సేవాకార్యంలో దయ కంటే కర్తవ్య భావన ఉండాలి - RSS Seva

సేవాకార్యంలో దయ కంటే కర్తవ్య భావన ఉండాలి - RSS Seva
సేవాకార్యంలో దయ

మార్గదర్శనం: కీ.శే. కృ.సూర్యనారాయణరావు

సేవాకార్యంలో దయ కంటే కర్తవ్య భావన ఉండాలి
   సేవా కార్యాన్ని చేసేటప్పుడు పేదవారి పరిస్థితిని చూసి మనసులో తప్పక దయాభావన సహజంగా కలుగుతుంది. కానీ అంతకుమించి వీరందరు మనవారే, అంతా మన అవయవ స్వరూపులే. మన దేహంలోని ఏదేని అవయవం గురించి దయాభావన ఉంటుందా? ఉండదు. అందులో మన కర్తవ్యభావన దాగి ఉంది. వీరందరూ మనవారే అనేదే సేవాభావన. వారంతా పరమాత్మ స్వరూపులే. వారిలోను మనలోను ఒకే దైవాంశ వెలసియున్నది. 
   రామకృష్ణ పరమహంస యొక్క ఉదాహరణ ఈ సందర్భంలో ఎంతో ప్రేరణ దాయకమైంది. ఒకసారి వారు వైష్ణవ భ్తిగీతాన్ని పాడుతున్నారు. అందులో పేదవారిపై దయా, కరుణ కలిగి
.ఉండాలనే భావన వ్యక్తమవుతున్నది. పాట పాడుతూ.. పాడుతూ భావావేశంలో పరమహంస నోటినుండి ఇలా మాటలు వెలువడినవి 'అరే! దయ. కరుణ చూపడానికి నేనెవడిని? వీరందరూ పరమాత్మ స్వరూపులే', ఈ వాక్యము విని శిష్యులమధ్యలో కూర్చునివున్న నరేంద్రుడు (వివేకానందుడు) గంతులు వేస్తూ ఇలా అన్నాడు. 'నాకు జీవితానికి దిశ లభించినది. దరిద్రదేవోభవ, మూర్ఖ దేవోభవ ఇది సేవచేయడానికి తగిన ప్రవృత్తి. మానవసేవయే మాధవసేవ అని వివేకానందుడు ప్రవచించాడు.

ఇదీ చదవండి: 
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:
➣ నాల్గవ భాగంఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
➣ ఎనిమిదవ భాగంసంఘ సేవా భావన నిర్మాణం

{full_page}
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top