అనుంగు సోదరి, యోగిని ముక్తాబాయి - Yogini Muktabhai

0
అనుంగు సోదరి, యోగిని ముక్తాబాయి - Yogini Muktabhai
Yogini Muktabhai
యోగిని ముక్తాబాయి
మహారాష్ట్రలో వరాకరీ సంప్రదాయానికి చెందిన అగ్రశ్రేణి వ్యక్తులలో ప్రముఖురాలు ముక్తాబాయి (క్రీ.శ. 1279-1297). మహారాష్ట్రకు చెందిన ప్రముఖ యోగి, సంకీర్తనాచార్యుడు జ్ఞానదేవ్‌కు స్వయానా సోదరి ముక్తాబాయి.

గోదావరి నదీతీరంలో ఆపేగాంవ్‌ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన విఠల్‌పంత్‌ కులకర్ణికి, రుక్కాబాయితో వివాహం జరిగింది. ఆ దంపతులకు చాలాకాలం పాటు సంతానం కలుగలేదు. కొద్ది కాలం తరువాత విఠల్‌ పంత్‌కు ఈ ప్రాపంచిక జీవితం పట్ల నిరాసక్తత ఏర్పడింది. అప్పుడు ఆయన వారణాసికి చెందిన రామానంద అనే. సాధువును ఆశ్రయించాడు. సన్వ్యాసం స్వీకరించాలనే తన అభిలాషను వ్యక్తంచేశాడు. నిజానికి, గృహస్థు గనక సన్వ్యాసాశ్రమం స్వీకరించాలంటే, అందుకు అతని భార్య అంగీకరించి, అనుమతినివ్వాల్సి ఉంటుంది. అయితే, తనకు పెళ్ళే కాలేదంటూ విఠల్‌ పంత్‌ ఆ సాధువు దగ్గర అబద్ధమాడాడు. ఆ మాటలు నమ్మిన రామానందుల వారు విఠల్‌ పంత్‌కు సన్వ్యాస దీక్ష ప్రసాదించారు. చైతన్యానంద అనే సన్వ్యాస నామం ఇచ్చారు.
   కాగా, వారణాసిలో జరిగిన ఈ పరిణామాలేవీ రుక్కాబాయికి తెలియదు. భర్త క్షేమంగా తిరిగి రావాలని ఆమె దైవ ప్రార్ధనలు చేస్తూ గడపసాగింది. ఒకసారి రామానందుల వారు రామేశ్వరం వెళుతూ, మార్గమధ్యంలో అనుకోకుండా రుక్కాబాయిని కలిశారు. మూటల సందర్భంలో, ఆమె భర్తే విఠల్‌ పంత్‌ అనే విషయం తెలిసింది. జరిగిన పొరపాటు గ్రహించిన ఆయన ఆ సాధ్వి బాధను గమనించి, సత్‌సంతానానికి జన్మనిస్తావంటూ ఆశీర్వదించారు. వారణాసికి తిరిగి వచ్చిన తరువాత రామానందుల వారు విఠల్‌ పంత్‌ (వైతన్యానంద)ను అపేగాంవ్‌ తిరిగి వెళ్ళాల్సిందిగా ఆజ్ఞాపించారు. మునుపటిలా యథావిధిగా గృహస్థాశ్రమ జీవితం గడపాల్సిందిగా ఆదేశించారు. గురువుగారి ఆజ్ఞను విఠల్‌పంత్‌ శిరసావహించక తప్పలేదు. కాలక్రమంలో విఠల్‌ పంత్‌, రుక్కాబాయి దంపతులకు నలుగురు సంతానం కలిగారు. వారిలో మొదటి ముగ్గురూ మగ పిల్లలు కాగా, నాలుగో సంతానం కుమార్తె ఆ ముగ్గురు కుమారులకూ వరుసగా నివృత్తి జ్ఞానదేవ్‌, సోపాన్‌ అని పేర్లు పెట్టారు. కుమార్తెకు ముక్తి అని నామకరణం చేశారు. విఠల్‌ పంత్‌ కుటుంబాన్ని ఊళ్ళోని అగ్రవర్జ్ధాల వారంతా అంటరానివారిగా చూసేవారు. అదేమంటే, ఒకసారి సన్వ్వాసం తీసుకున్న వ్యక్తి మళ్ళీ గృహస్థు కావడానికి వీల్లేదని వాదించేవారు. ప్రాణత్యాగమొక్కటే దీనికి ప్రాయశ్చిత్తమని పేర్కొనేవారు. చివరకు విఠల్‌ పంత్‌, రుక్కాబాయిలు తమ పిల్లల్ని అనాథల్నిచేసి, తాము గంగానదిలో దూకి ప్రాణత్యాగం చేసుకున్నారు.

