ఇస్లాం మూలాలు, జిహాద్ గురించి సమగ్రంగా - Sources of Islam

The Hindu Portal
0
ఇస్లాం మూలాలు - Sources of Islam

ఇస్లాం మూలాలు :

   జిహాద్ గురించి సమగ్రంగా, సాధికారికంగా తెలుసుకోవడానికి కురాన్, హదీస్, షరియాలు ఆధారం. కురాన్ అనేది భగవంతుడైన అల్లా ప్రవక్త (ముస్లీములకు మాత్రమే ) అయిన మహమ్మదుకు (మాత్రమే) అందించిన సందేశాల సంకలనం అని ముస్లింలందరి విశ్వాసం. అది అరబ్బీ భాషలో ఉంది. కురాన్ కొన్ని అయాలుగాను, సూరాలుగాను విభజించబడి ఉంటుంది. ఆయహ్ అంటే సూత్రం. ఆయాత్ అంటే సూత్రాలు. సూరహ్ (లేక సూరా) అంటే అధ్యాయం. సువర్ అంటే అధ్యాయాలు. కురాన్ లోని ప్రతి సూరాకి ఒక పేరు ఉంటుంది. ఉదాహరణకి అన్ఫల్, తౌబా మొదలైనవి. 'సూరా అన్ ఫల్' అంటే అన్ఫల్ అనే పేరు గల అధ్యాయం అని అర్థం. ఒక సూరాలో అనేక ఆయాలు ఉంటాయి. కురాన్లో మొత్తం 114 సూరాలు, 6211 ఆయాన్లు ఉన్నాయి. ఆయహ్ సంఖ్యలు వేర్వేరు ముస్లిం సంప్రదాయాల్లో వేర్వేరుగా ఉన్నాయి. ఆ తేడాలు మనకిప్పుడు అనవసరం. 
      మరొక విభజన ప్రకారం కురాన్లో ఎనిమిది భాగాలున్నాయి. వాటి పేర్లు 1. హర్ఫ్, 2. కలిమా, 3. రుకూ, 4. రబ్, 5. నిఫ్, 6. సుల్స్, 7. జుజ్, 8. మంజిల్. వీటిలో జుజ్ గురించి రెండు మాటలు చెప్పాలి. జుజ్ ఏకవచనం. దాని బహువచనం అజ్జా. పర్షియను భాషలో 'సిపారా' అంటారు. అంటే కురాన్ ముప్పై (30) భాగములు అని అర్థం. రోజుకొక భాగం చొప్పున రంజాన్ నెలలో వల్లించడానికి వీలుగా చేసిన విభజన ఇది. సాంప్రదాయకులైన ముస్లింలు కురానును జులుగా విభజిస్తారు. వాళ్ళు సాధారణంగా ఆయాత్, సూరాల విభజనను ఉపయోగించరు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. కురానులో కొన్ని “మనసూఖ్” సూత్రాలున్నాయి. 'రు చేయబడిన సూత్రాలు' అని అర్థం. తరువాతి కాలంలో అల్లా మహమ్మదుకు ప్రసాదించిన సూత్రాలు అంతకుముందు ప్రసాదించిన కొన్ని సూత్రాలను రద్దుపరచాయి. అటువంటి మనసూఖ్లు కురానులో కొన్ని వందలున్నాయి.

    
    కురానుకు ఇస్లాంలోని రెండు ప్రధాన సంప్రదాయాలైన సున్నీ, షియా సంప్రదాయాలకు చెందిన అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. 
సున్ని సంప్రదాయానికి చెందిన వ్యాఖ్యానాలు ఇవి:
1. అల్లాఘవీ 
(2) అజ్ - జమభ్షరీ 
(3) అత్ - తఫ్సీరుల్ - కబీరు 
(4) ఇబ్నుల్ అరబి 
(5) అల్ బైజానీ 
(6) అల్ - ముదారిక్ 
(7) హుసైన్ 
(8) అల్ - జలాలాన్ 
(9) అల్ - మజ్ హరీ 
(10) అజీజీ. ఇవి ముఖ్యమైన వ్యాఖ్యానాలు మాత్రమే. ఇంకా అనేకం ఉన్నాయి.

