అశని పాతము - పరమ పూజనీయ డాక్టర్‌జీ ఆకస్మిక మరణవార్త - The Most Venerable Dr.Hedgewar sudden death

Vishwa Bhaarath
0
అశని పాతము - పరమ పూజనీయ డాక్టర్‌జీ ఆకస్మిక మరణవార్త - The Most Venerable Dr.Hedgewar sudden death

: అశని పాతము : 

విషాద వార్త

హఠాత్తుగా నిర్మలమైన ఆకాశంనుండి పిడుగుపడ్డట్లు పరమ పూజనీయ డాక్టర్‌జీ ఆకస్మిక మరణవార్త జేష్ట బహుళవిదియా శుక్రవారం (21 జూన్‌ 1940) రోజున లక్షలకొలది స్వయంసేవకుల పృాదయాలపై ఆశనిపాతమై ప్రళయాన్ని సృష్టించింది. చాలామందికి డాక్టర్‌జీ అనారోగ్యాన్ని గురించి ఎక్కువగా తెలియదు. అలాంటి సమయంలో ఆకస్మికంగా పిడుగులాంటి ఈవార్తను వినేసరికి రాతిబొమ్మలవలె అందరూ నిశ్చేష్టులైనారు. ఎక్కడపని అక్కదే వదలి “ఇదేమిటి! ఎలా జరిగింది!” అనే ప్రశ్నించుకున్నారు. 'డాక్టర్‌జీ స్వర్గస్థులైనారనే శబ్దాలకు అర్ధంకూడా ఎవరికీ తోచలేదు. ఎవరిని చూచినా చెవిటిలా, మూగలా కొయ్యబారిపోయినారు. వేల గొంతుకలు దుఃఖంతో పూడుకుపోయినాయి. గుండెలు వ్రయ్యలవుతవేమో ననిపించింది. కన్నీటికాల్వలు ప్రవహించాయి. ఒక నిమిషంక్రితం వరకు వికసించి చిరునవ్వులు గుబాళించే ముఖాలన్నీ వాడిపోయినాయి. డాక్టర్‌జీ భవ్యమూర్తి కంద్లకుకట్టినట్లు ప్రతివ్యక్తికి కన్పించింది.

ఇది ఎలా సంభవించింది ? మన డాక్టర్‌జీ ఎలా గతించారు ? ఇక ముందు ఈ హిందూజాతిగతి ఏమికాను ? సంఘం ఎలా నడుస్తుంది ? ఒకటేమిటి ? వేలకొలది ప్రశ్నలు హృదయాలను కంపింపచేశాయి. ఎటుచూసినా ఏమీతోచని దుఃఖపుపొంగే కన్పించింది.
    కొన్నాళ్ళనుంచి డాక్టర్‌జీ ఆరోగ్యం ఎగుడుదిగుడుగా ఉన్నదని అందరికి తెలుసు. చాలామందికి అప్పట్లో వారు అస్వస్థతగా ఉన్నారని తెలుసు. కాని ఒక్కరుకూడా- చివరికి 24 గంటలు వారిని అంటిపెట్టుకొని ఉండేవారు సహితం- ఈ వ్యాధే డాక్టర్‌జీని పొట్టన పెట్టుకుంటుందని గురువారం రాత్రివరకూ అనుకోలేదు. అందుకని ఈ వార్త హఠాత్తుగా వినేసరికి నాలుగువైపులా హాహాకారాలు వ్యాపించాయి. 
    16 మే సాయంకాలం జ్వరం వచ్చింది. అప్పుడే పూనా ప్రాంత పర్యటన ముగించుకుని వచ్చినందువల్ల ఆ ఆయాసంమూలాన ఏదో ఆరోగ్యం కుంటుపడి ఉండవచ్చునని అనుకుంటూనే కొంతకాలం గడచింది. కానీ జ్వరం తగ్గటం మాటపోయి, ఆరోజుకారోజు తీవ్రంకావడంతో ఆందోళన అధికమైంది. మందు మాకులు జరుగుతూనే ఉండేవి. క్రమేపీ ఆరోగ్యం చెడిపోయి శరీరం శిథిలమై 37 రోజులు బాధపడి, జర్జరమైన ఆ భౌతికదేహాన్ని శాశ్వతంగా విడిచి డాక్టర్‌జీ అమరులైనారు.

వ్యాధి చరిత్ర

   దాక్టర్‌జీ చిట్టచివరిజబ్బును గురించి చెప్పేముందు రెండు మాటలలో ఆయన శరీరస్థితిని, అస్వస్థతను గురించి తెలపడం అవసరం. 1925లో మొట్టమొదట సారిగా న్యుమోనియా జ్వరం వచ్చిన తరువాత దాదాపు ఎనిమిది సంవత్సరాల వరకు అంటే 1932 వరకు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. 1980లో జరిగిన ఆందోళన సందర్భంలో బంధితులైనప్పుడు జైల్లోకూడా ఆరోగ్యంగానే ఉండేవారు. జైల్లో నానాకష్టాలు అనుభవిస్తున్నా సంతోషంగా కాలం గడపడంవల్ల, 18 పౌన్ల బరువు హెచ్చింది. మానసికంగానూ, శారీరకంగానూ, ఈజైలుయాత్ర శుభంగానే పరిణమించిందని ఆయన అనేవారు. ఆతరువాత సంఘకార్యం ఇతోధికంగా వ్యాపించడంవల్ల, ఎప్పుడూ పర్యటన చేస్తూండేవారు. రాత్రిళ్లు మేల్ళొంటూండడం కూడా తటస్థించేది. ఎడతెరిపిలేని ఈ పరిశ్రమవల్ల డాక్టర్‌జీ శరీరం దెబ్బతిన్నది. పూర్వం ఎప్పుడో వీపు ఎడమభాగంలో కనుపించిన నొప్పి అప్పుడు మళ్ళీ ప్రత్యక్షమైంది. “మాలిష్‌ వల్లనూ, ఆవిరికాపుల వల్లనూ కొంత ఉపశమనం కనుపించేది. బాధ అపరిమితంగా హెచ్చి సహించడం వల్ల కానప్పుడుతప్పు, ఇలా వారు నొప్పివల్ల బాధపడుతున్నారని కూడా ఎవరికీ తెలిసేదికాదు. వీపు కుడిభాగం ఎడమభాగంకన్నా ఎంతో చల్లగా ఉంటూఉందేది.

