మనశక్తి ఎంత ఎక్కువైతే, అంత సరళంగా సమస్యలు పరిష్కారమౌతాయి - With The more manpower, the Problems are solved so easily

0
మనశక్తి ఎంత ఎక్కువైతే, అంత సరళంగా సమస్యలు పరిష్కారమౌతాయి - With The more manpower, the Problems are solved so easily
Balasaheb Deoras ji - బాళాసాహబ్ దేవరస్

: మనశక్తి ఎంత ఎక్కువైతే, అంత సరళంగా సమస్యలు పరిష్కారమౌతాయి :
  మనదృష్టిలో తాత్కాలిక సమస్యలకు విలువ లేదని, వాటిని గుర్తించనక్కరలేదని అనుకోవటం సరైనది కాదు. కాగా, మనం గుర్తించవలసినదేమంటే-సమాజంలో మనశక్తి ఎంత ఎక్కువగా వృద్ధి చెందుతుందో అంత తేలికగా సమస్యలు పరిష్కారమౌతాయి. 'తాత్కాలిక సమస్యలగురించి మా శక్తినంతా వినియోగించి మేము ప్రయత్నం చెయ్యనే చెయ్యబోము అని ఏనాడూ ప్రతిజ్ఞ తీసికోలేదు. ఈ దయనీయస్థితిలో ఉన్న సమాజంలో పరివర్తన తీసికొనివచ్చి, ఈ సమాజాన్ని జీవంతో తొణికిసలాడుతున్న స్వాభావిక స్వరూపాన్ని సంతరింపజేయటం అనే అంతిమ లక్ష్యాన్ని మనం చేరుకోవలసి ఉంది. కాబట్టి ఇది చేసుకోవటమే మేలు' అనే నీతిని మనమెన్నడూ అనుసరించరాదు. ఆ విధమైన ఆలోచనలను రానీయరాదు. ఏదో ఒక తాత్కాలిక సమస్య పరిష్కారం గురించి శక్తినంతటినీ పణంగాపెట్టిన సందర్భాలో ఒకటిగానో అర్ధగానో అలాంటి ప్రస్తావనలు వచ్చే అవకాశముంటుంది.
   పూర్తయ్యేవరకైనా, సంఘ అస్తిత్వాన్ని కాపాడుకోవాలిగదా! నిరాశచెంది 'ఆత్మహత్య సమస్యలగురించి ఆలోచించేటప్పుడు మనకు గల మర్యాదలను, హద్దులనుకూడా గుర్తు పెట్టుకోవాలి. ఒక సమస్యయొక్క పరిష్కారం ప్రభుత్వంద్వారా మాత్రమే జరిగేదైతే, ఆ సమస్యకు ప్రతిఘటన గురించిన ప్రయత్నాలుకూడా ఆస్థాయిలోనే జరగవలసి ఉంటవి. ఇతర సంస్థలు తమ హద్దులమేరకు నడచుకొంటూ ఇవ్వదగిన సహకారాన్ని అందిస్తాయి.

  సమాజంలో వివిధ సమయాలలో తాత్కాలిక సమస్యలు అనేకం ఉత్పన్నమవుతూ ఉంటవి. అవి మనకు గ్రుచ్చుకోవటం లేదు, మసలను నేరుగా బాధించటం లేదు-కాబట్టి పట్టించుకోవటం లేదు అనుకోవటం తగదు. సంఘం ఆ సమస్యలపట్ల కళ్లు మూసుకొని నిశ్చింతగా కూర్చొనిపోవటం లేదు. అన్ని సమస్యలనూ సరిగా పరిశీలిస్తూనే ఉండిఉంది. 
  ఈనాటి ప్రజానీకానికి ఈ సమస్యలతో ఎంతో కష్టం కలుగుతూ ఉంది కదా- మరి సంఘం ఇన్ని సంవత్సరాలుగా పనిచేసుకొంటూ వస్తున్నది, అంటే గతంలో ఇంతకంటే ఎక్కువ కష్టమే అనుభవించి ఉంటుందని అర్థం చేసుకోవాలి. సంఘం ఉందికాబట్టే ఈమేరకైనా పని జరుగుతూ ఉంది. ఇంత కష్టపడిన తర్వాతకూడా-సమస్యలే ఉత్పన్నం కానివిధంగాగాని ఉత్పన్నమైన సమస్యలు మనం కోరుకున్న తీరులో అత్యంత సులభంగా పరిష్కారమయ్యే విధగా గాని- మనం కోరుకున్నంత శక్తి నిర్మాణంకాలేదు. ఆ కారణంగా మనకు దుఃఖం కలుగుతూ ఉండవచ్చు. అయినా అవకాశం జారిపోయిందే, ఇప్పుడింకేమి చేయగలము అంటూ నిరాశచెందనక్కరలేదు. ఇంక మనం చేయగల్గిందేమీ లేదు, ఇన్నాళ్లుగా దక్ష-ఆరమ చేస్తూనే ఉన్నాంగదా, ఏమి సాధించాము? ఎంతకాలమైనా ఇలా చేస్తూ పోవలసిందేనా? -- ఇటువంటి ప్రశ్నలతో నిరాశ చెందవలసిన అవసరమే లేదు. ఒక అవకాశం జారిపోయినంతమాత్రాన మరల ఇంకొక అవకాశం రానేరాదని అనుకోరాదు. మన ఆస్తిత్వము ముందు ముందు చాలా ప్రభావాన్ని కలుగజేస్తుందని సంఘం గట్టిగా నమ్ముతున్నది. ఏదో ఒక తాత్కాలిక సమస్య లేదా అవకాశమూ కలసి వచ్చినపుడు - ఎంత మూల్యం చెల్లించి అయినాసరే, వాటిని సాధించేందుకు పూర్తిశక్తిని వినియోగించగలదు. 

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top