మన ఆదర్శం (ప.ఫూ. డాక్టర్‌ హెడ్గెవార్‌, పుణే) : Our ideal (Dr. Keshav Baliram Hedgewar Speech 1935)

0
మన ఆదర్శం (ప.ఫూ. డాక్టర్‌ హెడ్గెవార్‌, పుణే) : Our ideal
మన ఆదర్శం
ప.ఫూ. డాక్టర్‌ హెడ్గెవార్‌, పుణే 1935 !

నన్ను అనేక ప్రశ్నలు అడుగుతూవుంటారు. ఆ ప్రశ్నల్లో ఒక దాన్ని గురించి ఈరోజు చర్చించదలుచుకున్నాను “సంఘ స్వయంసేవకులు సిద్ధాంతాన్ని ఆదర్శంగా నిలుపుకోవాలా లేక వ్యక్తినా ? ఎవ్వరైనా ఒక వ్యక్తిని ఆదర్శంగా నిలుపుకొనవలసి వచ్చినట్లయితే ఆ వ్యక్తి ఎవరు ?” అనేది ప్రశ్న.

“సిద్ధాంతమే మన ఆదర్శం” అని ఇంతవరకూ చెపుతూవచ్చాం. కాని సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ఎంత సులభమో దానిని ఆచరణలో చూపడం అంత కష్టమైనపని. సమాజంలో విగ్రహపూజ రావడానికి ఇదే కారణం. నిజం ఆలోచిస్తే రాతిలో దేవుడున్నాడా ( అదృశ్యము, అస్పష్టము, అవ్యక్తము అయిన విశ్వసంచాలక శక్తియొక్క నిర్దుణ, నిరాకార స్వరూపాన్ని పూజించడం అందరికీ తేలికైన పనికాదు. అందుకే విగ్రహాన్ని ఆ విశ్వవ్యాప్తమైన శక్తికి ప్రతిరూపంగా సంభావించి పూజిస్తూ వుంటాం. కాని కేవలం విగ్రహపూజ చేయడమే ధర్నానికి సర్వస్వం కాదు. మూర్తి సుందరంగా ఉన్నదనీ, చక్కగా ఉత్తమోత్తమ శిల్పకళా విన్యాసాన్ని చూపిస్తోందనీ మనం పూజించడంలేదు. ఆ మూర్తిలో ఒక మహోన్నతమైన తత్వం కన్పిస్తుంది. ఆ విగ్రహాన్ని ఒక మహాద్భుత సిద్ధాంతానికి చిహ్నమని భావించడమే యీ పూజకు కారణం. ఆ వ్యక్తి స్వరూపాన్ని గురించి సాధారణ ప్రజానీకానికి ప్రబోధం కల్గించేందుకు విగ్రహపూజ ఒక సాధనం.
    ఒక వ్యక్తిని ఆదర్శంగా గ్రహిస్తే, ఆ వ్యక్తి మనకు అందుబాటులో లేనివాడుగా ఉండరాదు. అదే రీతిగా మనంకూడా ఆ వ్యక్తికి దూరాన ఉండ కూడదు. అట్టి వ్యక్తినే ఆదర్శంగా (గ్రహించాలి. సద్దుణాలన్నిటికీ ప్రత్యక్ష స్వరూపం సర్వదా దోషరహితుడునైన వ్యక్తినే మనం ఆదర్శంగా స్వీకరించాలి. ఆదర్శంగా స్వీకరించిన వ్యక్తి అటుతరువాత ఏదైనా తప్పుచేయడం తటస్ట్థిస్తే మరొక వ్యక్తిని వెతకవలసి వస్తోంది. ఆ రెండో వ్యక్తిలో కూడా తప్పులు కనపడితే ఇంకొక మూడో వ్యక్తిని- ఈరీతిగా రోజుకొక వ్యక్తిని ఆదర్శంగా వెతుక్కోవడంతోనే సరిపోతుంది. అందుకని వ్యక్తిని ఆదర్శంగా స్వీకరించాలని వాంఛించినప్పుడు, ఎలాంటి దోషాలూలేని వ్యక్తినే ఎన్నుకోవడం మంచిది. అంతేగాక మనము ఆదర్శంగా స్వీకరించదలచిన గుణములన్నీ కూడా అతనిలో ఉండాలి.

