" ఆర్థిక పరిస్థితి లేదా నిరుద్యోగం ": డా. మోహన్ భాగవత్ జీ తో మూడవరోజు ప్రస్నోత్తరాలు - Economic situation or unemployment

" ఆర్థిక పరిస్థితి లేదా నిరుద్యోగం ": డా. మోహన్ భాగవత్ జీ తో మూడవరోజు ప్రస్నోత్తరాలు - Economic situation or unemployment
డా. మోహన్ భాగవత్ జీ
'భవిష్య భారతం'
మూడవరోజు సమావేశంలో ప్రస్నోత్తరాలు
: ఆర్థిక పరిస్థితి లేదా నిరుద్యోగం :
ప్రశ్న : గ్రామ వికాసం, స్వదేశీ ఆధారిత ఆర్థిక విధానం మరియు నిరుద్యోగం పట్ల సంఘం అభిప్రాయం ఏమిటి ? 2014 తర్వాత దేశంలో జరిగిన అఖివృద్ధిని సంఘం తన ఆలోచనలకు అనుగుణంగా జరిగిందని భావిస్తుందా ?
జవాబు : గ్రామ వికాసం పని మేము చేస్తూనే ఉన్నాం. గ్రామాల వికాసం జరిగి తీరాల్సిందే. గ్రామాల గ్రామీణత్వం స్థిరంగా ఉండాలి. గ్రామాలలో పాఠశాల లేదు అంటే గ్రామీణత్వం లేదని అర్ధం. అభివృద్ధి అనేది సంపూర్ణంగా జరగాలి, అయితే గ్రామంలో ఉన్న వృత్తులన్నీ, ప్రకృతి పట్ల మిత్రత్వాన్ని కల్గి ఉన్నాయి. వాటిమధ్య పరస్పర సహకారం ఉంది, సద్భావన ఉంది, వీటన్నింటిని కచ్చితంగా ఉండేలా చూసుకుంటూ గ్రామ వికాసమనేది జరగాలి. గ్రామ వికాసంతోనే భారత వికాసం ఉంది అని మేము నమ్ముతాము. గ్రామ వికాసం కొరకు మా స్వయంసేవకులు పనిచేస్తున్నారు కూడా. నేడు మన దేశంలోసంఘ స్వయంసేవకుల ప్రయత్నాలపల్ల ఇతరులకు చూపదగిన గ్రామం అన్నవి సంఖ్యాపరంగా దాదాపు అయిదువందల పరకూ ఉన్నాయి. మేం మరింత ముందుకు సాగుతున్నాము.
   స్వదేశీ ఆధారిత ఆర్థిక విధానం అందరికీ లభించాలి. ఎందుకంటే ఆర్థిక విధానంలో ఆర్థిక రక్షణ, స్వావలంబస ఉంటుంది. స్వదేశీతో సహవాసం చేయనంతవరకు వాస్తవమైన అభివృద్ధి జరగనే జరగదు. ఇంతకూ స్వదేశీ అంటే ఏమిటి ? స్వదేశీ అంటే ప్రపంచంతో దేశాన్ని కలవకుండా దూరంగా ఉంచడం కాదు. 'అనోభద్రాః క్రతవో యనస్తు విశ్వతః మా ఇంట్లో తయారు చేసుకోగల్గినవి, నేను బజారు నుండి తీసుకురాను. మన ఊరి సంతలో దొరికేవాటివల్ల మన ఊరిలోవారికి పని దొరికితే, అలాంటి వాటిని బయట ఊరి నుండి, సంత నుండి తీసుకుని రాకూడదు. ఇలా ఒక్కొక్క అడుగు ముందుకెళ్తే మనదేశంలో తయారయ్యే వాటిని బయటినుండి తెచ్చుకోము. మనదేశంలో దొరకనివి మరియు జీవితానికి తప్పనిసరి అవసరమైనవాటిని బయటి నుండి తెచ్చుకోవచ్చు. జ్ఞానానికి సంబంధించింది, సాంకేతికతకు సంబంధించినది, మనం ప్రపంచమంతటి నుండి భవిష్యత్తు, ఆకాంక్షలకనుగుణంగా వాటిని మార్చుకునే అవకాశం ఉండాలి. అలాగే వీలైనంతవరకూ అన్నీ మనదేశంలో లభించేలా ప్రయత్నమూ చేయాలి. ఇదీ స్వదేశీ ప్రవృత్తి ఈ ప్రవృత్తి లేకుండా ఏ ఆర్థిక ప్రణాళికలైనా మనదేశాన్ని బలోపేతం చేయజాలవు.
   ప్రపంచమంతా ఒక దగ్గరికి వచ్చింది. అలా ఒక దగ్గరికి రాని రోజుల నుండే తీసుకోవచ్చు. అయితే అలా తీసుకున్న తర్వాత మనదేశ ప్రకృతి మరియు మనదేశ అంతర్జాతీయ వ్యాపారం జరుగుతోంది. అంతేకాదు అది ఇచ్చిపుచ్చుకోవడమనే పద్దతి ఆధారంగా నడిచేది. అదలాగే నడుస్తుంటుంది. అయితే ఇచ్చిపుచ్చుకోవడంలో కేవలం ఇవ్వడమే మనవైపు నుండి జరిగి, అటువైపు వారు తీసుకోవడం మాత్రమే జరగరాదు. ఇచ్చి పుచ్చకోవడం జరిగినా మన షరతులను మనం రూపొందించుకోవాలి అనే భావనతో అది జరగాలి. ఇది పూర్తిగా వ్యావహారిక విషయం, అన్నిచోట్లా జరిగేదే. అపుడే దేశం బలోపేతమవుతుంది.