షియా సంప్రదాయ వ్యాఖ్యల్లో ముఖ్యమైనవి ఇవి :
(1) షేక్ సదూక్, 
(2) అత్ - తఫ్సీరుల్ - కబీర్ - రచయిత సయ్యద్ ముహమ్మద్ అర్ - రజీ. 30 సంపుటాలు.
(3) అస్ - సఫీ 
(4) అస్ - సిర్రుల్ - వజీజ్ 
(5) సిద్ధతుల్ - ముంతహా. రచయిత మీర్బర్ 
(6) అల్- బుర్హాన్, రచయిత సైయిద్ హషమ్.
    ఇక జిహాద్ మూలాధారాల్లో రెండవవది హదీస్. అంటే సంప్రదాయము అని అర్థం. అహదీస్ దీనికి బహువచనం. దీన్నే సున్నా (బహువచనం - సునన్) లేక ఆచారం అని కూడా అంటారు. ప్రవక్త ఆచరించిన వివిధ పనుల వివరం (సున్నతుల్ ఫిల్), ప్రవక్త బోధలు (సున్నతుల్ - కౌల్), ప్రవక్త సమక్షంలో ఇతరులు ప్రవర్తించగా వాటిలో ప్రవక్త ఆమోదించిన చర్యలు (సున్నతుత్- తకీర్), ఇవి గాక ప్రవక్త అనుచరుల మాటలు, చేతలలో ప్రామాణికంగా ఎంచబడేవి వీటన్నిటిని కలిపి హదీస్ లేక సున్నా అని వ్యవహరిస్తారు. నిజానికి హదీసు - సున్నాల్లో కొంత భేదం ఉంది. అది సాంకేతికమైన భేదం. దాని వివరాలు మనకు అవసరం లేదు. హదీసును సున్నీలు, షియాలు, వహాబీలు మొదలైన అన్ని వర్గాల ముస్లింలు ప్రామాణికంగా పరిగణిస్తారు.

   కురానును స్వయంగా దేవుడు ప్రవక్త మదిలో స్ఫురించేటట్లు చేయగా, ఆ స్ఫూర్తితో  ప్రవక్త నడచిన నడత, పలికిన పలుకులను అతడి జీవిత కాలంలో అతడి దగ్గరి బంధువులు, స్నేహితులు, అనుచరులు నమోదు చేసిన సమాచారం, లేక ప్రవక్త తన చుట్టూ ఉన్నవారి చేతలు, మాటలలో ఆమోదించిన వాటి సమాచారం, ఈ మొత్తం కలిపి హదీసులుగా రూపొందాయని ఇస్లాం సంప్రదాయం చెపుతోంది. 
ప్రామాణికత దృష్ట్యా వివిధ హదీసు (ఉదంతం)లను మూడు తరగతులుగా విభజించారు.
1. హదీసు స్ - షాహి - స్వచ్ఛమైన, ఉన్నతమైన ప్రమాణం.
2. హదీసు ల్ - హసన్ - మధ్యమస్థాయి ప్రమాణం
3. హదీసుజ్ - జైఫ్ - బలహీన ప్రమాణం.

ఒక హదీసు (ఉదంతం)ను మొట్టమొదటగా వర్ణించిన వ్యక్తి హోదాను బట్టి హదీసులను మూడు రకాలుగా విభజించారు.
1. హదిసుల్ - మర్పూ - ఉన్నత సంప్రదాయం.
ప్రవక్త చేతను లేక మాటను వర్ణించేది.
2. హదీసుల్-మౌకూఫ్- పరిమిత సంప్రదాయం.
ప్రవక్త సహవాసు (అష్ హాబ్)ల మాటలు లేక చేతలను వర్ణించేది.
3. హదీసుల్-మక్ తూ- పరోక్ష సంప్రదాయం. ప్రవక్త సహవాసులతో
మాట్లాడిన వ్యక్తుల (తాబియూన్) మాటలు, చేతలను వర్ణించేది.
    హదీసులను ఒకరి నుంచి మరొకరికి అందించిన వ్యక్తుల గొలుసునుబట్టి హదీసును ముత్తసిల్ - తెగకుండా వచ్చినది, మునక్వాతి - తెగినది, అని రెండు రకాలుగా పేర్కొంటారు.

