స్వాతంత్య్ర విప్ల‌వవీరుడు "లాలా హర్ దయాల్ మాథుర్" - Indian nationalist revolutionary and freedom fighter "Lala Har Dayal Mathur"

Vishwa Bhaarath
0
Lala Har Dayal Mathur
Lala Har Dayal Mathur
య‌న ఒక భారతీయ జాతీయవాద విప్లవకారుడు. భారతీయ స్వేచ్ఛ కోసం తన‌ను తాను అంకితం చేసిన పండితుడు. అతను ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో పర్యటించి స్వాతంత్య్ర ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి పని చేశాడు.

అతను ఢిల్లీలోని కాయస్థ‌ కుటుంబంలో 14 అక్టోబర్ 1894 – జన్మించాడు. మిషన్ కళాశాలలో విద్యను పొందాడు. అతను పట్టభ‌ద్రుడైన‌ప్పుడు యంగ్స్‌మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ సభ్యుడు. తరువాత అతను లాహోర్ వ‌చ్చి అక్కడ ప్రభుత్వ కళాశాలలో సైఫెండ్ హోల్డర్ గా చేరాడు. అక్కడ 1903లో ఇంగ్లీష్ లిటరేచర్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందాడు. జాబితాలో అగ్రస్థానం నిలిచాడు. కొన్ని పేపర్లలో అతను పూర్తి మార్కులు సాధించాడు. అతను మ‌రో సంవత్సరం అక్కడ కొనసాగాడు.

చరిత్రలో రెండవసారి తన ఎం.ఏ. డిగ్రీని తీసుకున్నాడు. భారత స్కాలర్షిప్ పొందిన తరువాత అతను ఇంగ్లాండ్ బయలుదేరాడు. ఆక్స్‌ఫ‌ర్డ్‌లోని సెయింట్ జాన్ కాలేజీలో చేరాడు. అక్కడ చదువుతున్న రోజుల్లోనే ఆయన జాతీయవాదిగా మారారు.

Lala Har Dayal Mathur
Lala Har Dayal Mathur
లాలా హర్ దయాల్ సాహిత్య రంగంలో ఎంతో కృషి చేసారు. సంస్కృత సాహిత్యంపై డాక్టరేట్ పొందారు. ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడు. ఇంగ్లాండ్లో అతను విప్ల‌వ‌కారులు సంస్కర్తలైన సి.ఎఫ్. ఆండ్రూస్, ఎస్.వర్మ , పరమానంద్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాడు. భారతీయుల అణచివేతకు వ్యతిరేకంగా ఆయన స్వరం పెంచారు. అతను భారతదేశానికి వచ్చి లాహోర్లో రాజకీయ కార్యకలాపాలకు అంకితమయ్యాడు.

అతను 1908లో లాహోర్ వెళ్ళాడు. లాలా లాజ్‌ప‌త్ రాయ్ తో కలిసి ఉండి, తన సహచరులను కలుసుకున్నాడు. సన్యాస జీవితాన్ని తీసుకోవడానికి అతను తన కుటుంబ జీవితాన్ని విడిచిపెట్టాడు. ఈ కాలంలో, అతను మోడరన్ రివ్యూ, ది పంజాబీకి వ్యాసాలు అందించాడు. విప్లవకారులతో అతని అనుబంధం నానాటికి పెరగసాగింది. భారతదేశ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉన్నందున భారతదేశం నుండి లండన్ బయలుదేరాడు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని మరింత ప్రచారం చేయడానికి, లాలా హర్ దయాల్ పారిస్, వెస్టిండీస్, దక్షిణ అమెరికా సరిహద్దులను దాటి అమెరికాకు చేరుకున్నారు. 1911 లో లాలా హర్ ద‌యాల్ యునైటెడ్ స్టేట్స్ కు వెళ్లి స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృత, తత్వశాస్త్ర ప్రొఫెసర్ గా చేరారు. ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ శాన్ ఫ్రాన్సిస్‌కో శాఖకు కార్యదర్శిగా ఉన్నారు.