భగవంతుని పట్ల అపార భక్తి విశ్వాసాలున్న పవిత్రులైన ఆ దంపతులకు జన్మించిన పుత్రులకు ఉపనయనం చేయనివ్వకుండా ఊరి వాళ్ళు అడ్డుపడ్డారు. చాలా మంది 'భాహ్మణులకన్నా ఎంతో ఉన్నతమైన విద్యను ఆ పిల్లలు అధ్యయనం చేశారు. ఆ కుమారుల్లో పెద్దవాళ్ళిద్దరూ. భిక్షాటనకు వెళ్ళేవారు. చిన్నవాడైన మూడోవాడు తమ చెల్లెలు ముక్తి (ఈమెనే ముక్తాబాయి అని కూడా పిలిచేవారు) ఆలనా పాలనా చూసుకొనేవాడు.
   అన్నదమ్ములందరిలోకీ బాగా తెలివైనవాదైన జ్ఞానదేవుడు సమాజం తమ పట్ల చూపుతున్న వివక్షను ధిక్కరించాడు. మనుషులు, పశు పక్ష్యాదులు, చెట్టూచేమలతో సహా అన్నిటా ఆ పరబ్రహ్మ స్వరూపం వ్యాపించి ఉన్నందువల్ల అందరూ గొప్పవారేనని జ్ఞానదేవుడు అభిప్రాయపడ్డాడు. ఆ మాటే అందరితో చెప్పాడు. క్రమంగా ఆ అన్నదమ్ముల పట్ల బ్రాహ్మణుల వైఖరి మారింది. ఆ పిల్లల పట్ల వారిలో ఆదరణ పెరిగింది. ఆ రోజుల్లో 'పైథాన్‌ను గొప్ప విద్యాధ్యయన కేంద్రంగానూ, అక్కడి వారిని మహా పండితులుగానూ భావించేవారు. ఉపనయనం, దీక్షాదులు జరగనప్పటికీ, ఈ పిల్లలు చాలా మంది బ్రాహ్మణుల కన్నా ఉన్నతులని సాక్షాత్తూ ఆ పైథాన్‌ ప్రాంత పండితులే నిర్ధారించారు. ఆ మాటే ఆపేగాంవ్‌లోని బ్రాహ్మణులకు తెలిపారు. ఆ పిల్లలకు అద్భుత శక్తులు ఉన్నట్లు తెలిపే అనేక సంఘటనలు ప్రచారంలో ఉన్నాయి.

జ్ఞానదేవుడు వేదాంతాన్నీ ఇతర తత్త్వశాస్తాలనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అటుపైన భగవద్గీతపై తనదైన వ్యాఖ్యానాన్ని అయితేనేం, “జ్ఞానేశ్వరి పేరిట రచించారు. అతడు తరచూ పండరీపూర్‌ను సందర్శించి, సంత్‌ నామదేవుడితో కాలం గడిపేవాడు. ముక్తాబాయి తన సోదరులతో కలసి ఉండేది. కాలం గడిచేకొద్దీ ఆమెకు కూడా అతీంద్రియ. శక్తులెన్నో సిద్ధించాయి. ఆమె కూడా యోగినిగా ప్రాచుర్యం పొందింది. 
   విఠోబా దేవుణ్ణి దర్శించి, కొలిచేందుకు ఒకరోజున 'ముక్తాబాయి తన సోదరులతో కలసి పండరీపూర్‌కు వెళ్ళింది. ఎల్లప్పుడూ అక్కడే ఉండే నామ్‌దేవ్‌ మిగిలినవారికన్నా తానే భగవంతుడికి ప్రీతిపాత్రుడనని భావించేవాడు. అక్కడకు వెళ్ళిన 'ముక్తాబాయి దేవుడికి ప్రణామం చేసింది. అయితే, నామదేవుడికి  మాత్రం ప్రణామాలు అర్చించలేదు. కేవలం దేవుడికి దగ్గరలో
ఉన్నంత మాత్రాన ఎవరికీ ప్రణమిల్లాల్సిన పనిలేదనీ, ఆధ్యాత్మిక గురువంటూ ఎవరూ లేని నామదేవుడికి నమస్మరించనవసరం లేదనీ ఆమె పేర్కొంది. చర్చోపచర్చల అనంతరం సంత్‌ గోరా కుంభార్‌ వద్దకు వెళ్ళాల్సిందిగా నామదేవుడికి చెప్పారు. ఆపేగాంవ్‌ గ్రామంలో కుండలు చేసుకొనే కుమ్మరి వాడు గోరా కుంభార్‌. నామదేవుడు. నిఖార్సయిన యోగి అవునో, కాదో ఆయన నిర్ణయిస్తాడని తెలిపారు. గోరా కుంభార్‌ ఓ వెదురు బెత్తంతో యోగులను పరీక్షించేవాడు. ఆయన నామదేవుడి దగ్గరకు రాగానే నామదేవుడు ఎంతో ఆందోళన చెందాడు. నామదేవుణ్ణి పరీక్షించి ఇంకా పచ్చి కుండలాంటి వాడేననీ, ఇంకా కాలాల్సి ఉందనీ గోరా కుంభార్‌ ప్రకటించాడు. మార్గదర్శనంచేసే గురువు అవసరం. నామదేవుడికి ఉందని స్పష్టం చేశాడు. నామదేవుడు అప్పుడిక జ్ఞానదేవుడి శిష్యుడూ, గతంలో తన ప్రత్యర్థి అయిన విశోబా ఖేచర్‌  వద్దకు వెళ్ళాడు. 

