రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ని ఒక స్వచ్ఛంద సంస్థగా రిజిస్టర్ చేయాలని, ఆ సంస్థని వ్యతిరేకించే పలువురు విమర్శకులు ఇటీవలి సంవత్సరాలలో వాదిస్తూ వస్తున్నారు. ఆర్ఎస్ఎస్ (RSS) చట్టపరమైన నిబంధనలతో నిమిత్తం లేకుండా, అన్నింటికీ అతీతమైన ఒక శూన్యంలో ఉన్నదనీ, ఆ సంస్థ ఉపయోగించే నిధుల విషయంలో పారదర్శకత లేదనీ భావిస్తూ ఈ డిమాండ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.
RSS చట్టపరమైన చరిత్ర
అయితే, ఆర్ఎస్ఎస్ చట్టపరమైన గుర్తింపు, పన్ను చెల్లింపుకి సంబంధించిన న్యాయపరమైన చరిత్రను పరిశీలిస్తే, ఆ సంస్థ చట్టబద్ధతకు, స్వచ్ఛంద సంస్థ (NGO)గా దాని రిజిస్ట్రేషన్ హోదాకు ఎలాంటి సంబంధం లేదని చట్టపరమైన తీర్పులు (precedents) స్పష్టం చేస్తున్నాయి. ఈ తీర్పులు ఆర్ఎస్ఎస్కు లభించే నిధుల వనరు అయిన 'గురు దక్షిణ'ను ఏ విధంగా పరిగణించాలనే అంశాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాయి.
ఆర్ఎస్ఎస్ (RSS) తన సేవా విస్తరణ కార్యక్రమాలలో ఎక్కువ భాగాన్ని ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు ఎన్జీఓలుగా నమోదైన అనేక అనుబంధ సంస్థల ద్వారా నిర్వహిస్తుంది. ప్రతిరోజూ నిర్వహించే 'శాఖ' ఆర్ఎస్ఎస్ కి ప్రధానమైన అంతర్గత కార్యక్రమం, ఈ శాఖల నిర్వహణకు అవసరమైన నిధులను స్వయంసేవకులు స్వచ్ఛంద ప్రాతిపదికన ఏడాదికి ఒకసారి 'గురు దక్షిణ' రూపంలో సమర్పిస్తారు.
ఆర్ఎస్ఎస్పై ఇప్పటివరకు మూడుసార్లు 1948, 1975 1992 సంవత్సరాలలో నిషేధం విధించారు: కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలే అన్ని సార్లూ ఈ నిషేధాలు విధించాయి.ఇలాంటి చర్యలు తీసుకునే ఏ ప్రభుత్వమైనా చేయవలసిన మొదటి పని, ఆ సంస్థ చట్టపరమైన హోదాను క్షుణ్ణంగా పరిశీలించడం అనేది హేతుబద్ధంగా కనీసం ఆశించే విషయం. అంతేకాకుండా, భారతీయ న్యాయస్థానాలలో ఆర్ఎస్ఎస్ (RSS) ఒక పక్షంగా వందలాది కేసులు కూడా నడిచాయి.
అయినప్పటికీ, ఏ ప్రభుత్వం, ఏ న్యాయస్థానం ఆర్ఎస్ఎస్ చట్టపరమైన హోదాను ఎన్నడూ ప్రశ్నించలేదు, అలాగే ఒక స్వచ్ఛంద సంస్థగా నమోదు చేసుకోవాలని కూడా ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం 1948-49 లో వ్యవస్థాగతంగా ఒక్క నిబంధనను మాత్రమే విధించింది. ఆర్ఎస్ఎస్ను లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని సూచించగా, సంస్థ ఆ నిబంధనను యథావిధిగా అమలు చేసింది.
