సేవ - డాక్టర్ జీ ఆలోచన: Dr. Hedgewar's selfless service thought's

సేవ - డాక్టర్ జీ ఆలోచన
సేవ - డాక్టర్ జీ ఆలోచన

మార్గదర్శనం: కీ.శే. కృ.సూర్యనారాయణరావు
డాక్టర్ జీ ఆలోచన:
  20వ శతాబ్దం ప్రారంభంలో డాక్టర్ హెడ్లేవార్ హిందూ సమాజ సంఘటన గురించి ఆలోచించారు. హిందూరాష్ట్రం పున:ప్రతిష్ఠయే వారి జీవనలక్ష్యంగా ఉండేది. అనేక సంవత్సరాలుగా భారతదేశం మరియు హిందూ సమాజం ఒకటిగానే ఉండేది అని కూడా డాక్టర్టీ అనుభూతి పొందారు. ఇక్కడి సంస్కృతి, పరంపర, చరిత్ర, జీవన విలువలు ఆదర్శము మరియు ఆకాంక్షలు ప్రజలందరిలో సమానం. అందరూ హిందూసమాజమనే కుటుంబానికి అవయవ స్వరూపులవంటివారే. పేద- ధనిక (చిన్నా- పెద్ద) మరియు ఎక్కువ-తక్కువ, అస్పృశ్యత అనేవి లేవు. మనమంతా ఒకటే అనే ఈ అనుభూతిని కలిగించడం మనపైవున్న గొప్ప బాధ్యత మరియు కర్తవ్యము. ప్రతి ఒక్కరు దేశకార్యములో పాలుపంచుకుంటేనే 'పరమ వైభవం' అనే కల సాకారమవుతుందని డాక్టర్ జీ భావించారు.
   శరీరంలోని రకరకాల అవయవాలు మొత్తం శరీరం కొరకు పనిచేస్తాయి. ప్రతి అవయవము యొక్క ఆరోగ్యము మరియు సమగ్రతల ప్రభావము శరీరమంతటిపైన పడుతుంది. అదేవిధంగా సమాజంలోని ఏ వర్ధమూ బలహీనముగా ఉండరాదు అనే భావన కూడా అవసరం. అందరు ఒకరికొకరు తోడుగా వుండాలి. ఉదా : బృందావనం వెళ్ళి శ్రీకృష్టభగవానుని దర్శనం చేసుకోవాలని మన మనసుకు అనిపించింది, అంతమాత్రాన మనసు దర్శనం చేసుకుంటుందా దర్శనంకొరకు కంద్లు కావాలి, కండ్లు అక్కడకు వెళ్ళగలుగుతాయా? తీసుకొనివెళ్లేవి కాళ్ళు, మరి దర్శనం మనసు మరియు కండ్లు చేసుకుంటాయి కదా!. 'ఆపని మాది కాదు' అని కాళ్ళు అనుకుంటే అక్కడకు వెళ్ళడం సాధ్యమా స్వామి దర్శనం చేసుకోవాలని నా కోరిక, మందిరంలోనికి వెళ్ళిన తర్వాతనే కండ్లు తెరుస్తాను అని కండ్లు అనుకుంటే కాళ్లు అక్కడిదాకా వెళ్లగలవా? దారిలో కాలికి ముల్లు గుచ్చుకుంటే, అప్పుడు 'దర్శనం చేసుకునేవి కండ్లు, తీసుకువెళ్లేవి కాళ్ళు, లాభపడేవారు వారైతే, మధ్యలో నాకేమిటి' అని చేతులు అనుకుంటే ఎలా? కాలిలో ముల్లు గుచ్చుకుంటే చేతులు వెళ్ళి
వెంటనే ముల్లును తీస్తాయి. కాళ్ళలో నొప్పి కలిగితే కండ్లపై కూడా ప్రభావం పడుతుంది. కన్నీళ్ళు కారుతుంటాయి.  అందుకని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండాలి.  ఏ ఒక్క అవయవం నిష్క్రియమైనా అది పక్షవాతంగా మారుతుంది. 

  ఈ మౌలిక ఆలోచనతోనే పూజనీయ డాక్టర్ జీ సంపూర్ణ నమాజాన్ని ఐక్యతా సూత్రముతో బంధించడానికి నిశ్చయించుకొని సంఘ స్థాపన చేశారు. శారీరక, బౌదిక కార్యక్రమాల ద్వారా హిందూ సమాజంలో సంస్కారాలు నింపి విశిష్టమైన మనోభావనలను నిర్మాణం చేశారు. యుద్ద
రంగంలో స్వయంసేవకుల సాహసమును చూసిన సైన్యాధికారులు ప.పూ.గురూజీని 'మీరు స్వయంసేవకులకు ఏమి నేర్పిస్తారు? ఏవిధమైన శిక్షణ యిస్తారు” అని అడిగారు. కబడ్డీ ఆడటం నేర్పుతామని గురూజీ చెప్పారు. అలాగే మోర్వీ ఆనకట్ట తెగినప్పుడు ఊహించని స్థాయిలో వఱదలు రాగా ఆ భయానక పరిస్థితులలో స్వయంసేవకులద్వారా కుళ్ళిన శవాలను తొలగించడాన్ని ప్రశంసిస్తూ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బాబూభాయి పటేల్ గారు ప.పూ. బాలాసాహెబ్ దేవరస్తో 'మీరు వీరికి ఎలాంటి శిక్షణ ఇస్తారు?' అని అడిగారు. వారి సమాధానం కూడా పైవిధంగానే ఉంది. మేము స్వయంసేవకులకు శవాలు మోసే శిక్షణ ఇవ్వము సమాజం అంతా మనది అనే భావనను శాఖలో కార్య క్రమాలద్వారా మేల్కొల్పుతామని దేవరస్ జీ అన్నారు.    శాఖల మాధ్యమంగా హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు అందరూ నా సోదరులే అనే మానసిక భావన నిర్మాణం అవుతుంది. అదేవిధంగా సేవాకార్యక్రమాల ద్వారా కూడా ఇలాంటి మనోభావనను మనం పెంపొందిస్తుంటాము. 

ఇదీ చదవండి: 
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:
➣ నాల్గవ భాగంఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
➣ ఎనిమిదవ భాగంసంఘ సేవా భావన నిర్మాణం

 {full_page}
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top