రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి కర్నాటక హైకోర్టులో భారీ ఊరట లభించింది. పథ సంచలన్ (రూట్ మార్చ్) నిర్వహించే పూర్తి హక్కు ఆరెస్సెస్ కి వుందని హైకోర్టు కలబురగి బెంచ్ తేల్చి చెప్పింది. శాంతిభద్రతలను బూచిగా చూపించి, దాని ముసుగులో సమావేశమయ్యే ప్రాథమిక హక్కును కూడా ఏకపక్షంగా తీసేయలేమని తేల్చి చెప్పింది. రాజకీయ కారణాలతో, వ్యతిరేకత కారణంగానో, చట్టబద్ధమైన, శాంతియుత కార్యక్రమాలను అణచివేయవద్దని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఆరెస్సెస్ నేత అశోక్ పాటిల్ దీనిపై ఓ రిట్ పిటిషన్ ను దాఖలు చేయగా… కర్నాటక హైకోర్టు ధర్మాసనం స్వీకరించి, విచారణ జరిపింది. పథ సంచలన్ మార్గాన్ని వివరిస్తూ కొత్త దరఖాస్తును జిల్లా కలెక్టర్ కి సమర్పించాలని ఆదేశించింది. అలాగే ఈ దరఖాస్తును పక్షపాతం లేకుండా పరిగణనలోకి తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై
ఆరెస్సెస్ కార్య శతాబ్ది సందర్భంగా దేశంలో ప్రతి చోటా పథ సంచలన్ జరపాలని ఆరెస్సెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా చిత్తాపూర్ తహశీల్దార్ కి కూడా స్థానిక ఆరెస్సెస్ కార్యకర్తలు పథ సంచలన్ విషయంపై దృష్టికి తీసుకెళ్లారు. కానీ తహసీల్దార్ శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి కుదరదని అన్నారు. దీంతో సమస్య తలెత్తింది.
హిందూ ఐక్యతకు, జాతీయ సమగ్రత, క్రమశిక్షణతో, శాంతియుతంగా పథ సంచలన్ నిర్వహిస్తోంది సంఘ్. సంఘ్ నిర్వహించే పథ సంచలన్ విషయంలో ఎక్కడా ఎప్పుడూ ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. దీని విషయంలో సంఘ్ స్వయంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే వుంటుంది. రాజ్యాంగ వ్యవస్థలపై అత్యంత నమ్మకం కారణంగా పథ సంచలన్ విషయంపై వ్యవస్థను సంప్రదించింది. కానీ శాంతి భద్రతల నెపంతో అనుమతి నిరాకరించారు.
ఆరెస్సెస్ పక్షాన న్యాయవాది అరుణ్ శ్యామ్ వాదిస్తూ, పథ సంచలన్ అనుమతి కోసం సక్రమంగా తాము సంప్రదించామని, ఈ నెల 13 న పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామన్నారు. అదే రకంగా 17 వ తేదీన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కి అధికారికంగా కూడా దరఖాస్తు చేసుకున్నామని పేర్కొన్నారు. అన్ని సక్రమంగా వున్నా.. సరైన కారణాలను చూపించకుండానే అధికారులు అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు.
దీంతో జస్టిస్ ఎం.జి.ఎస్. కమల్ ముందు అత్యవసర విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏ కారణాల రీత్యా తిరస్కరించారో చెప్పాలని కోర్టు కోరింది.ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ‘‘ఓ సమూహం నినాదాలు చేయకుండా, నిరసనలు లేకుండా శాంతియుతంగా నడవడానికి అనుమతి అవసరమా? ఏ నిర్దిష్టమైన చట్టం కింద ఆ హక్కును తిరస్కరించవచ్చో చెప్పండి’’ అంటూ సూటిగా ప్రశ్నించారు.
ఆర్ఎస్ఎస్ పథ సంచలన్ ను నవంబర్ 2న నిర్వహిస్తామని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు, ఇటీవలి నెలల్లో కర్ణాటక అంతటా 250 కి పైగా మార్గ సంచాలన్లను ఒక్క శాంతిభద్రతల సమస్య కూడా లేకుండా విజయవంతంగా నిర్వహించారని పిటిషనర్ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.