    గురుపూజా మహోత్సవ సందర్భంలో మనం ధ్వజాన్ని గురువుగా మన్నించి పూజిస్తున్నాం; ఇది మన అందరికీ తెలిసిన విషయమే. మనం వ్యక్తులను పూజించడంలేదు వ్యక్తి తన మార్గంలో సర్వకాల సర్వావస్థల్లోనూ చలించకుండా వుందగలదని మనం చెప్పలేలం. అచంచలముగా ఆదర్శస్థానములో ఉందగలిగినది కేవలం సిద్ధాంతం మాత్రమే. అలాంటిదే మన భగవాధ్వజము. మన కాషాయధ్వజాన్ని చూడగానే మన దేశచరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, ఒక్కటేమిటి మన సర్వస్వం కళ్ళకు కట్టినట్లు కన్పిస్తాయి. ఆ పవిత్ర ధ్వజాన్ని చూడగానే హృదయంలో అనేకభావాలు ఉప్పాంగుతాయి. అనంతమైన స్పూర్తి ప్రతి రక్తాణువులోనూ ప్రవహిస్తుంది. అందుకే అలాంటి భగవధ్వజాన్ని-మన సిద్ధాంతాలకు ఏకైక చిహ్నమైన భగవధ్వజాన్ని- మనం గురువుగా భావిస్తున్నాము. ఎవరో ఒక వ్యక్తిని గురువుగా అంగీకరించకపోవడానికి ఇదే కారణం.
     సిద్ద్ధాంతాన్నే ఆదర్శంగా నిలుపుకొని నిర్వహించుకో గలిగితే మంచిదే. కాని నిర్మల హృదయంతో నిర్వికార భావంతో సిద్ధాంతాన్ని అనుష్టించుకోలేకపోతే ఆ సిద్ధాంతానికి చిహ్నమై, సర్వగుణ సంపన్నుడైన వ్యక్తిని గురువుగా భావించవచ్చు. కాని ఆ వ్యక్తి అతి ప్రాచీనుడు కాకూడదు. వేదకాలంలోనుంచో లేదా పురాణయుగంలోనుంచో ఎవరో ఒక వ్యక్తిని మీరు గ్రహిస్తే చరిత్రాత్మకంగా ఆ మహావ్యక్తిని గురించి ఎన్నో సందేహాలు పుడతాయి. ఇలాంటి వ్యక్తి జన్మించాడా? లేక కేవలం కవుల కల్పనయా ? అని వివిధ ప్రశ్నలు ఉదయించవచ్చు. రామకృష్ణులలో ఒకరిని నిస్సందేహంగా ఆదర్శస్థానంలో నిలుపుకోవచ్చు. కాని మొన్న మొన్న జన్మించి, సందేహించడానికి వీలులేని సర్వగుణ సంపన్నుడై వెలుగొందిన వ్యక్తిని ఆదర్శంగా స్వీకరిస్తే మంచిది.