19382 నుంచి 1940 వరకు

   1932లో మరీ ఆరోగ్యం చెడినందున కొంతకాలంపాటు పూర్తిగా విశ్రాంతి తీసికొనితీరాలని డాక్టర్లు సలహానిచ్చారు. సలహా ననుసరించి రెండు నెలలపాటు “థంతోలీలో" డా. హరదాస్‌గారి ఇంట్లో గడిపారు. 1934లో మళ్ళీ ఆరోగ్యం చెడిపోవడంవల్ల 'ధరమ్‌పేటిలో శ్రీకృష్ణారావ్‌వైద్యగారి దగ్గర నాలుగు నెలల పాటు ఉన్నారు. ఈ రెండు సమయాలలోనూ పేరుకు విశ్రాంతి అనేగాని, డాక్టర్‌జీకి విశ్రాంతి మచ్చుకైనా లభించలేదు. స్వయంసేవకులూ, కార్యకర్తలూ, మిత్రులూ నిరంతరం కలుస్తూనే ఉండేవారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, గోష్టీసమావేశాలు మొదలైన కార్యక్రమాలు కూడా ఎడతెరిపిలేకుండా జరుగుతూనే ఉండేవి. పట్టణానికి నాలుగు మైళ్ళదూరాన ఎక్కడో ధరమ్‌ పేటలోఉన్నాా దాక్టర్‌జీని చూడడానికి సయంసేవకులు గుంపులు గుంపులుగా వెళుతూనే ఉండేవారు. దాక్టర్‌జీ భూమిఅంచుల్లో ఉన్నా, గాలించి ఆయనను సందర్భించనిదే స్వయంసేవకులకు తృప్తి ఉంటుందా ! అదే విధంగా డాక్టర్‌జీ కూడా స్వయంసేవకులకు చూడనిదే వుండగలరు ? ఇక శరీరానికి విశ్రాంతి లభించడం ఎలా ? మానసిక విశ్రాంతి విషయం ఆలోచించనైనా వీలుపడదు. 
   సంఘానికి సంబంధించిన ఆలోచనలూ భావాలూ ఎల్లప్పుడూ మనస్సును కలవరపెడుతూ వుండేవి. ఈ ఆలోచన లకు అంతేమిటి ? మరి ఆయన శరీరానికిగానీ, మనస్సుకుగాని శాంతి లభించడం ఎలా ? అప్పటినుంచి ప్రతిసంవత్సరమూ, కొంతకాకున్నా కొంతైనా విశ్రాంతి తీసుకొమ్మని వైద్యులు సలహాలిస్తూవుండేవారు. కాని క్రమేషి సంఘకార్యం బహుముఖంగా వ్యాపించడం వల్ల యావద్దేశంలోని కార్యభారంకూదా నానాటికి పెరిగిపోతూ ఉండేది. సమావేశాలకు అంతేలేదు. పర్యటనలు ఎక్కువవుతూవుందేవి. ఇక విశ్రాంతిఅనేమాట లేకుండాపోయింది. 1939లో " శిక్షణ శిబిరం” తరువాత, శ్రీ బాబాసాహెబ్‌ ఘటాటేగారు ఎంతో వత్తిడి చేసినందువల్ల జూన్‌ 20వ తేదీన 'దేవలాలీకి విశ్రాంతికై వెళ్ళారు. విశ్రాంతిమాట ఏమోకాని, పోగానే న్యుమోనియాజ్వరంవల్ల ఆరోగ్యం మరీ చెడిపోయింది. ఐనా శ్రీయుతులు బాబాసాహెబ్‌, డా.దామ్లే (నాసిక్‌) డా! చౌబే, శ్రీరాజాభావూ సాఠే మొదలైనవారు ఎంతో ప్రేమతో కనిపెట్టుకొనివుండి ఉపచారాలు చేసినందువల్ల వ్యాధి నెమ్మదించింది.

రాజగీర్‌ ప్రకృతిచికిత్స

   ఆ తరువాత ఒక సంవత్సరంవరకు యెప్పుడూ దాక్టర్‌జీ అనారోగ్యంగానే ఉంటుండదేవారు. శరీరమంతా చెమటతో తడిసి ముద్దబెతూండేది. అందుకని కనీసం అరడజను బనీన్లు రోజూ తొడుగుకొనడానికీ, మరునాటికి అరడజను బనీన్లు ఉతికించడానికీ సిద్ధంగా ఉండేవి. కృత్రిమంగా చల్లపరచిన నీళ్లూ, ఎలక్ట్రికల్‌ ఫాన్‌, వట్టివేళ్ళ తడికెలు మొదలైన శీతలోపచారాలు ఆయనకు సరిపడేవికావు. అందుకే అన్ని బుతువుల్లోనూ ఉన్ని గుడ్డలే ఉపయోగించవలసి వచ్చేది. 1935లో ఒకసారి వివాహంలో పొరపాటున మంచునీరు (ఐస్‌ వాటర్‌) త్రాగించారు. అందువల్ల దగ్గుతో మూడు సంవత్సరాలు బాధపడ్డారు. ఇలాంటి సమయాలలో ఆయన మొగమాటానికి అంతుండేది కాదు. తనకొరకు అనవసరంగా ఇతరులు కష్టపడడంకానీ, ఇబ్బందిపడడంకానీ వారికి నచ్చకపొయ్యేది. జ్వరం ఎంత కష్టపడడంకానీ, ఇబ్బందిపడడంకానీ వారికి నచ్చకపొయ్యేది. జ్వరం ఎంత తీవ్రంగావున్నా తమపనులు తామే చేసుకుంటూండేవారు. “మహారాష్ట్ర పత్రిక సంపాదకులు శ్రీ గోపాలరావ్‌ ఓగ్లే ఇంకా ఇతర మిత్రులు బలవంతం చేసినమీదట 1940 జనవరిలో శ్రీ అప్పాజీ జోషీ మొదలైన నలుగురైదుగురు సహచరులతో బీహారులోవున్న రాజగీర్‌కు “జెషధీజల చికిత్స నిమిత్తం వెళ్ళి రెండు నెలలపాటు ఉన్నారు. 
   అక్కడి వేడినీటి బుగ్గ్లలవద్ద స్నానంవల్ల ఆరోగ్యం కొంత కుదుటబడకపోలేదు. ఏప్రిల్‌ నెల ఆరంభంతో గ్రీష్మారంభం కాగానే అక్కడనుంచి తిరిగి వచ్చారు. రాజగీర్‌లోనైనా ఆయనకు నిజంగా విశ్రాంతి లభించలేదు. ఉత్తర ప్రత్యుత్తరాలు ఎప్పటివలెనే ఉండేవి. ఆయన ఎక్కడవుంటే అక్కడ సంఘశాఖ స్థాపించడం తప్పదు. వెళ్ళడం చికిత్సకు, విశ్రాంతికి, కాని బీహార్‌ ప్రాంత పర్యటనచేసి, శాఖలు స్థాపించి వచ్చారు. ఇదీ ఆయన విశ్రాంతి తీసుకునే పద్ధతి. ఆయన జీవితంలో ప్రతి ఘడియ దేశంకొరకే ఉపయోగింపబడింది. విశ్రాంతి సమయంలోకూడా సంఘ కార్యక్రమంలేనిదే ఆయనకు శాంతి లభించదు. ఆయనకు విశ్రాంతిస్థలం సంఘస్థాన మొక్కటే అనేది యదార్ధమైన విషయం.

