"సంఘ కార్యపద్ధతి": డా. మోహన్ భాగవత్ జీ మొదటిరోజు ఉపన్యాసం - Sangh Karyapaddathi

ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్
ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్

సంఘ కార్యపద్ధతి
నేను రెండవ భాగం వైపు మొదట వస్తున్నాను. ఎందుకంటే సంఘ కార్యక్రమాలలో ఒక వ్యక్తి 'సంఘ ఉత్తిష్ఠ' అని ఆజ్ఞ ఇవ్వగానే, అందరూ లేచి నిలబడటం, 'సంపు ఉపవిశ' అనగానే అందరూ కూర్చోవడం చూసి, సంఘం ఒక పెద్ద నిరంకుశత్వంతో కూడిన సంస్థ అని అనుకోవచ్చు. అలాగే సంఘంలో 'సర్ సంఘ చాలక్ 'అనే ఒక వ్యక్తి ఉంటాడు. నేడు బయట వినిపించే పరిభాషలో ఆయనను చీఫ్ అని తప్పుగా వ్యవహరిస్తారు. 'చీఫ్' కాబట్టి ఆయన చెప్పగా అందరూ వింటారు, అన్ని విషయాలు ఆయన ఇష్టప్రకారం జరుగుతాయి అని ప్రజలకు అన్పిస్తుంది. అయితే సంఘాన్ని లోపలికి వచ్చి చూడటం ద్వారానే నేను చెప్పబోయే అన్ని విషయాలు మీకు తెలిసివస్తాయి. అయితే కేవలం నేను చెప్పుతున్నానుకాబట్టి మీరొక అభిప్రాయానికి రాకండి. లోపలికి వచ్చి చూడండి. మీకు ఆ విషయాలే కన్పిస్తాయి.

