స్వయంపూర్ణ సమాజ జీవనం సాగించగలగాలి - Be able to live a self-sufficient society

0
స్వయంపూర్ణ సమాజ జీవనం సాగించగలగాలి - Be able to live a self-sufficient society
ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకుల స్వీయ-రక్షణ,శిక్షణ 
: స్వయంపూర్ణ సమాజ జీవనం సాగించగలగాలి :
చాలాముందునుండే ఇటువంటి అనేక సందర్భాలు, సమస్యలూ మనముందుకు వస్తున్నవి. 
1937లో పుణేలో జరిగిన ఉదంతమిది. అక్కడ హనుమంతునికి ఒక చిన్న గుడి కట్టబడి ఉంది. దీనికి దగ్గరలో ఒక మసీదు ఉంది. గుడిలో గంటలు మ్రోగించడాన్ని ముస్లిములు నిరసించారు. దానిమీద వివాదం రేగింది. అక్కడ ఉద్రిక్తతలు పెరిగిపోవటం చూసిన ప్రభుత్వం 144వ సెక్షన్ విధించటమేగాక, గుడిలో గంట మ్రోగించకుండా నిలుపుదల చేయించింది.
   అక్కడికి దగ్గరలోనే ఒక సర్దారు ఉండేవాడు. ఆయన నివాసం 144వ సెక్షన్ విధించిన వీధులకు బయట ఉన్నది. ఆయన లౌడ్ స్వీకరు ఏర్పాటుచేసి బాజాలు వాయింపజేశాడు బజాలతో ఎంతగా శబ్దంచేసినా మహమ్మదీయులకు ఇబ్బందేమీ కల్గటం లేదని తద్వారా నిరూపించాడు. చిన్న గుడిలో వ్రేలాడదీసిన చిన్న గంట మోగించినపుడు నిజానికి ఆ శబ్దం మసీదువరకు పోయి వినబడనే, వినబడదు-అయినా గంట మ్రోగించకుండా నిషేధించటం మూర్ఖత్వంగాక మరేమిటి పుణేలో ఉన్న హిందువులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించాలని సంకల్పించారు. స్థానిక నాయకులు ఈ పనిలో సంఘ స్వయంసేవకులుకూడా భాగస్వాములు కావాలని కోరారు. అప్పుడు 200 మంది స్వయంసేవకులతో సంఘశిక్షావర్గ నడుస్తున్నది. అయితే సత్యాగ్రహం చేయడానికి ఈ స్వయంసేవకులను పంపించటం కుదరదని డాక్టర్జీ చెప్పినపుడు వారికి కోపం వచ్చి డాక్టరీని నానామాటలు అన్నారు. కొందరు ప్రముఖులు వచ్చి డాక్టర్టీని ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేశారు. శిక్షావర్గలో పాల్గొనడానికి వచ్చిన స్వయంసేవకులు సత్యాగ్రహంలో పాల్గొనలేదు. డాక్టర్జీ మాత్రం కొందరు స్థానిక వ్యక్తులతోకలసి ఆ సత్యాగ్రహంలో పాల్గొన్నారు.

   ఇవేకాదు, వఱదలు, క్షామము, కొట్లాటలు, గొడవలు ఇటువంటి అనేక సమస్యలు సంఘ ప్రారంభ దినాలనుండే సంఘంముందుకు వస్తూ ఉండేవి. అందరిచేతా మంచివాళ్ళు అనిపించుకోవటం ప్రతి సమస్యగురించి మన వైఖరిని వివరించుతూ ప్రకటనలు జారీచేయటమూ, సమస్య పరిష్కారంకోసం హళాహళి చేయటం, అటూ ఇటూ పరుగెత్తటం ఇలా చేయటంద్వారా కొన్ని సందర్భాలలోనైనా ప్రశంసలు లభించవచ్చుగాక. కాని వాటిద్వారా నిర్మాణమయ్యేదేమీ ఉండదు. వాస్తవికమైన నిర్మాణం జరగాలంటే సమస్యనుబట్టి దానికి అనురూపమైన (తగిన) ఆచరణ, వ్యవహారమూ చేయవలసి ఉంటుంది.

  అసలు డాక్టర్జీ సంఘాన్ని స్థాపించినది ఎందుకు?’- ఈ విషయమై రకరకాలుగా అభిప్రాయాలు వినవస్తుండేవి. ఏనుగును తడిమిచూసిన ఏడుగురు అంధులు ఏనుగును ఏడు విధాలుగా వర్ణించి చెప్పినట్లుగానే, వేఱు వేఱు కారణాలతో డాక్టర్టీకి సన్నిహితంగా వచ్చినవారు ఆయా కారణాలకు అనుగుణమైనరీతితో వివరణలిస్తూ ఉండేవారు. 'డాక్టర్జీ ఒక గొప్ప విప్లవకారుడు ఆంగ్లేయుల పాలనను అంతమెందించడానికే సంఘాన్ని స్థాపించా'రని కొందరు చెప్పేవారు. 'హిందువులకు, ముస్లింలకూ మధ్య కొట్లాటలు, గొడవలూ అవుతున్నవిగదా! వాటిలో హిందువుల తరఫున పోరాడే వారే లేరు. కాబట్టి అలాంటివారిని తయారుచేయటం కోసమే సంఘాన్ని స్థాపించారు డాక్టర్జీ' అంటూ మరికొందరు చెప్పేవారు. 1926లో నాగపూర్ లో తమమీద ముస్లింలు దాడులు చేసి ఇళ్లుదోచుకుపోయేందుకు ప్రయత్నించగా, హిందువులు ఆ దాడులను దృఢంగా ఎదుర్కొనటంతో అందరూ డాక్టర్జీని ప్రశంసించ నారంభించారుకూడా. వాస్తవానికి ప్రతియొక్క పెద్ద లక్ష్యానికి వెనుక వందలాదిగా చిన్న చిన్న నిమిత్తాలో అనుభవాలో ఉంటాయి. ఆ బృహత్ లక్ష్యాన్ని నిర్దేశించుకోవటంలో ఇవి సహాయకారులవుతాయికూడా.