2014 తర్వాత ఇలా జరిగిందా? కేవలం 2014 విషయమే కాదు, 1947లో ఇలా జరిగిందేమో ఆలోచించి చూడండి. ఈ ఆదర్శ విషయం అమలు కావడానికి ఒక పరిస్థితి వారసత్వంగా దొరికింది. దానిని స్వీకరించి పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వమేమో వచ్చింది. పదండి, స్వదేశీని అమలు చేయాలని, ఖజానా తెలిచి చూస్తే అందులో ఒక్క పైసా కూడా లేదు. మరి డబ్బు ఎక్కడినుండి తేవాలి. మొదట దాన్ని సమకూర్చుకోవాలి. అపుడు స్వదేశీ దిశలో ముందుకు సాగవచ్చు. అందువల్లే 1947 కావచ్చు, 1952, 1957 కావచ్చు, ఏ సంవత్సరమైనా తీసుకోండి ప్రభుత్వం నూరుశాతం ముందుకువెళ్ళగలిగిందా ? ప్రభుత్వ పరిధిలో, ఈ రోజే, ఒకేసారి ఇది సంభవం కాజాలదు అయితే ఆ దిశలో ప్రయత్నమైనా జరిగిందా? అవును, ఆ దిశలో జరిగింది అని నాకనిపిస్తోంది. ఎందుకంటే సమాజంలో వాతావరణం మారిపోయింది.
" బాబా రాందేవ్ " వారి పతంజలి ఉత్పత్తులు.
    నేడు మనదేశంలో చాలామంది, మనదేశంలోనే తయారుచేద్దాం అని భావిస్తున్నారు. నేడు మనదేశపు వ్యాపారసంస్థలు కూడా పోటీపడటం కోసం ముందుకెళ్తున్నాయి. 'రామ్ దేవ్ బాబా'' లాంటి సన్యాసి కూడా ముందడుగు వేస్తున్నారు. పరిశ్రమలు పెరుగుతున్నాయి. నైపుణ్యాల శిక్షణ పెరుగుతోంది. యువకులు విదేశాలకు వెళ్ళి చదువు అభ్యసించి, తిరిగివచ్చి పనిచేస్తున్నారు. వ్యవసాయ పనులు చేస్తున్నారు. నైపుణ్య శిక్షణలో పనిచేస్తున్నారు. దేశం తన కాళ్ళమీద తాను నిలబడాలని భావిస్తుండటంవల్ల ఇది జరుగుతోందనిస్తోంది. అలా మన ఉపన్యాసాలవల్ల కొంతైనా వాతావరణ మేర్పడిందని అన్సిస్తోంది. ఎవరికైతే ఈ అనుభవం కల్గుతోందో, ఆ కారణంగా అది నిర్మాణమవు తోంది. అలాగని నూరుశాతం ఇది ఒకేసారి జరిగిపోతుందని చెప్పలేము. అలా జరిగినపుడు ఆరోజు బంగారు దినం అవుతుంది. అయితే ఈ రోజున, ఆ దిశలో దేశం ముందడుగు వేస్తోందని మాత్రం చెప్పవచ్చు. 

- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.

మొదటి రోజు ఉపన్యాసం:

రెండవ రోజు ఉపన్యాసం:

మూడవ రోజు ఉపన్యాసం:
భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top