![]() |
| RSS Sah-Sarkaryavah : Arun Kumar |
యువత దేశానికి అత్యంత గొప్పబలమని, వారి నిర్మాణాత్మక కృషి ఉజ్వ భవిష్యత్తుకు పునాది వేస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ అరుణ్ కుమార్ అన్నారు.
ఈ నెల 24 న జమ్మూలోని జాఖ్ సాంబా, రాయా మోర్ లో ‘‘యువ సంవాద్’’ కార్యక్రమం జరిగింది. అందులో అరుణ్ కుమార్ పాల్గొన్నారు. దేశం పట్ల నిస్వార్ధ సేవ, త్యాగం, అంకిత భావ స్ఫూర్తిని రగిలించేలా ఈ కార్యక్రమం జరిగింది.
జాతీయ అభివృద్ధికి యువత చురుగ్గా తోడ్పడాలని, తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అాగే భారతీయ సాంస్కృతిక విలువలను అలవర్చుకోవాలని యువతకు సూచించారు.
జమ్మూ కేంద్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి, ఆచార్య సంజీవ్ జైన్ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్య, నైతిక విలువలు మరియు సామాజిక బాధ్యతల ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు; యువత సానుకూల దృక్పథంతో, సృజనాత్మక ఆలోచనా విధానంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంఘ స్వయంసేవకులు ఎక్కడైతే క్రియాశీలకంగా ఉంటారో, అక్కడ పురోగతి మరియు సానుకూల పరివర్తన అనివార్యమని ఆయన వ్యాఖ్యానించారు.
వివక్ష, సామాజిక దురాచారాలు కేవలం వ్యవస్థల నుంచి కాకుండా మానవ మనస్సు నుంచే పుడతాయని అరుణ్ కుమార్ అన్నారు. వ్యక్తిత్వ నిర్మాణం, సంఘటన శక్తి ద్వారా విలువల ఆధారిత సామాజిక పరివర్తన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
అలాగే దేశ ఘనమైన చరిత్రను గుర్తు చేశారు. పూర్వీకులు విదేశీ దండయాత్రల నుంచి నాగరికతను ఎలా కాపాడి, దాని సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించారో వివరించారు. రోజువారీ శాఖలు, సేవా కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, సామాజిక సంస్కరణల కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో ప్రయత్నాల ద్వారా అందిస్తున్న సేవను కూడా వివరించారు.
ఆరెస్సెస్ ను లోతుగా కాకుండా పైపైన చూసినప్పుడు తరుచూ అపార్థానికే గురి అవుతుందన్నారు. ఈ సంస్ధ పరివర్తన, వ్యక్తిగత పరివర్తన ద్వారా దేశ నిర్మాణమే లక్ష్యంగా ఓ విస్తృత సామాజిక ఉద్యమం నడుస్తోందన్నారు.బలమైన వ్యక్తుల నిర్మాణం జరిగితే అదే బలమైన సమాజం, బలమైన దేశానికి దారితీస్తుందన్నారు.ఆరెస్సెస్ ఏ సంస్థతోనూ పోటీపడదని, దేశ భద్రత, గౌరవం, ఐక్యతను నిర్ధారించడానికి కృషి చేస్తుందన్నారు.