    డా|| హెడ్డేవార్ జీ ఈ ప్రయోగాన్ని మొదటే చేసి చూపారు. 'సంపూర్ణ హిందూ సమాజాన్ని' సంఘటితం చేసే పద్దతి ఏమిటి? అలా చేస్తూ చేస్తూ పోతే దాని పరిణామం ఎలా ఉంటుంది, ఏమౌతుంది అనేదంతా ఆయన కళ్ళముందు సృష్టంగా ఉండేది. ఆ విషయంలో అయన ప్రతిభ అలౌకికమైంది. ఆయన జీవితం చాలా లోతైనది అయితే సంఘస్థాపన గురించి ప్రకటన చేయడంతప్ప ఆయన మరింకేమీ చేయలేదు. సంపూర్ణ హిందూ సమాజాన్ని సంఘటితంచేసే సంఘం నేడు ఫ్రారంభమైంది అని ప్రకటించారు. అలా చెప్పడంతోనే ఆ సమావేశం ముగిసి పోయింది. సహచరులు రావడం జరిగాక, ఏం చేయాలి ? వాళ్ళంతా కలిసి కూర్చొని, తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకొండి అని చెప్పారు. ఆ రోజున మన శాఖ ప్రారంభం కాలేదు. ఈ శాఖ
అనేది తర్వాత ఎప్పుడో ప్రారంభమయ్యింది.
    ప్రారంభంలో సంఘం సమావేశాల రూపంలో ఉండేది. నెలకొకసారి సమావేశం జరిగేది, నెలకొకసారి జరిగే ఈ సమావేశానికి మొదట రెండు, మూడు సార్లు మనుషులు వచ్చారు. ఆ తర్వాత ప్రత్యేకంగా పిలవాల్సి వచ్చింది. ఆ తర్వాత పిలిచినా రాకపోవడం మొదలైంది. దాంతో ఈ సమావేశాన్ని నెలకొకసారి కాక, ప్రతివారమూ జరిపితే అది అలవాటు అవుతుందికదా అని అనిపించింది. అలా గాడిన పడిన తర్వాత రోజూ జరపడం మొదలైంది. గదిలోపల రోజువారీ సమావేశాలు చర్చలు జరపడం మొదలైంది. అయితే సంఘంలో, ఆనాటికి వచ్చిన వాళ్ళంతా యువకులు బాలురు. సంపాదనాపరులు చాలా తక్కువమంది. డా|॥ హెడ్డేవార్ కు ఆనాటికి 35 ఏళ్ళ వయస్సు, ఆయన సంఘంలోని జ్యేష్ఠులలో ఒకరు. అయిదారుగురు మాత్రమే కొంచెం పెద్దవారు ఉండేవారు. దాంతో యువకులైనవారు, "రోజూ వచ్చి గదిలో కూర్చొని చర్చించడంవల్ల ఏమి లాభం? మనం యువకులంకదా! మైదానంలోకి పోయి కాళ్ళుచేతులు ఆడిద్దాం. శారీరక కార్యక్రమాలు చేద్దాం, చిన్న చిన్న ఆటలు ఆడుదాం, కబడ్డీ ఆడుదాం, శస్త్ర విద్యలు కూడా నేర్వవచ్చుకదా!" అన్న ఆలోచనలతో వ్యాయామశాలకు వెళ్ళడం ప్రారంభించారు. 
    అలా గదిలో నుండి మైదానంలోకి వచ్చిన మూడు, నాలుగు నెలల తర్వాత దైనందిన శాఖ ప్రారంభమైంది. శాఖ ప్రారంభించండని డా|| హెడ్డేవార్ చెప్పలేదు. సమావేశంలో కూర్చునే బృందంలో చర్చ జరిగి ఏకాభిప్రాయానికి వచ్చాక ఇదంతా జరిగింది. డా|| హెడ్డేవార్ కు రోజూ ప్రజలు ఒకచోట కలవాలని ఉండేది తప్ప, ఆయన ఎప్పుడూ ఇలా చేయాలని చెప్పలేదు. కార్యకర్తల చేతుల్లో పెట్టి, ఈ పని చేయాలన్నారు, ఎలా జరుగుతుందో ప్రయోగం చేయమన్నారు. అలా ఇది వికసితమైంది. తర్వాత కార్యకర్తలు దండ మొదలగునవి ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాడు ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు. వాళ్ళు పెరేడ్ చేసేవారు, అది చూసి మనమూ పేరేడ్ చేయాలని భావించారు. దాంతో మొదటి ప్రపంచయుద్ధం తర్వాత సైన్యం నుండి పదవీవిరమణ పొందిన మార్తాండరావ్ జోగ్ అనే డా|| హెడ్డేవార్ స్నేహితుడి ఆధ్వర్యంలో పెరేడ్ చేయడం ప్రారంభమైంది. పెరేడ్ ప్రారంభమయ్యాక దానికొరకు ఒక గణవేష్ ఉంటే బాగుంటుందన్సించింది. అలా గణవేష్ రూపొందింది. అది ఆనాటి పోలీస్, మిలట్రీ వాళ్ళ దుస్తులను పోలి ఉండింది. ఆ తర్వాత 'పథ సంచలనం' మొదలై బ్యాండ్ కావాలన్సించింది. దాంతో మిలిట్రీ బ్యాండ్ ను అనుకరిస్తూ మనదైన అరకొరగా ఉన్న ఒక బ్యాండ్ రూపొందింది. అయితే ఇవన్నీ కార్యకర్తలమధ్య చర్చద్వారానే రూపొందాయి.

