రామ మందిరం కాంప్లెక్స్ ‘డీ-1’ గేటు మార్గం ద్వారా సాధారణ భక్తులుగా ప్రవేశించి దేవాలయం లోని సీతారసోయి వద్ద నమాజు చేయడానికి ప్రయత్నించగా పసిగట్టిన భద్రతా దళాలు వేగంగా స్పందించి అడ్డుకున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని సోపైన్ జిల్లాకు చెందిన 55 ఏళ్ల అబు అహ్మద్ షేక్, సోఫియా అనే మహిళతో పాటు మరో యువకుడిని పోలీసులు ఈ ఘటనలో అదుపులో తీసుకోవడంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. భద్రతా దళాలు అక్కడ ప్రార్థన యత్నాలను అడ్డుకోవడంతో అహ్మద్ షేక్ పెద్ద ఎత్తున మత నినాదాలు చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భారతీయులు శతాబ్దాలుగా పోరాడి నిర్మించుకున్న దివ్యమైన రామమందిరంలో మధ్యాహ్నవేళ నమాజుచేసి సనాతన ధర్మాన్ని అనుసరించే వారిని అవమానించడమే కాకుండా తాము తలుచుకుంటే ఏమైనా చేయగలమని హెచ్చరించాలనే ఉద్ధేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడ్డారు. నిత్యం లక్షలాది భక్తులతో కిటకిటలాడే అయోధ్య రామాలయంలో కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ కన్నుగప్పి లోనికి చొచ్చుకొచ్చి అక్కడ నమాజు చేయాలని సంకల్పించడమే వారి మత బరితెగింపును స్పష్టం చేస్తుంది. యావత్ హిందూ సమాజం ఎంతో ఆరాధ్యంగా కొలిచే అయోధ్య రామాలయంలోనే తాము బహిరంగంగా పగటి వేళనే నమాజు చేయ గలిగామని వారు ప్రపంచానికి తెలియజేసే పైశాచికానందమైన కుట్రలు పన్నారు. మరోవైపు అయోధ్యలోని రామమందిరంపై ఉగ్రవాదులు కుట్రలు పన్నబోతున్నారనే వార్తలున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడం, అక్కడ కోట్ల రూపాయలు వ్యయం చేసి ఆధునిక పరికరాలతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినా రక్షణ వైఫల్యం తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి.
అయోధ్యలో నమాజు కుట్రలు బయటపడిన రోజునే మన భాగ్యనగరంలో కూడా దేవాలయం లక్ష్యంగా మరో దురదృష్టకరమైన ఘటన జరగడం ఆందోళనకరం. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన అల్తాఫ్ అనే ఒక మత మౌఢ్యుడు సఫిల్ గూడ చెరువువద్ద కట్టమైసమ్మ ఆలయం ప్రాంగణంలో పవిత్రంగా భావించే బొడ్రాయి వద్ద అసభ్యకరంగా వ్యవహరించి హిందువుల మనోభావా లను గాయపరిచాడు. రాకపోకలతో నగరం నడిబొడ్డున నిత్యం హడావుడిగా ఉండే సఫిల్‌గూడ చెరువు ప్రధాన రహదారిలో ఉన్న కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయంలో జనవరి 10వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో ఈ ముస్లిం యువకుడు దుశ్చర్యకు పాల్పడుతూ నిస్సిగ్గుగా బొడ్రాయి వద్ద మూత్ర విసర్జన చేయడంతో స్థానికులు అతడని పట్టుకొని ఆగ్రహంతో దేహశుద్ధి చేశారు. ఈ అసభ్య చర్యను నిరసిస్తూ వేలాది మంది తెల్లవారు జాము వరకు భారీ ధర్నా చేపట్టారు.
