లౌకికవాదం అంటే ఇదేనా? - This is what secularism means?

లౌకికవాదం
హాత్మాగాంధి ఖిలాఫత్ ఉద్యమాన్ని ఎందుకు బలపరిచాడు? దీనికి చరిత్రకారులు చాలా వ్యాఖ్యానాలు చెప్పారు. ఇంతకూ ఖిలాఫత్ ఉద్యమం అంటే ఏమిటి? పాశ్చాత్య ప్రపంచాల్లో రాజుకు మత గురువులకు తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. రాజుకు ఉన్నట్లే మతాధిపతులకుకూడా సైన్యం ఉండేది. మతాధిపతులు తమకునచ్చినవారినే రాజుగా నియమించేవారు. ఇక అరబ్బు ప్రపంచంలో ఖలీఫా అనే వ్యక్తి ఏకకాలంలో రాజుగాను మతాధిపతిగానూ ఉండేవాడు. ఖలీఫా తన సామ్రాజ్యవ్యాప్తికోసం కత్తిమీద ఆధారపడేవాడు. ఈనాడు మనం చూస్తున్న ఇస్లామిక్ సామ్రాజ్యాలన్నీ ఇలా దండయాత్రల ద్వారా స్థాపించబడినవే. 1920వ దశకంలో అక్కడ ఎవరిని ఖలిఫాగా నియమించాలనే విషయంలో కల్లోలం చెలరేగింది. ఆ సందర్భంగా భారతదేశంలో మతకల్లోలాలు జరిగాయి. మహాత్మాగాంధీ ఈ ఖలీఫా నియామకానికి సంబంధించిన ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొనాలి అని శాసించాడు. గాంధీగారు ఇలా ఎందుకు చేశాడు? ఇదొక పెద్ద ప్రశ్న. మహమ్మద్ ఆలీ జిన్నా షేక్ ముజిబుర్ రెహమాన్ షౌకత్ ఆలీ వంటి ఆనాటి ముస్లింలీగ్ నాయకులంటే గాంధీగారికి భయం. అందుకని వారికి దాసోహం అన్నాడు అని చరిత్రకారులు వ్యాఖ్యానించారు.

1947లో భారతదేశం ఇండియా పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ అని మూడు ముక్కలు చేయబడింది. అందుకు గాంధీ, నెహ్రూలు ఒప్పుకున్నారు-ఇది కూడా భయం వల్లనే. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ బెదిరింపులకు లొంగిపోతూండేది! మనది సెక్యులర్ దేశం అని సాకు చూపేవారు. 1950లో బి.ఆర్.అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించిప్పుడు అందులో సెక్యులర్ అనే మాటలేదు. శ్రీమతి ఇందిరాగాంధీ 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి బలవంతంగా భారత రాజ్యాంగానికి సవరణలు ప్రతిపాదించి ‘సెక్యులర్’ అనే మాటను చేర్పించింది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ముస్లిములు కమ్యూనిస్టులు సహజమిత్రులు. హిందూ మతద్వేషం అనే పునాదిమీద ఆ పార్టీ నిర్మాణం జరిగింది. అందుకే దేశ విభజనకు సై అన్నారు. ఇండియాలో ఖిలాఫత్ ఉద్యమాన్ని తమ భుజాలకు ఎత్తుకున్నారు. కశ్మీరులోని సగం భాగాన్ని పాకిస్తాన్ బలప్రయోగం ద్వారా ఆక్రమించుకుంటే నెహ్రూ దానిని ఇండియన్ యూనియన్‌లో కలుపలేదు సరికదా ఇండియాకు ఉన్న రాజ్యాంగం కశ్మీరుకు చెల్లదు-కశ్మీరు ముఖ్యమంత్రిని ప్రధాని అని పిలువవచ్చు-అన్నారు. అంతేకాదు ‘ఇండియాలో హిందువుగా పుట్టడంకన్నా గాడిదగా పుట్టడం మంచిది’ అన్నాడు మోతీలాల్ నెహ్రూ. ‘నేను మత విశ్వాసాల దృష్ట్యా ముస్లిమును. దురదృష్టవశాత్తు హిందూ సమాజంలో జన్మించాను’ (బై-యాన్- యాక్సిడెంట్ ఆఫ్ బర్త్) అన్నాడు జవహర్‌లాల్ నెహ్రూ. ఈ విధంగా 20వ శతాబ్దపు కాంగ్రెస్ చరిత్ర ఖలీఫాగారి కోసమూ మహమ్మద్ ఆలీ జిన్నా కోసమో అన్నట్లు సాగింది. ఇవ్వాళ చరిత్రను ఎవరూ మార్చలేరు.