ఒక ఉదంతం ఎందరు వ్యక్తులు ఒకరికొకరు అందించగా నమోదు చేయబడింది అనే విషయం ఆధారంగా హదీసులను ఎనిమిది తరగతులుగా విభజించారు:
1. హదీసుల్- ముతవాతిర్- నిస్సందేహమైన విలువ గలది. ఒకే ఉదంతాన్ని మార్పు లేకుండా అనేక వ్యక్తుల గొలుసులు నమోదు చేసి ఉంటే అట్టి ఉదంతం విషయంలో సందేహమక్కరలేదు. ఇలాంటి ఉదంతాలు మొత్తం హదీసుల్లో కేవలం ఐదు మాత్రమే ఉన్నాయని ఇస్లాం సంప్రదాయ వేత్తలు చెపుతారు.
2. హదీసుల్-మష్ హూర్- కనీసం మూడు వేర్వేరు బృందాల (గొలుసుల) వ్యక్తులు నమోదు చేసిన ఉదంతాలు. వీటిని ముస్తఫీజ్ (diffused) అని కూడా అంటారు.
3. హదీసుల్ - అజీజ్ - అరుదైన ఉదంతం. రెండే గొలుసుల వ్యక్తుల నమోదు చేసిన ఉదంతం (నమోదు చేయడం అంటే పేర్కొనడం అని).
4. హదీసుల్- ఘరీబ్ - నాసిరకం ఉదంతం. ఒక్క వరస వ్యక్తులు మాత్రం అందించినది.
5. ఖబరుల్ - వాహిద్ ఒక వ్యక్తి మాత్రమే చెప్పగా విని ఒక వరస (గొలుసు) వ్యక్తులు అందించినది.
6. హదీసుల్ ముర్సల్ - పట్టులేని, వదులైన ఉదంతం. నమోదు చేసిన వ్యక్తి "ప్రవక్త ఇలా చెప్పాడు” అంటూ మొదలు పెట్టి చెప్పేది. అంటే దీనికి ఒక నిశ్చయమైన ప్రమాణం ఉండదు. చెప్పేవాడి మీద నమ్మకమే ప్రమాణం.
7. రివాయహ్ - ఈ విధంగా చెప్పబడింది' అని ప్రారంభమయ్యే హదీసు,
ఇది ఏ ప్రమాణాన్ని పేర్కొనదు.
8. హదీసుల్-మౌజూ - కల్పిత ఉదంతంగా ధృవపడినది. సున్నీ సంప్రదాయం ప్రకారం ఆరు హదీసు సంకలనాలు ప్రామాణికంగా ఎంచబడుతున్నాయి. ఈ ఆరింటిని కలిపి 'షిహా - సిట్టా' లేక 'సరైన ఆరు' అని వ్యవహరిస్తారు.