అంతులేని వీపునొప్పి

  రాజగీర్‌నుంచి తిరిగిరాగానే శిక్షణ శిబిరం) ఆరంభమయ్యే తిథి సమీపించింది. పూనా శిబిరంలో 15 రోజులపాటు కార్యకర్తలతోనూ, స్వయంసేవకులతోనూ సంతోషంగా గడిపి, మే 16న నాగపూర్‌ చేరుకున్నారు. ఇక్కడకూడా ఆయన శిబిరంలోనే బస చేశారు. కాని ఆ రాత్రే జ్వరం వచ్చి ఉష్ణోగ్రత క్రమేపి పెరిగింది. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత 24 రోజులవరకు శిబిరం నడిచింది. కాని ఎప్పటివలెకాక, జబ్బుతో మంచంలో ఉన్నందున స్వయంసేవకులతోనూ కార్యకర్తలతోనూ కలసి మెలసి కార్యక్రమాలలో పాల్గొనలేకపోయారు. కనీసం మాట్లాడే స్థితిలోనూ లేరు. దీనివల్ల ఆయన మనస్సు చాలా బాధపడింది. ఇప్పటి ఈ జబ్బుకు కారణం లోతుపాతులు తెలియని ఆ వీపునొప్పే, ఆ నొప్పికి అంతులేదు. నొప్పివల్ల జ్వరంకూడా అపరిమితంగా హెచ్చడం ఆరంభించింది.

ఓ.టి.సి.లో డాక్టర్‌జీ

   మొత్తం శిబిరం నడిచినరోజులలో కేవలం మూడుసార్లు మాత్రమే స్వయంసేవకులకు డాక్టర్‌జీ దర్శనం లభించింది. 16వ తేదీన పూనా నుంచి వచ్చిననాటి మధ్యాహ్నం “బౌద్దిక్‌ వర్ష (ఉపన్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ తరువాత మళ్ళీ వారిని చూడాలనే కుతూహలం స్వయం సేవకులకు అపరిమితంగా ఉన్నందునా, డాక్టర్‌జీకి కూడా స్వయంసేవకులను చూడాలనే
కోరిక ఉన్నందునా జూన్‌ 2 ఆదివారం సాయంకాలం జరిగిన “'బౌద్ధిక్‌ వర్గులో డాక్టర్‌జీ పాల్గొన్నారు. డాక్టర్‌జీ ఇచ్చానుసారం శిబిరానికి సర్వాధికారిగావున్న పూజనీయ మాధవరావ్‌ గోళ్వల్కర్‌ ఆనాడు 'జయసింగ్‌కు ఛత్రపతి శివాజీ లేఖ” అనే విషయాన్ని గురించి రెండుగంటలు ఆలోచనలను రేకెత్తించి, స్ఫూర్తినిచ్చే ఉపన్యాసం ఇచ్చారు. మూడవసారి దర్శనం లభించింది. చివరిరోజున సమారోపమహోత్సవ సందర్భంలో 9వ తేదీ ఉదయాన, అంతకు క్రిందటిరోజున బహిరంగసభలో పాల్గొనాలని ఎంత కోరికవున్నా ఆరోగ్యందృష్పా బాధతో బసలోనే వుండవలసివచ్చింది. అందుకని ఆ మరునాటి ఉత్సవంలో అంటే 9వ తేదీన సమావేశానికి తీసుకువచ్చారు. మాటాడేటప్పుడు కష్టం కలుగకుండా వుండేందుకు దూరశ్రవణ యంత్రాలు ఏర్పాటు చేశారు. విభిన్న ప్రాంతాలనుంచి వచ్చిన స్వయంసేవకులు మాట్లాడిన తరువాత పరమపూజ్య దాక్టర్‌జీ సంభాషించారు. అది కొద్దిసేపే అయినా నిజంగా ఆ ఉపన్యాసం స్వయంసేవకుల హృదయాలను కదలించింది. ఇదే డాక్టర్‌జీ అంతిమ సందేశం.

దాక్టర్‌జీ అంతిమ సందేశం

  " మాననీయ సర్వాధికారీ, ప్రాంత సంఘచాలక్‌ మహోదయా, సంఘ అధికారులారా, స్వయంసేవక సోదరులారా. ఈ రోజు కనీసం రెండు మాటలైనా మీ ముందు మాట్లాడగలనో లేనో చెప్పలేను. గత 24 రోజులనుండి మంచంలో పడివున్నానని మీకు తెలుసు. సంఘదృషవ్టా ఈ సంవత్సరం చాలా అదృష్టకరమైనది. నా కండ్రముందు నేనీనాడు సమస్త హిందూ రామ్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ఒక చిన్న దృశ్యమూర్తిని సందర్భిస్తున్నాను. కాని ఇన్నాళ్ళ నుండి నాగపూర్‌లోనే వుంటున్నా అనారోగ్యంవల్ల ప్రత్యక్షంగా అందరితోనూ పరిచయం చేసుకొనే మహద్భాగ్యం లభించలేదు. పూనా ఓ.టి.సి.లో వున్న పదిహేను రోజుల్లో ప్రతి స్వయంసేవకునితోనూ పరిచయం చేసుకున్నాను. నాగపూర్‌ ఓ.టి.సి.లోకూడా అలాంటి అదృష్టమే లభిస్తుందని ఆశించాను. కాని ఆ అవకాశం నాకు లభించలేదు. ఈనాడు ఇందువల్లనే మీ దర్శనం చేసుకునే నిమిత్తం వచ్చాను. మీకూ నాకూ అంతగా పరిచయం లేకున్నా ఒకరిపై ఒకరు ఇలా ఆకర్షింపబడదానికీ, ఒకరి హృదయాలు మరొకరివైపు ఇలా పరుగెత్తడానికీ కారణం ఏమిటి?
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సిద్ధాంతమే అలాంటిది. అందువల్లనే ఒకరికొకరు తెలియపోయినా ప్రథమ దర్శనంతోనే పరస్పర ప్రేమానురాగాలు ఉత్పన్న మవుతాయి. ఒకటి రెండు మాటలతోనే స్నేహితులౌతారు. ఒక చిరువ్వుతోనే ఒకరినొకరు గుర్తిస్తారు. కొన్ని రోజుల పూర్వం పూనాలో ఒకసారి నేనూ శ్రీ కాశీనాధరావు లిమయే (సాంగ్లీ) కలిసి 'లకడీ పూలొ మీదుగా నడుస్తున్నాం. మా కెదురుగా తొమ్మిది పది సంవత్సరాల పిల్లలిద్దరు వస్తున్నారు. మా ప్రక్మనుంచే వెడుతూ ఒక చిరునవ్వు నవ్వారా యిద్దరూ. వీరిద్దరూ సంఘ స్వయంసేవకు'లని నేను లిమయేగారితో అంటే ఆశ్చర్యంతో ఆయన ఎలాంటి పరిచయం లేనిదే ఆ యిద్దరినీ స్వయంసేవకులని ఎలా గుర్తించగలిగానో తెలుసుకోలేక చిక్కులో పడ్డారు. ఆయనకిది ఒక సమస్యగా తోచింది. “వారిద్దరూ స్వయంసేవకులని తెలిపే ప్రత్యేకమైన దుస్తులనేవి కూడా లేవు. ఐనా వీరు స్వయంసేవకులని మీరెలా చెప్పగలరు”ని ఆయన ప్రశ్నించారు. 'నేను అంటున్నాను గనుకనే అని అంటూ “మీరు పరీక్షించదలచుకున్నారా” అని కొంత దూరం నడిచిన ఆ పిల్లలను పిలచి 'మే మెవరమో మీకు తెలుసా ? అనినేనా బాల స్వయంసేవకుల నడిగాను. తెలుసు అంటూ ఆ ఇద్దరూ ఇలా అన్నారు. “శివాజీ మందిర్‌లో ఉన్న బాలశాఖకు రెండు సంవత్సరాల పూర్వం మీరు వచ్చారు. మీరు మా సర్‌సంఘచాలక్‌ డా॥ హెడగేవార్‌గారు, వీరు సాంగ్లీకి చెందిన కాశీనాధరావ్‌ లిమయేగారు.”

