పరమ పూజనీయ దాక్టర్‌జీ ప్రథమ మాసికం (నాగపూర్‌) !

0
పరమ పూజనీయ దాక్టర్‌జీ ప్రథమ మాసికం (నాగపూర్‌) - Doctorji First Month (Nagpur)

ప్రథమ మాసికం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కేంద్రస్థలిలో (నాగపూర్‌) పరమ పూజనీయ దాక్టర్‌జీ ప్రథమ మాసికం సైనిక పద్ధతిలో జరిగింది. దివంగతులైన తమ నాయకునికి సైనిక వందన మర్పించడానికి భారతవర్ప్నమంతటి నుంచీ సంఘచాలకులూ, కార్యకర్తలూ, ప్రతినిధులూ నాగపూర్‌ విచ్చేశారు. పంజాబ్‌, సంయుక్తప్రాంతం, బెంగాల్‌ మధ్య ప్రాంతం, మహాకోసల, మద్రాసు, కర్ణాటకం, ఖాన్‌దేశ్‌, బీరార్‌, మధ్య భారతం మొదలగు ప్రాంతాలనుంచీ, సంస్థానాలలో వ్యాపించియున్న శాఖలనుంచీ, ప్రముఖ శాఖలకూ జిల్లాలకూ సంఘచాలకులైన వారందరూ సమావేశమైనారు. లోక నాయక్‌ ఆణే, డా॥ ముంజేగార్లుకూడా ప్రత్యేకంగా ఆ సమయానికి అక్కడికి విచ్చేశారు.
    ప్రేక్షకులంతా దర్శనం చేసుకునేందుకు వీలుగా, రేశంబాగ్‌ కేంద్ర సంఘస్థానంలో పరమ పూజనీయ డాక్టర్‌జీ భౌతికదేహానికి అంత్యసంస్మారం జరిగిన ప్రదేశాన్ని లతాపుష్పాలతో చక్కగా అలంకరించారు. దానికి ఉత్తరంగా మైదానంలో పెద్దపెద్ద పందిళ్ళు నిర్మించి వచ్చిన (ప్రేక్షకులూ పెద్దలూ కూర్చుకునేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యన ప్రధానవేదీ, దానికి ఎడమవైపు సంఘచాలక్‌లు కూర్చోడానికి ఒక వేదికా నిర్మింపబడ్డాయి. ప్రధాన వేదిక కెదురుగా పరమపూజనీయ డాక్టర్‌జీ చిత్రపటాలను- అనేక సమయాలలో తీసినవి-చక్కగా అలంకరించారు. దీని ముందు ధ్వజస్తంభం నిలబెట్టబడింది. డాక్టర్‌జీకి (శ్రద్దాంజలి సమర్పించడానికి నాగపూర్‌ వాస్తవ్యులు సముద్రంలా ఉప్పొంగి అక్కడికి వచ్చారు. వచ్చినవారిలో నాగపూర్‌లోని ప్రముఖులంతా వున్నారు. కు.పతేహ సింహరావ్‌ భోంస్లే, సర్‌దార్‌గుజర్‌, శ్రీపంత్‌ పాచలేగాంవ్‌కర్‌ మహరాజ్‌, సర్‌ కర్షల్‌ కుకుడ్డే,  శ్రీ తాంబే మొదలైనవారు వచ్చినవారిలో ప్రముఖులు. స్త్రీల సంఖ్య అపారంగా వచ్చింది.