![]() |
| The jihad of religious 'mentally ill' people |
మైసమ్మ దేవాలయంలో అలజడి వేడి చల్లారక ముందే హిందువులు ఆనందోత్సవాలతో జరుపుకునే మకర సంక్రాతి పండుగ రోజు జనవరి 14వ తేదీ అర్థరాత్రి పాతబస్తీ పురానాపూల్ వద్ద చారిత్రాత్మకమైన మైసమ్మ దేవాలయంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. దుండగులు మైసమ్మ ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి విగ్రహాన్ని, పటాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం పాతబస్తీ కావడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. స్థానికులతో పాటు హిందూ సంఘాల నేతలు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు. వారం రోజుల వ్యవధిలోనే హైదరాబాద్‌లో హిందూ దేవాలయాల లక్ష్యంగా రెండు దుశ్చర్య ఘటనలు జరగడంతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఒక వర్గం లక్ష్యంగా అల్లరి మూకలు బరితెగిస్తుండడంతో రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా మెýగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
దేవాలయాల్లో జరిగిన ఈ మూడు ఘటనల్లో దుండగుల దుశ్చర్య గమనిస్తే సనాతన ధర్మంపై వారికున్న కక్ష మాత్రమే కాకుండా హిందువుల సహనాన్ని పరీక్షిస్తున్నట్టు ఉంది. మత దురహం కారంతో పరమతస్థుల మనోభావాలను గాయ పర్చేందుకు, రెచ్చగొట్టేలా ఈ చర్యలున్నాయి. నిత్యం లౌకికవాదాన్ని వల్లె వేసే మన సెక్యులర్ పార్టీలు, మేధావులు ఈ ఘటనలపై ఇంతవరకు నోరు మెదపకపోవడం దురదృష్టకరం. హిందువులపై, హిందూ దేవాలయాలపై ఎక్కడ దాడులు జరిగినా మొట్టమొదటగా వినిపించే మాట మానసిక పరిస్థితి సరిగ్గా లేని వ్యక్తులు చేసిన ఘటనగా కప్పిపుచ్చడం. ఒకటి రెండు అంటే అనుకోవచ్చు, అన్ని సందర్భాల్లో ఈ మానసిక పిచ్చోళ్లకు హిందూ దేవాలయాలే లక్ష్యాలుగా కనిపిస్తాయా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. వాళ్లు అన్ని పనుల్లోనూ మంచిగానే ఉంటారు. కేవలం దేవాలయాలపై దాడులు చేసినప్పుడు మాత్రమే వారు మానసిక రోగులుగా కనిపిస్తారు. దీన్ని మానసిక రోగం అనే దానికంటే మత రుగ్మత అనడం సరైనది. ఎందుకంటే అయోధ్య రామా లయంలో నమాజు కోసం ప్రయత్నించిన వ్యక్తి కొంత కాలంగా మానసికంగా ఇబ్బందిపడుతూ చికిత్స తీసుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరం ఏమిటంటే ఆ మానసిక రోగి కశ్మీర్ నుండి అజ్మీర్‌కు వెళ్తూ మధ్యలో అయోధ్య వచ్చాడు. ఒక మానసిక రోగి అన్ని వందల కిలోమీటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేశాడు. అయోధ్యలో కూడా భద్రతా దళాల కన్నుగప్పి లోపలికి రావడం కూడా పిచ్చోడి లక్షణమేనా..? ఆయనను పోలీసులు పట్టుకున్నప్పుడు పెద్దగా మత నినాదాలు చేశాడు. ఎలాంటి లక్ష్యం లేకుండా వచ్చిన ఆయన నినాదాలు ఎందుకు చేశాడు..? పోలీసులు పట్టుకోగానే భయపడకుండా నినాదాలు చేయడం వెనుక తెగింపు కనిపించడం లేదా..? ఆయనకు తోడుగా మరో మహిళ కూడా రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? ఇవన్నీ మానసిక జబ్బు అంటే అంతకు మించి మరో హాస్యాస్పదం ఉండదు.