ఆరు సంకలనాలు ఆయా సంకలన కర్తల పేర్ల మీదుగా ప్రచారంలో ఉన్నాయి. అవి:
1. బుఖారి 2. ముస్లిం 3. తిర్మిజి, 4. దాఉద్, 5. నసై 6. ఇబ్న్ మాజహ్. 
షియా సంప్రదాయంలో ఐదు హదీస్ సంకలనాలున్నాయి. అవి:
1. కాఫీ 2 ఫకీ 3. తహ్ జిబ్ 4. ఇస్తిబ్సర్ 5. బలాయాహ్.
    జిహాద్ మూడవ మూలాధారం షరియా. అష్ - షర్ అంటే 'మార్గము' అని అర్థం. అంటే ముస్లింలకు ప్రవక్త ద్వారా అల్లా నిర్దేశించిన మార్గం అని అర్థం. దీన్ని ఆధునిక పరిభాషలో ము న్యాయస్మృతి అంటారు. ఇస్లామిక్ న్యాయవేత్తల ప్రకారం షరియాలో ఐదు భాగాలున్నాయి.
1. ఇతిక్వాదాత్ - విశ్వాసం గురించి చెప్పేది.
2. ఆదాబ్ - నైతిక విషయాలు.
3. ఇబాదాత్ - భక్తి విషయాలు.
4. ముఆమలాత్ -వ్యవహార విషయం.
5. ఉకూబాత్ - శిక్షలకు సంబంధించినది.
   వీటిలో మూడవదైన ఇబాదాత్ లో కత్ అంటే కలిగిన ముస్లింలు పేద ముస్లింలకు చేయవలసిన దానాల గురించి, జిహాద్- ఇస్లాంను వ్యాప్తి చేయడానికి ముస్లిమేతరుల (మీద చేయవలసిన) నిరంతర మత యుద్ధం గురించి వివరించబడింది.
   ఐదవదైన ఉకూబాత్ లో ఇస్లాం మతాన్ని విడిచి పెట్టిన వాళ్ళకు వేసే మరణశిక్ష (హద్దుర్ రిద్దాహ్)తోబాటు ఇతర శిక్షల వివరాలు ఉన్నాయి. 
  ముస్లిం న్యాయస్మృతిలో ప్రవక్త మహమ్మదు బోధలు, ఆచరణ (అప్ - సున్నహ్) ప్రముఖ పాత్ర వహిస్తాయి. అస్ - సున్నహ్ అంటే మహమ్మదు ఆచారం (Custom) అని అర్థం. 
అది మూడు విధాలు :
1. సున్నతుల్ ఫిలీ, మహమ్మదు స్వయంగా ఆచరించి చూపినది.
2. సున్నతుల్ - కౌలీ - మహమ్మదు ప్రకారం ముస్లింలలు పాటించవలసిన ఆచారాలు.
3. సున్నతుల్ - తత్రరీ - మహమ్మదు సమక్షంలో ఇతరులు చేసిన పనుల్లో మహమ్మదు
ఆమోదించినవి.