   ఎప్పుడన్నా, ఏదో ఒక మొహల్లాలో కొట్లాట జరిగినపుడు ప్రజలు డాక్టర్జీ వద్దకు వచ్చి అన్ని శాఖల స్వయంసేవకులనూ ఆ మొహల్లాలోని ప్రజల రక్షణార్ధం పంపాలని కోరుతూ ఉండేవారు. డాక్టర్టీ వారందరికీ యథోచితంగా నచ్చజెప్పేవారు. అప్పుడప్పుడూ వినీవిననట్లుగా పట్టించుకోకుండా ఉండేవారు. వారు మళ్ళీ మళ్లీ అదే చెప్పినపుడు మేము మీకొరకు ఏమీ చేయజాలము' అని స్పష్టంగా చెప్పవలసి వచ్చేది. 'ఎంతో మృదు, మధురభాషి, హిందూ సంఘటనంకోసం కంకణం కట్టుకొన్నవాడు ఏమి మాట్లాడుతున్నాడని వారికి ఆశ్చర్యంకలిగేది. డాక్టర్టీ అలాంటివారికి మరలా వివరించేవారు. "చూడండి, ఈ సమాజందారి తప్పింది, సమాజంలోని వ్యక్తులు స్వయంగా తాము చేయవల్సినదేదో కొంత ఉందని అనుకోవటం లేదు. తమకు బాధ్యత ఉందనీ అనుకోవటం లేదు. కొట్లాటలు జరిగినపుడు సంఘ స్వయంసేవకులో, పోలీసులో వచ్చి వారిని రక్షించాలనీ అనుకొంటూ, తాము మాత్రం ఇంట్లోనే కూర్చొంటున్నారు. ఈ మనోవృత్తి ఇలాగే కొనసాగేట్లయితే, సమాజం మరింతగా భరష్టమైపోతుంది. సమాజంలో రావలసిన పరివర్తన ఏదీ రానేరాదు. మొహల్లాపై దాడి జరిగినపుడు మొహల్లాలో ఉన్న వారందరూ చేతిలో లారీలు పట్టుకొని మొహల్లాను రక్షించుకోవాలి ". సంఘ స్వయంసేవకులు వచ్చినట్లయితే వారు తప్పక మీతో ఉంటారు ముందుంటారుకూడా. మిగిలినవారు తలుపులు బిడాయించుకొని ఇంట్లో కూర్చుంటారు, 
   స్వయంసేవకులేమో వారికి రక్షణగా వీధుల్లో తిరుగుతుంటారు అనేది హిందూ సంఘటన అనే మాటవెనుక ఉన్న కల్పన కానే కాదు. అందరూ మరణించినా మంచిదే, కాని రక్షించుకోవలసిన విధానం ఏమిటంటే మనం స్వయంగా ముందుకు నడుస్తాం, మిగిలిన వారందరినీకూడా తీసికొని వెళ్తాం. అలా చేసినప్పుడే దారితప్పిన సమాజపు అలవాట్లు మళ్ళీ పట్టాలకెక్కుతాయి. రావలసిన మార్పు వస్తుంది అని డాక్టర్టీ వారికి తెలియజెప్పుతుండేవారు. సంఘయొక్క భూమికను స్పష్టపరుస్తూ డాక్టర్జీ ప్రారంభంనుండి ఇదే చెప్పుతుండేవారు.

  తాత్కాలిక సమస్యలగురించి సంఘంయొక్క భూమిక ఏమిటి? - అంటే మన నిత్యసిద్ధశకి ఆధారంగా స్వాభావికంగా ఏమేరకైతే సమాజాన్ని మనతోపాటు నడిపించుకోగలమో, అంతమేరకే సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అప్పుడప్పుడూ కొన్ని సమస్యలు తలెత్తిన సందర్భాలలో సంఘం తన శక్తినంతా ఒడ్డి ఆ సమస్యను పరిష్కరించాలని స్థానికంగా ఉండేవారు కోరుతుంటారు. ఈ సంఘటన నిర్మిస్తున్నది ఇటువంటి సమయాల్లో వచ్చి మనలను ఆదుకొనడానికే గదా అని వారికి అనిపించుతూ ఉంటుంది. ఆ సమస్యతో సతమతమవుతున్నవారి మనఃస్థితి ఎలా ఉంటుందంటే, పూర్తి శక్తిని వినియోగించి ఇప్పటికిప్పుడు ఈ సమస్యను పరిష్కరించుకోలేకపోతే మనకథే ముగిసిపోతుంది, మనం ఆస్తిత్వం కోల్పోతాం అనే భయం ఉంటుంది. అయినా ఇలాంటి సందర్భాలలో మనం మన కల్పనను స్పష్టంచేయవలసి ఉంటుంది. తల ఎత్తిన సమస్య ఏదైనా కావచ్చు, స్వాభావికమైన  రీతిలో ఎంతమేరకు ఎదుర్కోగలమో, అంతవరకే పరిష్కారమవుతుంది. సమాజంలోని ఘటకులందరినీ మనతోపాటు కదలించి తీసికొనిపోతూ శక్తిని మరింతగా పెంచుకోవటమే ఈ సమస్యలకు పరిష్కార మార్గమవుతుంది. 

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top