![]() |
| Vidya Bharati |
ఆర్ఎస్ఎస్ ఆదర్శాలతో ప్రేరణ పొందిన విద్యా విభాగమైన విద్యాభారతి తరతరాలుగా భారతీయ విలువలు, సంస్కృతి, నడవడికలో నిష్ణాతులైన విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించిన నాటి నుండి, గ్రామీణ భారత్‌ను చైతన్యపరచడానికి విద్యే అత్యంత ప్రభావవంతమైన మార్గమని గుర్తించింది. సేవ, సంస్కారం ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలను చైతన్య పరచాలని నిర్ణయించుకుంది. విద్యా భారతి సంస్థలు, ముఖ్యంగా సరస్వతీ శిశుమందిరాలు, విద్యా మందిరాలు, సరైన ప్రభుత్వ పాఠశాలలు లేని ప్రాంతాలలోని లోపాలను సరిచేస్తూ, తక్కువ ఖర్చుతో కూడిన, సమాజ ఆధారిత విద్యను అందించాయి. విశ్వాసం, సేవ ఆధారంగా గ్రామీణ భారత్‌లో ఒక సామాజిక, సాంస్కృతిక ఉనికిని పెంపొందించింది. విద్యాభారతి, సాంస్కృతిక విలువలను సమకాలీన విద్యతో మేళవించడానికి కట్టుబడి ఉన్న, భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వేతర పాఠశాలల నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఉంది.
ఇది 1977లో అధికారికంగా ఏర్పడి నప్పటికీ, దీని కార్యకలాపాలు 1952లో ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో మొదటి సరస్వతీ శిశుమందిరం స్థాపనతో ప్రారంభ మయ్యాయి. విద్యా భారతి “వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం” అనే ఆరెస్సెస్ సిద్ధాంతానికి ఒక నిదర్శనం. విద్యాభారతి అఖిల్ భారతీయ శిక్షా సంస్థాన్ – (వీబీఏబీఎస్ఎస్) సంస్థాగత ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంది. ఇది మేధోపరంగా నిష్ణాతులుగా, నైతికంగా దృఢంగా, ఆధ్యాత్మికంగా ప్రబుద్ధులైన విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలను పర్యవేక్షిస్తుంది. విద్యాభారతి విద్య “భారతీయీకరణ, జాతీయీకరణ, ఆధ్యాత్మికీకరణ”ను ప్రోత్సహిస్తుంది. 2024-25 నాటికి 12,000కు పైగా విద్యాసంస్థలతో, 35 లక్షలకు పైగా విద్యార్థు లకు సేవలందిస్తున్న ఇది, భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ పాఠశాలల నెట్‌వర్క్‌లలో ఒకటి.
విద్యాభారతి పాఠశాలల సహకారం
విద్యాభారతి పాఠశాలలు విద్యాబోధన, భారతీయ విలువల సమ్మేళనానికి ప్రసిద్ధి చెందాయి. పాఠ్యప్రణాళికలో రోజువారీ ప్రార్థనలు, దేశభక్తి గీతాలు, యోగా, సంస్కృత బోధన, నిజాయితీ, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతపై దృష్టి సారించిన నైతిక విద్య ఉంటాయి. భారతీయ సంస్కృతి, వారసత్వం పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి సాంప్రదాయ పండుగలను జరుపుకుంటారు. ఈ విద్యా వ్యవస్థ సాంస్కృతికంగా దృఢమైన యువతను తీర్చిదిద్దింది. అలాంటి యువత సామాజిక సేవల ద్వారా ఆరఎసఎస్‌తో తన అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విధంగా, విద్యాభారతి ఆరఎసఎస్ పట్టణ మేధో పునాదికి, గ్రామీణ సమాజానికి మధ్య వారధిగా పనిచేస్తూ, పాఠశాల విద్యలో జాతీయ చైతన్యాన్ని పెంపొందిస్తుంది. అదేవిధంగా, గిరిజన వర్గాలతో విద్యాభారతి అనుబంధం ఏకల్ విద్యాలయాలు (ఒకే ఉపాధ్యాయుడు ఉండే పాఠశాలలు), సంస్కార కేంద్రాల ద్వారా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లోని మారుమూల, అటవీ ప్రాంతాలకు విస్తరించింది. ఈ సంస్థలు అక్షరాస్యత, ప్రాథమిక విద్యను అందించడంతో పాటు, స్థానిక ఆచారాలను పరిరక్షిస్తూ జాతీయ సమైక్యతను పెంపొందిస్తాయి. ఈ విస్తరణ కార్యక్రమం ఆర్ఎస్ఎస్ సామాజిక పునాదిని పట్టణ మధ్యతరగతి నుండి గ్రామీణ, గిరిజన జనాభా వరకు విస్తరించింది.