     సంఘం చేస్తూన్న తపస్సుకు ఇది ఫలితం. ఇది ఎవరో ఒకరు చేయగా ఫలించిన కార్యం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉపన్యసించినది మద్రాసు వాస్తవ్యులు శ్రీ సంజీవకామత్‌. అపరిచితులుగా వచ్చి, నాలుగు రోజుల్లోనే మనకు పరిచితులై మనలో ఒకరై తిరిగి వెళుతున్నారు. ఈ గౌరవం సంఘానిదే కాని, ఎవరో ఒక వ్యక్తిదికాదు. భాషలు వేరైనా, ఆచారాలు వేరైనా, పంజాబ్‌, బెంగాల్‌, మద్రాసు, బొంబాయి, సింధు మొదలైన ప్రాంతాల స్వయంసేవకులు పరస్పరం ఇంత (ప్రేమను ఎందుకు అనుభవిస్తున్నారు ? రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సభ్యులు కనుకనే, ఒక సంఘ స్వయంసేవకుడు మరొక స్వయంసేవకుణ్ణి తన సోదరునికన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అన్నదమ్ములైనా, ఆస్తిపాస్తుల కొరకు వివాదపడతారేమోగాని స్వయంసేవకులలో పరస్పరం అలాంటిది ఉండనేరదు. 24 రోజులనుంచి నేను మూలపడివున్నా నా హృదయం మీతో-ఇక్కడనే- ఉన్నది. నిన్న సాయంకాలం ఐదు నిమిషాలపాటు, కనీసం ప్రార్ధనకైనా సంఘస్థాన్‌లో ఉండాలని హృదయం తపించింది. కాని దాక్టర్లు గట్టిగా వద్దని నివారించడంవల్ల ఆ కోరికను చంపుకొని ఇంట్లోనే ఉండవలసి వచ్చింది.

    ఈ రోజు మీరంతా తిరిగి మీమీ స్థానాలకు వెడుతున్నారు. (ప్రేమ పూర్వకంగా మీకు నా వీడ్కోలు ఇస్తున్నాను. మనం ఇప్పుడు విడిపోతున్నా విచారించవలసిన సమయం మాత్రం కాదిది. మీరే పనిని సఫలమొనర్చడానికి ఇక్కడికి వచ్చారో ఆ పనిని పూర్తి చేయడానికే మీమీ స్థలాలకు వెడుతున్నారు. శరీరంలో ప్రాణాలున్నంత వరకు సంఘాన్ని మరచిపోము” అని ప్రతిజ్ఞ చేసుకోండి. ఏ వ్యామోహంవల్లనైనా సరే మీరు చలించ కూడదు. “అయిదారు సంవత్సరాల పూర్వం నేను సంఘ సభ్యుణ్ణి' అని చెప్పు కోవలసిన దురవస్థ మీకు కలుగకూడదు. మనం జీవించి
ఉన్నంతవరకూ స్వయంసేవకులమే. తను మనో ధనాలను వినియోగించి సంఘకార్యాన్ని నిర్వహిస్తామని మీరు స్వీకరించిన ప్రతిజ్ఞను నిరంతరం చైతన్యయుక్తంగా ఉంచుకోండి. ప్రతిదినం నిద్రించబోయేముందు ఈ రోజు నేను చేసిందేమిటి ? అన్ని ప్రశ్నించుకోండి. సంఘకార్యక్రమాన్ని నియమానుసారం చేయడంవల్లకానీ కేవలం ప్రతిరోజూ సంఘశాఖకు నియమానుసారం వెళ్ళటంవల్లకానీ సంఘకార్యం పూర్తి అవుతుందని భావించకండి. ఆసేతు హిమాచల వ్యాపించియున్న విశాల హిందూసమాజాన్ని సంఘటిత పరచాలి. మన నిజమైన కార్యరంగం సంఘంలో కాక ఇతర జనసముదాయంలోనే ఉన్నది. సంఘం కేవలం స్వయంసేవకులకనే
కాదు. సంఘంలో లేని హిందువులందరి కొరకుకూడా. వారికి నిజమైన దేశోద్ధరణ మార్గాన్ని చూపవలసిన బాధ్యత మనది. దాని నిర్వహణకు సంఘటనతప్ప మరొక మార్గం లేదు. హిందూజాతికి సంపూర్ణ కళ్యాణం ఈ సంఘటనవల్లనే చేకూరుతుంది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం మరే ఇతర పనులనూ చేయదలచుకోలేదు. భవిష్యత్తులో సంఘం ఏమి చేస్తుందనే ప్రశ్నకు అర్థం లేదు. ఈ సంఘటన కార్యాన్నే సంఘం మరింత వేగంతో నిర్వహిస్తుంది. ఇలా చేయగా చేయగా భారతవర్షమంతా సంఘమయమై కనుపించే పర్వదినం తప్పక చూడగలం. ఆ పైన హిందువులను కుటిలదృష్టితో చూడగల సాహసం మరెవ్వరికీ ఉందదు. ఇతరులమీద దండయాత్రలు చేయడానికి మన మీ కార్యక్రమాన్ని తల పెట్టలేదు. కాని ఎవ్వరూ మన నెత్తిన ఎక్కకుండా నిరంతరం జాగరూకులమై ఉండాలి. ఈనాడు నే నేదో క్రొత్త విషయాన్ని మీకు తెలపడంలేదు. సంఘ స్వయంసేవకులందరూ సంఘ కార్యమును తమ జీవిత సర్వస్వంగా భావించాలి. సంఘ కార్యమే మన పరమ లక్ష్యమనే ఈ భావాన్ని మీ హృదయాలలో అంకితం చేసికొని మీమీ ప్రాంతాలకు వెడతారని ఆశిస్తూ మీ అందరికీ స్నేహపూర్వకంగా నా వీడ్కోలు సందిస్తున్నాను.

