భారత ఏకత్వము, నైతిక నిష్ఠ, భద్రతకు ముప్పుగా మారుతున్న మతమార్పిడులు !

Vishwa Bhaarath
0
భారత ఏకత్వము, నైతిక నిష్ఠ, భద్రతకు ముప్పుగా మారుతున్న మతమార్పిడులు - Religious Converts pose a threat to Indian unity, moral integrity and security -
Religious conversion: A threat to India’s unity, integrity, and security
ర్థిక సుస్థిరత సాధనతో పాటుగా విదేశీ శక్తుల బారి నుంచి దేశ సరిహద్దును కాపాడుకునేంత వరకు భారత్‌ ముంగిట సవాళ్ళు పొంచి ఉన్నాయి. అయితే, నేడు దేశం ఎదుర్కొంటున్న మరొక ప్రధాన సవాల్‌గా అనేక రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా దేశ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా సంఖ్యలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఇదే మరే ఇతర భద్రతాపరమైన ముప్పు కన్నా కూడా అత్యంత ప్రమాదకరమైనది.

గతంలో దేశం రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల వంచనకు గురైంది. ఇస్లామిస్టులు దేశాన్ని దోచుకున్నాయి. భారతీ సంస్కృతిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాయి. దేశాన్ని విభజించడంలో విజయం సాధించాయి.

జనాభా సంఖ్యలో విపరీతమైన మార్పులు జరగడానికి కారణమైన ప్రధానమైన అంశాల్లో ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హిందువుల వలసలు, విదేశీ నిధుల వినియోగంతో నానాటికి పెరిగిపోతున్న మత మార్పిడి ఘటనలు మరియు ‘లవ్ జిహాద్’ సంఘటనలు ఉన్నాయి. ఈ నీతిబాహ్యమైన క్రీడలో రాడికల్ ఇస్లామిక్ సంస్థలు, క్రైస్తవ మిషనరీలు పాలుపంచుకుంటున్నాయి.

ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 2020నాటి చట్టవిరుద్ధమైన మతమార్పిడి నిరోధక ఆర్డినెన్స్ కింద 340 మందిని బుక్ చేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రకారం తాము బలవంతంగా మత మార్పిడి చెందినట్లు 77 మంది బాధితులు మేజిస్ట్రేట్ ఎదుట అంగీకరించారు. దేశంలోని 24 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న హవాలా నెట్‌వర్క్ ద్వారా పొందిన రూ.57 కోట్ల విదేశీ నిధుల వినియోగించి దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు బలవంతంగా ఇస్లామ్ మతానికి మారిపోయారని ఉత్తరప్రదేశ్ తీవ్రవాద వ్యతిరేక బృందం(ATS) ఇటీవల వెల్లడించింది.

కేరళలో 1951లో 17.5 శాతంగా ఉన్న ముస్లిము జనాభా 2021 నాటికి 26.6 శాతానికి చేరుకుంది. బెంగాల్‌లో అదే సంవత్సరానికి 20 శాతంగా ఉన్న ముస్లిము జనాభా 2021 నాటికి 30 శాతానికి చేరుకుంది. 1951లో అస్సాంలో 17.6 శాతంగా ఉన్న ముస్లిము జనాభా దాదాపు 37 శాతానికి చేరుకుంది.

