సేవాకార్యంలో సహనమ్ - Seva - Sahanam

సేవాకార్యంలో సహనమ్ - Seva - Sahanam
సేవాకార్యంలో సహనమ్

మార్గదర్శనం:
కీ.శే. కృ.సూర్యనారాయణరావు

సేవాకార్యంలో సహనము అవసరం
  సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ఎంతో సహనాన్ని కలిగి ఉండాలి. ఇందుకు హృదయాన్ని కరిగించే ఉదాహరణ ఒకటి. సోదరి నివేదిత ఇంగ్లండు దేశపు విద్వాంసురాలు ఒక కళాశాలలో లెక్చరరు, అక్కడి విద్యా కమిటీలో సభ్యురాలు. స్వామివివేకానంద పిలుపుమేరకు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ అయిన ఆ విదేశీవనిత నివేదితగా పేరు మార్చుకొని బారతదేశంలోని పేద ప్రజల కొరకు సేవాకార్యక్రమాలను చేయడానికి సమర్పితమైంది. 
   స్వామీజీ ఆమెకు బెంగాల్లో మహిళావిద్య పని అప్పగించారు. బాలికలను చదివించడం మూఢాచారంగా భావిస్తున్న సమయంలో ఎంతో శ్రమకోర్చి అనేక అవమానాలను సహించి ఆమె అనాథ బాలికల కొరకు ఒక పాఠశాల (అనాథాశ్రమం) నెలకొల్పింది. బ్రిటీష్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం తీసుకోకూడదని నిర్ణయించుకుంది. దేశీయుల నుండే ధనసహాయాన్ని తీసుకొని పాఠశాల నడిపించింది.

  ఒకసారి ఆర్థిక సహాయం గురించి ఒక ధనవంతుని వద్దకు వెళ్ళి, అనాథ బాలికల పోషణ నిమిత్తం సహాయం అడిగింది. అతను ఒప్పుకోలేదు. తిరస్కారభావంతో వెళ్ళిపొమ్మని కూడా అన్నాడు. కాని నివేదిత పేద బాలికల కొరకు అతనిని ప్రార్థించినది. ఆమహాశయుడు కోపోద్రిక్తుడై వివేకాన్ని కోల్పోయి మహిళ అని కూడా ఆలోచించకుండా సోదరి నివేదితను ఒక చెంపదెబ్బ వేసినాడు. అయినా నివేదిత కొంతసేపు మౌనంగా అక్కడే నిలబడింది.
  తిరిగి ఆ పెద్ద మనిషితో మహాశయా! మీరు నాకైతే ఇది ఇచ్చారు. చాలా ఆనందకరమైన విషయం, కానీ ఈ అనాథ బాలికలకొరకు ఏమీ ఇవ్వలేదు; వారికి ఏమైనా ప్రసాదించండని మళ్లీ విన్నవించుకోవడంతో ఆ వ్యక్తి కన్నీటి పర్యంతమై సిగ్గుపడ్డాడు. తరువాత ధనసహాయం కూడా చేశాడు. కార్యముగురించి ఇలాంటి నిష్ఠ, లక్ష్య సాధనకొరకు ఇలాంటి సమర్పణభావన, సహనము ఉండాలి. సేవాకార్యకర్తలు మానావమానాలను జయించి సఫలతపై దృష్టిపెట్టాలి.

ఇదీ చదవండి: 
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:
➣ నాల్గవ భాగంఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
➣ ఎనిమిదవ భాగంసంఘ సేవా భావన నిర్మాణం

{full_page}
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top