" మన హిందూ స్త్రీలను రక్షించుకోవాలి " - ప.ఫూ. డాక్టర్‌ హెడ్గెవార్‌, పుణే 1935 !

Telugu Bhaarath
0
మన హిందూ స్త్రీలను రక్షించుకోవాలి - ప.ఫూ. డాక్టర్‌ హెడ్గెవార్‌, పుణే 1935 - We must protect our Hindu women Dr. Hedgewar speech, Pune 1935

అమృతవాణి
మనం మన స్త్రీలను రక్షించుకోవాలి 

1. ఉపక్రమణిక
నేడు మనపై ఎన్నో విపత్తులు విరుచుకుపడుతున్నాయి. అయినా మనం బలహీనంగానే ఉన్నాం. మనం మన స్త్రీలను రక్షించుకోలేక పోతున్నాం; మన ఆడపడుచుల గౌరవాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఇతర సమాజాలు మనలను తమ ఆహారంగా పరిగణిస్తున్నాయి. మనం కందమూలములని అవి భావిస్తున్నాయి.

హిందువుల ఆడపడుచులు తమ ఆస్తి అనే తలంపు వారిలో స్థిరపడిపోయింది. వారికి మనలను గురించి భయపడవలసిన అవసరం లేకపోవడానికి కారణం మన బలహీనతయే. హిందూదేశంలో 25 కోట్లమంది హిందువులం మనం ఉన్నాం. ఈ దేశపు మొత్తం జనసంఖ్య ముప్పై అయిదు కోట్లు. మిగతా పదికోట్లమందీ ఎక్కడనుంచి వచ్చారు ? ఈ పదికోట్లమంది ప్రజలూ మననుందే విడివడిపోయారు. మన కుంభకర్ణ నిద్రవల్ల వారు మననుండి వేరయిపోయారు. మనం నిద్రపోతూ ఉన్నందువల్ల వారు మనకు దూరమయిపోయారు.

ఇప్పటికయినా మనం కళ్లు తెరవాలి. ఇకముందు ఎన్నడూ మనం ఇట్టి పాపం చేయకూడదు. నేడు మనలను కందమూలాలుగా పరిగణించేవారే రేపు మనలను చూచి భయపడాలి. వాస్తవానికి ఎవరి కిష్టమయితే వారు మననుండి చీలిపోయేటంత బలహీనంగా లేము మనం. మనం చేసిన ఈ ఘోరమైన పాపంవల్ల మన శరీరంలోని ఈ అవయవాలు ఖండించబడినాయి. ఇప్పుడు మనంకూడ అంత తేలికగా లేము. ఎవరైనా మనలను (మింగాలనుకుంటే అది వారికే అపాయమని ఆయా సమాజాలు గ్రహించాలి. మన సమాజాన్ని శక్తిమంతంగా చేయడానికి, సంఘటిత పరచడానికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభింపబడింది. భారతదేశమంతటా, మూలమూలలా హిందువులను సంఘటిత మొనరించడానికి ఈ సంఘశాఖలు కృషి చేస్తున్నాయి. యావద్దేశంలో సంఘశాఖ లేని ఒక్క గ్రామంకానీ, ఒక్క పల్లెగానీ లేకుండాచేయాలి. ఈ శాఖలన్నిటికీ ఏకైక సూత్రం ఉండాలి. అప్పుడే హిందువుల్లో అద్భుతమైన తేజమూ, ప్రచండమైన ఆత్మవిశ్వాసమ, అపారమైన సామర్ధ్యమూ నిర్మించబడగలవు. అప్పుడు మనతో సరితూగగగలవారు ప్రపంచంలో ఉండజాలరు. దీనికై మీరందరూ సహకరించాలి. మేము విడిగా ఒద్దునఉంది చూస్తుంటామని అన్నందువల్ల ఎలాంటి లాభములేదు. ఈ సంవథుం హిందువులందరికొరకూ కదా! అందుకని హిందువులందరూ దీనిలో ప్రవేశించాలి. ఇది మన అందరి సంఘం. 
    సంఘంలో కులానికి ప్రాధాన్యంలేదు. వ్యక్తుల గొప్పదనాలకు చోటులేదు. ప్రాంతీయ దురభిమానాలకు తావు అసలే లేదు. కష్టాలు అందరికీ ఉన్నవే. సంసారబాధలు అందరినీ వెన్నంటుతునే ఉన్నాయి. ఎవరికివారు తమ కవ్టాలను చెప్పుకొని దుఃఖిస్తూ కూర్చుంటే పరులబారిన పడడంతప్ప మరొకగతి మనకు లేదు. మిగతా అన్ని పనులకంటే సంఘకార్యం మహత్తరమైనదని భావించి మనసా ప్రాణపదంగా ఈ పనిలో ప్రవేశిస్తే కనీసం రేపటి మన సంతతియైనా హిందువులమని చెప్పుకుంటూ జీవించగలిగే రోజు వస్తుంది. మన అనంతరంకూడా హిందూధర్మం సజీవంగా ఉండేందుకు తగినట్లుగా మనమీనాడు పునాదివేయాలి. మనకప్పగింప బడిన ఈ ఆస్పి దొంగలపాలు కాకుండా చూచుకోవాలి. అప్రమత్తతతో దీన్ని కాపాడుకోవాలి.

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top