మహాపురుషులను గురించి కొన్ని భ్రమలు నేడు మన సమాజంలో వ్యాపించి  వున్నాయి. “శ్రీకృష్ణుడు తన జీవితంలో ఎన్నో అద్భుతకార్యాలు చేశాడు. అందుకని ఆయనను ఆదర్శంగా గ్రహించవచ్చు. కాని, ఈ విషయంలో అనేక వికృత భావాలు వ్యాపించి వున్నాయి. “శ్రీకృష్ణుడు చేసిన పనులు మనం చేయలేం; ఆయన పరమేశ్వరుడు; పూర్జావతారమూర్తి మనమో మానవులం. దేవతలు చేసిన అద్భుతకార్యాలు మానవ మాత్రులకు సాధ్యపడవు.” ఇలా అనేకులు భావిస్తున్నారు. శ్రీకృష్ణునిలాంటి దోషరహితుడైన పవిత్రమూర్తిని దేవతాకోటిలో చేర్చి, ఆయనలోని సద్గుణాలను అలవరచుకోవడం మనకు అసాధ్యమని తప్పించుకుంటున్నాము. రామ,కృష్తులను పూజించడంకానీ, భగవద్లీత, రామాయణం, భారతాదులను చదవడం కానీ వాటిద్వారా సద్గుణాలను అలవరచుకొనే ఉద్దేశంతో జరగడంలేదు. కేవలం పుణ్యం ఒడిగట్టుకుందామనే మూఢభావాలే కన్పిస్తున్నాయి. ఇదెంత ప్రమాదకరమైన పొరపాటు !
   మీకు నేనొక ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు మాయింటికి ఒక అతిథి వచ్చాడు. ప్రతిరోజూ స్నాన సంధ్యాది కార్యక్రమాలు ముగించుకున్న తరువాత ఆధ్యాత్మ రామాయణంలో ఒక అధ్యాయం నియమానుసారం చదువుతూ వుండేవారాయన. ఒకసారి భోజనం చేసేటప్పుడు “అయ్యా! మీరు ప్రతిరోజూ పారాయణం చేస్తున్నారుకదా ? దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారా ?” అని ఆయనను ప్రశ్నించాను. ఈ ప్రశ్న అడగడమే తరువాయి; ఆ మహానుభావుడు కోపంతో కుమిలిపోయినాడు. “మీరు శ్రీరామచంద్రమూర్తిని అవమానిస్తున్నారు. పరమేశ్వరుని గుణాలు మనుష్యులకు అబ్బుతాయా ? నద్గుణాలను అలవరచుకోవాలనే దృష్టితో మేం ఎప్పుడూ పారాయణంచేయం. పుణ్యం సంపాదించుకోడానికే మేం ఈ పారాయణం చేస్తున్నాం” అని అన్నారాయన.
   ఇది కూడా హిందూజాతి క్షీణించడానికి తోద్బడ్డ పెద్ద కారణాలలో ఒకటి. మన ధార్మిక సాహిత్యంలో ఒకదాన్ని మించిన (గ్రంథం మరొకటి. మన గతచరిత్రకూడా ఎంతో మహోదాత్తమైనది. వీరరస ప్రదాయకమైనది. కాని దానిని యోగ్యరీతిలో మననం చేసికోవడముకూడ మనము నేర్చుకోలేదు. ఎవరైనా కర్తవ్య పరాయణుడైన ధీమంతుడు జన్మిస్తే అతనిని వెంటనే అవతారపురుషుల్లో జమకట్టి, ఆయన నెత్తిన దైవత్వాన్ని రుద్దడం జరుగుతూంది. దైవగుణాలను మనం ఆచరించలేమనే భ్రమతో ఆయా సద్దుణాలను అలవరచుకోవడమే మానివేస్తున్నాం. నిన్న మొన్నటి శివాజీ, లోకమాన్య తిలక్‌లనుకూడా అవతార పురుషుల్లో జమకట్టడం జరిగింది. శివాజీని శివుని అవతారమని భావిస్తున్నాం. “శివభారతం, శివచరిత్ర” ల్లాంటి కావ్యాలలో ఈ భావాన్ని సమర్థించారుకూదా. లోకమాన్య తిలక్‌ మనకు సమకాలికుడు ఐనా ఆయనకు నాలుగుచేతు అతికించి శంఖ, చక్ర, గదా, పద్మాలను ఆచేతుల్లో అమర్చిన చిత్రాన్ని నేను కళ్ళారా చూచాను. ఇలా మహానుభావుల నందరినీ దేవతల్లో జమకట్టే ఈ వింతపద్ధతిని ఏమనాలి ? ఎవరైనా ఎక్కడైనా జన్మించాడని తెలియడమే ఆలస్యం; వెంటనే కూర్చోబెట్టడం అక్కడ పూజలుమాత్రం చాలాహడావిడిగా జరుగుతూ ఉంటాయి. కాని ఆయనలో మూర్తీభవించియున్న సద్గుణాలను అలవరచుకొనే దృష్టి మాత్రం కన్పించదు. ఇలా బాధ్యతలను చక్కగా తప్పించుకుని మన యిష్టంవచ్చినట్లు సంచరించే ఈకొత్తకళను చక్కగా అలవరచుకున్నాము.
   అందుకని దోషరహితుడైన వ్యక్తిని ఆదర్శంగా నిలుపుకోవాలి. అంతేకాక ఆ వ్యక్తి గుణాలను మనజీవితంలో అనుసరించాలి. ఈ దృష్టితో గత చరిత్రలోని ఘట్టాలను పరికిస్తే మనకు ఛత్రపతి శివాజీ యెక్కడే కన్పిస్తాడు. అతన్నిగాని లేదా మరొకవ్యక్తినిగాని ఆదర్శంగా స్వీకరించందని నేను బలవంతం చేయను. సిద్ధాంతాన్నే ఆదర్శంగా (గ్రహిస్తే ఇంకా చెప్పవలసిందేమిటి ? కాని వ్యక్తిని ఆదర్శంగా ఎన్నుకోదలచిన పక్షంలో శివాజీలాంటి మహానుభావుడు మనకు లభించడం మన అదృష్టం. ఛత్రపతి శివాజీకి గురుదేవులైన శ్రీరామదాసస్వామి స్వయంగా “శివాజీనే ఆదర్శంగా మన్నించండి” అని ప్రజానీకంలో ప్రబోధించారు. “శివరాయ్‌ఆచే ఆఠవావే రూప్‌, శివరాయాచా ఆఠవావా ప్రతాప్‌” అంటే “శివాజీ స్వరూపాన్నే ధ్యానించండి. శివాజీ ప్రతాపాన్నే అనుష్టించండి” అని అర్థం. ఇవి సమర్థగురు శ్రీ రామదాసస్వామి ప్రబోధాలు, శివాజీ మహోదాత్తు దైనందువల్లనే ప్రశస్తః శ్రేయాన్‌ శ్రేష్ట రామదాసస్వామికూడా ఆయనను ఆదర్శంగా ఎంచుకొనమని ముక్తకంఠంతో ఉద్పోధించారు. శివాజీని ఆదర్శంగా స్వీకరిస్తే హిందుత్వాన్ని రక్షించడానికి ఆయనచూపిన పరాక్రమం ఆయన చేసిన సాహసకృత్యాలు జ్ఞప్తికి వస్తాయి. పరమ పవిత్ర భగవధ్వజాన్ని చూచినప్పుడు మనకేవిధమైన స్ఫూర్తి లభిస్తుందో, అలాంటి స్ఫూర్తినే శివాజీ చరిత్ర మనకు ప్రసాదిస్తుంది. నేలకొరిగిన భగవధ్వజాన్ని మళ్ళీ ఉత్తుంగ శిఖరాలలో ఎగురవేసి, శివాజీ “హిందూపద-పాదుశాహీ” ని నెలకొల్పడమేగాక, నష్టప్రాయమైన హిందుత్వంలో అమృతాన్ని నింపి, ప్రాణప్రతిష్ట చేశాడు. అందుకని మనం ఎవరైనా వ్యక్తిని ఆదర్శంగా గ్రహించదలచుకుంటే శివాజీనే గ్రహించాలి. ఇంతవరకు ఆయనను ఇంకా అవతారమూర్తుల శ్రేణిలోకి పూర్తిగా నెట్టలేదు. అవతారమూర్తిగా ఆలయంలో ప్రతిష్టింపబడకముందే మేల్మొని ఆయనను మనకు ఆదర్శ్భవ్యక్తిగా స్వీకరించాలి.