అయోధ్య రామాలయంలోనే కాదు సఫిల్‌గూడ కట్ట, పురానాపూల్ మైసమ్మ దేవాలయం వద్ద కూడా మత పిచ్చి ఉన్మాదులు అమానవీయంగా పశువుల వలే ప్రవర్తించారు. అన్ని ఘటనల్లో చెప్పినట్టే షరామామూలుగా వీరి మానసిక పరిస్థితి కూడా బాగోలేదంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టిం చడం ఖాయమని గత అనుభవాలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో దేవాలయాలపై ఇలాంటి దాడులు పరిపాటిగా మారాయి. నగరంలో దేవాలయాల లక్ష్యంగా బరితెగిస్తున్న ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఆగస్టు, 2024లో పాతబస్తీ రక్షాపురంలో అమ్మవారి దేవాలయంపై, అక్టోబర్, 2024లో సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో ఇదే తరహా దాడులు జరిగాయి. అప్పుడు కూడా పెద్ద ఎత్తున హిందువులు నిరసనలు చేపట్టారు. నిందితులను మానసిక రోగులని చల్లార్చుతూ చేసిన ప్రకటనతో తాత్కాలికంగా ఉద్రిక్తతలు తగ్గిస్తున్నా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సరైన చర్యలు తీసుకోవడంలో మాత్రం ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి.
హిందూ దేవాలయాల లక్ష్యంగా ముందస్తు ప్రణాళికలతో అలజడి సృష్టిస్తున్న వారిని మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని చెబుతూ సున్నితమైన అంశాలను పక్కదారి పట్టించడం చూస్తుంటే వారు మానసికంగా దృఢంగా ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా? లేక మన ప్రభుత్వాలతోపాటు సనాతన ధర్మాన్ని అనుసరించే వారు మానసికంగా బలహీనంగా ఉన్నారా? అనే సందేహాలు వస్తు న్నాయి. దేవాలయాలపై మత పిచ్చోళ్ల అరాచకాలు పెరుగుతున్న దశలోనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యల రూపంలో మానసిక దాడి చేశారు. మత పిచ్చితో ఉన్మాదులు దేవాలయాల్లో తెగబడితే ఎంపీ అసదుద్దీన్ తానేమీ తక్కువ కాదన్నట్టు మత కోణంలో మాట్లాడారు. ఉన్మాదులు దేవాలయాల్లో అలజడి సష్టించి తమ మతం ఆధిపత్యాన్ని ప్రదర్శిం చాలని చూస్తే, ఎంపీ తన వ్యాఖ్యలతో భారత్‌లో ఇస్లాం మతం ప్రాబల్యాన్ని సూచించారు.
హిందూ సమాజాన్ని కించపరుస్తూ దేవాల యాల్లో అలజడి జరుగుతున్న దశలోనే జనవరి 10వ తేదీన ఓవైసీ మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంబాయిలో ప్రసంగిస్తూ హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒక రోజు దేశంలో అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి చేపడతారని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారంలో భాగంగానే కనిపిస్తున్నా దీని వెనుక వారి మత ఆధిపత్యం, ఛాందస కుట్రలు దాగున్నాయి. దేశంలో 14 శాతంపైగా ఉన్న ముస్లిం మైనార్టీలు ప్రధాన మంత్రి పదవి చేపడతారని ఆయన ప్రకటించడం హాస్యాస్పదం కాదు. దేశంలో సంకుచిత బుజ్జగింపు రాజకీయాల కారణంగా 14 శాతం ఉన్న ముస్లింలు ఇప్పటికే పలుచోట్ల గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తెలంగాణ, కేరళ, కర్నాటక, జమ్మూకశ్మీర్ వంటి కీలక రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బుజ్జగింపు రాజకీయాల దృష్ట్యా ఏదో ఒకరోజు మైనార్టీ నేత ప్రధానమంత్రి పీఠం అధిరోహిస్తారనే ధీమా ఓవైసీ మాటల్లో ప్రస్పుటమవుతోంది. మరోవైపు ముస్లింల జనాభా పెరుగుదలతో ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేశమైన భారత్‌లో మార్పులు సంభవిస్తాయని ఓవైసీ సున్నితంగా తెలియజేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని అనుసరించే హిందూ సమాజానికి ప్రమాదకరమైన హెచ్చరిక లాంటిదే.