స్వచ్ఛంద సంస్థలకు రాజ్యాంగ ప్రాతిపదిక
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)(c) ప్రకారం, పౌరులందరికీ సంఘాలు, యూనియన్లు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే ప్రాథమిక హక్కు ఉంది. అయితే సమాజం కోసం పనిచేసే ప్రతి సంస్థ కూడా ఒక స్వచ్ఛంద సంస్థ)గా నమోదు చేసుకోవడం తప్పనిసరి ఏమీ కాదు. భారతీయ తీర్పు సంఘాలు ఆర్ఎస్ఎస్ ను చట్టబద్ధమైన 'బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్' (BOI - వ్యక్తుల సమూహం)గా ఎప్పటి నుంచో పరిగణిస్తున్నాయి. భారతీయ పన్ను చట్టం ప్రకారం, స్వచ్ఛంద సంస్థల కోసం రెండు వేర్వేరు విభాగాలు ఉన్నాయి: ఒకటి 'అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్' (AOP), మరొకటి 'బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్' (BOI). ఒక AOP సాధారణంగా NGOగా నమోదు చేసుకోవచ్చు, కానీ ఒక BOI చట్టబద్ధంగా ఉనికిలో ఉండటానికి అటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
చారిత్రాత్మక గురుదక్షిణ కేసు
గత దశాబ్దాల కాలంలో, ఆదాయపు పన్ను శాఖ, వివిధ న్యాయ వేదికలు ఆర్ఎస్ఎస్ చట్టపరమైన స్వరూపాన్ని, దాని ఆర్థిక నమూనాను ప్రత్యేకంగా పరిశీలించాయి. ఈ నేపథ్యంలో, సంస్థ చట్టపరమైన హోదా, దానికి నిధులు సమకూరే విధానం రెండింటిపై 'కమిషనర్ ఆఫ్ ఇన్కమ్-టాక్స్ వర్సెస్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (1994)' కేసులో వెలువడిన చారిత్రాత్మకమైన తీర్ప, పూర్తి స్పష్టతను ఇస్తుంది.
ఈ కేసు నేరుగా 'గురుదక్షిణ'పై పన్ను విధింపునకు సంబంధించినది. 1967-68 నుండి 1975-76 మదింపు సంవత్సరాలలో (అసెస్మెంట్ ఇయర్స్) సేకరించిన గురుదక్షిణపై ఆదాయపు పన్ను విధించాలని ఆదాయపు పన్ను శాఖ ప్రయత్నించింది. ఈ నిధులు వార్షిక ఉత్సవాల సందర్భంగా ఆర్ఎస్ఎస్ సభ్యులు అంటే స్వయంసేవకులు స్వచ్ఛందంగా సమర్పించిన ఆర్థిక విరాళాల రూపంలో ఉన్నాయి.
విరాళాలు ఇచ్చిన వ్యక్తుల పేర్లు, చిరునామాలను అకౌంటింగ్ రికార్డులలో అధికారికంగా నమోదు చేయనందున లేదా వాటితో లింక్ చేయనందున, ఈ ఆదాయాన్ని 'అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్' (AOP) లేదా 'బాడీ ఆఫ్ INDIVIDUALS' (BOI) కింద పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణించాలని ఆదాయపు పన్ను శాఖ వాదించింది. అయితే, ఆర్ఎస్ఎస్ (RSS) ఈ వాదనను సవాలు చేసింది. ఒక పరస్పర అవగాహన గల సంస్థ (మ్యూచువల్ ఆర్గనైజేషన్) పరిధిలో స్వచ్ఛందంగా సేకరించిన విరాళాలు కాబట్టి, తమ గురుదక్షిణ నిధులకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉండాలని ఆర్ఎస్ఎస్ వాదించింది.
ఈ వివాదం బొంబాయ్, పట్నా లోని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునళ్ల (ITAT) ద్వారా చివరకు పట్నా హైకోర్టుకు చేరింది. అక్కడ హైకోర్టు RSSకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పు ప్రధానంగా 1978 డిసెంబర్ 19 నాటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సర్క్యులర్ లో అంశాలు ప్రాతిపదికగా వెలువడింది. "రెస్పాండెంట్-అస్సెస్సీ అంటే పన్ను చెల్లింపుదారు తన సభ్యుల నుండి పొందిన గురుదక్షిణకు, పరస్పర సూత్రం (principle of mutuality) ఆధారంగా పన్ను నుండి మినహాయింపు పొందవచ్చు,” అని ఆ సర్క్యులర్ లో పేర్కొన్నారు. ఈ సర్క్యులర్లో పేర్కొన్న "రెస్పాండెంట్-
అస్సెస్సీ" మరెవరో కాదు, ఆర్ఎస్ఎస్ (RSS).
ఈ నేపథ్యంలో హైకోర్టు పరిశీలనకు వచ్చిన ప్రశ్నలు ఏమిటంటే:
(i) ఈ కేసుకి సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులలో ఆర్ఎస్ఎస్ (RSS)లో పరస్పర సూత్రం (principle of mutuality) ఉన్న విషయం స్పష్టంగా ఉందా? (ii) ఈ కేసు వాస్తవాలు, నేపథ్యం పరిశీలించిన ఆధారంగా, సభ్యులు భక్తుల నుండి వచ్చిన మొత్తాన్ని 'గురుదక్షిణ'గా పరిగణించి, దానికి పన్ను మినహాయింపు ఇవ్వవచ్చా?"