యువ భారతీయులను అమెరికాకు రమ్మని ప్రోత్సహించడానికి, అతను ధనవంతుడైన రైతు జవాలా సింగ్‌ను ఒప్పించి, అమెరికాలోని బర్కిలీలో ఉన్నత విద్య కోసం గురు గోవింద్ సింగ్ స్కాలర్షిప్లను ఏర్పాటు చేశాడు. లండన్లోని శ్యామ్ జీ కృష్ణవర్మ ఇంటి తరహాలో, అతను ఈ విద్యార్థుల కోసం వసతి గృహాన్ని తెరిచాడు. దీనిని ఇండియాహౌస్‌ అని పిలుస్తారు. భారతదేశంలో జరిగిన సంఘటనలు, ముఖ్యంగా వైస్రాయ్ పై హత్యాయత్నం అతని జాతీయవాద భావానికి మరింత ఆజ్యం పోసింది. అతను భారతీయులను ఉద్దేశించి, మాతృదేశాన్ని సాయుధ పోరాటంతో విముక్తి చేయమని వారిని ప్రోత్సహించాడు. ఒరెగాన్లోని ఆస్టోరియా పర్యటనలో, గదర్ ఉద్యమం అధ్యక్షుడిగా సోహన్ సింగ్ భక్నతో హర్ దయాల్ సెక్రటరీ జనరల్ గా ప్రారంభమైంది. ఈ ఉద్యమం అమెరికాలో కార్చిచ్చులా వ్యాపించింది. పెద్దసంఖ్యలో వలస వచ్చిన భారతీయులు చేరారు. వీరిలో విద్యార్థులు, కార్మికులు కూడా ఉన్నారు. వారి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, గదరైట్లు వివిధ భాషలలో ఒక వార్తాలేఖను తీసుకువచ్చారు.

బాంబు తయారీ, పేలుడు పదార్థాల వాడకంపై కూడా హర్ దయాళ్ శిక్షణను ఇచ్చారు. దీనిని గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని అరెస్టు చేయమని అమెరికా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసింది. అందువల్ల అతను జర్మనీకి ఆ తరువాత స్వీడను వచ్చాడు. ఆయన మార్చి 4, 1939 న ఫిలడెల్ఫియాలో తుది శ్వాస విడిచారు.

Lala Har Dayal

Lala Har Dayal
Lala Har Dayal

The revolutionary struggle against the British tyranny, Lala Hardayal. Lala Har Dayal  was born in 1884 and did his early schooling  in Delhi before graduating in Sanskrit from St. Stephen’s College. Then in 1905 he was awarded two scholarships to study at Oxford. It was in England that he got in touch with esteemed nationalist Shyamji Krishnaverma , who brought out a publication, The Indian Sociologist. It was in this publication that Lala Har Dayal first wrote about his political views. His writings were noticed by the establishment and soon the British imposed a ban on them. In 1911  Lala Har Dayal moved to the United States joining Stanford University as a Professor of Sanskrit and Philosophy.

It was during this time that the legendary Ghadar Movement was born and spread like wildfire in the United States with large number of immigrant Indians joining – these included the students as well as the workers. To spread their message, the Ghadarites brought out a newsletter in different languages. The newsletter, also called Ghadar, talked of revolution and overthrow of the British Raj from India. In April 1914, he was arrested by the United States government for spreading anarchist literature and fled to Berlin, Germany. He subsequently lived for a decade in Sweden before returning to the  United States.A polyglot, he was fluent in Urdu, Sanskrit, English, French, German and Swedish Languages. Har Dayal died in Philadelphia of a heart attack on March 4, 1939 while on a lecture tour of America. His deepest regret was that he could never return to his homeland because the British kept refusing him permission.

It was due to the sacrifice of revolutionaries like Har Dayal that people of this nation were inspired to rise up against the British tyranny.

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top