సాయంకాలం సరిగా 5 గంటలకు కార్యక్రమం ఆరంభమైంది. మేఘదేవుడు తన చల్లని ఛాయతో అన్ని వైపులా ఉత్సాహాన్ని నింపాడు. ఈ ఉత్సాహం నిజమైన ఉత్సాహం కాదు. తలపెట్టిన ఆనాటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలనే కౌతుకం అది. కాని అప్పటి వాతావరణమంతా ఎంతో గంభీరమైనది.
   రెండు తరుణ అణికినులు, రెండు బాల అణికినులు ఘోష్‌ (బ్యాండుతో సంఘస్థానంలోకి ప్రవేశించిన తరువాత కొద్ది సమయానికే నూతన సర్‌సంఘచాలక్‌ పరమపూజనీయ మాధవరావ్‌ గోళ్వల్మర్‌కూడా ప్రవేశించారు. ఆయన రాగానే సైనికాఖి వందనం సమర్పింపబడింది. ధ్వజానికీ పరమపూజనీయ దాక్టర్‌జీ చిత్రపటానికీ పూలమాలలు సమర్పించి నూతన సర్‌సంఘచాలక్‌జీ ధ్వజాన్ని ఎగురవేశారు. తరువాత ప్రార్ధన జరిగింది. ప్రత్యుత్పచలనం (రివ్యూ ఆర్జర్‌మార్చి) ప్రదక్షిణాసంచలనం (మార్చిఫాస్ట్‌) స్వాగత ప్రణామ్‌ (రజిమెంట్‌ సాల్యూట్‌) దాహసంస్మార్‌ మందచల్‌ (ఫ్యూనరల్‌ స్లోమార్చ్‌) మొదలగునవి జరిగాయి. ఈ కార్యక్రమం జరిగినంతవరకూ నాలుగువైపులా నిశ్ళబ్దతా, దుఃఖమూ ఆవరించాయి. తరువాత పరమపూజనీయ దాక్టర్‌జీ సైనిక వేషంలోవున్న చిత్రపటానికి విభిన్న ప్రాంతాలనుంచి వచ్చిన సంఘచాలకులంతా పూలమాలల నర్చించారు. తరువాత డాక్టర్‌జీని ఉద్చోధిస్తూ ఒక స్వయంసేవకుడు వ్రాసిన “అమూర్త మూర్త మూర్తిమంత” అనేగీతం స్వయంసేవకుల హృదయాలు కరిగేట్లు పాడబడింది.
   నాగపూర్‌ సంథుచాలకులు శ్రీమాన్‌ బాబా సాహెబ్‌ ఫుటాటేగారు ప్రారంభోపన్యాసం చేస్తూ “పరమపూజనీయ డాక్టర్‌జీ హిందూధర్మాన్నీ హిందూ సంస్కృతినీ రక్షించి దేశాన్ని కాపాడడానికి ఈ పని చేయ నిశ్చయించుకున్నారు, వారు ఎన్నో బాధల్లో, కష్టాల్లో ప్రారంభించిన ఈ మహా సంఘటనోద్యమాన్ని పరమపూజనీయ మాధవరావ్‌ గోల్వల్మర్‌ లాంటి గ్రేష్ట పురుషునికి అప్పగించారు. శ్రీ గోళ్వల్మర్‌గారి నాయకత్వాన మన సంఘట నోద్యమం సంపూర్ణంగా వికసించగలదని నా విశ్వాసం.” అని అంటూ నూతన సర్‌సంఘచాలక్‌గారికి ప్రణామమర్చించారు. తరువాత బొంబాయి ప్రాంత సంఘచాలక్‌ శ్రీ కాశీనాధ్‌రావ్‌జీలిమయే, లక్నోలో అడ్వకేటుగా పేర్వడ్డ బాబూ తేజ్‌నారాయణజీ, శ్రీమాన్‌ లోకనాయక ఆణే, శ్రీయుత బాబా సాహెబ్‌ ఖాపర్డే డా॥ ముంజే మొదలైన ప్రముఖులంతా ఉపన్వసించారు.