     డా|| హెడ్డేవార్ ఏనాడూ 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్' ప్రారంభమైంది అని చెప్పనేలేదు. ఆయన సంఘం ప్రారంభమైంది అని మాత్రమే చెప్పారు. శాఖకువచ్చే కార్యకర్తలు కొత్తవారిని తీసుకురావడం మొదలయ్యాకే, వాళ్ళు 'ఏమిటి మీ సంఘం? అని ప్రశ్నించడంతో, వాళ్ళు ‘మన సంఘం పేరు ఏమి'టని డాక్టర్జీని అడిగారు. అపుడు డాక్టర్ జీ, 'దాన్ని ఎవరు నిర్ణయించారు? కూర్చొని ఆలోచించండి' అన్నారు. సమావేశం జరిగింది. పదహారుమంది పాల్గొన్నారు, మూడు పేర్లు ప్రతిపాదించబడ్డాయి. చర్చ జరిగింది, ఓటింగ్ జరిగింది. అలా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్' అనే పేరు ఎక్కువమంది అంగీకారం మేరకు నిర్ణయమైంది. డా॥ హెడ్డేవార్ సంఘ స్థాపనకు రెండేళ్ళ ముందువరకు రాష్ట్రీయ స్వయంసేవక్ మండల్ ను నడిపారు. కానీ ఆయన ఆ పేరును ఎవరికీ చెప్పలేదు. చర్చద్వారానే అది బయటకు వచ్చింది. 
    సామూహిక ఏకాభిప్రాయ స్వభావం డాక్టర్జీకి కూడా ఉండేది, అలాగే సంఘానికీ ఉంది. మాలో ఒకసారి అంగీకారం జరిగితే, అది మళ్ళీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉండదు. అయితే ఎవరు మాట్లాడటం ప్రారంభించినా, ఒకటే మాట మాట్లాడుతారు. అయితే ఒక్కొక్కరి శైలి ఒక్కోరకంగా ఉండవచ్చు. కాబట్టి చెప్పే పని ఎవరికో ఒకరికి అప్పగించబడుతుంది. నేడు నేను మీముందు చెబుతున్న విషయాలన్నీ 'బజరంగ్ లాల్జీ' కూడా చెప్పగలరు, నాలాగే ఆయనకూడా మైకు ఇవ్వడం జరిగింది. అయినా ఆయన తమ మోహాన్ని అణుచుకున్నారు. ఎందుకంటే ఒక నోటిద్వారానే విషయం వెళ్ళాలి అని భావించా రాయన. అనుశాసనంతో ఒకే అభిప్రాయం వ్యక్తం చేయడమనే ఆలోచనతో ఇలా అన్నిస్తుంది. కానీ ఒకరు చెబితే అంతా జరిగిపోతుంది అనుకుంటారు. కానీ అలా జరగదు. ఒక్కొక్క సాధారణ స్వయంసేవక్ లోని వివేకంతో పని జరిగిపోతుంది.
    రోజూ శాఖకు వెళ్ళాలి అని మేము చెబుతాము. మేమంతా అలా వెళ్తాం. మేము శాఖకు వెళ్తామా లేదా అన్నది అతిచిన్న స్వయంసేవక్ కూడా గమనిస్తుంటాడు. ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు పట్టుకుంటారు కూడా. నేను స్వయంగా సంఘ సర్ సంఘచాలక్ ను, నా పేరు నాగపూర్ లో మోహితే సాయం శాఖ సూచీలో ఉంది. పర్యటన కారణంగా నేను రోజూ ఆ శాఖకు వెళ్ళలేను. ఆ శాఖకు ఒక బాల స్వయంసేవక్ కొత్తగా రావడం జరిగింది. అప్పటికి అతడు నాల్గవ తరగతి చదువుతున్నాడు. చాలా రోజులకు నేను నాగపూర్ కు వెళ్ళాను. సాయంత్రం శాఖకు వెళ్ళాను. 'వికిర' అయ్యాక అతడు నావద్దకొచ్చాడు. నన్నే చూస్తుండటంతో విషయమేమిటని అడిగాను. అపుడా బాల స్వయంసేవక్, రోజు శాఖకు రావాలని మా గణశిక్షక్ చెప్పాడన్నాడు. మంచి విషయమే గదా అన్నాను. అపుడతడు, మీరు మా శాఖకు చెందిన స్వయంసేవక్ అని విన్నాను అన్నాడు. నిజమే అతడు, మరి మీరు రోజూ శాఖలో కన్పించడం లేదే అన్నాడు. అందుకు నేను, రోజూ పర్యటన చేస్తుంటాను, ఏ ఊరికి పర్యటనకు వెళ్తే, ఆ ఊరిలోని శాఖకు వెళ్తుంటాను అనగానే, ఆ బాలుడు, మీరు నాగపూర్లో ఎన్నిరోజుల నుండి ఉన్నారు అన్నాడు. వెంటనే నాలుగైదు రోజుల నుంచి ఉన్నా ననగానే, నేను మొదటిసారి శాఖలో ఈ రోజే చూస్తున్నాను అన్నాడు. అపుడు నేను ఇతర శాఖలకు వెళ్ళే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి వెళ్ళాను అని చెప్పాను. ఆ తర్వాత నేను ఎప్పుడు ఆ శాఖకు వెళ్ళినా, అతడు నా పర్యటన ఎక్కడెక్కడ జరిగిందని, శాఖ ఎక్కడెక్కడ జరిగిందని అడుగుతుండేవాడు.