![]() |
| Vidya Bharati |
గతంలో ఏకాంతంగా ఉన్న వర్గాలను విస్తృత సాంస్కృతిక, జాతీయ సందర్భానికి అనుసంధానించింది. విద్యాభారతి నుంచి వచ్చిన అనేక మంది గ్రాడ్యుయేట్లు ,స్థానిక వాలంటీర్లు సేవాభారతి, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం, గ్రామ వికాస్ కార్యక్రమాల వంటి ఆరఎసఎస్-ప్రేరేపిత కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నారు. తద్వారా స్వీయ అస్త్తిత్వంతో కూడుకున్న సామాజిక నాయకత్వ ఆవృతాన్ని స్థాపిస్తున్నారు. ఈ అనేక కార్యక్రమాలు ఆరఎసఎస్‌ను గ్రామ అభివృద్ధి, స్వయం సమృద్ధి, నైతిక జీవనానికి అంకితమైన క్షేత్రస్థాయి సంస్థగా నిలబెట్టాయి. ఇటీవల భారత ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల భాగస్వామ్యంతో కొత్తగా 100 సైనిక్ పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ చర్యలో భాగంగా, ఏడు (07) విద్యాభారతి పాఠశాలలను సైనిక్ పాఠశాలలుగా మార్చడానికి ఎంపిక చేశారు.
దేశ పునః నిర్మాణంలో విద్యాభారతి పాఠశాలల పాత్ర
విద్యాభారతి పాఠశాలలు విద్యాపరమైన కఠినత్వం, సాంస్కృతిక వారసత్వం , నైతిక సూత్రాల కలయిక ద్వారా విద్యార్థులను తీర్చిదిద్ది, భారత దేశ పునఃనిర్మాణానికి గణనీయంగా దోహదపడతున్నాయి. విద్యాభారతి, సరస్వతీ శిశు మందిరాలు, సంస్కార కేంద్రాలు వంటి సంస్థల ద్వారా మేధస్సును, వ్యక్తి నిర్మాణాన్ని పెంపొందించే సంపూర్ణ విద్యను ప్రోత్సహిస్తుంది. ఈ సంస్థలు నిత్య ప్రార్థనలు, యోగా, సంస్కృత విద్య, ప్రాచీన పండుగల స్మరణ ద్వారా భారతీయ సంస్కారాలను (ఆదర్శాలను) ప్రచారం చేస్తూ, విద్యార్థులలో ప్రగాఢమైన దేశభక్తి, క్రమశిక్షణ భావనను పెంపొందిస్తున్నాయి. ఇవి సమకాలీన పాఠశాల విద్యతో పాటు, సేవ, స్వయం సమృద్ధి, సామూహిక శ్రేయస్సు వంటి సూత్రాలను ప్రోత్సహిస్తూ, యువతను సామాజిక సేవల్లో చురుకుగా పాల్గొనేలా ప్రేరేపిస్తున్నాయి. విద్యా భారతి తన పరిధిని మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తూ, ప్రభుత్వ వనరుల కొరత ఉన్న ప్రదేశాలలో నాణ్యమైన విద్యను అందిస్తుంది. గిరిజన, అణగారిన వర్గాలను శక్తిమంతం చేయడం ద్వారా, ఇది జాతీయ అభివృద్ధికి అవసరమైన సామాజిక ఐక్యతను, సమ్మిళిత వృద్ధిని పెంపొందిస్తుంది. స్వయం సేవకులుగా శిక్షణ పొందిన విద్యావేత్తలు, వాలంటీర్లు, పౌర కర్తవ్యాన్ని, జాతీయ చైతన్యాన్ని పెంపొందించే నైతిక నమూనాలుగా నిలుస్తున్నారు. తత్ఫలితంగా, విద్యాభారతి పాఠశాలలు దేశాభివృద్ధికి అంకితమైన బాధ్యతా యుతమైన, సాంస్కృతికంగా పరిణతి చెందిన పౌరులను తీర్చిదిద్దుతున్నాయి.
For more details Contact :
Address:
- Sri Saraswathi Vidyapeetham
- Khairtabad, 6-3-597/A/7,
- Venkataramana Nagar,
- Hyderabad-04
- phone - 04023316084
- Website: www.ssvptelangana.in