    ముస్లింలకు కురాను ఎంత పవిత్రము, అనుసరణీయమో సున్నా కూడా అంతే. సున్నా (ప్) లేక హదీసు సంకలనాలను గురించి పైన చెప్పుకున్నాం. అయితే సున్నీ సంప్రదాయానికి చెందిన ఆరు సంకలనాలైన బుఖారీ, ముస్లిం, తిర్మిజి, దాఉద్, నసఫి, మాజహ్'లు సున్నీ ముస్లింలందరికీ సమానమైనప్పటికీ సున్నీలలోని వివిధ శాఖలవారు ఆయా న్యాయసూత్రాలను వ్యాఖ్యానించి, అనుసరించడంలో కొన్ని తేడాలుంటాయి. ఆ తేడాలను బట్టి సున్నీ ముస్లింలకు చెందిన షరియా (న్యాయస్మృతి)ని నాలుగు శాఖలుగా విభజించారు. అవి:
1. హసఫీ 2.షాఫీ 3. హలీ4. మాలికీ,
    ఈ శాఖల్లో ఒక్కోశాఖ ఒక్కో ప్రాంతంలో వాడుకలో మన దేశంలోని సున్నీ
ముస్లింలు ఎక్కువగా హనఫీ శాఖకు చెందినవారే. ఈ శాఖ ప్రకారం షరియాలో రెండు
భాగాలున్నాయి. అవి : 
1. ఏకాహ్- మతలౌకిక న్యాయం, 2. ఫరైజ్ వారసత్వ విభాగం.
    ఫికాహ్ అనే మాట ఫిక్ (Figh) నుంచి వచ్చింది. ఇది హనఫీ శాఖలోని ప్రధానమైన నాయవిభాగం. ముస్లిమేతరులను ప్రభావితం చేసేది ఇదే. ఫిక్ మీద అనేక ప్రామాణిక గ్రంథాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది. ఈ శాఖకు మూలపురుషుడైన అబుహనీఫా స్వయంగా రచించిన 'ఫికాహ్ - ఉల్ - అక్బర్'. ఇది హనఫీలకు అత్యంత ప్రామాణిక గ్రంథం. తరువాతది హనీఫా శిష్యుడు అబుయూసఫ్ రచించిన 'అదాబ్ - ఉల్ కాజీ'. యూఫ్ శిష్యుడు. ఇమామ్ ముహమ్మద్ రచించిన ఆరుగ్రంథాలు కూడా ముఖ్యమైనవే. వీటిలో ఐదు గ్రంథాలను ఒకచోట చేర్చి “జహీద్ - ఉర్ రవయత్” అనే పేరుతో ఉపయోగిస్తున్నారు. ఆరవ గ్రంథం పేరు 'నవదిర్'. హనీఫా, అతడి శిష్యుల తరువాత చెప్పుకోవలసిన హనఫీ న్యాయవేత్తలు ఇమామ్ జుఫర్ బిన్ అల్ - హాజీ మరియు హసన్ బిజ్యద్ అనేవాళ్ళు. వీరిద్దరు హనీఫాకు సమకాలికులు. 8వ శతాబ్దికి చెందినవాళ్ళు. హనీఫాకు స్నేహితులు. హనీఫా శిష్యులు చెప్పకుండా వదిలిన విషయాల మీద వీరిద్దరి అభిప్రాయాలనే సున్నీలు అనుసరిస్తారు.

    'అదబ్ ఉల్ కాజీ' గ్రంథంపై అనేక వ్యాఖ్యాలున్నాయి. వాటిల్లో ఎక్కువ ప్రచారంలో ఉన్నది అబుబక్ర్ అహ్మద్ బిన్ ఉమర్ ఉల్ - ఖస్సఫ్ అనే పండితుడు రచించిన గ్రంథం ఇతడు హిజ్రా 261వ సంవత్సరం లేక సామాన్యశకం 883కి చెందినవాడు.  హనఫీ సిద్ధాంతాన్ని సంక్షిప్త రూపంలో అందించేది ముక్తసర్ ఉత్ - తహవి' అనే గ్రంథం. దీన్ని అబుజాఫర్ అహ్మద్ బిన్ మహమ్మద్ అత్ తహవి (హి.331). అదేవిధంగా అబు ఉల్ హుసైన్ అహ్మద్ బిన్ మహమ్మద్ అల్-కుదురి (హి. 228) అనే న్యాయవేత్త రచించిన ముక్తసర్ లిల్ - కుదురి అనే గ్రంథం కూడా ప్రసిద్ధి చెందినదే. మట్ సుత్ అనే గ్రంథాన్ని షమ్స్ ఉల్ ఐమ్మహ్ అబు బక్ర్ ముహమ్మద్ అస్- సరసి రచించాడు. అతడు వ్రాసిన మరొక గ్రంథం పేరు అల్-ముహిత్.
    పైన చెప్పినవిగాక మరొక రకం హనఫీ న్యాయశాస్త్ర గ్రంథాలున్నాయి. వాటి పేరు అల్ - హిదయప్. ఈ మాటకు 'మార్గదర్శి' (దారి చూపేది) అని అర్థం. అల్ హిదయహ్ (హిదయా) ఫి - అల్ - ఫరు అనే గ్రంథం అబు హనీఫా, అతడి శిష్యుల యొక్క సాంప్రదాయాన్ని వివరించే సులభదర్శినిగైడు) వంటిది. దీన్ని బుర్హన్ - ఉద్ - దిన్ అలీ (హి. 593) రచించాడు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన గ్రంథం. హిదయాకు కిఫయహ్, ఇనయహ్, నిహయహ్, ఫత్ - ఉల్ - కబీర్ అనే వ్యాఖ్యానాలు ఉన్నాయి.