నూతన సర్‌సంఘచాలక్‌గారి ఉపన్యాసం

   అందరూ ఉపన్యసించిన తరువాత నూతన సర్‌సంఘచాలక్‌ పరమ పూజనీయ మాధవరావ్‌ గోల్వల్మర్‌ (గురూజీగారు) అంతిమోపన్యాసంలో ఇలా సంభాషించారు:
   “ప్రస్తుతం నా మనస్సు ఆందోళనగా ఉన్నది. ఇంతవరకూ జరిగిన ఉపన్యాసాల తరువాత నేను మాట్లాడగలనని తోచదు. మన ఏకైక నాయకుణ్ణి మనం కోల్పోయాం. ఇంతకంటే భయానకమైన దుర్హటన యింకేదైనా జరుగుతుందన్నా నేను నమ్మను. పరమపూజనీయ డాక్టర్‌జీ అభిప్రాయానుసారం ఆయన ఆజ్ఞవల్ల నేనీ పదవికి వచ్చాను. నన్నుగురించి ఇంతవరకు చెప్పబడినదానిలో నాది ఏమి లేదు. అంతా డాక్టర్‌జీ పుణ్యకర్మ ఫలితమే. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సంఘటన అమరమైనది. ఈ సంఘటనను స్వయంగా ఆరంభించిన ఆద్య సర్‌సంఘచాలక్‌గారు దివంగతులైనా ఈపని మాత్రం అవిచ్చిన్నంగా నడుస్తూనే వుంటుంది. ఇంతవరకు ఉద్యమాలన్నీ వ్యక్తి ప్రాముఖ్యతవల్ల జరిగాయి. కాని సంఘం “సిద్దాంత ప్రాముఖ్యాన్ని” విశ్వసించింది. దీనిని ప్రపంచానికి చేసి చూపాలి. 
   స్వయంసేవకులు వ్యక్తి పూజ చేస్తారని కొందరు ఆక్షేపిస్తుంటారు. అలా అన్నా మాకు విచారం లేదు. కాని దాక్టర్‌జీ అనంతరం కూడా సంఘకార్యం మునుపటివలె నడుస్తూనే ఉన్నది. మరి డాక్టర్‌జీపట్ల స్వయంసేవకులకు '“అంధభక్తి లేదనేది ఈ విషయంవల్ల బుజువు కావడంలేదా ? నన్నీ మహా పదవికి దాక్టర్‌జీ ఎందుకు నియోగించారో నాకు తెలియదు. కాని ఆయనకు నాపై అపారమైన అనురాగముండేదని మాత్రం నేను చెప్పగలను. ఆ ప్రేమముందు తల్లితండ్రుల ప్రేమ, గురుశిష్యుల ప్రేమకూడా వెలవెలబోతాయి. డాక్టర్‌జీ ఉపవిష్ణులైన ఈ పరమ పవిత్ర స్థానంలో కూర్చోడానికి నాకు యోగ్యత లేదని నాకు తెలుసు. డాక్టర్‌జీ అంతరాత్మ నాకు ప్రేరణ నిచ్చి, నా చేత సరియైన పనినే చేయిస్తుందని విశ్వసిస్తున్నాను. నా శరీరాన్నీ మనస్సునూ, ఆత్మనూ దాక్టర్‌జీకి అప్పగించాను. అప్పగించినవాటిని చక్కగా ఉపయోగించుకోగలరని డాక్టర్‌జీపై నాకు విశ్వాసమున్నది.

ధ్యేయమూ, వైఖరీ

సంఘ వైఖరి భవిష్యత్తులో ఎలా వుంటుంది ? అని నే డనేకులు ప్రశ్నిస్తున్నారు. సంఘ ధ్యేయమూ వైఖరీ మొదలే నిశ్చయింపబడినాయి. భవిష్యత్తులో వీటిలో మార్పు రానక్కరలేదు. సంఘం ప్రస్తుతం జరుగుతూన్న రాజకీయ ఉద్యమాలలోనూ లేక ఆందోళనలోనూ పాల్గొనదలచుకోలేదు. డాక్టర్‌జీ ప్రసాదించిన కార్యపద్ధతినీ సిద్ధాంతమునూ అనుసరించే మన మీ కార్యాన్ని చేయాలని నిశ్చయించుకున్నాం. డాక్టర్‌జీ తదనంతరం సంఘ మేమవుతుందని అనేకులు సందేహిస్తున్నారు. ఇలాంటి ప్రశ్నకు నిజంగా తావులేదు. సాహసంతో ప్రతికూల పరిస్థితులను ఎదిరిస్తూ లెక్క చేయక, సంఘం తన మార్గంలో తన పద్ధతిలో నిరంతరం పురోగమిస్తూనే ఉంటుంది. ఇందులో సందేహంలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా ఉన్నత స్థాయిని అందుకుంటూనే వుంటాం. ఈ “శక్తి” నిరాటంకంగా వృద్ధి అవుతూనే ఉంటుంది. ఒకనాడు సమస్త రాష్ట్రంలో ఈ “శక్తి యే కన్పడుతుంది. మన మెవరికీ భయపడం. నిరంతరం సేవద్వారా వృద్ధింగతమయ్యే యీ “శక్తిని చూచి దుష్టులుకూడా భయపడి తీరుతారు. ఒకే ధ్యేయాన్ని ఒకే మార్గాన్ని నిశ్చయించుకొని, వాటిని అనుసరిస్తూనే మనం పురోగమిస్తాం. ఈ విషయాన్ని మీరు విశ్వసించండి.