తిరిగి అస్వస్థత

ఆ తర్వాత కమేపీ దాక్టర్‌జీ ఆరోగ్యం చెడుతూనే వచ్చింది. జ్వరం తగ్గడమనేదే లేదు. డాక్టర్ల కోరికపై ఆయనను పరీక్షించడానికి 'మేయో” హాస్పిటల్‌కు తీసుకువెళ్ళారు. అక్కడ డాక్టర్లు వారిని చాలా జాగ్రత్తగా పరీక్షించారు. 'యక్స్‌రే” ద్వారా ఫోటో తీసుకున్నారు. ఎంత చేసినా వీపులో నొప్పివున్న భాగాన్ని మాత్రం కనిపెట్టలేకపోయారు. నాగపూర్‌ ప్రఖ్యాతవైద్యులు శ్రీ డేవిడ్‌ కూడా ఊపిరితిత్తులను పరీక్షించారు. కాని వ్యాధి అంతు దొరకలేదు. 
   మేయో హాస్పిటల్‌లో జరిగిన పరీక్ష తర్వాత డాక్టర్‌జీని మాననీయ ఘటాటేగారి ఇంటికి మార్చారు. బుధవారం అంతా చాలా ఆందోళనతోనే గడిచింది. గురువారం ప్రొద్దున్న డా॥ హరదాస్‌, డా॥ వించురే, డా॥ జె. ఎల్‌. శర్మగార్లు తిరిగి నాడిని చూసేసరికి, పరిస్థితి చాలా ప్రమాదంగా కన్పించింది. రక్తపుపోటు ఎక్కువగా కన్చించినందువల్ల శర్మగారు “లంబర్‌ పంచరొ చేయడానికి నిశ్చయించుకున్నారు. “లంబర్‌ పంచర్‌ చేయవలసినంత పరిస్థితి వచ్చిందని తెలియగానే దాక్టర్‌జీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ శరీరస్థితి ఎంతవరకు వచ్చిందో గ్రహించ గలిగారాయన. ఇక శరీరయాత్ర “'మూన్నాళ్ళ ముచ్చటి అనికూడా తెలుసుకున్నారు. ఈ భావాలతో వారి హృదయంలో ఒక తుఫాను లేచింది. ఏకాంతంగా కొంతసేపాలోచించడానికి అనుమతికోరి, అటుతరువాత కొంతసేపటికి శ్రీమాధవరావ్‌ గోళ్వల్మర్‌ను లోనికి రప్పించి, అక్కడవున్న నలుగురిముందు “లంబర్‌ పంచర్‌ చేయడం తప్పనిసరి ఐతే చేయవచ్చు. కాని ఇటుపిమ్మట సంఘకార్యభారం మీరు నిర్వహించవలసి ఉంటుంది. అదిమాత్రం జ్ఞాపకముంచుకోండి” అని అన్నారు. కాని డాక్టర్లు ఏదో తమలో తాము ఆలోచించుకొని అప్పటికి “లంబర్‌ పంచరొ చేయనవసరంలేదని నిశ్చయించుకున్నారు. రాత్రికో లేదా మరునాటికో చూడవచ్చునన్నారు. అప్పటికి మాత్రం ఆగటమే యుక్తమని నిశ్చయింప బడింది.

    మధ్యాహ్నం పరిస్థితి మరీ అధ్వాన్న మయింది. ఏదో భయంకరమైన మనోవ్యధ ఆయనను బాధిస్తున్నట్లు గోచరించేది; ముఖకవళికల్లో ఉగ్రరేఖలు వ్యాపించాయి. నిమిషానికొకసారి మంచంలోనే లేచి కొద్దిసేపు కూర్చోడం, లేచి యిటు-అటు తిరగడం మళ్ళీ కూర్చోడం తిరిగి లేవడం; ఇలాగే చాలా సేపు గడిచింది.

అంతిమ కాళరాత్రి

చుట్టూ ఉన్నవారు ఇదంతా చూస్తూ దిగులుపడిపోయారు. సాయంకాలంవరకూ ఎలాగో సమయం గడిచింది. డా.హరదాస్‌, దా. తత్వవాదీ, దా. చోళ్‌కర్‌ మళ్ళీ వచ్చి పరీక్షించి, ఇక ఒక్క క్షణం ఆలస్యం చేసినా పరిస్థితి చేయి జారుతుందనే భయంతో లంబర్‌పంచర్‌ చేశారు. చేసినప్పుడు సాధారణంగా కొంత నీరు కారడం సహజమే, కాని డాక్టర్‌జీ శరీరంనుంచి కొండవాగులా నీరు ఈవలికి ప్రవహించింది. ఇది జరుగుతూన్నంతవరకు డాక్టర్‌జీకి కల్గిన వేదన భరించనలవి కానిది. మానసిక, శారీరక బాధలు మితిమీరిపోయినాయి. రెండుచేతులా ముఖాన్ని కప్పుకుని అశ్రువులకు దారి వదిలారు... మహాప్రళభయమప్పుడు ప్రపంచాన్ని కంపింపచేసే పెనుగాలి తుఫాను వారి హృదయాన్ని కలిచివేసిందిరాబోలు |! నెత్తురును నీటిగా ధారవోసి ఏ మహత్మార్యాన్ని పెంచి పోషించి పెద్దదిగా చేశారో ఆ సంఘకార్యం తన అనంతరం ఏమికాను ! ఈ దుఃఖంతో వారి మనస్సు ఎంత క్షోభ ననుభవించిందో మాటలతో తెలపడం అసంభవం.
    డాక్టర్‌జీ శరీరంలో కొంత రక్తాన్నికూడా తగ్గించాలని ఆ రాత్రే డా. హర్‌దాస్‌ నిశ్చయించుకున్నారు. నిశ్చయానుసారం చాలావరకు రక్తం తీసినా అనుకున్నంత వెలువడలేదు. డా॥ తత్వవాదీ, డా॥ వించురే మొదలైనవారంతా రాత్రి యావత్తూ అక్కడే గడిపారు. గంటగంటకూ శరీరస్థితి చెడుతూనే వచ్చింది. రాత్రి 11 గంటలనుండి జ్వరం మళ్ళీ హెచ్చింది. ప్రతి రెండు గంటలకూ ఒక్కొక్క డిగ్రీచొప్పున జ్వరం హెచ్చడం ఆరంభమైంది. అర్ధరాత్రి గతించినప్పటి నుంచీ డాక్టర్‌ జీ ముఖవర్చస్సు అతి గంభీరము గానూ, ఉగ్రంగానూ కనిపించింది. ఏదో ఆలోచనాసమాధిలో ప్రవేశించడానికి ప్రయ ల్నిస్తున్నట్లు ఉండేది. రాత్రి 2 గంటలకు డాక్టర్‌జీకి మూర్చ వచ్చింది. ఆ తరువాత తుది గడియవరకూ దాదాపు మూర్చావస్థతోనే గడిచింది. “దాదాపు” అంటే మధ్య మధ్య వారి నోటివెంట ఏవో కొన్ని సంధిమాటలు వెలువడుతూండేవి. దృష్టిని నాసికాగ్రాన బంధించి ఏదో వస్తువును తదేకంగా చూస్తున్నట్లు భాసించేది. తెల్లవారురూమున ముఖంలో అలముకొన్న గంభీర రేఖలు పోయి ప్రసన్నత తాండవించింది. అప్పుడే దాక్టర్‌జీ పెదవులమీద ఒక రెప్పపాటువరకు ఏదో సన్నని చిరునవ్వు మెరసింది. డాక్టర్‌జీ మృదుహాసం చేశారు. ఉపచారం చేస్తోన్న స్వయంసేవకులూ, డాక్టరు తత్వవాదీ మొదలైన వారంతా రాత్రి యావత్తూ జాగరణే చేశారు.