ప్రజాస్వామ్య భారత దేశంలో ఉన్నతమైన రాష్ట్రపతి పదవిని జాకీర్ హుస్సేన్, మహ్మద్ హిదయ తుల్లా, ఫక్రుద్దీన్ ఆలీ, అబ్దుల్ కలాం చేపట్టారు. దేశంలో అత్యున్నత పదవి మైనార్టీలకు ఇవ్వకూడదని ఎక్కడా లేదు. అలా అని మహిళలు చేపట్టకూడదని కూడా లేదు. అయితే అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్య ల్లోనే మత కోణం కనిపిస్తోంది. హిజాబ్ ధరించిన వారు ప్రధాని పదవి చేపట్టాలన్నారు. మతం ఆధారంగా రాజకీయాలు చేసే ఓవైసీ హిజాబ్ అంశంతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారు. ఒక ముస్లిం లేదా ముస్లిం మహిళ ప్రధాని పదవి చేపట్టాలి అనడం కంటే హిజాబ్ ధరించిన వారు ప్రధాని అవుతారని చెప్పడంలోనే మత కోణం ఉంది. బిహార్ సీఎం నితీష్‌కుమార్‌పై ఇటీవల హిజాబ్ చర్చ జరుగుతున్న వేళ ఓవైసీ మహారాష్ట్ర ఎన్నికల్లో హిజాబ్ అంశం లేవనెత్తారు. సున్నితమైన హిజాబ్ గురించి ఆయన మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. అక్టోబర్ 26, 2022న కర్ణాటక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలవేళ ఒక సభలో మాట్లాడుతూ హిజాబ్ ధరించిన వారు ప్రధాని కావాలని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో కర్ణాటకలో హిజాబ్ వివాదం నడుస్తుంది. అంతేకాదు మార్చి, 2022లో కర్ణాటకలో హిజాబ్ అంశంపై కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో కూడా ఓవైసీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఎన్నికల సమయాల్లో హిజాబ్ వంటి సున్నితమైన అంశాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి వెన్నతో పెట్టిన విద్య కావడంతో తరచూ మాట్లాడుతుంటారు.
పాకిస్తాన్ వలే కాకుండా ఇండియాలో అంబేద్కర్ కారణంగా హిజాబ్ ధరించిన వారికి కూడా ప్రధాన మంత్రి పదవి చేపట్టే అవకాశముందని ఓవైసీ వ్యాఖ్యానించారు. అడుగడుగునా మతం పేరుతో రాజకీయాలు నడుపుతూ లబ్ధిపొందే ఓవైసీ లాంటి వారు అంబేద్కర్ పేరు ఎత్తడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. మత రాజకీయాలు, భారత్‌లో ఇస్లాం మతం, దేశ విభజన అంశాలపై అంబేద్కర్ స్పష్టమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఇస్లాంలో మతం, పాలన వేర్వేరుగా ఉండడం కష్టమని, దేశ విభజన సమయంలోనే హిందువులు, ముస్లింల మధ్య నమ్మకం తగ్గిందని, వీరి మధ్య శాంతి ఉండకపోవచ్చని, బాధాకరమైనా దేశ విభజన పరిస్థితులు ఏర్పడ్డాయని నాడే అంబేద్కర్ తమ అభిప్రా యాన్ని స్పష్టంగా చెబితే, ఇప్పుడు ఆయన పేరు ఉటంకిస్తూ హిజాబ్ ధరించిన వారు ప్రధానమంత్రి అవుతారని ఓవైసీ వ్యాఖ్యానించడం హస్యాస్పదం
అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యల్లో ముస్లిం మహిళల అభివృద్ధి కంటే ఆయనలో ఉన్న మత అహంకార ఆధిపత్యమే కనిపిస్తోంది. ఎన్నో అవకాశాలున్నా ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ కీలకమైన పదవులను మహిళలకు ఎన్నడూ కట్టబెట్టకుండా చిన్నచూపు చూస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కారణంగా తప్పని పరిస్థితుల్లో మహిళలకు కార్పొరేటర్ల పదవుల అవకాశాలు ఇస్తున్నారు. నిజంగా ఆయనకు ముస్లిం మహిళలపై ప్రేమ ఉంటే వారికి ఉన్నత పదవులు ఎందుకివ్వలేదు? ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ పదవులను తమ కుటుంబ సభ్యులకు, తమ అనుచరులకు మాత్రమే ఇస్తూ మహిళలకు ఎందుకివ్వలేదు? భారతదేశంలో అత్యున్నత పదవైన ప్రధాని పదవి గురించి మాట్లాడే ఓవైసీ హిజాబ్ ధరించిన వారికి మజ్లీస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వచ్చు కదా?! మహిళల గురించి మాట్లాడే ఓవైసీ 2023 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన మాధవీలతపై ఒక మహిళ అని కూడా చూడకుండా మజ్లీస్ పార్టీ ఎంత అనుచితంగా, దౌర్జన్యంగా వ్యవహరించిందో తెలిసిందే. మాధవీలత హిందు మహిళ అనుకుంటే గతంలో హిజాబ్ ధరించిన ముస్లిం మహిళ పట్ల కూడా మజ్లీస్ అలానే వ్యవహరించింది. చంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2018లో అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీకి ప్రత్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేసిన ముస్లిం మహిళ షాహీజాది సయ్యదపై మజ్లీస్ పార్టీ చేసిన ఆగడాలు, వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు. ఆమెను బరిలో నుంచి తప్పించేందుకు అన్ని రకాల ఒత్తిళ్లు తెచ్చారు. ఆమె వారి బెదిరింపులకు, ఒత్తిళ్లకు లొంగకుండా పోటీ చేస్తే ఇబ్బందులు పెట్టారు. హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని పదవి చేపట్టాలని ఆకాంక్షించే అసదుద్దీన్ నాడు హిజాబ్ ధరించిన మహిళపట్ల ఎందుకు అనుచితంగా వ్యవహ రించారో సమాధానం చెప్పాలి. వీరి వ్యవహారశైలి ఒకేలా కనిపిస్తోంది. హిజాబ్ ధరించినా, ధరించక పోయినా మత ఛాందసంతో ఓవైసీ కనుసన్నల్లో వారి అడుగులకు మడుగులు వత్తే వారుండాలి. మానసికంగా రాజకీయ దాడులు చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలో ముస్లిం మహిళలపై ప్రేమ కంటే వారి మత ఆధిపత్యం, ఛాందసమే ఎక్కువగా కనిపిస్తోంది.
నూతన సంవత్సరం 2026 ఆరంభంలోనే యాదృచ్ఛికంగానైనా దేవాలయాల్లో ప్రత్యక్షంగా అలజడులు, పరోక్షంగా అసదుద్దీన్ వ్యాఖ్యలు గమనిస్తే దేశంలో సనాతన ధర్మంపై విషం కక్కేందుకు, కుట్రలు పన్నేందుకు విద్రోహ శక్తులు కాచుకొని కూర్చున్నాయని స్పష్టమవుతోంది. దేవాలయాýపై మానసిక రోగుల పేరిట దాడులు, హిందూ సమాజంపై మానసికంగా రాజకీయ దాడులు చేస్తున్న ఓవైసీ వ్యాఖ్యలపై జాగృతం కావాల్సిన పరిస్థితులు ఆసన్నమయ్యాయి. సెక్యులరిస్టుల నుండి సనాతన ధర్మాన్ని పరిరక్షించు కోవాల్సిన సమయం వచ్చింది. హిందూ సమాజం చైతన్యం కాకపోతే భవిష్యత్తులో విషపూరిత శక్తులతో తిప్పలు తప్పవు. అత్యంత అప్రమత్తంగా మెలగాల్సిన అవసరం సనాతన ధర్మవాదులపై ఉంది.
– శ్రీపాద