     హిదయా తరగతి న్యాయ గ్రంథాల కంటే భిన్నమైన మరొక రకం న్యాయ సాహిత్యం పేరు 'ఫతవ'. వీటినే 'ఫత్వా' అని కూడా అంటారు. ఇల్లమ్-ఉల్-ఫతవ అంటే “న్యాయనిర్ణయాల శాస్త్రం” అని అర్ధం. ఫతవ అంటే వివిధ సందర్భాల్లో వేర్వేరు న్యాయ నిర్ణేతలు వేర్వేరు విషయాల మీద వెలువరించిన న్యాయ నిర్ణయాలు అని చెప్పవచ్చు. అలా వెలువడిన ఫత్వాల సంకలనాలు అనేకం ఉన్నాయి. హనఫీ న్యాయశాఖకు సంబంధించిన ఫత్వా సంకలనాల్లో ముఖ్యమైనవి. 
ఇవి - 
ఇమామ్ ఇస్తికర్-ఉద్-దిన్ తహిర్ బిన్ అహ్మద్ అల్ బుఖారి (హి.542) సంకలించిన ఖులసత్-ఉల్-ఫతవ, బుర్హన్ ఉద్-దిన్ బిన్ మజహ్ అల్-బుఖారీ సంకలనం చేసిన అభిరణ్-ఉల్-బరనీయ, కజాఖాన్ అనే మారు పేరుగల అల్ - పార్గని యొక్క ఫతవ-ఇ-కజిఖాన్, అల్ ఘజ్మీని సంకలనం చేసిన కురియత్-ఉల్మునియత్ గ్రంథం, అస్ - సమాని యొక్క విజనత్-ఉల్- ముస్లియిన్ అనే సంకలనం, షేజుల్ ఇస్లామ్ మహమ్మద్ బిన్ అల్ హుసేన్ సంకలనం చేసిన ఫతవ అల్-అంకిరవి, ఫతవ - హమ్మదియ అనే సంకలనాలు ప్రసిద్ధమైనవి. ఇవిగాక మన దేశంలో బాగా వాడుకలో ఉన్న మరి రెండు సంకలనాలు ఫతవ-సిరాజియ్యాహ్, మరియు ఫతవ - ఆలంగిరి. వీటిలో ఫతవ - అలంగిరి చాలా పెద్ద గ్రంథం. దీంట్లో హనఫీశాఖకు వర్తించే ప్రతి న్యాయ నిబంధనకు సంబంధించిన నిర్ణయం (ఫత్వా) లభిస్తుంది. ఇది మన దేశంలో చాలా ముఖ్యమైన ఫత్వాల సంకలనంగా ఎంచబడుతున్నది. 'రద్దుల్ ముహతర్' అనే ప్రాచీన గ్రంథం తరువాత అత్యంత విస్తృతంగా వాడుకలో ఉన్న గ్రంథమిదే.
     ఇక హనఫీ న్యాయస్మృతి యొక్క అనువాదాల మాటకొస్తే నీల్ బెయిల్లీ 1865లో రచించిన గ్రంథం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు.

