మలప్పురం జిల్లాలోని కుట్టిచతంకావు ప్రాంతంలోని హిందూ మందిరంలోకి చొరబడి, విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముస్లిం వ్యక్తి నదీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయ ప్రతినిధి చేసిన ఫిరయాదు మేరకు, నిలంబూరు పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు . అయితే నదీర్ అరెస్టైన తర్వాత, ఆయన సహచరులు పాత చింతకాయ పచ్చడిని తెరపైకి తెచ్చారు. మానసికంగా ఆయన సరిగ్గా లేడని జిహాదీ గ్రూపులు చెబుతున్నాయి.
నదీర్ మధ్యాహ్నం ప్రాంతంలో ఆలయం దగ్గరికి కారులో వచ్చాడు. ఆ తర్వాత ఆలయంలోకి ప్రవేశించి, విగ్రహాన్ని ధ్వంసం చేసి, దేవాలయ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయ బాధ్యుడు వేణుగోపాలన్ మాట్లాడుతూ.. దేవాలయ ప్రాంగణంలో నదీర్ తీవ్ర భయాందోళనలు సృష్టించాడని, ఉద్దేశపూర్వకంగానే విధ్వంసం చేశాడని పేర్కొన్నారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదైందని తెలిపారు.
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సాజు కె అబ్రహం నేతృత్వంలోని పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. సంఘటన స్థలం నుండి సేకరించిన సమాచారం ఆధారంగా, సంఘటనలో ఉపయోగించిన వాహనాన్ని కరువరకుండ్ లో గుర్తించారు. ఈ నేపథ్యంలో నిలంబూరు సబ్ఇన్స్పెక్టర్ కె రతీష్, కరువరకుండ్ పోలీసుల సహకారంతో నదీర్ను అరెస్టు చేశారు.
మరో వైపు నిందితుడ్ని అరెస్ట్ చేసే సమయంలో మసీదులో పనిచేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తమ కస్టడీలోకి తీసుకున్న తర్వాత నదీర్ ను రాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. మరో వైపు భారత న్యాయ సంహితలోని సెక్షన్లు 324(4), 298, 351(2), మరియు 3(5)తో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

