అరుణాచల్ ప్రదేశ్‌లోని నైషి, గాలో, ఆది కమ్యూనిటీలు సాంప్రదాయ గిరిజన సంస్కృతిని ఆధునిక విద్యతో అనుసంధానించే నాలుగు గురుకులాలను స్థాపించాయి.
ఈ గురుకులాలు గిరిజన సంప్రదాయాలు, జీవనశైలి , కొత్త విద్యను బోధించడం ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ నాలుగు గురుకులాలు కూడా సాంప్రదాయ గిరిజన బోధనలను (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) సిలబస్ తో మిళితం చేసి, గిరిజనలుకు చక్కని విద్యను అందిస్తున్నాయి.
డోన్యి పోలో కల్చరల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ (DPCCT ) అనేది అరుణాచల్ ప్రదేశ్ స్థానిక సంస్కృతిని పరిరక్షించడం ప్రోత్సహించడం అనే దృక్పథంతో ఏర్పడిన లాభాపేక్షలేని సంస్థ. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి, ట్రస్ట్ రాష్ట్రంలోని కొన్ని మారుమూల ప్రాంతాలలో గురుకుల్ తరహా స్థానిక పాఠశాలలను స్థాపించింది. ప్రస్తుతం ఎనిమిదవ తరగతి వరకు ఈ పాఠశాలలు నడుస్తున్నాయి. తూర్పు కామెంగ్‌లోని రంగ్లోని న్యూబు న్యూవ్గామ్ యెర్కో; కీయి పాన్యోర్లోని మ్వాయాలోని న్యూబు న్యూవ్గామ్ యెర్కో; లెపరాడాలోని బసార్లోని మెంజ్వ్క్ మెక్కోక్ ర్వ్గు; సియాంగ్ జిల్లాలోని పాబోలోని నీలుంగ్ తుంగ్కో వంటి ఈ పాఠశాలలు అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ వనవాసీ తెగలైన నైషి, గాలో, ఆది వంటి వనవాసీలకు సేవ చేయడానికి ఏర్పడ్డాయి.
![]() |
Gurukuls |
ఈ గురుకులాలు ఆధునిక విద్యతో పాటు గిరిజన సంప్రదాయాలు, జీవనశైలి చ సాంస్కృతిక జ్ఞానాన్ని పరిరక్షించడానకోసం ఏర్పాటు చేయబడినవి. వీటిల్లో NCERT సిలబస్‌తో స్వదేశీ బోధనలను అనుసంధానించడం ద్వారా, ఈ సంస్థలు చక్కటి విద్యను అందించడంతో పాటుగా, ఆధునికతతో కూడిన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే వీటిల్లో చేరడనికి చాలామంది గిరిజనులు మక్కువ చూపుతుండడంతో వచ్చే విద్యార్థులను దఈష్టిలో పెట్టుకుని ఈ గురుకులాల్లో టాయిలెట్లు, బాత్రూమ్ లు, మరిన్ని తరగతి గదులు, డార్మిటరీ లాంటి మరిన్ని మౌలిక సదుపాయాలను కలిపించడానికి విరాళాలను ఇవ్వాళని డోన్యి పోలో కల్చరల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ (DPCCT ) సంస్థ కోరుతోంది.