![]() |
| "Mata Revati Bai Sanskaram Kendra" |
ఆరెస్సెస్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలో విద్యాభారతి మాతా రేవతి బాయి సంస్కార కేంద్రాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని శ్యామ్ నగర్ ప్రాంతంలో ఈ సంస్కారం కేంద్రం ప్రారంభమైంది. ఆరెస్సెస్ సంస్థాపకులు డా. కేశవ బలిరాం హెడ్గేవార్ తల్లి మాతా రేవతి బాయి గౌరవార్థం ఈ సంస్కార కేంద్రానికి ఆ పేరు పెట్టారు.
ఢిల్లీ ప్రాంత కార్యకవాహ అనిల్ గుప్తా, ఇతర అతిథులు జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నరేంద్ర నాథ్ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు పురుషోత్తం ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రాంత కార్యవాహ అనిల్ గుప్తా మాట్లాడుతూ సంస్కార కేంద్రాలు కేవలం విద్యా కేంద్రాలు మాత్రమే కావని, పిల్లలలో భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, దేశభక్తి, సామాజిక సామరస్యాన్ని పెంపొందించేందుకు అంకితమైన సంస్థలని అన్నారు. 'ఓం' యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, ఉన్నతమైన విలువలు కలిగిన పిల్లలే బలమైన సమాజానికి, సంపన్న దేశానికి పునాది అవుతారని ఆయన పేర్కొన్నారు. తాను కూడా విద్యాభారతి పూర్వ విద్యార్థినేనని తెలిపారు.
రాజౌరి గార్డెన్‌కు చెందిన సరస్వతి బాల్ మందిర్ ఏర్పాటు చేసిన 6వ సంస్కార కేంద్రం ఇదని, పశ్చిమి విభాగంలో ఇది 29వ కేంద్రం అని, విద్యాభారతి ఢిల్లీ ప్రాంత్కు చెందిన 122వ సంస్కార కేంద్రం ఇదని ప్రాంత్ సంయోజక్ నరేంద్ర దత్ తెలిపారు. పిల్లల్లో భారతీయ సాంస్కృతిక విలువలు, దేశభక్తి, సామాజిక సామరస్యం మరియు వ్యక్తిత్వ నిర్మాణాన్ని పెంపొందించడమే ఈ కేంద్రాల ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ సందర్భంగా బాల పుస్తకాలయం (చిన్నారుల గ్రంథాలయం), స్వాధ్యాయ యోజన (స్వయం అధ్యయన చొరవ)లను కూడా ప్రారంభించారు మరియు విద్యార్థులకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు.
సంస్కార కేంద్రం విద్యార్థులు దేశభక్తి గీతాలు, సంస్కార గీతాలు, కవితా ప్రదర్శనలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు, ఇది వారిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ సాంస్కృతిక విలువలను ప్రతిబింబించింది.కార్యక్రమాన్ని ప్రాంత్ సేవా శిక్షా ప్రభారి శ్రీ ఓంశరణ్ శ్రీవాస్తవ నిర్వహించారు ధన్యవాద సమర్పణ, రాష్ట్రీయ గీతాలాపనతో వేడుక ముగిసింది.