లౌకికవాదం మా లక్ష్యం అని నేడు చెప్పాలనుకునేవారు ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని బహిరంగంగా బలపరుస్తున్నారు. సెక్యులరిజం అనేమాట మతాతీత పాలన అనే అర్థంలో బ్రిటన్‌లో పుట్టింది. దీనికి మతరహిత పాలన అని కమ్యూనిస్టులు భాష్యం చెప్పారు. అరబ్బు దేశాలన్నీ మత రాజ్యాలే. పాకిస్తాన్‌లో ఐఎస్‌ఐ సైనిక మత నియంతృత్వం ఉంది. ‘మాకు ప్రజాస్వామ్యం సరిపడదు’ అని బహిరంగంగా జనరల్ ముషారఫ్ ప్రకటించాడు. ఐనాసరే మతం పుట్టింది ఎందుకు? అంటే పాకిస్తాన్ యొక్క అభ్యుదయం కోసం అన్నారు. కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ మొన్న కరాచీ వెళ్లి ‘మీరూమేమూ కలిసి నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాము రండి’ అని పిలుపునిచ్చాడు. 2014 ఎన్నికలలో సోనియాగాంధీ న్యూఢిల్లీలోని ఇమాం అబ్దుల్లా దగ్గరకు వెళ్లి ‘మీరూమేమూ కలసి బిజెపిని ఓడించాలి. ఎందుకంటే అది మతతత్వ పార్టీ’ అన్నది. అంటే ఏమిటి? ఇటలీలో బాప్టిజం పొంది ఇండియాకు వచ్చిన సోనియా సెక్యులరిస్టు-్ఫత్వాలు జారీ చేసే ఇమాం అబ్దుల్ బుఖారీ సెక్యులరిస్టు. ‘ఇండియన్ కల్చరల్ నేషనలిజం’ (భారత జాతీయ సాంస్కృతిక జాతియవాదం) అనే సిద్ధాంతం మీద పార్టీ నిర్మాణం చేసుకున్న బిజెపి మాత్రం దుర్మార్గురాలు. ఇప్పుడీ సంగతులన్నీ ఎందుకు గుర్తు చేసుకోవలసివచ్చిందంటే గుజరాత్ ఎన్నికల సందర్భంగా గాంధీనగర్‌లోని ఆర్చిబిషప్ ఒక లేఖను విడుదల చేశాడు. అందులో ఆయన ‘భారత జాతీయవాదాన్ని ఓడించండి’ అని ఓటర్లకు పిలుపునిచ్చాడు. ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు చాలా ఉన్నాయి.
సెక్యులర్ దేశంలో ఒక ఆర్చిబిషప్ ఇలా ఆజ్ఞాపత్రం జారీ చేయడం అంటే భారత రాజకీయ వ్యవస్థలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నట్లే అవుతుంది. మరి దీనికి సూడో సెక్యులరిస్టులు ఏం సమాధానం చెబుతారు?
 ఇండియన్ నేషనలిజాన్ని ఓడించండి – అంటే ఇండియా ‘నేషనలిజం’ అనే భావన నిర్మూలింపబడాలి అని చాలాచాలా స్పష్టంగా చెప్పినట్టయింది.
నేషనలిజాన్ని ఓడించండి-కాంగ్రెస్‌ను బలపరచండి అని ఆర్చిబిషప్ కోరాడు. ఈ మాటకు అర్థం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ‘నేషనలిజాన్ని’ ఆమోదించని పార్టీ అని అర్థం. అంటే సోనియాగాంధీ-రాహుల్‌గాంధీలు ఇండియన్ నేషనలిస్టులు కారు-అని స్పష్టంగా చెప్పినట్లయింది. మరి వీరెవరు? నెహ్రూ తాను మత విశ్వాసాల దృష్ట్యా ముస్లిమును అని చెప్పుకున్నాడు.  
ఇందిరాగాంధీ ఫిరోజ్‌గాంధీని వివాహం చేసుకోవడం ద్వారా ‘పార్సీ’ మతస్థురాలయింది. ఆమె కోడలు వాటికన్ పోపుద్వారా ‘మతం’ పుచ్చుకున్న ఇటలీ వనిత. ఆమె అల్లుడు రాబర్ట్ వద్రా. అతని భార్య ప్రియాంక. అంటే నెహ్రూ రాజవంశం ఈ ఏడుతరాలుగా హిందువులు కారు- అని తెలియడం లేదా?
ఆర్షిబిషప్ ప్రచారానికి దీనికి షీలాదీక్షిత్ మనీష్ తివారీ, ఆనంద్‌శర్మ, సుప్రియ చతుర్వేది వంటి ‘సత్’ బ్రాహ్మణులు ఏం సమాధానం చెబుతారు? ముస్లిములు ఫత్వాలు జారీ చేస్తుంటే చర్చి భారత రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటుంటే భారత కమ్యూనిస్టులు ఎందుకు నోరెత్తడం లేదు?? వీరి సెక్యులర్ పాతివ్రత్యం ఇప్పుడు భంగపడుతున్నది కదా! ‘సెక్యులరిజం అంటే రాందేవ్‌బాబా యోగి ఆదిత్యనాథ్ వంటి హిందూ యోగులు భారత రాజకీయ వ్యవస్థలో పాల్గొనకూడదు అని మా భావం. అంతేకాని ఇమాం, బుఖారీలు ఆర్చిబిషప్పులు ఎప్పుడూ సెక్యులరిస్టులే’ అంటున్నాడు కామ్రేడ్ సునీల్‌చోప్రా బహిరంగంగా. ‘కశ్మీరు నుండి ఆరు లక్షల మంది హిందువులు తరిమివేయబడితే వారికి తిరిగి కశ్మీరులో పునరావాసం కల్పించాలి’-అని సెక్యులరిస్టులు కోరరు. మైన్మార్ నుండి తరిమివేయబడిన రెండుకోట్ల మంది ఉగ్రవాదులైన రోహింగ్యాలకు మాత్రం భారతీయ ఆధార్ కార్డులు ఇవ్వాలని వాదిస్తున్నారు. ఇదీ సెక్యులరిజం అంటే!!