     ఇంతవరకు సున్నీ ముస్లింలకు వర్తించే న్యాయ గ్రంథాలు, అందునా సున్నీ హనఫీశాఖ (మనదేశంలో ఎక్కువగా ఉన్నది) వారి చెందిన గ్రంథాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు షియా ముస్లింలకు వర్తించే న్యాయస్మృతులను క్లుప్తంగా పరిచయం చేసుకుందాము. షియాలు సున్నీ ముస్లింల యొక్క 'ఆరు అసలైన' (షిహాసిట్టా) హదీస్ సంకలనాలను ఒప్పుకోరు. వారికి వేరేగా నాలుగు హదీసు సంకలనాలున్నాయి. వాటన్నిటిని కలిపి కుతుబ్-ఇ- అర్బాహ్ అంటారు. వేర్వేరుగా వాటి పేర్లు - 1. తహ్జిబ్ 2) ఇMసార్ .. కాఫి 4. అల్- ఫకీహ్.
    షియా సంప్రదాయాన్ని ఇమామియా (హ) సంప్రదాయమని కూడా అంటారు.
ఈ సంప్రదాయానికి చెందిన ముఖ్యన్యాయ గ్రంథాలు:
    అబు జాఫర్ ముహమ్మద్ అత్- తుసి అనే రచయిత కురాను, హదీస్, షరియాల మీద వ్రాసిన గ్రంథాలు. అదే రచయిత షియా న్యాయశాస్త్రానికి సంబంధించి మబసుత్, ఖిలఫ్, నిహయహ్, ముహిత్ అనే గ్రంథాలు వ్రాశాడు. అత్- తుసి రచించిన రిసలత్ -ఇ - జాఫరియహ్ అనే గ్రంథం కూడా చాలా సిద్ధి గలది. షరయ ఉల్అనే గ్రంథాన్ని షేక్ న ఉద్-దిన్ అబు ఉల్ కాసింజాఫర్ బిన్ ము అయ్యిద్ అల్ - హిల్లి అనే ఆయన రచించాడు. ఇతడికే షేక్ ము అయ్యద్ అనే పొట్టి పేరు ఉంది. ఇతడు రచించిన షరయ ఉల్ ఇస్లామ్ భారతదేశపు షియా ముస్లింలకు ప్రధాన న్యాయ గ్రంథం. ఈ గ్రంథానికి మసలిక్ ఉల్-అఫ్ హమ్ అనే వ్యాఖ్యానాన్ని జయిన్ ఉద్-దిన్ అలి అస్ - సైలి అనే పండితుడు రచించాడు. జవాన్ ఉద్-దిన్ కి షహిద్ -ఇ-సని అనే మరొక పేరు కూడా ఉంది.
   షియా ముస్లింలకు సంబంధించిన వారసత్వ (ఫరైజ్) నిబంధనల మీద వ్రాసిన అత్యంత పురాతన గ్రంథం అబ్దుల్ అజీజ్ బిన్ అహ్మద్ అల్ - అజది మరియు అబు ముహమ్మద్ అల్ - కింది అనేవారు రచించారు. వీరిలో అల్ - కింది అనే పండితుడు ఖలీఫా హరున్ ఉర్- రషిద్ కాలం నాటివాడు. భారతదేశంలోని షియా ముస్లింలు ఎక్కువగా అనుసరించే న్యాయస్మృతులు ఇవి-షరయ ఉల్- ఇస్లాం, రౌజత్ ఉల్ అహ్కమ్, షరాహ్-ఇ-లుమ, మఫతిహ్, తహరిర్, ఇర్షదుల్ అజహన్.


* సామాన్య శకమంటే నేడు మనం వాడుతున్న క్రీస్తుశకం. దీన్ని పొట్టిగా సా.శ. అని వ్రాస్తాము. సా.శ. 622 సంవత్సరంలో మహమ్మదు ప్రవక్త మక్కాను వదిలి పెట్టి మదీనాకు వలసపోయాడు. ఆ సంఘటనను ముస్లింలు హిజ్రా అని వ్యవహరిస్తారు. A.H. అంటే After Hizra హిజ్రా తరువాత అని అర్ధం. ఏదైనా హిజ్రా సంవత్సరానికి 622 సంఖ్యను కలిపితే దానికి సమానమైన సామాన్య శకసంవత్సరం వస్తుంది. ముస్లింల కాలగణన హిజ్రాశకం ప్రకారం నడుస్తుంది.

....ముక్కంటి 

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top