,
![]() |
| Hamas, killed Hindu .. The silence of intellectuals with compassionate hearts |
భారతదేశంలో జాలి గుండెల భస్మాసుర హస్తాలు, ఎర్ర మేధావులు కొదవలేదు. కాకపోతే, ఈ హృదయాలు ఎక్కడో విదేశాల్లోను, అదీ అన్యమతాలకు చెందిన బాధితుల కోసం మాత్రమే ప్రతి స్పందిస్తాయి తప్ప స్వదేశీయుల కోసం ఎంతమాత్రం స్పందించవు. మరీ ముఖ్యంగా హిందువులు ఏమైపోయినా, వీరు ఎంతటి అన్యాయానికి గురైనా.. చివరికి హిందువుల్లోని ముక్కుపచ్చలారని పసిపిల్లలపైన గాని, స్త్రీల పైన గాని ఎంతటి అత్యాచారాలు జరిగినా కనీసం కన్నెత్తి చూడరు ఈ జాలిగుండెల మేధావులు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, సరిగ్గా రెండేళ్ల కిందట అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడి లెక్కలేనంతమందిని పాలస్తీనాలో గాజా తదితర ప్రాంతాలకు అపహరించుకుపోయిన హమస్ ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో హిందువుల ప్రాణాలు తీసేశారు. వీరంతా నేపాల్ దేశానికి చెందిన హిందూ విద్యార్థులు. రెండేళ్ల కిందట 17 మంది నేపాల్ విద్యార్థులు గాజా సరిహద్దుల వెంబడి ఉన్న కిబుడ్జ్ అలుమిన్ ప్రాంతంలో 'లెర్న్ టు ఎర్న్' అనే వ్యవసాయ ఆధారిత కార్యక్రమం కోసం ఇజ్రాయెల్ వచ్చారు. దురదృష్టవశాత్తు అప్పుడు జరిగిన హమస్ ఉగ్రవాదుల దాడిలో 10 మంది విద్యార్థులు చనిపోయారు. వీరి పేర్లు, నారాయణ్ ప్రసాద్, గణేశ్ కుమార్, ఆశిష్ చౌదరి, దీపేష్ రాజ్ బెస్తా, అనంద్ సాహ్, రాజేష్ కుమార్ స్వర్ణకార్, రాజన్ ఫులారా, పదమ్ థాపా, ప్రభేష్ భండారీ, లోకేంద్ర సింగ్ ధామి.
నేపాలీ విద్యార్థులలో ఒకడైన బిపిన్ జోషిని ఉగ్రవాదులు అపహరించుకుపోగా, బందీగా ఉంటూ అతను చనిపోయాడు. ఉగ్రవాదులు ఇతనిని గాజాకు తీసుకుపోతున్న దృశ్యాలు కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి. ఈ అక్టోబర్ 2025లో బిపిన్ జోషి శవాన్ని హమస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌కి అప్పగించగా అక్కడి నుంచి ఆ భౌతికకాయం అతని స్వదేశమైన నేపాల్ చేరుకుంది.
బిపిన్ని హమస్ ఉగ్రవాదులు పట్టుకోవడానికి కొద్దిసేపటి ముందు, ఇతనితో పాటు మరికొందరు విద్యార్థులు ఒక షెల్టర్‌లో తలదాచుకున్నారు. ఆ సమయంలో అక్కడున్న ఒక గ్రెనెడ్ని అతను బయటకు విసిరేసి వారందరి ప్రాణాలూ కాపాడాడు. ఆరుగురు బతికి బయటపడినప్పటికీ, బిపిన్ ఉగ్రవాదులకు చిక్కడం, వాళ్లు అతన్ని గాజాకు తీసుకుపోవడం జరిగాయి. మరోవైపు బిపిన్ కుటుంబ సభ్యులు అతని విడుదల కోసం రెండేళ్ళ పాటు ఇజ్రాయెల్, అమెరికా దేశాలు తిరిగారు. పాత వీడియోలు చూసి బిపిన్ బతికే ఉన్నాడన్న ఆశతో అతన్ని వెనక్కి తెచ్చుకోగలమని కుటుంబ సభ్యులు ఎంతగానో ప్రయత్నాలు చేశారు. అయితే, హమస్ ఉగ్రవాదులు అతని మృతదేహాన్ని ఇజ్రాయెల్ అధికారులకు అప్పగించినప్పుడు వారి గుండె చెరువైంది.
తోటి విద్యార్థుల ప్రాణాన్ని కాపాడిన బిపిన్ త్యాగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్, నేపాల్ దేశాలు మరణానంతరం అతనిని గౌరవించాయి. టెల్ అవివ్‌లోని బెన్ గురియాన్ విమానాశ్రయంలో బిపిన్ జోషికి గౌరవ వీడ్కోలు పలికారు. బిపిన్ దేహంపై నేపాల్ జాతీయ పతాకాన్ని కప్పి అధికార లాంఛనాలతో అంత్యక్రియల కోసం అతని స్వగ్రామమైన కాంచన్‌పూర్ పంపించారు.
బిపిన్ త్యాగనిరతి, ధైర్యసాహసాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.. కానీ, ఈ విద్యార్థుల దయనీయ స్థితి భారతీయ జాలి గుండెల భస్మాసుర హస్తాలను, ఎర్ర మేధావులను కదిలించలేకపోయింది. ఎందుకంటే వారంతా హిందువులు కనుక.. మేధావులకు బాధిత పాలస్తీనియన్లే కనిపించారు తప్ప, హమస్ దాడుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న హిందూ విద్యార్థులను మనుషులుగా సైతం చూడలేని జాలి గుండెలు వీరివి.
పైగా పాలస్తీనా ప్రజల కోసం విద్యార్థులను సైతం ఎండల్లో నడిపించి ర్యాలీలు నిర్వహించిన తీరును ఇటీవలే తెలంగాణలోని ఖమ్మం పట్టణంలో చూశాం. చట్ట విరుద్ధమైన ఈ ర్యాలీలో NCC & NSS యూనిఫాంలో ఉన్న పాఠశాల విద్యార్థులను తీసుకురావడం మరో దారుణం. ఈ పరిణామానికి ముందే పాలస్తీనాకు మద్దతునిచ్చే సీపీఐఎం పార్టీ మేధావులను బాంబే హైకోర్టు సైతం మందలించింది.
ఇవి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇలాంటి ర్యాలీలెన్నో చట్టవిరుద్ధంగా జరిగాయి. భారతదేశంలోని అన్యమతాలవారి దాడుల్లో పీడితులవుతున్న హిందువులను ఏమాత్రం పట్టించుకోక పాలస్తీనా కోసం రోడ్లపైకి వస్తున్న ఈ మేధావులు ఎవరి కోసం ఇక్కడున్నారో పౌరులంతా ఆలోచిస్తే అంతర్గత శత్రువుల నుంచి మన దేశాన్ని కాపాడుకుని మరెంతో ముందుకు నడిపించగలం.
@vskts