‘భారతదేశంలో హిందూ మతాన్ని నాశనం చేయండి-అందరి చేతులలోను బైబిలు పెట్టండి’ అని ప్రొఫెసర్ కంచ ఐలయ్య పుస్తకం వ్రాస్తే ఆయనకు విజయవాడలో మహాఘనత వహించిన మన సెక్యులరిష్టులు సన్మానసభ ఏర్పాటు చేశారు. ‘‘మేము పుట్టింది మైనారిటీల రక్షణ కోసమే’’ అని వేదికలపై రాత్రింబవళ్లు గర్జించే సెక్యులరిస్టులు’’ కశ్మీరులో మణిపూర్‌లో నాగాలాండ్ అరుణాచల్‌ప్రదేశ్‌లలో హిందువులు మైనారిటీలో ఉన్నా వారికి రిజర్వేషన్లు వర్తింపచేయండి అని ప్రశ్నింకండి- ‘మైనారిటీలు అంటే మా దృష్టిలో ముస్లిములు మాత్రమే’’ అంటున్నారు. కేరళలో ముస్లిములు క్రైస్తవులు కమ్యూనిస్టు మతం పుచ్చుకున్నవారిని కలిపిచూస్తే హిందువులు మైనారిటీలో ఉన్నారు. మరి వారికి మైనారిటీ రిజర్వేషన్లు వర్తించవా? దేశంలోని సెక్యులరిస్టులు లోకవంచన, ఆత్మవంచన చేసుకుంటున్నారు. శ్రీమతి షబ్నం లోనీ రాత్రింబవళ్లు ఇండియాను ఇండియన్ నేషనలిజాన్ని తిట్టిపోస్తున్నది. ఈమె ఢిల్లీలో న్యాయవాద వృత్తిలో ఉంది. మరి ఈమె పాకిస్తాన్‌లో ‘‘ఇంత’’ సురక్షితంగా జీవించగలదా?? సెక్యులర్ పీఠాధిపతి ఏచూరి సీతారాం కరాచీలో తన పార్టీ కార్యాలయం తెరువగలడా?? పాకిస్తాన్ వెళ్లి ‘మీ మతరాజ్యం (తియోక్రటిక్ స్టేట్) నశించాలి’ అని నినాదం ఇస్తే బహిరంగంగా నడివీధిలో ఉరి తీస్తారు. ఇండియాలో ఉంటూ హిందువులు నశించాలి అని కమలహసన్‌లు కంచ ఐలయ్యలు కామ్రేడ్ కరాత్‌లు నిరభ్యంతరంగా తిట్టవచ్చు. మహారాణి పద్మావతి అల్లాఉద్దీన్ ఖిల్జీతో జుగల్‌బందీ నృత్యం చేసింది-అని సినిమాలు తీయవచ్చు. ఎందుకంటే ఇది ‘ఆర్టిస్టిక్ లైసెన్సు’ కిందికి వస్తుంది. పైగా అల్లాఉద్దీన్ ఖిల్జీ-ఔరంగజేబు నాదిర్షా మాలిక్ కాఫర్, అక్బరు, టిప్పుసుల్తాను వీరంతా వీర సెక్యులరిస్టులుకదా!! జోధాబాయిని లవ్‌జిహాదీలు ఎత్తుకుపోతే సెక్యులరిజం. మహారాణి పద్మినికి అల్లాఉద్దీన్ కన్నుకొడితే సెక్యులరిజం! 2014లో నరేంద్రమోదీతో ‘‘కావాలంటే మా ఎఐసిసి కార్యాలయలో గారేజ్‌లో టీ దుకాణం పెట్టుకొని బతుకు. నీవు హిందువువు కాబట్టి రాజ్యాధికారం ఇవ్వము’ అన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ నిజమైన సెక్యులరిస్టు!!

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్ఆం ధ్రభూమి సౌజన్యం తో)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top