ఆర్ఎస్ఎస్ సేవాదృష్టి - RSS Seva Drushti

ఆర్ఎస్ఎస్ సేవాదృష్టి - RSS Seva Drushti
ఆర్ఎస్ఎస్ సేవాదృష్టి - RSS Seva Drushti

ఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
ప్రపంచంలోని ఏమూలన ఉన్న ఏ హిందువుకు గాయం అయినా అది మనందరికీ గాయమే అనే భావన ఉత్సన్నమైతేనే మనం హిందువులము అని స్వామివివేకానంద అంటారు. 
పండిట్ దీనదయాళ్ జీ
పండిట్ దీనదయాళ్ జీ
  చివరి పంక్తిలో ఉన్న చిట్టచివరి వ్యక్తికి కూడా మేము సేవ చేస్తాము అని పండిట్ దీనదయాళ్ జీ అంటారు. ఈ భావనతోనే డాక్టర్ హెడ్లేవార్జీ జ్ఞాపకార్థం వారి జన్మశతాబ్ది సందర్భంగా సమాజంలోని ఉపేక్షిత, అట్టడుగు, బలహీన అస్పృశ్య వర్గాల మధ్య విస్తృతంగా సేవాకార్యక్రమాలు చేపట్టాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. 
   స్వాతంత్య్రం లభించిన ఇన్నాళ్ళ తర్వాత కూడా మన రక్తంలో రక్తం కండలో కండగా ఉన్నసుమారు 30-35 కోట్ల జనాభాగల ఒక పేదవర్గము బలహీనులుగా, దరిద్రులుగా ఉన్నారు. నిరక్షరాస్యులుగా సమాజం నుండి విడిగా జీవిస్తున్నారు. దురదృష్టవశాత్తు వారిలో కొందరు మతమార్పిడికి గురై విజాతీయులయ్యారు. ఇలాంటి బలహీన వర్గాలలో నిస్వార్ధసేవ చేయడం మన లక్ష్యం. అనేక కారణాలవల్ల శాఖల మాధ్యమంగా మనం వారివద్దకు వెళ్ళలేకపోయాము.

   సేవ అనేది వారితో కలవడానికి ఒకసాధనం. అలాగే వారిమధ్యకు వెళ్లడానికి ప్రవేశ బిందువు (Entry point) కూడా శాఖలోని వివిధ కార్యక్రమాలద్వారా ప్రతి కుటుంబాన్ని కలుస్తూ, సన్నిహిత సంబంధం నెరపాలని ఆశిస్తున్న విధంగానే అనేక సేవాకార్యక్రమాలను సాధనంగా చేసుకొని ఆ బలహీనవర్గాల కుటుంబాల దగ్గరకు మనం వెళ్లి కలవాలి. మనం వారిని విద్యావంతులుగా చేద్దాం. వారిలో సంస్కారాలను నింపి ఉపాధి కొరకు శిక్షణనిద్దాం. ఇలా వివిధ రకాలుగా దృశ్యమానమయ్యే సేవలు అందించాలి. అయితే ఇవే మన అంతిమ లక్ష్యం కాదు. మనం సేవనుదాటి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళాలి.

ఇదీ చదవండి: 
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:
➣ నాల్గవ భాగంఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
➣ ఎనిమిదవ భాగంసంఘ సేవా భావన నిర్మాణం

{full_page}
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top