అంతిమ సమయం :

   ఇలా ఆ కాళరాత్రి గడిచి సూర్యోదయం అయింది. కాని అది నిజంగా “కాలదివసమే”. డాక్టర్‌జీని పొట్టన పెట్టుకున్న రాక్షస దినం. ప్రొద్దున్నే ఉష్ణోగ్రత క్రమేపి హెచ్చుతూ 106 డిగ్రీలవరకూ వచ్చింది. శ్రీ ఘటాటేగారు పరుగెత్తి డా॥ హరదాస్‌, డా! ఖరేగార్లను తీసుకు వచ్చారు. కాని డాక్టర్లు పెదవి విరిచి. అవసానకాలం సమీపించిందని తెలిపారు. దానితో ఆశలన్నీ అడుగంటాయి. నాల్గువైపులా హాహాకారాలు వ్యాపించాయి. టెలిఫోన్‌ చేసి నాగపూర్‌లోని సంఘాధికారులనూ, కార్యకర్తలనూ అందరినీ ఘటాటేగారి ఇంటికి పిలిపించారు.
   వారంతా వచ్చేసరికి ఊర్ధ్వ శ్వాస మొదలైంది. మృత్యుదేవత పొంచి కూర్చున్నది. ప్రతి వ్యక్తి పొంగుతున్న దుఃఖాన్నీ, ఎక్కిళ్ళనూ ఆపుకోలేక కన్నీటిని తుడుచుకుంటూ, ఏమీ తోచక డాక్టర్‌జీ శయ్యచుట్టూ తిరుగుతుందేవారు. ఆ చివర గడియలో డాక్టర్‌జీ ఎంత బాధపడ్డారో: చూస్తేనే గుండె పగిలిపోతుందనిపించింది! బయట వరండాలోనూ, ప్రక్క గదులోను తలలు వంచుకొని మిగతావారు కూర్చున్నారు. ఎవరినోటా మాట అనేది లేదు డాక్టర్‌జీ గొంతులోనుంచి వినిపించే గురక ప్రక్క గదుల్లోవారికి కూడా స్పష్టంగా వినిపించేది. దయలేని మృత్యుదేవత చూపుతున్న ఆ క్రౌర్యం చూడ నలవికానిది. ఇలా ఒక గంటసేపు గడిచింది. తొమ్మిదిగంటల ఇరవై ఐదు నిమిషాలైంది. ఒక్కసారిగా శ్వాస ఆగి డాక్టర్‌జీ మెడ ఒక ప్రక్కకు ఒరిగింది. ఇంకేముంది: డాక్టర్‌జీ జీవనజ్యోతి ఆరిపోయిందని అందరూ భావించారు. నాలుగువైపులా ఏడుపులు మొదలైనాయి. ఇంతలో మళ్ళీ శ్వాస ఆరంభమైనట్ట్లూ, ప్రక్కకు జారిన పెదవుల్లోనూ, కనురెప్పల్లోనూ కదలిక వచ్చినట్లు కన్పించింది. ప్రాణం పోలేదు. ఆరిపోతున్న అగ్ని శిఖలలో ఒకటి రెండు జ్వాలలు ఇంకా మిగిలాయి. కాని...కొన్ని క్షణాలలోనే 9 గంటల 27 నిమిషాలకు డాక్టర్‌జీ ఆత్మ అనంతాకాశంలో లీనమైంది. డాక్టర్‌ హెడగేవార్‌ కీర్తిశేషులైనారు. రాష్ట్రీయ  స్వయంసేవక సంఘ ఆద్య సర్‌ సంఘచాలక్‌ డాక్టర్‌ 'హెడగేవార్‌గారు మరణించారు.

    మరణం ! ఎంత అమంగళం ! రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్‌సంఘచాలక్‌గారి మరణమా !ఊహాశక్తినంతా ఉపయోగించి యోచించినా ఊహించుకోలేని ఆ అమంగళ దృశ్యాన్ని ఆనాడు నాగపూర్‌ పౌరులు ఆశ్రుసిక్త నేత్రాలో చూశారు. చూస్తూచూస్తూ ఉండగానే సంఘ ప్రాణశక్తిని నిర్ణయుడైన యమదేవుడు తీసికొనిపోయాడు. ఆ కళ్ళతో ఈ ఒంటితో హిందూరాష్ట్రం స్వతంత్రమై, వైభవోపేతమై విలసిల్లగా చూడాలని యావజ్జీవితం పరితపించిన ఆ భౌతిక శరీరం మాతృభూమి ఒడిలో చేష్టలుడిగి పడిపోయింది. తృప్తిలేని ఆ కన్నులు శాశ్వతంగా మూతపడినాయి.

అన్నిటినీ మించిన ఆఘాతం

 మృత్యుశయ్యచుట్టూ వేలకువేలుగా స్వయంసేవకులు కూడారు. ఇందరు ఉండగానే మన ప్రాణసమానమైన ఆద్య సర్‌ సంఘచాలక్‌ను మన కండ్లముందు నిరయదైవం అపహరించాడు. మరే సందర్భమైనా ఐతే తమ సర్‌సంఘచాలక్‌కు ఏ కొద్ది నష్టం కలిగినా స్వయంసేవకులు తమ రక్తాన్ని ప్రవహింపచేసేవారు. కాని ఆ వీర స్వయంసేవకులే విషాదకరమైన ఈ విధి విధానాన్ని చూస్తూ వెక్కివెక్కి ఏడుస్తూ విహ్వలతతో తపిస్తూ కూర్చోడంతప్ప మరేం చేయగలరు! వారి అధీనంలో ఏమున్నది ? మానవశక్తి పని చేయలేనిచోట రెండు చేతులా ముఖాన్ని కప్పుకొని చనిపోయిన ఆ ప్రేమమూర్తికి ఆశ్రుజలంతో అంజలి అర్పించడమో లేదా పరమేశ్వరుని ప్రార్ధించడమో తప్ప మరోమార్గం ఏమున్నది ? రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఆద్య సర్‌సంఘచాలక్‌క జాలువారినన్ని వేడి కన్నీటి ధారలు మరెక్కడా కనిపించలేదు. సంఘ చరిత్రలో ఇది పరమ విషాదకరమైన ఘట్టం. భగవంతుడు సంఘంమీద ఇంతకు మించిన ఆఘాతం కల్పింపగలడనేది అసంభవం.

