ఆర్.ఎస్.ఎస్ ప్రచారకులు గుణ సంపన్నులు కావాలి - RSS campaigners Attributes must be Richness

0
ఆర్.ఎస్.ఎస్ ప్రచారకులు గుణ సంపన్నులు కావాలి - RSS campaigners Attributes must be Richness

: ప్రచారకులు గుణ సంపన్నులు కావాలి :

ఒక మంచి, కుశలుడైన శ్రేష్ఠ కార్యకర్త రూపంలో ప్రచారక్ కార్యక్షేత్రంలోకి రావాలి. ప్రజలకు అతనినుండి అమితమైన ప్రేరణ లభిస్తూ ఉండాలి. సంపర్కంలోకి వచ్చే స్వయం సేవకులకు, తటస్థపడే పరిస్థితులకు యోగ్యమైన మార్గదర్శనమందిస్తూ, అతడు ముందుకు నడిపించుతూ ఉండాలి. ప్రచార లో ఉండవలసిన గుణములు అంటూ జాబితా వ్రాయబూనితే అందులో అన్ని మంచి గుణాలు ఉండాలి. అతడు వక్త అయి ఉండాలి. విద్యాంసుడై ఉండాలి. తపస్వి, త్యాగి అయి ఉండాలి. మితభాషిగా ఉండాలి. కలుపుగోలుగా ఉంటూ ఆత్మీయంగా వ్యవహరించేవాడై ఉండాలి అంటూ ప్రచారకులలో ఉండవలసిన గుణములు అంటూ ఒక పట్టిక రూపొందించి ఇవ్వవలసిన అవసరం లేదు. 
   అటువంటి పట్టిక ఒకటి ఇచ్చి, దానినిబట్టి పరీక్ష నిర్వహించినట్లయితే అందులోనుండి చాలా కష్టాలు ఏర్పడుతాయి. మనుష్యునిలో ఏదో ఒక గుణం లేకున్నా, అది సంపాదించుకోవాలని అతడు అనుకొన్నట్లయితే అధ్యయనం, అనుభవం, ప్రయత్నాలతో అభ్యాసంతో నేర్చుకోగల్గుతాడు. చేసే ప్రయత్నాలలో అక్కడక్కడా లోటుపాట్లు సంభవించినపుడు, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, అతడు తన యోగ్యతను పెంచుకొంటూనే ఉంటాడు. అందుకనే సామాన్యంగా, కొంత అనుభవం సంపాదించుకొన్నతర్వాతనే ప్రచార పంపటం జరుగుతూ ఉంటుంది. ప్రచారక్ చాలా పనులు చేయాలని మనం ఆపేక్షిస్తూ ఉండవచ్చు, కాని అన్నింటిలోకి మహత్వపర్ణమైనది మిగిలిన వారికి పనిచేయాలని ప్రేరణనిస్తూ-కార్యకర్తల స్థాయిని, పరిస్థితులనూ మదింపు చేసుకొని వారి శక్తి సామర్థ్యాలకు తగిన యోజనతో మార్గదర్శనం చేస్తూ ఉండటం. ఏమరుపాటు లేకుండా ఉండటం (సతర్కత), కుశలతతో పనిచేయటం-వీటితోపాటు అందరినీ చక్కగా సమన్వయించుకొంటూ ముందుకుపోవటం - ఇది చాలా ముఖ్యం. ఎవరైనా ఒక స్వయం సేవక్ తన క్షేత్రంలో బాగా పనిచేస్తున్నప్పటికీ, ఇతరులను సరిగా సంబాళించుకోలేక పోతున్నట్లయితే, అతడిని ప్రచారగా పనిచేయమని చెప్పటం కంటే, కార్యకర్తగా ఉంటూ పనిచేయనివ్వాలి.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top