    సంఘం అలాంటి 'ఓపెన్ ఆర్గనైజేషన్', ఇందులో ప్రతి స్వయంసేవక్ ఏదైనా అడగవచ్చు. ప్రతిస్వయంసేవక్ ఆలోచిస్తాడు. ప్రతి స్వయంసేవక్ ఆలోచన చర్చకు వచ్చే పద్ధతి ఉంది. నేడు లక్షలాది స్వయంసేవకులున్నారు. వారిలో ప్రతి ఒక్కరూ చెప్పేది ప్రత్యక్షంగా నేను వినలేకపోవచ్చును. అయితే శాఖాస్థాయి నుండి ప్రతి స్వయంసేవకు ఆలోచనా చర్చకు వచ్చే పద్దతి ఉంది. ఆలోచనలు వ్యక్తం చేయబడగా అవి క్రమంగా ప్రతినిధిసభకు చేరుతాయి. ప్రతినిధిసభలో సర్వాసుమతి పొందినదాంట్లో అందరూ తమతమ ఆలోచనను కలగలుపుతారు. Most Democratic Organisation (అత్యంత ప్రజాస్వామిక సంస్థ)ను మీరు చూడాలనుకుంటే సంఘానికి రావాల్సిందే.
   ఇక్కడ స్వయంసేవక్ మీద ఎలాంటి అంకుశమూ ఉండదు. మేము అతడికందించిన సంస్కారం మరియు వివేకాలే అతడిని నడిపిస్తాయి. వాటి పరిధిలో అతడు అభిరుచి ననుసరించి ఏదైనా చేయగలడు. అతడు చేసేదానిపైన మా అంకుశం ఏదీ ప్రయోగించబడదు. ఇలాంటి పద్దతి డా|| హెడ్డేవార్ స్వీయ అనుభవం మరియు ఆలోచన నుండి వెలువడిన శాస్త్రం. మేము అలాంటివారిని పిలుస్తుంటాము. శారీరక, బౌద్ధిక మరియు మానసిక ప్రగతి సాధించేవరకూ ప్రయత్నిస్తూ ఉంటాము. అలా ప్రయత్నం చేస్తూ కొంత యోగ్యత పొందినతరువాత అతడు తనకు ఇష్టమైన పనిలో భాగస్వామి కావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి అనేది మేమేమీ చెప్పం. అతడు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఎక్కడికి వెళ్ళినా, సంపూర్ణ సమాజాన్ని తనదిగా భావించి
దేశహితాన్నే కాంక్షిస్తూ తన పని కొనసాగిస్తాడు. ఎక్కడికి వెళ్తే అక్కడి క్రమశిక్షణను పాటిస్తాడు. ఈ విషయంలో మాత్రం ఎలాంటి రాజీపడడు. ఇంత మాత్రమే అతడి నుండి అపేక్షించ బడుతుంది. ఇదే సంఘ కార్యపద్ధతి.
    మేము రోజూ చిన్న చిన్న, సరళమైన కార్యక్రమాలదా్వారా సంస్కారాలందిస్తాము. ఆ సమయానికి ఏ కార్యక్రమం అందుబాటులో ఉంటే దాన్ని నిర్వహిస్తాము. కొత్తకొత్త కార్యక్రమాలు వస్తుంటాయి. వాటిని మేము అంగీకరిస్తాము. మా కార్యక్రమాలను స్వీకరించడంలో మాపై ఒక బంధనం లాంటిది ఏర్పడుతుంది. సంఘం అన్నిరకాల ప్రజలమధ్య నడుస్తుంది. అది ఏదో ఒక వర్గానికి సంబంధించిన సంస్థ కాదనేదే ఆ బంధనం. అన్ని రకాల ఆర్థిక వర్గాలలో, అన్నిరకాల భాషలలో, అన్ని రకాల కులాలు, ఉపకులాలలో నడిచే సంస్థ. అన్ని రకాల వ్యక్తులు చేయగల్గిన కార్యక్రమం. మా అభిల భారతీయ కార్యక్రమంగా మారిపోతుంది. మంచిమంచి కార్యక్రమాలెన్నో ఉన్నాయి.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం: డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:

రెండవ రోజు ఉపన్యాసం:

మూడవ రోజు ఉపన్యాసం:

భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక .
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top