 మనం సిద్ధాంతోపాసకులం

నాయకత్వం వహించాలనే కోరిక నాకు ఎప్పుడూ లేదు. ఏదో ఒక మహోత్తమ సిద్దాంతాన్ని ఉపాసించే సేవకుణ్ణిగా ఉండాలని నా యిచ్చ. అలాంటి మహోత్తమ సిద్ధాంతాన్ని చూపగల ఆదర్శమూర్తియైన మహాపురుషుడు నాకు లభించినందుకు ఎంతో సంతోషముగానున్నది. హృదయంలో సేవాభావం నిజంగా ఉంటేనే సంఘంలో స్వయంసేవకుడుగా గాని, అధికారిగా గాని వుందగలడు. డాక్టర్‌జీ నన్ను సేవచేయమని ఆజ్ఞాపించారు. స్వయంసేవకులందరు సర్వస్వార్పణం చేస్తామనే ప్రతిజ్ఞ తీసుకునే సంఘంలో ప్రవేశిస్తారు. కాని పదవీ ప్రాముఖ్యంవల్ల నాపై యీ నైతిక బాధ్యత మరింత అధికమైంది. ఇది నేను పూర్తిగా గ్రహించాను. దీనికై నేను సిద్ధంగా కూడా ఉన్నాను. “నాది” అని భవించగలదేదీ నాకు లేదు. ఉన్నదేదో అది అంతా డాక్షర్‌బీ ఇచ్చిందే. ఆయన తపోమహిమవల్ల యీ కార్యక్రమం సక్రమంగా జరుగుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. స్వయంసేవకులందరి హృదయాంతరాళలలో వెలిగే ఈ జ్యోతి మన కర్తవ్యాన్ని నిర్వహించుకోడానికి అవసరమైన వెలుగును తప్పక ప్రసాదిస్తుందని నా విశ్వాసం. డాక్టర్‌జీ మొదట నిర్మించిన పునాదిమీదనే ఆధారపడి సంఘం నేటివరకూ  పనిచేస్తున్నది. ఇకముందు కూడా ఇలాగే నడుస్తుంది. ఈ మహోత్తమధ్యేయం త్వరలోనే సాఫల్యాన్ని పొందగలదని నా విశ్వాసం.
   తదనంతరం సర్‌సంఘచాలక్‌గారు విచ్చేసిన అతిధు లందరికీ- ముఖ్యంగా భోంస్లే రాజపుత్రులకు-ధన్యవాదాలర్పించారు. శ్రీమాన్‌ రాజా బహదూర్‌ రఘోజీరావ్‌ భ్లోంస్తే అస్వస్థులుగా ఉన్నందువల్ల రాజాలక పోయినందుకు విచారం వెలిబుచ్చుతూ, రాజపరివారానికి సంఘంపట్ల ఉన్న ఆదరాభిమానాలను శ్లాఘించారు. చివరకు ధ్వజప్రణామం అయినతరువాత రిట్రీట్‌ బిగుల్‌ అయింది. ధ్వజావతరణం జరిగింది. దానితో ఆ సమావేశం సమాప్తమయింది.

   స్వర్ణస్తులళైన తమ ఆద్య సర్‌సంఘచాలక్‌గారికి (శ్రద్ధాంజలి నర్చ్పించడానికి సమస్త భారతం నుంచి సమావేశమైన ప్రతినిధుల హృదయాలలోనూ, తదితర స్వయంసేవకుల హృదయాలలోనూ ఈ సమావేశంవల్ల ఎంతో గంభీర పరిణామం కన్పించింది. ప్రతి వ్యక్తి హృదయంలోనూ దాక్టర్‌జీ స్మరణయే; పెదవులపై దాక్టర్‌జీ పవిత్రనామం. కంద్లముందు డాక్టర్‌జీ ప్రతిమ. వేదనతోనూ, విచారంతోనూ కృంగిపోతూ విచ్చేసిన వారంతా తమ తమ స్థానాలకు తిరిగివెళ్ళారు. ఈ కేంద్ర నాయకత్వాన నిష్టతో మహోత్తమ కార్యాన్ని కీర్తి మందిరానికి పుఠరోగమింప చేయాలనే ఉదాత్తభావం ప్రతి పహృదయంలోనూ వెళ్ళేప్పుడు కన్పించింది.
    ఈ కార్యక్రమాన్ని కీర్తిమందిరానికి పురోగమింప చేయగలిగినప్పుడే దాక్టర్‌జీ స్మృతి కూడా నిరంతరం కీర్తి మందిరంలో ్రతిష్టితం కాగలదనే విశ్వాసమే దీనికి కారణం.

♦♦♦♦♦♦

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top