గతంలో వెలువడిన సంబంధిత తీర్పులను సమీక్షించి, ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత, న్యాయస్థానం ఇలా తీర్పునిచ్చింది:
"మాకు సమర్పించిన మొదటి ప్రశ్న (i) కి మేము అవుననే సమాధానం ఇస్తున్నాము, ఇది ఆదాయపు పన్ను శాఖకు వ్యతిరేకంగా పన్ను చెల్లింపుదారునికి (అస్సెస్సీ) అనుకూలంగా ఇస్తున్న సమాధానం. ఇక రెండవ ప్రశ్న (ii) లో ఉన్న 'భక్తులు' (devotees) అనే పదాన్ని తొలగించి, ఆ ప్రశ్నను ఈ క్రింది విధంగా సవరిస్తున్నాము: 'ఈ కేసుకి సంబంధించిన వాస్తవాలు నేపథ్యం ఆధారంగా, సభ్యుల నుండి వచ్చిన మొత్తాన్ని గురుదక్షిణగా పరిగణించి, దానికి పన్ను మినహాయింపు ఇవ్వవచ్చా?' అలా సవరించిన రెండవ ప్రశ్న (ii) కి కూడా మేము అవుననే సమాధానం ఇస్తున్నాము, ఈ సమాధానం పన్ను చెల్లింపుదారునికి అనుకూలంగా ఆదాయపు పన్ను శాఖకు వ్యతిరేకంగా ఇస్తున్నాం."
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT), పట్నా హైకోర్టు రెండూ వర్తింపచేసిన ఈ 'పరస్పర సూత్రం' (Principle of Mutuality) అనేది చట్టంలో విదితమైన న్యాయ సిద్ధాంతం. ఈ సూత్రం ప్రకారం, ఒక నిర్దిష్ట సమూహానికి చెందిన వ్యక్తులు తమ సొంత, ఉమ్మడి, వాణిజ్యేతర అవసరాల కోసం వనరులను (నిధులను) సమకూర్చుకున్నప్పుడు.. వారు ప్రజల నుండి వాణిజ్యపరమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్న వ్యాపార సంస్థప విధించినట్లుగా వారిపై పన్ను విధించడం కుదరదు.
ఈ న్యాయ సిద్ధాంతం, విరాళాలు ఇచ్చేవారు, ఆ నిధుల ద్వారా లబ్ధి పొందే వారు ఇద్దరూ ఒకే సమూహానికి చెందినవారని గుర్తిస్తుంది; అందువల్ల, అటువంటి అంతర్గత విరాళాల నుండి పన్ను విధించదగిన 'లాభం' ఏదీ కూడా సంస్థకి చేకూరదు.
ఈ తీర్పు ఏం స్పష్టం చేస్తోంది? (What the Judgment Establishes)
ఈ పరస్పర సూత్రాన్ని (Principle of Mutuality) వర్తింపజేయడం ద్వారా ఆర్ఎస్ఎస్ (RSS) చట్టబద్ధమైన గుర్తింపు పొందిన సంస్థ అని, అలాగే దాని ఆర్థిక వనరుల సమీకరణ మొదలైనవి అనియంత్రిత కార్యకలాపాలు కావని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కేసుకు సంబంధించిన న్యాయశాస్త్రం (jurisprudence) ప్రకారం.. ఆర్ఎస్ఎస్ అనేది చట్టపరంగా ఒక పరస్పర అవగాహనతో కూడిన, స్వయం సమృద్ధి గల వ్యవస్థగా గుర్తింపు పొందింది. దీని చట్టపరమైన ఉనికి ఒక ఎన్జీఓగా రిజిస్ట్రేషన్ పొందడంపై ఆధారపడి లేదు అన్నది స్పష్టంగా తెలుస్తోంది
ఈ తీర్పు పర్యవసానం - ఒక ఎన్జీఓగా నమోదు చేసుకోవడం అనే అంశం వేరు, చట్టబద్ధమైన గుర్తింపును కలిగి ఉండటం అనే అంశం వేరు, ఈ రెండూ పూర్తిగా భిన్నమైన విషయాలు అనేది నిర్వివాదంగా స్పష్టమైంది. న్యాయస్థానాలు, పన్నుల శాఖ అధికారులు చట్టబద్ధత అనే రెండవ అంశాన్ని చట్టపరమైన చట్రంలోనే పదేపదే పరిశీలించి, ధృవీకరించారు.
( అరుణ్ ఆనంద్ ఆర్ఎస్ఎస్ (RSS) పై రెండు పుస్తకాలు రచించారు. ఆయన ఎక్స్ హ్యాండిల్: @ArunAnandLive.)
ఈ వ్యాసంలో వ్యక్తం చేసిన అంశాలు రచయిత వ్యక్తిగతమైన అభిప్రాయాలు. ఇవి ఈ పత్రిక వైఖరిని ప్రతిఫలించవు.

.gif)