    సంఘాధికారుల్లో ఎవరిని ఆదర్శంగా మన్నించాలి అనే ప్రశ్నకు ఇక తావు లేదు. మనలో అనేకులు దోషరహితులుగా ఉండవచ్చు. ఇంతే కాదు; శివాజీలోని సుగుణాలను ఆచరణలో చూపించగల్లిన ధీమంతులు కూడా ఉండవచ్చు. అయినా అందరూ యింకా పూర్తిగా వికసించని మొగ్గలే. అందుకే పూర్తిగా వికసించిన ప్రసూనాన్నే మనకాదర్శ్భంగా స్వీకరించాలి. ఎందుకంటే సగం వికసించిన మొగ్గలో దురదృష్టవశాత్తు పురుగు పుట్టితే తరువాత పశ్చాత్తాప పడవలసిఉంటుంది. సంపూర్ణంగా వికసించి, క్రిమిరహితంగా-అన్ని విధాలా యింపుగా కనుపించే ప్రసూనాన్నే - ఆదర్శంగా స్వీకరిస్తే మన కార్యప్రసూనానికికూడా నవచైతన్యం నిరంతరం లభీస్తూవుంటుంది. ఇంకాస్పష్టంగా చెప్పాలంటే ఏ మహవాీపురుషుని జీవితకుసుమం సంపూర్ణంగా వికసించిందో, ఏ మహాపురుషుడు దోషరహితుదై మహోదాత్తుడుగా వెలుగొందుతూ వున్నాడో, ఏ మహాపురుషుని ధ్యేయం చిరసత్య ప్రాప్పియో, అట్టి మహానుభావుని మన కాదర్శంగా స్వీకరించాలి. సిద్దాంతంస్టానే వ్యక్తిని ఆదర్శంగా నిలుపుకోవాలంటే ఛత్రపతి శివాజీకంటే ఉత్తమోత్తముడైన వ్యక్తి మనకు లభించడం అసాధ్యం అని నా అభిప్రాయం.
(full-width)

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top