కుటుంబంలో 'చేయకూడని పనులు' - Things not to do in our society

0
చేయకూడని పనులు - Things not to do in our society

చేయకూడని పనులు 
  1. ఇతరుల వస్తువులను వారి అనుమతి లేకుండా తీసుకోవదు.
  2. సాధ్యమైనంతవరకు ఇతరుల వస్తువులను ఉపయోగించవద్దు.
  3. ఇతరుల దోషములను, లోటుపాట్లను గురించి వారి పరోక్షంలో మాట్లాడకూడదు.
  4. ఇతరుల ఉత్తరాలను చదువకూడదు.
  5. ఇతరులతో మాట్లాడునపుడు కండ్లు, ముఖము పక్కకు తిప్పకూడదు.
  6. కాలిమీద కాలువేసి కూర్చోవడం, కాళ్లు ఆడించడం సభ్యతా లక్షణం కాదు.
  7. మీరు మాట్లాడాలనుకున్న వ్యక్తి ఏదైనా వ్రాస్తుంటే, ఏమి వ్రాస్తున్నారో చూడరాదు.
  8. వేళ్ళు విరుచుకోవడం, గోళ్ళు కొరకడం సభ్యతా లక్షణం కాదు.
  9. భోజనంచేస్తుంటే వారి ఎదురుగా నిలబడి మాట్లాడవద్దు.
  10. ఏ వస్తువునూ ఎడమచేత్తో ఇవ్వకూడదు.
  11. నిలబడి నీళ్ళు త్రాగకూడదు.
  12. నిలబడి మూత్ర విసర్జనము చేయకూడదు.
  13. మనకంటే పెద్దవారిని ఏకవచనంతో పిలువకూడదు.
  14. గడపను త్రొక్కకూడదు.
  15. గడపమీద కూర్చోకూడదు.
  16. గోవు, పుస్తకము మరియు పెద్దలకు కాళ్ళు తగలకుండా జాగ్రత్త పడుతుండాలి.
  17. ఆహారాన్ని వెదజల్లకూడదు. పారేయకూడదు.
  18. దేవాలయములోనున్నపుడు, ప్రాపంచిక భౌతిక ఆలోచనలు చేయకూడదు.
  19. ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకోకూడదు.
  20. రైలు, బస్సు ప్రయాణంలో స్వంత విషయాలను బంధువులతోగాని పరాయివాళ్ళతోగాని చర్చించకూడదు.
కుటుంబానికి కరదీపికలో తరువాతి అంశం చదవండి → " పెద్దలు ఆలోచించవలసినవి "

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top