సామాజిక పరివర్తన - సంఘం సేవాలక్ష్యము - Social Transformation - The goal of RSS community service

సామాజిక పరివర్తన - సంఘం సేవాలక్ష్యము - Social Transformation - The goal of RSS community service
సామాజిక పరివర్తన - సంఘం సేవాలక్ష్యము

మార్గదర్శనం: కీ.శే. కృ.సూర్యనారాయణరావు

సామాజిక పరివర్తన - సంఘం సేవాలక్ష్యము
నదృష్టి కేవలం సేవ వరకే పరిమితం కాదు. సేవా కార్యక్రమాల ద్వారా వారికి లాభమైతే కలుగుతుంది. కాని సేవయే చివరిది కాదు. సేవకంటే కూడా ముందుకు అడుగులు వేయాల్సి ఉంది. ఇదే మన ప్రత్యేకత. డాక్టర్జీ ఆలోచన ప్రకారం ప్రతి వ్యక్తి దేశభక్తుడు కావాలి. పేదవాడు చదువురానివాడు కూడా దేశభక్తుడు కాగలడు. ఉపేక్షిత బలహీన వర్గాలలోని వారి శక్తిని, సామర్థ్యాన్ని ఈ దిశలో వికసింపజేయడం మనలక్ష్యం. గౌరవప్రదమైన పరంపర కలిగిన ఎంతో గొప్పదైన మనదేశం గురించిన సరైన అవగాహనతో సమాజం కొరకు పనిచేయాలనే భావనను ఇలాంటివారిలో నిర్మాణం చేయాలనేది డాక్టర్లీ ఆలోచన. ఏ సమాజం నుంచైతే తాను స్వీకరిస్తున్నాడో ఆ సమాజానికి తాను తప్పక కొంత తిరిగి ఇవ్వాలి అనే భావనను అతనిలో మేల్కొల్పడాన్ని సేవా కార్యక్రమాల ద్వారా మనం సాధించాలి.

నేను బెంగళూరువద్ద ఉన్న ఒక అనాథ శరణాలయం చూడడానికి వెళ్ళాను. దాని వ్యవస్థాపకులు తమ అనాథశరణాలయంలో శిక్షణ పొంది జీవితంలో ఉన్నత పదవులకు చేరుకున్న బాలుర పట్టికను ఎంతో గర్వంగా చూపించారు. నేను వారిని ప్రశంసిస్తూ “మీరు ఏపిల్లలకైతే సేవచేసి వారికి ఒక సుఖవంతమైన జీవితంలో స్థిరపరిచారో వారు తిరిగి ఈ అనాథాలయానికి ఉపయోగపడుతున్నారా? అని ప్రశ్నించాను. “వారెవరూ ఆవిధంగా ఉపయోగపడడం లేదని వ్యవస్థాపకుడు చెప్పాడు. “ఏ ఆశ్రయంలో వారు పెద్దవారై ఉన్నత పదవులు చేపట్టారో,వారు వారి మాదిరిగా ఇక్కడకు అనాథలుగా వస్తున్న వారికొరకు ఏమైనా చెయ్యాలనే భావన మీరు కలిగిస్తున్నారా?” అని అడిగినప్పుడు “మేము ఆలోచించలేదు” అని ఆ వ్యవస్థాపకుడు చెప్పాడు. కాగా సంఘం యొక్క సేవా కార్యక్రమాల వెనక సామాజిక బాధ్యత అనే భావనని మేల్కొల్పడం దాగిఉంది. 
   మనకు సేవవల్ల సామాజికంగా లాభం కలుగుతున్నప్పుడు ఇతరులకు సేవచేయడం మన కర్తవ్యం. ప్రభుత్వ ప్రణాళికలద్వారా జరిగే సేవా ప్రకలపాలలో మనుషులకు కేవలం ఎల్లప్పుడు
తీసుకోవాలనే భావనయే ఉంటుంది. దానికి భిన్నంగా సమాజం కొరకు ఏమైనా చేయాలి అనే భావనను వారిలో మనం కలిగించాలి. ప్రయోజనం పొందుతున్నవారిలో వ్యక్తిగత జీవన
వికాసంతోపాటు సామాజిక భావనను మేల్కొల్పడం కూడా మనలక్ష్యం.

ఇదీ చదవండి: 
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:
➣ నాల్గవ భాగంఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
➣ ఎనిమిదవ భాగంసంఘ సేవా భావన నిర్మాణం

{full_page}
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top