అంత్య దర్శనం

ఈ దుఃఖవార్తను వెంటనే తంతిద్వారా అన్ని చోట్లకూ, అందరికి తెలిపారు.నాగపూర్‌ నుంచి “మహారాష్ట్రా, పూనానుంచి “కాల్‌” అనే పత్రికలు ప్రత్యేక జీవితము సందేశము సంచికల ద్వారా ఈ వార్తను ప్రకటించాయి. ఆకాశంనుంచి ఆశనిపాతమైనట్లు అన్ని వైపులా చేష్టలుడిగి నిశ్శబ్దత వ్యాపించింది. డాక్టర్‌జీ మరణించారన్న వార్త రెప్పపాటుకాలంలో నాగపూరంతా దావానలంలా వ్యాపించింది. పౌరులూ, స్వయంసేవకులూ విన్నబోయిన ముఖాలతో పిచ్చివారివలె పరుగెత్తుకుంటూ ఘటాటేగారి ఇంటికి చేరుకోవడం ఆరంభించారు. మధ్యాహ్నంకల్లా చుట్టుపట్ల (గగ్రామాలనుంచి కూడా జనం గుంపులుగా రావడం మొదలైంది. అకోలా, అమరావతి, చాందా, భండారా, వార్దా, హింగన్‌ఘాట్‌, ఆర్వీ, కాటోల్‌, ఉమరెడ్, సావనేర్‌, రామ్‌టేక్‌, కామ్‌ఠీ మొదలైన అనేక స్థలాలనుంచి వేనవేల స్వయం సేవకులు, కార్యకర్తలూ బస్సులమీదా, రైళ్ళమీదా శవయాత్రా సమయానికి నాగపూర్‌ చేరుకున్నారు. మధ్యాహ్నంవరకూ డాక్టర్‌జీని మరొక్కసారి చూడాలని గుంపులు గుంపులుగా ప్రజలూ, స్వయంసేవకులూ వస్తూనే ఉన్నారు. ప్రొద్దున మొదలు సాయంకాలంవఅకు దీనికి అంతేలేదు. స్వయంసేవకులు-చిన్నలూ పెద్దలూ, దాక్టర్‌జీ దేహాన్ని తుదిసారి చూచి, ప్రణామంచేసి, బరువెక్కిన గుండెతో వెళుతూనే వున్నారు. చిన్నారి బాలస్వయంసేవకులు కూడా నాలుగైదుమైళ్ళ దూరాన్నుంచీ పరుగెత్తుకుంటూ వచ్చారు, మిట్టమధ్యాహ్నం ఎండలో దప్పితో తపించిన ఆ బాల స్వయంసేవకుల ముఖాలు వాడిపోయినాయి. పాపం! ఏమిచేయటానికీ తోచక ఒక మూల కూలి పోయారు. ఘటాటేగారి ఇంటి ఆవరణలో, బయట వీధుల్లో గుంపులు గుంపులుగా ప్రజలు ఏదో నెమ్మదిగా మాట్లాడుకుంటూ పొంగి పొరలే దుఃఖాన్ని లోలోపలనే మింగుకుంటూ నిలుచున్నారు. ఏమిచేయాలో ఎవరికీ తోచదు. కంటనీరు... దృష్టి శూన్యంలోకి...

కరిగి కన్నీరుకార్చిన ప్రకృతి

సాయంత్రం అయిదింటికి శవయాత్ర నిశ్చయింపబడింది. దాదాపు నాలుగు గంట అయ్యేసరికి హఠాత్తుగా ఈ ఆకాశమంతటా మేఘాలు వ్యాపించాయి, మొదట చిటపట చినుకులతో మొదలై కుంభవృష్టిగా మారింది. ప్రకృతి కూడా కరిగి సానుభూతిగా కన్నీరు కురిపిస్తున్నది కాబోలు ! వర్షం కురుస్తున్నా వచ్చే ప్రజల సంఖ్యమాత్రం తగ్గలేదు. ఆ కుంభవృష్టిలోనే వేల ప్రజలు నిశ్శబ్దంగా ఘటాటేగారి ఇంటి ముందర శాంతంగా నుంచున్నారు. నాగపూరు స్వయంసేవకులంతా అక్కడికి చేరుకున్నారు. ఐదు గంటలకు వర్షం కొంత తగ్గుముఖం పట్టింది. డాక్టర్‌జీ మృతదేహాన్ని తీసుకొని వెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు. సన్నజల్లు ఇంకా ఉన్నా నిశ్చిత సమయానికి శవయాత్ర ఆరంభమైంది. యాత్రారంభానికి ముందు అనేక సంస్థల పక్షాన దాక్టర్‌జీ మృతదేహానికి పుష్పమాలలు అర్పించారు.

శవయాత్ర

ఆ శవయాత్ర నాగపూరు చరిత్రలో కనివిని ఎరుగనిది. ముందు సైకిళ్ళ బారులు నడిచాయి. ఆ తరువాత స్వయంసేవకులు సాధారణ దుస్తులతో నగ్నశిరస్సుతో నిశ్శబ్దంగా నాలుగు పంక్తుల్లో నడిచారు. అటు తరువాత నాగపూరు పారులు, వారివెనుక దాక్టర్‌జీ భౌతిక కాయం, ప్రక్కన భగవధ్వజం, మళ్ళీ పారులు, స్వయంసేవకులు, సైకిల్‌ బారులు. ఈ మౌనయాత్ర ఒక మైలు పొడవు ఉన్నది. నాగపూర్‌ కాంగ్రెస్‌, హిందూమహాసభ, ఫార్వర్ట్‌బ్లాక్‌, సోషలిస్టుపార్టీ, మజ్టూర్‌పార్టీ, హరిజన్‌ సోదరసంఘం మొదలైన అనేక సంస్థలేకాక, మహిళా సంఘాలవారు కూడా ఆ శవయాత్రలో పాల్గొన్నారు. మహారాజ్‌ బాగ్‌రోడ్‌, యూనివర్శిటీ, సీతాబర్జీ, మెయిన్‌రోడ్‌, లోహేకా పూల్‌, సుభాష్‌చంద్రరోడ్‌, తిలక్‌ విగ్రహం, రూయికర్‌రోడ్‌ ద్వారా చండీ మందిరం ముందునుంచి డా॥ ముంజే ఇంటిముందుగా డాక్టర్‌జీ అంతిమయాత్ర కేంద్ర సంఘస్ఫానానికి చేరుకున్నది. దారిలో తిలక్‌పుతలా, చిట్నీస్‌పార్క్‌ బడ్‌కస్‌చౌక్‌ మొదలైనచోట్ల వేలసంఖ్యలో హిందూపౌరులు అంత్య దర్శనార్థం నిరీక్షిస్తూ నిలుచున్నారు. దారిపొడవునా శ్రేణులలో జనులు మృతదేహానికి నమస్కరిస్తూ నిలుచున్నారు. రోడ్డుకిరువైపులా ఇండ్లముంగిట మేడలపైనా, గోడలమీదా-ఒకచోటేమిటి -ఎక్కడెక్కడ స్టలం లభిస్తే అక్కడక్కడ ప్రజల ఈ దృశ్యాన్ని చూడడానికి నిలుచున్నారు. అనేకచోట్ల డాక్టర్‌జీపైన పుష్పవృష్టికురిసింది. అనేక పూలమాలలు అర్పింపబడినాయి. ఇందులో పార్సీ పౌరులుకూడా పాల్గొన్నారు. అడుగడుగున ఫోటోలు తీసికోబడ్డాయి. నెమ్మది నెమ్మదిగా బరువెక్కిన కాళ్ళతో, ఆ మలుపులతో ఉన్న వీధుల్లో నడుస్తూ నాలుగు గంటల తరువాత కేంద్ర సంఘస్సానానికి చేరుకున్నారు.