ప్రపంచంలో దేవుడు లేని చోటంటూ ఏదీ లేదని ఆయనకు విశోబా ప్రదర్శించి చూపాడు. అలాగే, ఇతర సాధు సత్పురుషుల కన్నా తాను గొప్పవాడినని ఎవరైనా అనుకోవడం అవివేకమని స్పష్టం చేశాడు. ఆ రకంగా నామదేవడికి జ్ఞానోదయమైంది. ఆయనలో పరిణతి చోటు చేసుకుంది. ఫలితంగా, ఆయన ఇప్పుడు అసలైన యోగిగా అవతరించాడని గోరా కుంభార్‌ అంగీకరించాడు. ముక్తాబాయి సైతం అప్పుడిక నామదేవుణ్ణి యోగిగా గుర్తించి, ఆయనకు ప్రణమిల్లింది. _ ముక్తాబాయికి సంబంధించి మరో గాథ ప్రచారంలో ఉంది. సోదరుడైన జ్ఞానదేవుడి ఆదేశం మేరకు ఆమె చాంగదేవ్‌ వటేశ్వర్‌ అనే యోగికి ఆధ్యాత్మిక మార్గదర్శినిగా వ్యవహరించినట్లు కథనం. ఆ యోగి తపీ నది ఒడ్డున నివసించేవాడు. ముక్తాబాయి మరాఠీ భాషలో ఎన్నో “అభంగుూలను రచించింది (అభంగ్‌ అంటే ఆధ్యాత్మిక భజన అని అర్ధం). ఈ విశ్వం మొత్తం పరబ్రహ్మమనే నూలుతో వడికిన ఒకే గుడ్డముక్క అని ఆమె ఓ అభంగ్‌లో అభివర్డించింది. అలాగే, జనం పరుషమైన మాటలతో నిందించినప్పటికీ యోగులు కోపగించరాదని పేర్కొంది.
   ఈ రకమైన అభంగ్‌ రాయడానికి ఓ కారణం ఉంది. కొంతమంది వ్యక్తుల ప్రవర్తనతో కోపగించిన జ్ఞానదేవుడు ఒకసారి పర్దశాలలోకి వెళ్ళి, తలుపు వేసుకొని లోపలే ఉండిపోయి బయటకు రావడానికి నిరాకరించాడు. ఆ సందర్భంలో ముక్తాబాయి ఈ అభంగ్‌ రచించింది. సోదరుడైన సంత్‌ జ్ఞానదేవుడి జీవితం నుంచి ఆమె జీవితాన్ని విడదీయలేం. నిజానికి, ఆమె జీవితం గురించి విడిగా తెలిసింది చాలా తక్కువ.
ముక్తాబాయి జీవిత కాలం కూడా తక్కువే! కేవలం పద్దెనిమిదేళ్ళ వయసులోనే పిడుగుపాటుకు గురై ఆమె మరణించింది. అయితేనేం, ఆమె అభంగులు, అన్న అయిన 'జ్ఞానదేవుడి జీవితంలో ఆమె పాత్ర ఇప్పటికీ ఆ యోగినిని చిరస్మరణీయం చేశాయి.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top