దేశ విభజనకు ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో కలిసి ఉన్న భారత్‌లో 140 సంవత్సరాల క్రితం నాటి జనాభాను ఇక్కడ ప్రస్తావించాలి. 1872లో అవిభాజ్య భారత్‌లో మొత్తం జనాభాలో ముస్లిములు 24 శాతం కాగా హిందువులు 72 శాతం ఉన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ముస్లిముల జనాభా దాదాపు 55 కోట్లు (2011 నాటి జనగణన ప్రకారం బంగ్లాదేశ్‌లో 15 కోట్లు, పాకిస్తాన్‌లో 20 కోట్లు మరియు బంగ్లాదేశ్‌లో 20 కోట్లు) ఉండగా హిందువుల జనాభా దాదాపు 103 కోట్లుగా నమోదైంది. ఇతర అల్పసంఖ్యాక వర్గాలను సైతం పరిగణనలోకి తీసుకున్నప్పుడు మొత్తం జనాభా 160 కోట్లకు చేరుకుంటుంది. అందులో హిందువుల జనాభా 64 శాతం, ముస్లిముల జనాభా 34 శాతంగా ఉంది. కనుక గడచిన 150 సంవత్సరాల్లో హిందువుల జనాభా 8 శాతానికి పైగా తగ్గిపోయింది.

భారత్‌లో రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థల తరహాలో పలు క్రైస్తవ మిషనరీలు హిందువులను మరీ ముఖ్యంగా హిందూ వనవాసీలు, షెడ్యూల్డ్ కులాలకు చెందినవారిని క్రైస్తవులుగా మారుస్తున్నాయి. 2021 సంవత్సరం డిసెంబర్‌లో ప్రచురితమైన ‘ప్రింట్’ నివేదికలో పంజాబ్‌లో యునైటెడ్ క్రిస్టియన్ ఫ్రంట్ సభ్యులొకరు చెప్పినదాని ప్రకారం అమృత్‌సర్, గురుదాస్‌పూర్ జిల్లాల్లో చర్చీల సంఖ్య 600 నుంచి 700 వరకు పెరిగింది. ఈ పెరుగుదలలో 60 శాతం నుంచి 70 శాతం గడచిన ఐదు సంవత్సరాల్లో జరిగింది. ‘ఛాంగయి సభ’ పేరిట అనేక చోట్ల రోజువారీ సభలు నిర్వహించడం ద్వారా క్రైస్తవ మిషనరీలు మతమార్పిడులకు తెగబడుతున్నాయి.

ముందుగా చెప్పినట్టుగా దేశంలో జన సంఖ్యలో చోటు చేసుకుంటున్న మార్పులు ప్రస్తుతం జాతీయ భద్రతపై ప్రభావం చూపే ఒక కీలకమైన అంశంగా మారాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అల్లర్లు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం జరిగాయి. బెంగాల్ మరియు కర్నాటక లాంటి రాష్ట్రాల్లో కడకు పోలీస్ స్టేషన్లపైన కూడా దాడులు జరిగాయి. ముస్లిము సమాజానికి చెందిన ఒక వర్గంలో నానాటికి పెరిగిపోతున్న రాడికలైజేషన్‌కు ఇది ఒక నిదర్శనం. వారు శాంతి, భద్రతలను తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఏమాత్రం భయపడకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.

ఈ నేపథ్యంలో (సరిహద్దు భద్రతా దళం) BSF పరిధిని అంతర్జాతీయ సరిహద్దు నుంచి దేశంలోపలకు 50 కిలోమీటర్లకు పొడిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. జన సంఖ్యలో మార్పుల కారణంగా నిర్దేశిత జిల్లాల్లో ఆందోళనలు, తిరుగుబాట్లు చివరకు ఓటరు నమూనా కూడా మారిపోయిందని BSF డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు.

నానాటికి పెరిగిపోతున్న బలవంతపు మతమార్పిడి ఘటనలు దేశ ఏకత్వము, నైతిక నిష్ఠ మరియు భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. ఎందుకంటే మత మార్పిడి కారణంగా ఒక వ్యక్తి అనుసరించే ఆలోచనా ధోరణి మారిపోతుంది. అతడు లేదా ఆమె ప్రవర్తన మారిపోతుంది. అలాంటి ఒక ప్రవర్తన భిన్నత్వాన్ని గౌరవించదు. సహనాన్ని విశ్వసించదు.

‘న్యూస్ ‌భారతి’ సౌజన్యంతో.. - విశ్వసంవాద కేంద్రము..

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top