తపోభూమిలో అంత్యక్రియలు

రేషంబాగ్‌ సంఘస్థానంలో చితిని పేర్చడానికి సకాలానికి అనుమతి లభించింది. తమ జీవిత సర్వస్వాన్ని అర్చించి నెరవేర్చిన సంఘకార్యం నిత్యమూ నిర్వహింపబడేచోటది. కేంద్రసంఘ శాఖా కార్యక్రమంకూడా ప్రతిరోజూ జరిగే పవిత్రస్థల మది. శిక్షావర్గలో దైనిక కార్యక్రమం కొనసాగింపబడే కార్యరంగమంది. అందుచే డాక్టర్‌జీ దానిని 'తపోభూమి”' అని వ్యవహరించేవారు. అలాంటి పవిత్రస్థలములో - ఆ తపోభూమిలోనే.... డాక్టర్‌జీ శవదహనంకూడా జరగడం స్మరణీయమైన విషయం. శిక్షావర్గలో నలువదిరోజులు స్వయంసేవకుల తపస్సుచే పవిత్రమైన ఆ భూమిలోనే మృతదేహానికి అగ్నిసంస్కారం జరిగింది. మైదానంమధ్య ఒక పెద్ద మండపం
నిర్మించారు. దానిక్రింద చితిని ఏర్పరిచారు. డాక్టర్‌జీ అన్నగారే మృతదేహాన్ని చితిమీద ఉంచారు. తరువాత అందరూ నిల్చుని సంఘ ప్రార్ధన, ధ్వజప్రణామంచేసి పరమపూజనీయ ఆద్యసర్‌సంఘచాలక్‌ భౌతికకాయానికి అంతిమ ప్రణామం అర్పించారు. స్వయం సేవకుల హృదయాలన్నీ ఆ సమయంలో దుఃఖావేగంతో తపించిపోయాయి. 
   పిమ్మట చితిపై గంధపుచెక్కలు, కర్పూరం, నెయ్యి మొదలైన పదార్థాలు ఉంచి వేదవిహితంగా 'మంత్రాగ్ని ప్రజ్వలింపచేశారు. చూస్తుచూస్తు ఉండగానే నాలుకలు చాచుతూ అగ్నిశిఖలు ఆ త్యాగమూర్తి డాక్టర్‌జీని తమలో లీనం చేసుకున్నాయి. ఆ ప్రేమమూర్తి మనకండ్ల కిక కన్పింపడు. ఆ అమరమూర్తి అమృత హాస్యంతో కురిపించే మధురశబ్దాలు మనమిక వినలేము. ఈ భావాలతో స్వయంసేవకులు క్షోభించిపోయారు. 'పెళపెళమనే శబ్దాలతో భయంకరంగా ధ్వనిస్తూ జ్వలిస్తూన్న చితికి తిరిగి తిరిగి నమస్కరిస్తూ మళ్లీ అనేకమార్లు వెనుతిరిగి, చితినిచూస్తూ వికలమైన మనస్సులతో, చిన్న వోయిన ముఖాలతో, రాత్రి పదిగంటలకు *'దహనభూమి” నుంచి వెనుతిరిగారు. అటు ప్రజ్వలిస్తున్న చితిపై అగ్నిశిఖలు, ఇటు స్వయంసేవకుల హృదయాలలో దుఃఖాగ్ని జ్వాలలు. డాక్టర్‌జీ భౌతికమూర్తి చితాగ్నిలో మాయమైంది. కాని ఆ ధ్యేయమూర్తి స్వయంసేవకుల పహృదయాగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై శాశ్వతంగా వారి హృదయపీఠాలపై అధివసించింది.

    ఆ ప్రేమమూర్తియే ఇక ప్రతి స్వయంసేవకునికీ స్ఫూర్తి ప్రసాదిస్తుంది. ఆ స్ఫూర్తి ప్రేరణవల్లనే ఈ మహత్తరమైన దైవకార్యం అంతిమ ధ్యేయాన్ని పొందడానికై ముందుకు సాగిపోతూంటుంది.

కేల్మోడ్తు మో దేవ కేశవా !

పెనుతుఫానున దివురు మన దేశ నౌక
కడలితీరము చేర్చిన-ఓ కర్ణధారీ ||కేల్మోడ్తు||

నీ జీవితములోని క్షణక్షణము కణకణము
నిజము మాకెల్లరకు స్ఫూర్తిదాయక మౌను
నీవు అమరుదవయ్య నీవు అజరుదవయ్య
ఓ మంత్రద్రష్దా ! మహాయోగీ || కేల్మోడ్తు ||

ఆత్మవిస్మృతి బూని అడగిపోయిన జాతి
పారతంత్రపు బ్రతుకు పరికించి కుమిలేవు
అహరహము తపియించి, తనుక్షణము జ్వలియించి
ఆత్మార్పణము చేసినావా, కేశవా ! ||కేల్మోడ్తు ||
సొంత సౌఖ్యాలు కాసంతయైనను లేవు
జాతి సుఖమే నీదు సౌఖ్యమనుకున్నావు
నీ హృదయ కుహరాన నిలచిన జ్యోతిచే
వేనవేల్‌ హృదయాల వెలుగు నింపేవా ||కేల్మోడ్తు||
కుల మత ద్వేషాల కుచ్చితపు భావాల
భాషావిఖభేదాల స్వార్ధ సంకుచితాల
పోటులకు బీటలై పోతున్న దేశాన్ని
సంఘామృతము నిచ్చి సంరక్ష చేసేవ ||కేల్మోడ్తు||


Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top